Guppedantha Manasu: తొందరపాటుతో తెలిసి తెలియక ప్రేయసి చేసిన తప్పుని క్షమించలేక అలాగని ఆమెని మరిచిపోను లేక సతమతమవుతున్న ఒక ప్రేమికుని కథ ఈ గుప్పెడంత మనసు. ఈ వారం సీరియల్ లో ఏం జరిగిందో చూద్దాం.

రిషి క్యాబిన్ కి వెళ్ళిన వసు మీరు ఎందుకు పిలిచారో నాకు తెలుసు బైక్ మీద వచ్చినందుకే కదా అంటుంది. నువ్వే అనుకుంటే సరిపోతుందా నేను పిలిచింది అందుకు కాదు మన కాలేజీ స్పాట్ వాల్యుయేషన్ కి సెలెక్ట్ అయినట్లుగా మెయిల్ వచ్చింది అంటాడు రిషి. గుడ్ న్యూస్ అంటుంది వసు. స్పాట్ వాల్యుయేషన్ లో యాక్టివ్గా ఉండొచ్చా అని అడుగుతుంది.

ఈ రిషి ఉన్న ప్రతి చోట వసు ఉంటుంది అంటాడు రిషి. మరోవైపు కొడుకు నుంచి తప్పించుకున్నామని ఆనంద పడుతున్న మహేంద్ర దంపతులకు ఎదురుపడతాడు రిషి. మీ ఆరోగ్యం బాగోలేదు బైక్ నడపొద్దు అని తండ్రిని మందలిస్తాడు. మీరైనా చెప్పాలి కదా అంటూ జగతిని మందలిస్తాడు. అలాగే అంటూ బయటికి వచ్చిన మహేంద్ర గట్టిగా నవ్వుతాడు.

ఎందుకా నువ్వు అంటుంది జగతి. మనం తప్పించుకున్నాము పాపం వసు పరిస్థితి ఏంటో అంటూ జాలి పడతాడు మహేంద్ర. మరోవైపు వసు బైక్ దాచేస్తాడు రిషి. రిషిని అనుమానిస్తుంది వసు.నేనే తీసి పక్కన పెట్టించాను ఇప్పుడేంటి అంటాడు రిషి. ఇంకోసారి బైక్ మీద రావద్దు అంటూ వార్నింగ్ ఇస్తాడు. అదంతా గమనించిన మహేంద్ర ఇంత విచిత్రమైన జంటని నేను ఎక్కడా చూడలేదు అంటాడు.

వాళ్ళ ప్రేమని చూస్తే సంతోషం వేస్తుంది పట్టింపులని చూస్తే బాధ వేస్తుంది వాళ్ళ సమస్యలని వాళ్లే పరిష్కరించుకోవాలి అంటుంది జగతి. మరోవైపు వసుతో మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి ఒకసారి రమ్మను అంటుంది దేవయాని. పెళ్లి వరకు వాళ్ళ ఇష్టం తర్వాత పెద్దవాళ్లుగా మిగతావన్నీ పెద్దవాళ్లుగా మనమే చూసుకోవాలి అంటుంది. వదిన గారికి ఆడుకోవడానికి మంచి ఆయుధం దొరికింది అంటాడు మహేంద్ర.

మరోవైపు వసూని పిలిపించి ఇదే విషయం గురించి మాట్లాడుతుంది జగతి. రిషి సార్ ఏమంటారో అని భయంగా ఉంది అంటుంది వసు. అప్పుడు మీరిద్దరూ కలిసి మాట్లాడుకోండి అంటుంది జగతి. మరోవైపు పెద్దమ్మ అన్నమాటల గురించి నన్ను ఏమైనా ప్రశ్నించాలి అనుకుంటున్నావా అంటాడు రిషి. నా దగ్గర ప్రశ్నలు లేవు సమాధానాలు మాత్రమే ఉన్నాయి కానీ అవి మీ ప్రశ్నలకు సరిపోవటం లేదు అంటుంది వసు.

మరోవైపు నిజం చెప్పకుండా దాచి తప్పు చేశావు. అందువల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అనుకుంటాడు రిషి. భోజనానికి కూర్చున్న దేవయానికి ఈరోజు వంటలు వసూలు చేసింది అంటూ వడ్డిస్తుంది ధరణి. తను ఎందుకు చేసింది వంటగది కూడా కబ్జా చేసేస్తుందా అలా చేయొద్దను అంటుంది దేవయాని. మీరు నాకు చెప్పటం నేను తనకి చెప్పడం అదంతా బాగోదు మీరే తనతో డైరెక్ట్ గా చెప్పండి అంటుంది ధరణి.

