Guppedantha Manasu: తన వాళ్ళని రక్షించుకోవడానికి పెళ్లయినట్లుగా నటించి తర్వాత నిజం చెబుదామని ఎంత ప్రయత్నించి, తన వాళ్లకి దగ్గరవుదామని ప్రయత్నిస్తున్న ఒక యువతి కథ గుప్పెడంత మనసు..

స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కి కాబోయే వారసుడు కి కారు ఆగిపోతే అతనికి లిఫ్ట్ ఇస్తాడు రిషి. దారిలో కనబడితే వసు ని కూడా ఎక్కించుకుంటాడు రాజ్. అప్పుడు వాళ్ళ మధ్యలో బెటర్ టాపిక్ వస్తుంది. మరోవైపు కొడుకు కోసం బాధపడుతూ ఉంటారు జగతి దంపతులు.

తన మానాన తన్ని వదిలేసిన బాగున్ను మళ్ళీ కాలేజీకి వచ్చి తన కళ్ళ ముందే తిరుగుతుంది వసు ఇదంతా అవసరమా అంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారని ఎన్ని కలలు కన్నాను, అంత తెలివైన అమ్మాయి ఇలా చేస్తుంది అనుకోలేదు అంటాడు మహేంద్ర. మరోవైపు గెస్ట్ హౌస్ లో రిషి ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి మీతో నేను మాట్లాడాలి అంటే రిషి వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

కాలేజ్ నుంచి బయటికి వస్తున్న వసు కి దేవయాని కనిపించి ఆమెని నానా మాటలు అంటుంది. వసు కూడా అందుకు తగ్గట్టు ఆమెతో చాలెంజ్ చేస్తుంది. రిషి సార్ తో మాట్లాడాలి అనుకుంటూ అతనికి మెసేజ్ చేయబోతుండగా దారిలో రాజీవ్ అడ్డగించి భార్యాభర్తల మధ్య వంద ఉంటాయి అందుకని వదిలేసి వెళ్ళిపోతావా రా నాతో అంటాడు. నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అంటూ ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది వసు.

జగతి దంపతులకి కాలేజీలో దేవయాని కనిపిస్తుంది. మీరేంటి ఇక్కడ హనీ అడిగితే మీ వల్ల కావడం లేదు అందుకే నేను వచ్చాను అయినా మీరు బస్సు ని సున్నితంగా డీల్ చేస్తున్నారు నేను నా స్టైల్ లో డీల్ చేస్తాను అంటూ మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వసు నా క్యాబిన్లో మీకేం పని ఇది నా సీటు నేను ప్రాజెక్ట్ హెడ్ ని నన్ను తీసేయాలి అంటే ఓటింగ్ ద్వారా తొలగించండి అంటుంది.

ఈ కాలేజ్ నాది అంటే అయితే నాకేంటి అంటూ దీటుగా సమాధానం ఇస్తుంది. మరోవైపు రిషితో మాట్లాడడానికి గెస్ట్ హౌస్ కి వస్తుంది వసు. ప్రాజెక్టు గురించి మాట్లాడాలి అంటే మాట్లాడదాంలే అక్కడయితే అందరూ ఉంటారు ఇంకెప్పుడూ ఒంటరిగా ఇలా రాకు అంటాడు రిషి. నేను నీతో మాట్లాడాలి జరిగింది చెప్పాలి అంటే జరిగింది చాలు అంటూ ఆమె మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు.

మీటింగ్ లో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ వసుకి అందరూ సహాయంగా ఉండాలి అంటాడు. కావాలంటే జగతి మేడం హెల్ప్ తీసుకో అంటాడు ఫనింద్ర. నా కొడుకుని ఇబ్బంది పెట్టిన తనకి నేను ఎందుకు హెల్ప్ చేస్తాను అనుకుంటూ నాకు కుదరదు అని చెప్పేస్తుంది జగతి. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఎందుకు మేడం నన్ను అవాయిడ్ చేస్తున్నారు నాకు హెల్ప్ చేయరా అని అడుగుతుంది వసు.

