Intiki Deepam Illalu December 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో తన ఇంటికి రమ్మంటున్న సూర్య ని వద్దు బాబు బ్రతుకు చెడి బంధువుల ఇంటికి వెళ్ళకూడదు ఇది అనుభవంతో చెప్తున్నాను అంటుంది లీలావతి. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతాను అనుకున్నారు అంటాడు సూర్య. మీ అభిమానం అవమానంగా మారకూడదు సూర్య దయచేసి వెళ్ళిపో అంటుంది లీలావతి.
లీలావతిని ఒప్పించిన వర్షిణి..
ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారు కృష్ణ నువ్వైనా చెప్పు అంటాడు సూర్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి అంటుంది కృష్ణ. మన పరిస్థితులు బాగోలేనప్పుడు ఎక్కడికి వెళ్లినా తిట్టుకుంటారు కృష్ణ అంటుంది లీలావతి. మీరు మా అమ్మ గురించి మాట్లాడుతున్నారని అర్థమైంది కానీ మీరు వస్తున్నది నాకోసం అంటాడు సూర్య. వాళ్లు ఎంత చెప్పినా వినకపోవడంతో వర్షిణికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు.
ఇప్పుడు మీ పెద్దమ్మ వాళ్ళు రోడ్డుమీద నించున్నారు మన ఇంటికి రమ్మంటే రావట్లేదు నువ్వైనా చెప్పు అంటాడు సూర్య. పెద్దమ్మకి ఫోన్ ఇవ్వు అంటుంది వర్షిణి. ఫోన్ తీసుకున్న లీలావతి తో నేను బ్రతికే ఉన్నాను పెద్దమ్మ చచ్చిపోలేదు మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది అంటుంది వర్షిణి. మా ఇంటికి వెళ్లకపోతే చచ్చినంత ఒట్టే మీరు ఇంటికి వెళ్ళండి నేను కూడా వచ్చేస్తాను అంటుంది వర్షిణి. సరే అంటుంది లీలావతి.
పిన్ని మొహం కూడా చూడనివ్వలేదన్న హర్ష..
కృష్ణ ఫోన్ తీసుకొని ఈ విషయాన్ని అత్తయ్యతో చెప్పొద్దు అంటుంది. అలాగే అంటుంది వర్షిణి. మరోవైపు ఇంటికి వచ్చినా హర్ష ని మీ పిన్నికి ఎలా ఉంది అని అడుగుతుంది హారిక. నేను వద్దామని అనుకున్నాను కానీ మీ వాళ్ళు ఏమంటారు అని రాలేదు అంటుంది హారిక. రాకపోవడం మంచిదయింది మా అమ్మ మా పిన్ని మొహం కూడా చూడనివ్వకుండా తిట్టింది అంటాడు. మా పిన్ని ని చాలా చిన్న హాస్పిటల్లో ఉంచారు.
హెల్ప్ చేద్దామంటే వాళ్ళు నన్ను చీదురించుకుంటున్నారు. సహాయం చేస్తే స్థితిలో ఉన్న చేతకాని వాడిలాగా ఉండిపోయాను. మరోవైపు క్లైంట్స్ అందరూ డబ్బులు కోసం అన్నయ్య మీద కేసు వేశారు అంటాడు హర్ష. మీ వాళ్ళందరూ నా కాళ్లు పట్టుకునే టైం దగ్గర పడిందన్న మాట అని మనసులోనే అనుకుంటుంది హారిక. బాధపడకు ఏదో ఒకటి చేద్దాం లే అంటుంది హారిక. మనం ఏం చేద్దాం అన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మనం మాత్రం ఏం చేస్తాం అంటాడు హర్ష.
జరిగింది తెలుసుకొని షాక్ అయిన హర్ష..
అంతలోనే వాళ్ళ ఇల్లు సీజ్ చేసినట్లు ఫోన్ వస్తుంది హర్ష కి. ఆ వార్త వింటూనే షాక్ అయిపోతాడు హర్ష. అతని అలా చూసి మీ పిన్ని గారికి ఏమైనా సీరియస్ అయిందా అంటుంది హారిక. మా ఇంటిని సీజ్ చేశారంట అంటాడు హర్ష. ఆ మాటలకి షాక్ అయిపోతుంది హారిక. మా అన్నయ్య వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నడిరోడ్డు మీద ఉన్నారు వెళ్లి తీసుకొని వస్తాను అంటూ కంగారుగా వెళ్ళబోతున్న హర్షని ఆపుతుంది హారిక.
