Intiki Deepam Illalu December 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అవమానాన్ని భరించలేని కృష్ణ అందుకే రానని చెప్పాను అంటుంది లీలావతి. మనం కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం బట్టలు సర్దు అంటాడు సూర్య. ఇప్పుడు మీరు బయటకు వచ్చేస్తే తల్లిని వదిలేసిన కసాయి కొడుకు అని నిన్ను అంటారు, అల్లుని చెప్పు చేతుల్లో పెట్టుకొని మీ కుటుంబాన్ని విడదీసేసానని మమ్మల్ని కూడా అంటారు.
అవమాన భారంతో వెను తిరిగిన అత్తా,కోడళ్ళు..
మాకు జరిగిన అవమానం మీ పక్కింటి వాళ్ళు కూడా తెలియదు కానీ మీరు ఇల్లు వదిలి వచ్చేస్తే లోకమంతా తెలుస్తుంది లోకం మమ్మల్ని నానా మాటలు అంటుంది దయచేసి అలాంటి పని చేయొద్దు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు కృష్ణ వాళ్ళు. వాళ్లని ఎంతో బ్రతిమిలాడుతారు సూర్య, వర్షిణి. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తారు. మిమ్మల్ని వదిలేస్తానని ఎలా అనుకుంటారు మీరు నా తల్లితో సమానం మీరు ఉండడానికి ఎక్కడ ఒక దగ్గర అద్దె ఇల్లు చూసి పెడతాను అంటాడు సూర్య.
మా కోసం ఏం చేసినా మీ వాళ్లు ఒప్పుకోరు మా వల్ల దీంట్లో గొడవలు రావడం ఇష్టం లేదు అంటుంది లీలావతి. మీకోసం అద్దె ఇల్లు చూసే అవకాశాన్ని ఇవ్వండి అంటుంది వర్షిణి. వద్దు వర్షిణి మావల్ల మీరు మాటలు పడడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటుంది లీలావతి. మా అత్తగారు మా గురించి మీకు తెలిసిందే కదా ఆవిడ గురించి ఏం పట్టించుకోకండి. సూర్య నేను వెళ్లి ఏదైనా ఫీల్డ్ చూసుకొని వస్తావ్ అంతవరకు ఇక్కడే ఉండండి అంటూ బయలుదేరిపోతుంది వర్షిణి.
లీలావతిని ఇగ్నోర్ చేసిన రాధ..
మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మా దారిన మమ్మల్ని వాళ్ళనివ్వండి అంటూ సూర్య దగ్గర ఫోన్ తీసుకొని ఆమె స్నేహితురాలు రాధ కి ఫోన్ చేస్తుంది. నేను చాలా కష్టాల్లో ఉన్నాను అని నాకు కొంచెం డబ్బు అవసరం ఉందని చెప్తుంది లీలావతి. అప్పటివరకు బాగానే మాట్లాడిన ఆ ఫ్రెండ్ డబ్బులు అడిగేసరికి ఫోన్ కట్ చేస్తుంది. మళ్లీ ఎక్కడ చేస్తుందో అని ఫోన్ కట్ చేసేస్తుంది రాధ. డబ్బు లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కూడా చులకన చులకన అయిపోతాం అన్నమాట, మనుషులకి మానవత్వం లేకుండా పోతుంది అని బాధపడుతుంది లీలావతి.
ఫోన్ సూర్యకిచ్చేసి బయటికి వెళ్లిపోతారు కృష్ణ, లీలావతి. వాళ్లకి ఎదురెళ్లి హర్ష తల్లిని ఇంటికి రమ్మని బ్రతిమలాడుతాడు. బ్యాంకు ఇల్లు సీజ్ చేసిన విషయం కనీసం నాకు చెప్పలేదు ఏంటమ్మా? మీరు సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తారని అనుకున్నాను అందుకే ఇక్కడికి వచ్చాను అయినా మీరు పరాయి వాళ్ళ ఇంటికి వెళ్లడం ఎందుకు నా ఇంట్లో ఉందురు గాని రండి అంటాడు హర్ష. మేము పరాయి వాళ్ళ ఇంటికి రాము అంటుంది లీలావతి.
