Intiki Deepam Illalu: కష్టాల్లో ఉన్న తన కుటుంబానికి ధైర్యం చెప్పి, ఆ కుటుంబాన్ని మళ్లీ పూర్వ స్థాయికి తేవాలని తపన పడుతున్న ఒక ఇల్లాలి కధ ఈ ఇంటికి దీపం ఇల్లాలు.
దీపక్ వాళ్ళ మాటలు వింటున్న సూర్యకి ఫోన్ రావడంతో వాళ్లకిదొరికిపోతాడు సూర్య. అతన్ని చితగ్గొట్టి కిడ్నాప్ చేసేస్తారు వాళ్ళు. సూర్య కోసం ఎదురుచూస్తున్న వర్షిణి కి కుంకుమ జారీ కిందన పడటంతో మరింత కంగారుగా ఏడుస్తుంది. మరోవైపు తల్లిని పలకరించడానికి వచ్చిన మన అలాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిని చూసి బాధపడతాడు.
చిన్న తలనొప్పి వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ స్టాఫ్ మొత్తం నిలబడే వారు అలాంటిది దిక్కు ముక్కు లేకుండా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే కారణం నేనే అంటూ ఏడుస్తాడు. కొడుకుని చూసినా ఆనందంలో ఉన్న మహేశ్వరి అవేమీ పట్టించుకోవద్దు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంటుంది. ఆమెని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తారు. తను వెళ్ళిన ఇంటిని చూసి షాక్ అవుతుంది మహేశ్వరి. ఎన్నో కుటుంబాలకి పిల్లని కట్టి ఇచ్చాము ఆఖరికి మనకి ఇల్లు లేకుండా పోయిందని ఏడుస్తుంది.
మరోవైపు రాఖీ మనోవాళ్ళకి బెయిల్ ఇచ్చాను అని హర్ష వాళ్ళతో చెప్తాడు. హర్ష ఆనందంగా ఫీల్ అయితే హారిక మాత్రం టెన్షన్ ఫీల్ అవుతుంది. మరోవైపు కోటీశ్వరులము అయిపోతాము అన్న ఆనందంలో ఉన్న తల్లి కూతుర్లకి వర్షిణి, సూర్య కనిపించడం లేదు అని చెప్పటంతో షాక్ కి గురవుతారు.నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు కదా అయినా నీకే ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు అంటుంది దమయంతి. దాని బాధ అన్నయ్య కనిపించలేదని కాదమ్మా అప్పుల వాళ్ళు ఎక్కడ దాన్ని మీరు పడతారు అని అంటుంది రాశి.
వాళ్లని అసహ్యించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వర్షిణి. మరోవైపు హారిక, రాఖీని తలుచుకుని భయపడుతుంది. ఆ మనో వాళ్లు బయటకు వస్తే నా బాగోతం అంతా బయట పడుతుంది అని టెన్షన్ పడుతుంది. అదే విషయాన్ని మేనేజర్ సంజయ్ కి చెప్పి జాగ్రత్త పడమంటుంది హారిక. మరోవైపు మనోని కలిసిన హర్ష వాళ్ల ఇంటికి రమ్మంటే ప్రపోసల్ రిజెక్ట్ చేస్తాడు మనొ.
పోనీ రోడ్డు మీద ఉన్న డౌట్ ఎందుకు కనీసం కార్ అయినా తీసుకో అంటే లేదు నాకు జీరో నుంచి స్టార్ట్ అవ్వడం అలవాటే అయినా నాకు అండగా నా కుటుంబం ఉంది అంటాడు మనో. మరోవైపు కంగారుగా వచ్చిన వర్షిణి,సూర్య వచ్చాడా అని మహేశ్వరి వాళ్ళని అడుగుతుంది. విషయం తెలుసుకున్న మహేశ్వరి వాళ్ళు కంగారుపడుతూ ఇక్కడికి రాలేదు అని చెప్తారు. మరోవైపు రాఖీ కూడా తను సపోర్ట్ ఇస్తాను అంటే వద్దు మీరు చేసిన సాయానికి సంతోషం నా సాయం ఎప్పుడు కావాలన్నా నేను రెడీగా ఉంటాను అని రాఖీ ప్రపోజల్ కూడా రిజెక్ట్ చేస్తాడు మనో.
ఇంటికి వచ్చిన మనో కి సూర్య కనిపించడం లేదని తెలిసి షాక్ అవుతాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దామనుకుంటే అక్కడ వాళ్లకి అవమానం ఎదురవుతుంది. కానీ ఎస్ఐ గారు మాత్రం పాజిటివ్ గా మాట్లాడి కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి పంపిస్తారు. మరోవైపు హారిక దగ్గరికి వచ్చిన రాఖీని నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని అడుగుతుంది. నిన్ను నమ్మి నేను చాలా నష్టపోయాను నేను మధ్యలో ఉండేటప్పుడు నా ఆస్తి సెకండ్ రాయించుకొని దాంతోనే బిజినెస్ పెట్టావని హర్ష కి తెలియకుండా ఉండాలి అంటే నాకు ఒక చిన్న సారీ చెప్పు అంటాడు.