మీ పిన్ని మొహమే చూడని మీ అమ్మ నీతో వస్తుందని ఎలా అనుకుంటున్నావు, వాళ్లు రారు హర్ష ఎవరినైనా పంపించి వాళ్లని రప్పించి మన గెస్ట్ హౌస్ లో ఉండేలాగా ఏర్పాట్లు చేద్దాం అంటుంది హారిక. వాళ్లు రాలేరు అని చెప్పి నేను వాళ్ళని రోడ్డుమీద వదిలేయలేను, నా మీద కోపం ఉన్న నేను వాళ్ళ కొడుకుని, వాళ్లని పట్టించుకోవాల్సిన బాధ్యత నాది. నేను ఉండగా పరాయి వాళ్ళతో ప్రిపేర్ ఏంటి వాళ్ళు రాకపోతే బలవంతంగా తీసుకొని వస్తాను అంటూ వెళ్ళిపోతాడు హర్ష.
పైశాచిక ఆనందాన్ని పొందుతున్న హారిక..
నేను కొట్టిన దెబ్బకి వడ్డేనా పడ్డ చేప లాగా గిలగలా కొట్టుకుంటున్నారు అంటూ పైశాచిక ఆనందం పొందుతుంది హారిక. మరోవైపు ఇంటికి వచ్చిన లీలావతిని అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన వర్షిణి పట్టుకొని ఏడ్చేస్తుంది. మన ఇల్లు మనకి లేకుండా పోయిందంటే చాలా బాధగా ఉంది అంటుంది వర్షిణి. దేవుడికి మా మీద కోపం వచ్చింది అందుకే ఆ దేవాలయాన్ని మాకు కాకుండా చేశాడు అంటుంది లీలావతి. బాధపడకండి పెద్దమ్మ మీకు మేమున్నాం అంటూ తన ఇంటిలోకి తీసుకువెళ్తుంది వర్షిణి.
వాళ్లని గుమ్మంలోనే నిలబెట్టేస్తుంది దమయంతి. ఇటువైపు కాలు మళ్ళిందేంటి మీ కొడుకు చేసిన ఎదవ పనికి నా కూతురు ఎంత బాధ పడుతుందో చూడ్డానికి వచ్చారా అంటుంది దమయంతి. వాళ్ళ ఇంటిని జడ్పీ చేశారమ్మ అందుకే మన ఇంటికి తీసుకొని వచ్చాను అంటాడు సూర్య. అంటే మా ఇంట్లో దిష్టి వేయటానికి వచ్చారా అంటుంది దమయంతి. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఏంటి అన్నా వర్షిణి ని నోరు మూయించేస్తుంది దమయంతి. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను అంత తిట్టు పోసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకున్న ఇంటికి వచ్చారు అని నిలదీస్తుంది.
లీలావతిని నానా మాటలు అంటున్న దమయంతి..
మిమ్మల్ని నమ్మిన వాళ్ల నోట్లో మట్టి కొట్టినందుకే ఆ దేవుడు మీకు విలువని ఏడ లేకుండా చేసేసాడు అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది. సూర్య తల్లిని వారిస్తుంటే వాళ్లు నన్ను అంటే లేని బాధ నేను వాళ్ళను అంటే వచ్చేస్తుందా అంటుంది దమయంతి. నీకు కూతురు కన్నా ఆస్తి ముఖ్యమా అని అడిగావు ఈరోజు నీ ఆస్తులు పోగానే నా ఇల్లు గుర్తు వచ్చిందా అంటుంది దమయంతి. నేనేమీ కావాలని మీ ఇంటికి రాలేదు మీ ఇంటికి వస్తే ఇలా మాట్లాడతావని తెలుసు.
నీ కొడుకు కోడలు రమ్మని బ్రతిమిలాడితే రావలసి వచ్చింది అనవసరంగా నోరు పారేసుకోవద్దు అంటూ కేకలు వేస్తుంది లీలావతి. బతుకు బజారుపాలైన పౌరుషానికి ఏం తక్కువ లేదు అంటుంది లీలావతి. దరిద్రాన్ని వదిలించుకోవాలని నా కొడుకు తెలియదు అందుకే మిమ్మల్ని వెంటబెట్టుకొచ్చాడు, వాడు పిలిస్తే మీరు ఎగేసుకుని వచ్చేయటమేనా? గతి లేని వాళ్ళని పోషించడానికి ఇదేమి అనాధాశ్రమం కాదు. నీ పెద్ద కొడుకు జైల్లో ఉన్నాడు.
మీకు ఎంత హక్కుందో మాకు అంతే హక్కు ఉందన్న వర్షిణి..
రెండో కొడుకు నా కూతుర్ని వదిలేసి వేరే దాంతో కొలుకుతున్నాడు నీ చెల్లెలు హాస్పిటల్ లో ఉంది నువ్వు మా నెత్తి మీద కూర్చోవడానికి వచ్చావా కుదరదు అంటుంది దమయంతి. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దమ్మా, నువ్వేమీ రాళ్ల కొట్టి పోషించక్కర్లేదు నిన్ను నీ కూతుర్ని ఎలాగైతే పోషిస్తున్నానో అలాగే నేను వాళ్ళని పోషిస్తాను అంటాడు సూర్య. మాట్లాడితే నా ఇల్లు అని అంటున్నారు ఇంటి మీద మీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. మా మీద పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకోను.