తల్లిని కనికరం లేకుండా మాట్లాడొద్దన్న హర్ష..
నేను పరాయి వాడిని ఏంటమ్మా కనికరం లేకుండా మాట్లాడుతున్నావ్ ఏంటమ్మా అంటాడు హర్ష. కనికరం లేనిది నాకా, నీకా? మన కుటుంబాన్ని ముక్కలు చేసింది నువ్వు మన పరువుని బజారుకి ఈడ్చింది నువ్వు. కన్నవాళ్ళ కన్నా, కట్టుకున్న దానికన్నా నువ్వు మోజు పడిన ఆడదే మీకు ముఖ్యం అనుకున్నావ్. నీలాంటి వాడిని స్వార్థపరుడు అంటారు అంతేగాని కొడుకు అనరు.
నువ్వు మా మాట వినుంటే ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవా? మీ నాన్న అన్నయ్య వాళ్ళు జైలు పాలు అవడానికి కారణం నువ్వు, మీ పిన్ని హాస్పిటల్ పాలు అవడానికి కారణం నువ్వు అంటూ కొడుకుని చివాట్లు పెడుతుంది లీలావతి. అదేంటమ్మా వాటన్నిటికీ నేను కారణమా అంటాడు హర్ష. నువ్వు హారికతో సంబంధం పెట్టుకోవడం వల్లే కదా దమయంతి పిన్ని లాయర్ ని తీసుకొచ్చి అంత హడావుడి చేసింది, బావగారు ఆస్తులు పంచేయాలనుకోవటానికి కారణం అదే కదా దానివల్లే మామయ్యకి హార్ట్ ఎటాక్ వచ్చింది.
లీలావతి కాళ్లు పట్టుకున్న హర్ష..
అన్నింటికీ కారణం నువ్వు అని తెలిసి కూడా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావ్ అంటుంది కృష్ణ. అవని మాట్లాడుకునే సమయం ఇది కాదు దయచేసి నా మాట వినండి అని రిక్వెస్ట్ చేస్తాడు హర్ష. ఇప్పటివరకు జరిగిన అవమానాలు చాలు దయచేసి మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనీ అంటుంది లీలావతి. తల్లి కాళ్లు పట్టుకొని కనీసం అన్నయ్య వాళ్ళు జైలు నుంచి వచ్చేవరకైనా నా దగ్గర ఉందురు రండి అని రిక్వెస్ట్ చేస్తాడు.
మీ నాన్న బయటికి వచ్చేంతవరకు అయినా నన్ను బ్రతకని అంటూ కొడుకు మీద కోప్పడుతుంది లీలావతి. మనుషులంటేనే అసహ్యించుకునే పరిస్థితికి అత్తయ్య గారు వచ్చేసారు, నేను అత్తయ్య గారిని చూసుకుంటాను నువ్వేమీ బాధపడొద్దు అంటూ లీలావతిని తీసుకొని వెళ్ళిపోతుంది కృష్ణ. ఒక చెట్టు కింద కూర్చొని ఎలాంటి పరిస్థితి వచ్చింది మనకి అంటూ బాధపడుతుంది లీలావతి. మనుషుల మధ్య కోపతాపాలు ఉండడం నిజమే కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంతా పంతం అవసరమా ఉంటుంది కృష్ణ.
రోడ్డున పడ్డ అత్తా, కోడళ్ళు..
హర్ష చేసింది తప్పే కానీ అతని విషయంలో అంత కఠినంగా ఉండడం అవసరమా అంటుంది. కన్న పిల్లల్ని దూరం చేసుకోవాలని ఏ తల్లికి ఉండదు కానీ ఏ ఆడదానికైనా పిల్లల కన్నా భర్త కట్టిన తాళి మీదే ఎక్కువ విలువ ఉంటుంది. ఆయన హర్షిని క్షమించాలి అనుకోవడం లేదు. అలాంటప్పుడు వాడు పిలిచాడని మనం వెళ్తే ఆయన తట్టుకోలేరు. ఆయనకు ఏమైనా జరిగితే నేను నా మాంగల్యాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది అంటూ ఏడుస్తుంది లీలావతి.
మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ ఎక్కడికో వెళ్తుంది కృష్ణ. అట్నుంచి వచ్చిన కృష్ణ వెళ్దాం పదండి అంటుంది. ఎక్కడికి వెళ్దాం అని లీలావతి అడిగితే ఏదైనా హద్దులు చూసుకుందాం అంటుంది కృష్ణ. దీంట్లో ఉండాలంటే డబ్బు ఉండాలి కదా ఇప్పుడు డబ్బు ఎక్కడిది అంటుంది లీలావతి. ఎవరి దగ్గర తీసుకున్నావ్ అని అడిగితే నేను ఎవరి దగ్గర తీసుకోలేదు అత్తయ్య నా గాజులు అమ్మేశాను అంటుంది కృష్ణ
అత్తా కోడల్ని అనుమానిస్తున్న పూలావిడ..
దానికి బాధపడుతున్న లీలావతిని కనీసం అవసరంలో మనకి వస్తువులైన ఆదుకుంటున్నాయి అందుకు సంతోషించండి అని నీలావతిని తనతో పాటు తీసుకువెళ్తుంది కృష్ణ. అద్దింటి కోసం ఒక ఆవిడ దగ్గరికి వెళ్తే మీ ఇంటి మగవాళ్ళు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది ఆవిడ. నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు అంటూ మా వారు జైల్లో ఉన్నారు అని చెప్తుంది కృష్ణ. మగోళ్ళు తాగి చందనాలు అడిగి జైలుకు వెళ్లడం అనేది పెద్ద విషయం ఏమి కాదు.
మీ మగవాళ్ళు జైల్లో ఉన్నారు మీరు అద్దెలా కడతారు అని అడుగుతుంది. మిమ్మల్ని చూస్తే కూలి పనులు చేసేవారి లాగా కనిపించడం లేదు. ఎలా కడతారు అని అడుగుతుంది. నేను ఏదైనా పని చేసి డబ్బులు కడతాను అంటుంది కృష్ణ. పని దొరక్కపోతే ఏం చేస్తావ్ మగవాళ్ళని అయితే గమనించి అడగ్గలను కానీ ఆడవాళ్ళని అలా అడగలేము కదా అంటుంది ఆవిడ. మేము మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించినమ్మ కావాలంటే ఈ పువ్వులు కట్టిస్తాను నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అంటుంది లీలావతి. మీరు పువ్వులు కట్టడం ఏంటి అత్తయ్య అంటే కష్టపడి పనిచేయటానికి నామోషి అవసరం లేదమ్మా అంటుంది లీలావతి.
Intiki Deepam Illalu December 27 Today Episode: అద్దె ఇంటిని చూసి బాధపడిన లీలావతి..
మీకు పువ్వులు కట్టడం అలవాటేనా అంటే రెండు రోజులు చేస్తే అదే అలవాటైపోతుంది అంటుంది లీలావతి. సరే అయితే సాయంత్రం పువ్వులు పంపిస్తాను అంటుంది ఆవిడ. అడ్వాన్స్ అంత ఇవ్వమంటారు అంటే అడ్వాన్స్ ఏమీ వద్దు నెల అద్దె ఇవ్వండి చాలు అంటుంది ఆవిడ. ఇల్లు చూసుకోమని తాళం ఇస్తుంది. ఇంటిని చూసినా లీలావతి ఇది మన వంటగది అంత కూడా లేదు అంటుంది లీలావతి.
బాధపడకండి అత్తయ్య మిమ్మల్ని బాగా చూసుకుంటాను అంటుంది కృష్ణ. తరువాయి భాగంలో మనో దగ్గరికి వచ్చిన కృష్ణ జరిగిందంతా చెప్తుంది. కేవలం నా కారణంగానే మన ఇల్లు రోడ్డున పడిపోయింది అంటూ బాధపడతాడు సూర్య. దీనికి అంతటికి కారణమైన వాళ్ళని వదలను అనుకుంటాడు మనో.