మీరు గొప్పవారు, యూనివర్సిటీ టాపర్ కానీ నా కొడుకుని ప్రేమలో ఫెయిల్ చేశారు అంటూ ఆమె మీద మండిపడుతుంది. మరోవైపు చక్రపాణి రిషి సర్కిల్ జరిగిందంతా చెప్పావా నా వల్ల కూడా తప్పు జరిగింది నేను వాళ్లకి క్షమాపణ చెప్తాను అంటాడు. అలాంటిది ఏమీ వద్దు నాన్న అంటే లేదమ్మా నాకు మీ ఇద్దరినీ పక్క పక్కన చూసి సంతోషించాలని ఉంది అంటాడు. నువ్వు మారిపోయావు నాన్న అంటే నువ్వే మార్చేసావు అంటాడు చక్రపాణి.

మరోవైపు రిషి ని నీడలా వెంటాడుతూ నిజం చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఎంత జరిగినా కూడా ఏ నార్మల్ గా ఉంటూ ఏమి జరగనట్లుగా ఎలా ప్రవర్తిస్తున్నావు అనుకుంటాడు రిషి. ఈరోజు నేను చెప్పేది విని తీరాలి అంటూ మొండికేస్తుంది వసు. ఏమి వినిపించుకోకుండా కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. రిషిని చూస్తే చాలా బాధగా ఉంది ఇప్పుడిప్పుడే తన బాధని మర్చిపోతుంటే మళ్ళీ వసు వచ్చి రిషి ని మొదటికే తీసుకువచ్చింది అంటూ బాధపడతాడు మహేంద్ర.

అతనితో మాట్లాడాలన్నా అతని మొహం చూడాలన్న భయంగా ఉంది అంటుంది జగతి. అలా బాధపడుతుంటే మనం ఏమి చేయలేము అని మహేంద్ర అంటే అతని విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడమే మంచిది అంటుంది జగతి. మరోవైపు మినిస్టర్ దగ్గరికి వెళ్దాము అని అడగడానికి ఋషికి ఫోన్ చేస్తుంది వసు కానీ ఏమి చెప్పకుండానే ఫోన్ పెట్టేస్తాడు రిషి. ఏడుస్తున్న కూతురుకి ధైర్యం చెప్తాడు చక్రపాణి.

వాళ్లకి ఇంకా కోపం పోలేనట్లుగా ఉంది మనం వాళ్ళకి ఎలాగైనా నిజం చెబ్దాము అంటాడు. మరోవైపు లెక్చరర్ లని క్యాబిన్ కి పిలిచి మనం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి రెడీగా ఉండండి అంటూ ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చి ప్రిపేర్ అవ్వమంటుంది. కానీ వాళ్లు వసు పెళ్లి గురించి మాట్లాడటంతో వాళ్ల మీద ఫైర్ అవుతుంది. మరోవైపు మినిస్టర్ దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరిన వసు వాళ్ళు కారు పాడవుతుంది అప్పుడే అటువైపుగా వచ్చిన రిషి వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాడు.

వసు చెప్పిన విషయాలు మినిస్టర్ కి బాగా నచ్చటంతో ఇంకా నాకు ఏమీ చెప్పొద్దు ప్రొసీడ్ అయిపో అంటాడు. తను చాలా తెలివైన అమ్మాయి తనని ఎప్పటికీ వదులుకోవద్దు అంటూ రిషికి సలహా ఇస్తాడు. రిటర్న్ లో లెక్చరర్ కొడుక్కి యాక్సిడెంట్ అయిందని తెలియడంతో ఆమెని ఇవాళ ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు. రిషి సర్ ఒక్కరే ఉన్నారు ఇప్పుడు నిజం చెప్పాలి అనుకుంటుంది వసు. కానీ అప్పుడే రాజీవ్ వచ్చి రోడ్డుమీద నాన్న గొడవ చేస్తాడు నా భార్యని నాకు అప్పగించండి అంటూ రిషి ని అడుగుతాడు.