వాళ్ళు ఇక్కడే ఉంటారు మీకు అంత ఇష్టం లేకపోతే వేరే వెళ్లిపోండి అంటుంది వర్షిణి. బిల్డప్పులు ఇస్తున్నావ్ ఏంటి ఎక్స్ట్రాలు చేయకు, ఈ ఇంటికి పెద్ద మా అమ్మ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేయవలసింది మా అమ్మ అంటుంది రాశి. అంతగా కావాలంటే ఆవిడ గారు కొడుకు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళమను. వీళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అంటుంది రాశి. బుద్ధి లేకుండా మాట్లాడొద్దు రాశి అంటాడు సూర్య. బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నాను అల్లుడు ఇంటికి వెళ్లి తిని కూర్చోవాలని ఎవరు అనుకోరు ఆ మాత్రం తెలీదా అత్తయ్య గారికి అంటుంది రాశి.
లీలావతిని ఘోరంగా అవమానించిన దమయంతి..
నువ్వు మాట్లాడుతున్నది మీ అత్తగారితో, నీకు కనీసం జాలి కూడా లేకపోతుందా ఎలాంటి పరిస్థితుల్లో వచ్చేమో నీకు తెలియదా అంటుంది కృష్ణ. వదిన నువ్వు ఎవరిని ప్రాధేయపడక్కర్లేదు ఈ ఇంటి మీద ఆవిడకి ఎంత హక్కు ఉందో నా భర్తకి కూడా అంతే హక్కుంది. సూర్య వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళు ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను అంటుంది వర్షిణి. ఇది నా ఇల్లు నన్ను కాదని ఈ ఇంట్లోకి ఎవరిని తీసుకొచ్చిన ఊరుకునేది లేదు, నా చావుని చూడాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటుంది దమయంతి.
మా కోసం మీరెవరు చచ్చిపో అక్కర్లేదు, మాకు ఎవరి ఆసరా అక్కర్లేదు మా కోసం మీరు గొడవలు పడకండి అంటుంది లీలావతి. ఏంటి పిన్ని ఇది పరాయి వాళ్ళతో నైనా ఎవరు ఇలా ప్రవర్తించరు మేము మీకు కేంద్రకం చేసావని ఇలా ప్రవర్తిస్తున్నారు పిన్ని అంటుంది కృష్ణ. నువ్వే పెద్ద నీతులు చెప్పావు కదా అంటుంది రాశి. నేనేం చెప్పాను రాశి అంటుంది కృష్ణ. పెళ్లయిన ఆడదానికి అత్తగారిల్లు అసలైన ఇల్లు, పుట్టిల్లు పరాయింటితో సమానం అన్నావు మరి ఇప్పుడు ఎలాగో వచ్చావ్ అంటుంది రాశి.
Intiki Deepam Illalu December 26 Today Episode: తల్లి మీద విరుచుకుపడ్డ సూర్య..
నా ఒక్కదాని కోసమే అయితే నేను వచ్చిండే దాన్నే కాదు కానీ అత్తయ్య గారి కోసమైనా ఆలోచించాలి కదా అంటూ రాశి ని బ్రతిమాలుతుంది కృష్ణ. నాకోసం నువ్వు ఎవరిని బ్రతిమిలాడొద్దు కృష్ణ, ఉండటానికి ఇల్లే అక్కర్లేదు చెట్టు నీడను కూడా బ్రతకొచ్చు అంటుంది లీలావతి. నువ్వు అన్నిసార్లు రమ్మను బ్రతిమిలాడినా కూడా నేను ఎందుకు రానన్నానో నీకు ఇప్పటికైనా అర్థమైందా సూర్య అంటుంది లీలావతి. కష్టమైన భరించవచ్చు కానీ అవమానాన్ని భరించలేం అంటుంది లీలావతి.
ఈ ఇల్లు నీది కాబట్టి నువ్వలా మాట్లాడవు మా ఇంటికి నా మాటకి విలువ లేనప్పుడు నేను మాత్రం ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి వర్షిణి బట్టలు సర్దు మనం కూడా వేరే ఇల్లు అద్దెకి తీసుకొని అందరం కలిసే ఉందాం అంటాడు సూర్య. తరువాయి భాగంలో జైలుకు వెళ్లి మనో కి జరిగిందంతా చెప్తుంది కృష్ణ. నా వలన ఇంటి పరువు తో పాటు ఇంటి మనుషులు కూడా రోడ్డు మీద పడ్డారు ఇదంతా నిన్ను ఏడిపించిన పాపమే కృష్ణ అంటూ బాధపడతాడు మనో. దీని అంతటికి కారణమైన వాళ్ళని ఎప్పటికీ విడిచిపెట్టను అని మనసులోనే అనుకుంటాడు.