రిషి వాళ్ళని కలపటం కోసం వాళ్ళిద్దరూ మాత్రమే కలిసి లంచ్ చేసేలాగా ప్లాన్ చేస్తారు మహేంద్ర దంపతులు. భోజనం చేస్తున్న రిషి వంటలు చాలా బాగున్నాయి పెద్దమ్మ చేసినట్లుగా ఉంది అంటాడు. నేనే కష్టపడి చేశాను అంటుంది వసు. ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నావా అంటాడు రిషి. మరోవైపు స్పాట్ వాల్యుయేషన్ గురించి భూషణ్ ఫ్యామిలీ మాట్లాడుకుంటూ ఉంటుంది.

మీకు కాలేజీకి దక్కిన గౌరవం కనిపిస్తుంది కానీ నాకు రిషి కష్టం కనిపిస్తుంది స్పాట్ వాల్యుయేషన్ వద్దు అంటుంది దేవయాని. కాలేజీకి పేరు వస్తుందంటే వద్దంటావేంటి అంటాడు ఫణీంద్ర. ఎక్కువ ఆలోచించకండి నేను చూసుకుంటాను అంటాడు రిషి. మరోవైపు వర్క్ చేస్తూ వసు గదిలో పడుకుండిపోతాడు రిషి. వసు హాల్లోకి వచ్చి పడుకుంటుంది. నీ స్థానం ఏంటో ఇప్పటికైనా తెలిసిందా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని.

రిషి సార్ కి నాకు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలో నాకు తెలుసు అంటూ దేవయానికి తల తిరిగిపోయేలాగా సమాధానం చెబుతుంది వసు. మరోవైపు స్పాట్ వాల్యుయేషన్ ఆఫీసర్ గా వస్తాడు ధర్మరాజు. స్పాట్ వాల్యుయేషన్ ఈ కాలేజీకి రాకూడదని ఎలాగైనా దీనిని అన్ సక్సెస్ఫుల్ చేయాలని ఆలోచిస్తాడు ధర్మరాజు. ఆ సందర్భంగా నే ఆన్సర్ షీట్స్ ని పెట్టి లాక్ చేసిన రూమ్ కీస్ ని సబ్బు మీద ప్రింట్ తీసి దొంగ కీస్ తయారు చేయిస్తాడు.

స్టాఫ్ అందరు ఉండగా పేపర్ బండిల్స్ ని రూమ్ లో పెట్టి అందరూ చూస్తుండగానే లాక్ చేస్తాడు మహేంద్ర. అందరూ వెళ్లిపోయిన తర్వాత డూప్లికేట్ కీస్ తో పేపర్స్ దొంగతనం చేసేస్తాడు ధర్మరాజు అది గమనించిన రిషి ఫ్యామిలీ ముందు కంగారు పడుతుంది. కానీ ఇదంతా ఎవరి వల్ల జరిగిందో అర్థం చేసుకుంటాడు రిషి. వసుని తీసుకొని ధర్మరాజు ఇంటికి బయలుదేరుతాడు.మద్యం మత్తులో ఉన్న ధర్మరాజు వీళ్ళు ఇంట్లోకి వెళ్ళటం గమనించడు.

Guppedantha Manasu రేటింగ్ మంచిగానే ఉన్నప్పటికీ కథలో బలం తగ్గుతుందంటున్న ప్రేక్షకులు..

దొంగతనం చేసిన పేపర్ బండిల్స్ ధర్మరాజు చేతిలో ఉండడం గమనిస్తాడు రిషి. ధర్మరాజు వాళ్లు ఉన్న వైపు రావటం గమనించిన రిషి, వసు ఒక గదిలో దాక్కుంటారు. అదే గదికి వచ్చిన ధర్మరాజు వసుని చూసి షాక్ అవుతాడు. రిషి, వసులు క్షేమంగా బయటపడతారా? భూషణ్ ఫ్యామిలీ తన కాలేజీ పరువు నిలబెట్టుకుంటుందా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 26, 2023 at 9:05 ఉద.