Intiki Deepam Illalu January 3 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నేను చేయలేని పని దమయంతి చేస్తుందట అవునులే కొందరు మగవాళ్ళు చేయలేని పనులు ఆడవాళ్లు మాత్రమే చేయగలరు అనుకుంటాడు హరి నారాయణ . అంతలోనే అక్కడికి రాశిని తీసుకుని వస్తుంది దమయంతి. అతన్ని చూసిన రాశి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు కంగారుగా అడుగుతుంది.
తల్లి చేసిన పనికి షాక్ అయిన రాశి..
ఈ అమ్మాయి మీ అన్నయ్య కూతురు రాశి అంటుంది దమయంతి. మీరు అంతా సీరియస్ గా చూడకండి పిల్ల భయపడుతుంది అంటుంది దమయంతి. కంగారు పడకు నేను నీకు బాబాయిని అవుతాను, ఇన్నాళ్లు నువ్వే నా అన్న కూతురు అని తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్లు నీకు చెందిన కోట్ల ఆస్తిని కాపాడుతూ వచ్చాను, నీ ఆస్తిని కాపాడడం బాబాయిగా నా బాధ్యత అంటాడు హరి నారాయణ .
ఏం మాట్లాడుతున్నారు అమ్మ, నేను వీళ్ళ అన్నయ్య కూతురు ఏంటి నా ఆస్తిని వీళ్ళు కాపాడడం ఏంటి నన్ను డ్రామా రిహార్సల్ కి తీసుకొచ్చావా అంటుంది రాశి. ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంటి నిజంగా తను నా అన్నయ్య కూతురేనా నిజం చెప్పకపోతే నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవు అంటాడు హరి నారాయణ . తను నిజంగానే మీ అన్నయ్య కూతురు ఇన్నాళ్లు తనకి నిజం తెలియదు సడన్గా ఇప్పుడు నిజం తెలిసేసరికి కంగారుపడుతుంది. అందుకే నాకు కొంచెం టైం కావాలి అని అడిగాను మీరేమో కంగారు పడి లాయర్ ని పంపించారు.
నన్నే అనుమానిస్తున్నారు అంటున్న దమయంతి..
అందుకే తనకి నిజం చెప్పటానికి కూడా టైం లేకపోయింది అంటుంది దేవయాని. అయినా ఇదేమైనా చిన్న విషయమా అంటుంది దమయంతి. మీరేమో నన్నే అనుమానిస్తున్నారు అందుకే నేను అరగంటలోగా ఇక్కడి నుంచి బయటపడకపోతే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వమని బయట ఉన్న నా మనుషులకి చెప్పాను. మీరేమీ నన్ను బెదిరించక్కర్లేదు పద అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది దమయంతి. సడన్ గా నిజం చెప్పేసరికి ఆ అమ్మాయి ఎమోషనల్ అయింది.
నాకు కూడా అలాగే ఉంటుంది కదా అర్థం చేసుకో అంటూ వాళ్ళ అన్నయ్యకి సంబంధించిన ఆస్తి పేపర్లు చూపించి వాటి మీద రాశి ని సంతకం పెట్టమంటాడు. ఇప్పుడు ఈ సంతకాలు అవన్నీ ఎందుకు, మీరు డాక్యుమెంట్లో చూపించిన ఆస్తులన్నీ చూసిన తర్వాత అప్పుడు సంతకాలు పెట్టుకుందాం అంటుంది దమయంతి. ఇంత పెద్ద డీల్ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది అంటుంది దమయంతి. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ రాశిని తీసుకొని వెళ్ళిపోతుంది దమయంతి.
హారిక కి చెమటలు పట్టిస్తున్న రాఖి..
ఈ దమయంతిని చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉంది. ముందు ఈ ఆస్తి పత్రాలు మీద సంతకాలు అయిపోని అప్పుడు నా అనుమానాన్ని క్లియర్ చేసుకుంటాను అనుకుంటాడు హరి నారాయణ . మరోవైపు రాఖీని తలుచుకొని కంగారు పడుతుంది హారిక. ఆ రాఖి పెద్ద సైకో గాడు వాడి పీడా విరగడైపోయింది అనుకుంటే మళ్ళీ సడన్గా వచ్చాడేంటి, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది రాఖీ అని ఇప్పుడే అర్థమైంది అంటే వాడు నన్ను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాడు అన్నమాట అనుకుంటుంది హారిక.