ఎన్నటికీ అలా కుదరదు అని తను కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంది హారిక. మరోవైపు సూర్యని వెతుక్కుంటూ మహేశ్వరి ఇంటికి వచ్చిన దమయంతి వాళ్ళు, దమయంతి వాళ్ళని నానా మాటలు అంటారు. మీరే మా అబ్బాయిని దాచేసారు అప్పుల వాళ్ళ బాధపడలేక ఏమైనా చేసుకున్నాడా వాడికి ఏమైనా జరిగిందంటే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది దమయంతి. సూర్య మీ అబ్బాయే కాదు మా అల్లుడు కూడా అంటూ మహేశ్వరి సర్ది చెప్పిన ఎక్కడ తగ్గకుండా నానా మాటలు అంటుంటారు దమయంతి, రాశి.
అప్పుడే అక్కడికి వచ్చిన వర్షిని ఇంకొక మాట మాట్లాడమంటే పళ్ళు రాలిపోతాయి అంటూ రాశిని మందలిస్తుంది. మరోవైపు ఇది నీ అత్తగారిల్లు వాళ్ళని అలా అనొచ్చా అంటూ రాశిని కృష్ణ మందలిస్తే, వాళ్లు ఎప్పుడూ నన్ను అలాగా చూడలేదు అందుకే నా కడుపు మంట తగిలి వాళ్ళు ఇలా అయిపోయారు అని శాపనార్థాలు పెడుతుంది రాశి. కృష్ణని అనాధ అని దమయంతి అంటే మన మహేశ్వరీలు గట్టిగా మందలిస్తారు దమయంతిని. తల్లి చెప్పుడు మాటలు విని పాడైపోతున్నావు ఎప్పటికైనా నీ తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడతావు అంటూ రాశికి కూడా గడ్డి పెడుతుంది మహేశ్వరి.
అవన్నీ ఎందుకు 24 గంటలు నా కొడుకుని ఇవ్వకపోతే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచను అని మహేశ్వరి అంటే ఇప్పుడు మాత్రం ఉంచుతున్నారా అంటుంది వర్షిని. దమయంతి వాళ్ళని అక్కడ నుంచి వెళ్లిపోమంటాడు మనో. వెళ్లకపోతే మీకు లాగా అర్ధగంటలో ఉండవలసిన కర్మ లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు తల్లి కూతుర్లు. సూర్య కనిపించడం లేదని తెలుసుకున్న హర్ష షాక్ అవుతాడు నేను కూడా వెతుకుతాను అంటూ వదినకి ధైర్యం చెప్తాడు.
మరోవైపు భయంతో వణికి పోతున్న హారిక హర్ష కి నిజం తెలిస్తే ఊరుకోడు, అంతకంటే ముందే రాశికి విడాకులు ఇప్పించేసి హర్షనే నా వాణ్ణి చేసుకోవాలి అనుకుంటుంది. అదే విషయం హర్షాకి చెప్తే ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగోలేదు అంటూ సూర్య మిస్ అయిన విషయాన్ని చెప్తాడు. మరొకవైపు బాధపడుతున్న చెల్లెల్ని ఓదార్చి వెళ్ళిపోతాను అన్నా చెల్లెల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాడు మనో. మరోవైపు బాధతో కుమిలిపోతున్న కుటుంబాన్ని భోజనాలు చేయమంటే చేయట్లేదు అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని నూరు పోసి ముద్దలు చేసి పెడుతుంది కృష్ణ.
అందుకు సంతోషించిన మహేశ్వరి వాళ్ళు కృష్ణని ఎంతో పొగుడుతారు. మరోవైపు హరి నారాయణ దామేతికి ఫోన్ చేసి ఇంకా రాలేదేమి అని అడిగితే జరిగిందంతా చెప్పి టైం అడుగుతుంది దమయంతి. ఇదంతా అప్పటికే తెలిసిన తండ్రి కొడుకులు ఇంకేం కొడుకు చచ్చి ఎప్పుడో శవమయ్యాడు అని నవ్వుకుంటారు. ముందు హరి నారాయణ అని అనుమానిస్తుంది కానీ మళ్లీ తనకు తాను సమాధానం చెప్పుకుంటుంది. అంతలో ఇంటికి వచ్చిన వర్షిని ఏ మొహం పెట్టుకొని వచ్చావు నీవల్లే మా అన్నయ్యకి ఇలా జరిగింది అని నానా మాటలు అంటుంది రాశి.