రిషి కూడా అతనితో వెళ్ళమంటాడు. అతని మాటలు నమ్మకండి అంటూ ఎంత చెప్పినా వినిపించుకోడు. ఇక లాభం లేదని అటువైపుగా వచ్చిన ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది వసు. మీ ఇద్దరినీ దూరం చేయటానికి పునాది వేశాను అంటూ నవ్వుకుంటాడు రాజీవ్. అదే విషయాన్ని దేవయానితో చెప్తే ఆమె కూడా సంతోషిస్తుంది నీకు రావలసిన కానుకలు వస్తాయి అంటూ ఫోన్ పెట్టేస్తుంది. దేవయాని నవ్వుకోవడం గమనించిన ధరణి ఎవరికో మూడింది అనుకుంటుంది.

మరోవైపు జగతి వాళ్ళని నానా మాటలు అన్నందుకు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు చక్రపాణి ఎలా అయినా నిజాన్ని జగతి మేడం వాళ్ళకి చెప్పాలి అనుకుంటూ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఈ విషయం తెలుసుకున్న వసు వద్దు అని చెప్పిన వినిపించుకోడు చక్రపాణి. మరోవైపు కొడుకు కోసం ఆలోచిస్తున్నా జగతి దంపతులకు కాఫీ ఇచ్చిన ధరణి,వసు కొన్ని రోజులు రిషికి కనిపించకుండా ఉంటే మంచిదేమో అంటుంది. అక్కయ్య అనుకున్నదే జరిగింది రిషి జీవితంలో ఇప్పుడు వసూలు లేకుండా పోయింది ఇందులో అక్కయ్య హస్తం ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది అంటుంది జగతి.

ఇంతకుమించి ఇంకేం చేస్తుంది అంటాడు మహేంద్ర. లేదు మావయ్య ఆవిడ ఈమధ్య చాలా సంతోషంగా ఉంటున్నారు ఆవిడ సంతోషంగా ఉన్నారు అంటే అవతల వాళ్ళకి ఏదో జరుగుతున్నట్లే లెక్క అంటుంది ధరణి. ఇల్లు వెతుక్కుంటూ వచ్చినా చక్రపాణిని గుమ్మంలోనే నిలబెట్టి నానా మాటలు అంటారు జగతి వాళ్ళు. అప్పుడు నా కళ్ళు నెత్తి మీద ఉన్నాయి దయచేసి నేను చెప్పిన మాట వినండి అంటూ చక్రపాణి ఎంత బ్రతిమాలిన వినిపించుకోరు.

Guppedantha Manasu

అంతలోనే అక్కడికి వచ్చి న వసు ఎందుకు నాన్న ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. ఇద్దరు ప్లాన్ చేసుకొని వచ్చి ఉంటారు అంటాడు మహేంద్ర. జరగవలసిన అంత జరిగిపోయింది ఇప్పుడు మీరు ఏం చెప్పి ప్రయోజనం దయచేసి మీరిద్దరూ ఎక్కడినుంచి వెళ్లిపోండి అంటూ కోపంగా మాట్లాడుతుంది జగతి. అంతలోనే దేవయాని రావటం గమనించిన జగతి చూసిందంటే గొడవ మరింత పెరుగుతుంది అంటూ ఆమెకి కనిపించకుండా వాళ్ళిద్దర్నీ
బయటికి పంపించేస్తుంది.

రిషి, వసుల అనుబంధానికి ఫిదా అయి, సీరియల్ ని టాప్ రేంజ్ లో నుంచో పెడుతున్న ప్రేక్షకులు..

చక్రపాణి ఎంత బ్రతిమాలినా వినిపించుకోదు. మరి రిషి, వసు కలుస్తారా? రాజీవ్ తన పంతాన్ని నెగ్గించుకుంటాడా? జగతి దంపతులు వసుని అర్థం చేసుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 29, 2023 at 9:10 ఉద.