నాకు ఉన్న డబ్బుతో ఏదైనా చేయగలను కానీ వాడి శాడిజం ముందు నా మనీ పవర్ దేనికి పనికిరాదు. ఇప్పుడేం చేస్తాడు తెలియదు ఆ హర్ష కి వాడు నిజం చెప్పేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతుంది హారిక. అప్పుడే బెడ్ రూమ్ లోంచి బయటికి వచ్చిన హర్ష, రాత్రి నాకుగా నేను ఇంటికి వచ్చినట్టు గుర్తులేదు ఎలా వచ్చాను అని అడుగుతాడు. ఓవర్ డ్రింక్ చేసి స్ప్రోలు తప్పి పడిపోయావు పెట్రోలింగ్ పోలీసులు మీ మొబైల్ లో ఉన్న నా నెంబర్ కి ఫోన్ చేస్తే నేనే నిన్ను తీసుకొని వచ్చాను అంటుంది హారిక.
హారిక కి సారీ చెప్పిన హర్ష..
మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఎక్కువగా తాగేసాను సారీ అంటాడు హర్ష. వాడు నన్ను ఫాలో చేస్తున్నట్టే హర్ష అని కూడా ఫాలో చేస్తున్నట్లు ఉన్నాడు, నన్ను వాడిదారికి తెచ్చుకోవడానికి హర్షని కిడ్నాప్ చేసిన చేస్తాడు అని మనసులోనే అనుకుంటుంది హారిక. నాకోసం చాలా టెన్షన్ పడినట్లు ఉన్నావు సారీ హారిక అంటాడు హర్ష. నాకు చెప్పకుండా ఎప్పుడు బయటికి వెళ్లొద్దు అంటుంది హారిక. మా వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్ ఏదైనా అరేంజ్ చేయాలి అని హర్ష అంటే నువ్వు రెస్ట్ తీసుకో అవన్నీ నేను చూసుకుంటానులే అంటుంది హారిక.
మరోవైపు లీలావతి పోలీస్ స్టేషన్లో ఉన్న జగదీష్ వాళ్లకి భోజనం తీసుకుని వస్తుంది. లేట్ అయిపోయింది నాన్న ఆకలి వేస్తుందా సారీ అంటుంది లీలావతి. సారీ చెప్పవలసింది నేను పెద్దమ్మ, మిమ్మల్ని ఇలా రోడ్డుకి ఇచ్చి నవ్వులపాలు చేశాను అంటాడు మను. మీరందరూ ఎక్కడ ఉంటున్నారు ఏం తింటున్నారు అని ఆలోచించి ఆలోచించి మనసు బాధతో నిండిపోయింది అంటాడు మనో. కష్టాలు కలకాలం ఉండవు దిగులు పడకు ముందు భోజనం చేయండి అంటుంది లీలావతి.
గిల్టీగా ఫీల్ అవుతున్న మనో, జగదీష్..
లీలావతిని కృష్ణ,మహేశ్వరి ఎక్కడ అని అడుగుతారు జగదీష్ వాళ్ళు.అవునూ,అమ్మ ఎందుకు నన్ను చూడ్డానికి రావట్లేదు, నా మీద పడిన నింద నిజమని నమ్ముతున్నారా? అంటాడు మనో. అలాంటిదేమీ లేదు నిన్ను విడిపించడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు కూడా లాయర్ తో మాట్లాడడానికే వెళ్లారు అందుకే రాలేదు అంటుంది లీలావతి. నేను పాపిష్టి వాడిని మీ అందరిని ఈ వయసులో ఇబ్బంది పెడుతున్నాను. నేను ఏ తప్పు చేయలేదని అమ్మకు చెప్పు పెద్దమ్మ అంటాడు మనో.
తప్పు నీది కాదు మనో నాది నేను తండ్రిగా భర్తగా అన్నిట్లోని ఫెయిల్ అయ్యాను. తల్లిదండ్రులు తమ పిల్లలకు వారసత్వంగా ఆస్తినిస్తాడు కానీ ఈ ఈ తండ్రినీకు అప్పులు మిగిల్చాడు నా వల్లే నీకు ఈ అప్పనిందులో అవమానాలు అంటూ బాధపడతాడు జగదీష్. మీరే ఇలాంటి పడిపోతే మనోని ఎవరు ఓదారుస్తారు అంటూ భర్తకి నచ్చ చెప్తుంది లీలావతి. ముందు మీరు భోజనం చేయండి అంటే ఆ ప్యాకెట్ వాళ్లకి ఇచ్చి వెళ్ళిపోతుంది లీలావతి. మరోవైపు కోపంగా వెళ్ళిపోతున్న రాశిని, నేను చెప్పేది విను ఆగు అంటూ ఆపుతుంది దమయంతి.
అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన దమయంతి..
వాళ్లు మన శత్రువులు కదా, నేను తన అన్న కూతురు ఏంటి స్టోరీలు చెప్తున్నావా అని అడుగుతుంది రాశి. నేను నిజమే చెప్తున్నాను, నువ్వు వాళ్ళ అన్నయ్య కూతురువే అంటుంది దమయంతి. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి నువ్వు వాడిని నమ్మించాలని చూస్తున్నావా నన్ను నమ్మించాలని చూస్తున్నావా అంటుంది రాశి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కన్నుకూతురు విషయంలో ఎవరు అబద్ధం చెప్పరు. ఆస్తుల కోసం పిల్లల్ని ఎవరు కాదనుకోరు.
నువ్వు నా కన్న కూతురివి కాకపోయినా కన్నబిడ్డ లాగా పెంచేను. ఒకప్పుడు నేను హరి నారాయణ ఒక ఊర్లో ఉండేవాళ్ళం. వాళ్ళ అన్న, వదిన సడన్గా చనిపోయారు. చనిపోయిన వాళ్ళ బిడ్డ నాకు దొరికింది. ఆస్తి కోసం ఆ బిడ్డని కూడా చంపేస్తారేమో అని భయపడి నా బిడ్డ అని చెప్పి పెంచాను. నీ ప్రాణాన్ని కాపాడిన నేను నీతో అబద్ధం ఎందుకు చెప్తాను అంటుంది దమయంతి. నేను వాళ్ల కూతుర్ని అయితే మరి కృష్ణ ఎవరు అంటుంది రాశి. కాదు మీ నాన్న ఏదో ఆశ్రమం నుంచి తనని తీసుకొని వచ్చారు తను ఒక అనాధ, నేను చెప్పేది నిజం.
మీ నానమ్మ మీద ఒట్టు అంటుంది దమయంతి. ఆస్తి కన్నా నాకు నువ్వే ముఖ్యం కాబట్టి ఇన్నాళ్లు నిజం చెప్పలేదు. ఇప్పుడు నీ భర్త నిన్ను మోసం చేశాడు కాబట్టి నీ జీవితం బాగుపడాలని ఉద్దేశంతో ఇప్పుడైనా నిజాన్ని బయటపెట్టాను అంటుంది దమయంతి. నేను నిజం చెప్పకపోతే ఆస్తులన్నీ ఎవరికీ చెందకుండా ఉండిపోతాయి అదే చెప్తే సగం ఆస్తి వస్తుంది. నేను చేసింది నీ మంచి కోసమే రాశి నన్ను అర్థం చేసుకో, నీ చేతికి ఆస్తి రాగానే నీ భర్తని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొని రావచ్చు ఆ హారిక కి సరైన బుద్ధి చెప్పొచ్చుఅంటుంది దమయంతి.
Intiki Deepam Illalu January 3 Today Episode: హారికని బెదిరిస్తున్న రాఖి..
కానీ ఇదంతా ఎవరూ నమ్మరు కదా అంటుంది రాశి. నమ్మకాలు ముఖ్యమా,కోట్ల ఆస్తి ముఖ్యమా, కోట్ల ఆస్తి మనల్ని వరిస్తున్నప్పుడు దరిద్రుల గురించి మనం ఆలోచించకూడదు నేను నీకు తోడుగా ఉంటాను అంటుంది దమయంతి. సరేలే నేను హర్ష దగ్గరికి వెళ్తాను అంటుంది రాశి. వెళ్లి బ్రతిమిలాడతావా అంటుంది దమయంతి. బ్రతిమలాడం ఫస్ట్ ఆఫ్ స్టోరీ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం సెకండ్ హాఫ్ స్టోరీ అంటుంది రాశి. మరోవైపు రాఖీని తలుచుకొని భయపడిపోతుంది హారిక.
నా హర్షని అడ్డుపెట్టుకొని నన్ను భయపెట్టాడంటే ఇంకేం చేస్తాడు అని భయంగా ఉంది అనుకుంటుంది హారిక.అంతలోనే రాఖీ నుంచి ఫోన్ వస్తుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి భయపడుతున్నావా నేను కిడ్నాప్ చేస్తే భయపడాలి కాని నీ డిక్కీ లో పెట్టాను కదా భయం ఎందుకు అంటాడు. ఇలాంటి షాక్ లు ముందు ముందు చాలా చూడాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి, నేను వచ్చింది తాజ్ మహల్ చూడడానికి కాదు నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి అంటాడు రాఖి. తరువాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్ లో చూద్దాం.