ఆ మాటలకి మండిపోయిన వర్షిని మీవల్లే హై ఉంటుంది సడన్గా కోటీశ్వరులు అయిపోతారు అని చెప్పాడు సూర్య ఆ విషయం గాని వెళ్లి ఉంటాడు అని అసలు విషయం చెప్పిస్తుంది వర్షిణి. ఆ మాటలకి షాకేనా తల్లి కూతుర్లు వీడు మారిపోయాడు అంటే నిజం అనుకున్నావు అంటూ కొడుకుని తిట్టుకుంటారు. మరోవైపు ఎప్పటికీ ఇంటికి రాని భర్తని తలుచుకొని ఏడుస్తుంది వర్షిణి. మరోవైపు సూర్య కోసం ఆలోచిస్తున్న హర్షకి ఇదంతా రాశి చేసి ఉంటుంది అని హర్ష కి ఏవేవో చెప్పి అతన్ని రెచ్చగొడుతుంది హారిక.
మరోవైపు రోడ్డు మీద కనబడ్డ తల్లి, పిన్నిని చూసి బాధపడే కారు ఎక్కమంటే వాళ్ళు హర్షాని నానా మాటలు అని నీతో మాట్లాడటం మాకు అవమానం అంటూ హర్ష ని చీదరించుకొని వెళ్ళిపోతారు. మరోవైపు పక్కింటి ఆవిడ ఇచ్చిన సలహాతో సూర్య కోసం పూజ ప్రారంభిస్తుంది వర్షిణి. అప్పుడే వచ్చిన దమయంతి తలుపు తీయడంతో ఆ గాలికి దీపం కొండెక్కిపోతుంది. నా కొడుకు కనిపించక నేను నాన్న పాటలు పడుతుంటే నువ్వు నీట్ గా చీర కట్టుకొని రెడీ అయ్యావు ఎవరికోసం అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది దమయంతి.
కోపంతో ఒళ్ళు మండిన వర్షిని మీ వల్లే దీపం కొండెక్కిపోయింది అంటూ అత్తని మందలిస్తుంది. ఇదేదో అపశకునం లాగా ఉంది అని అత్తా కోడళ్ళు ఏడుస్తారు. మరోవైపు తను అప్పిచ్చిన ఫ్రెండ్స్ అందరినీ డబ్బు రిటర్న్ ఇమ్మంటే వాళ్ళు ఇవ్వరు సరి కదా మనోని నానా మాటలు అంటారు. మీ అందరినీ అరెస్ట్ చేసి హారికని మాత్రం ఎందుకు వదిలేసారు అంటూ హారిక మీద అనుమానం వచ్చేలాగా మాట్లాడతారు అతని ఫ్రెండ్స్. మరోవైపు రాశి దగ్గరికి వచ్చిన హర్ష విడాకుల పేపర్ మీద సంతకం పెట్టమంటాడు.
అడ్డు వచ్చిన దమయంతిని ఇది నాకు రాశికి సంబంధించిన విషయం మీరు మధ్యలో దొరొద్దు అంటూ వాటిని తిడతాడు. మా ఇంటిని ముక్కలు చేద్దామనుకున్న ప్పుడే నీకు విడాకులు ఇద్దామనుకున్నాను అంటే పేపర్స్ మీద సంతకం పెట్టమంటాడు హర్ష. అప్పుడే వచ్చిన వర్షిని సూర్య కనిపించట్లేదని అందరూ టెన్షన్ లో ఉంటే నువ్వు నీ సంతకాలు ఏంటి అంటూ అన్నయ్యని మందలిస్తుంది. నువ్వు రాశికి విడాకులు ఇస్తే సూర్య నాకుడు నన్ను విడాకులు అడుగుతాడు అప్పుడు పరిస్థితి ఏంటి అన్నా వర్షినితో రాసి ఎంత చెడ్డవాడు కాదు సూర్య అంటాడు హర్ష.
Intiki Deepam Illalu: కృష్ణ మనో ధైర్యానికి నికి ఫిదా అవుతున్న ప్రేక్షకులు..
వర్షిని ఏడుస్తూ హర్ష కి సర్ది చెప్పి పంపించేస్తుంది. మరోవైపు ఇంటికి వచ్చినా రాఖిని ఎందుకు వచ్చావు అని అడుగుతుంది హారిక. నీ పాత ప్రియుని ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావా నా ఇంటి గృహలక్ష్మి చేసుకుందామని అంటూ ఏవేవో చెప్తాడు రాఖి. రాశి విడాకులు కాగితం మీద సంతకం పెడుతుందా? రాఖి,హారిక గుట్టు బయట పెడతాడా? మనో వాళ్లు పూర్వస్థితికి చేరుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.