Intiki Deepam Illalu December 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వాళ్లు ఉన్న పరిస్థితికి బాధ పడుతుంది లీలావతి. వందల మందిని పోషించే మనవాళ్లు జైల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల ధైర్యం ఉన్న మహేశ్వరి హాస్పిటల్లో ఉంది. మన పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందెంటి కృష్ణ అని బాధపడుతుంది లీలావతి.
బాధతో కన్నీరు పెట్టుకుంటున్న లీలావతి..
మహేశ్వరి ఉన్న ఏదైనా చేయగలిగేది నేను మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేద్దాం అంటే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. బంధువులే కాదు స్నేహితులు కూడా పేదరికంలో ఉన్న వాళ్ళని పట్టించుకోవటం లేదు అంటుంది లీలావతి. మీ స్నేహితురాలు నాకు ఉద్యోగం చూసింది కదా అత్తయ్య మీ సంపాదనతో పాటు నా సంపాదన తోడైతే అత్తయ్య గారిని ధైర్యంగా చూసుకోవచ్చు. నీలోగా మావయ్య వాళ్ళు బయటికి వచ్చేస్తే మనం పరిస్థితులు మారుతాయి అంటూ ధైర్యం చెప్తుంది కృష్ణ.
వాళ్లని చూడడానికి వెళ్తాను అన్నావు కదా ఏమైంది అంటుంది లీలావతి. వాళ్లకి బెయిల్ ఇవ్వాలంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాళ్లు ఎవరైనా ఫెయిల్ ఇవ్వాలంట అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అత్తయ్య అంటుంది కృష్ణ. అంటే వాళ్ళు ఇప్పట్లో రావడం కష్టమన్నమాట అని ఏడుస్తుంది లీలావతి. బాధపడకండి అత్తయ్య దేవుడే మనకి సాయం చేస్తాడు అంటుంది కృష్ణ. మరోవైపు ఇంటికి వచ్చిన వర్షిణి వాళ్ళని చూసి ఏం , బియ్యం ఏంటి మీ వాళ్ళు పరమాన్నం వండి తెమ్మన్నారా అని వెటకారంగా అడుగుతుంది.
వర్షిణిని నిలదీస్తున్న దమయంతి..
ఆడపిల్లల సొమ్ము తినాలనుకునే కుసంస్కారం లేదు వాళ్ళకి. మేం పట్టుకెళ్ళిన సామాన్లు తిరిగి పంపించేసింది పద్ధతి తెలిసింది కాబట్టి బొట్టు పెట్టి ఒడిబియ్యం పోసింది అంటుంది వర్షిణి. చిటికెడు కుంకుమ రెండు కేజీలు బియ్యానికి అంత గొప్పగా చెప్తున్నావు, ఇచ్చిందానికైనా సిగ్గుండాలి తీసుకునే దానికైనా సిగ్గుండాలి. ఆరోజు నా కూతురు పట్టుచీర పెడుతుంటే పుట్టుకతోనే కోటీశ్వరుల్ని నేను ఇలాంటివి చాలా చూశాను అని గొప్పలు పోయావు.
ఈరోజు ఏమైంది, ఓడలు బళ్ళు,బళ్ళు ఓడలు అవడం అంటే ఇదే. మీ అమ్మ మంచాన్ని పడిన నీ పొగరు ఏమి అణగలేదు అంటుంది దమయంతి. ఇంకా ఏదో మాట్లాడబోతున్న దమయంతిని మధ్యలోనే ఆపేస్తాడు సూర్య. ఏం ఆడదైనా సౌభాగ్యంకి చిహ్నాలు అయినా పువ్వులు కుంకుమ కోరుకుంటుంది నువ్వు దానికి కూడా విలువపడుతున్నావ్ అంతా నీచమైన మనస్తత్వం ఏమిటి నీది, డబ్బు ఉన్నా లేకపోయినా అత్తయ్య వాళ్ళది గొప్ప మనసు.
తల్లి,చెల్లిని అసహ్యించుకుంటున్న సూర్య..
వాళ్ళ దగ్గర రూపాయి లేకపోయినా మన దగ్గర చేయి చాచలేదు. గొప్ప వాళ్ళు ఎప్పటికీ గొప్ప వాళ్లే నీకు లాగా లేకి బుద్ధులు లేవు అంటాడు సూర్య. కృష్ణ కాపురం బాగోకపోతే కోర్టు వరకు వెళ్లి ఎన్నో పాటలు పడ్డావు మరి మీ చెల్లెలు దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నావ్ అంటూ నిలదీస్తుంది దమయంతి. దీనికి నీకులాగే అహంకారం ఎక్కువ తన జీవితాన్ని తను పాడు చేసుకుంటుంది అయినా కూడా ఎక్కడ పొగరు తగ్గలేదు.
అలాంటి వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. మన జీవితాన్ని బాగు చేయాలన్న ధ్యాస నీకూ లేదు. తల్లి కూతుర్లు ఇద్దరూ నచ్చినట్లు చేసుకోండి నాకేం చెప్పొద్దు అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు సూర్య. మా పెద్దమ్మ నాకు ఏమీ ఇవ్వలేదని ఆడుకోసుకుంటున్నారు కానీ మా పెద్దమ్మ మంచి మనసుతో ఆశీర్వచనం ఇచ్చింది అది చాలు నాకు. అదే నాకు ఉన్నది నీ కూతురికి లేనిది అంటుంది వర్షిణి. నేను మీ కూతురు లాగా మొగుడు వదిలేసిన ఆడదాన్ని కాదు భర్తతో గౌరవంగా అత్తింట్లో కాపురం చేసుకుంటున్నాను.
మహేశ్వరి కాళ్లు పట్టుకున్న హారిక..
నేను నా మొగుడితో గర్వంగా బయట తిరగలను నువ్వు నీ కూతురు అలా తిరగగలరా అంటూ అత్త దుమ్ము దులుపుతుంది వర్షిణి. మరి రేపు హాస్పిటల్ లో ఉన్న మహేశ్వరి కొడుకుని తలుచుకొని బాధపడుతుంది. అంతలోనే అక్కడికి హర్ష, హారిక వస్తారు. వాళ్లని చూడటానికి కూడా ఇష్టపడదు మహేశ్వరి.
మహేశ్వరి కాళ్లు పట్టుకొని నా ప్రాణాలు కాపాడడానికే ఆయన నా మెడలో తాళి కట్టారు అర్థం చేసుకోండి అంటూ మహేశ్వరిని బ్రతిమాలుతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను హర్ష గారికి భార్యని అంటే మీకు కోడలు అవుతాను. మీ ఇంటి కోడలుగా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాకు ఉంది. అందుకే మనో గారిని మావయ్య గారిని విడిపించడానికి మెయిల్ ఏర్పాటు చేశాను. కానీ వాళ్లు కూడా నా సహాయం తీసుకోవడానికి నిరాకరించారు. బంధాలని క్షమిస్తే నిలబడతాయి కానీ ద్వేషిస్తే ఏం వస్తాయి ఆంటీ అంటుంది హారిక.
హర్ష వాళ్ళని బయటికి పొమ్మన్న మహేశ్వరి..
అవును పిన్ని మా తప్పుల్ని మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు. నిన్ను చూడడానికి వస్తే అమ్మ నన్ను చూడనివ్వకుండా బయటికి గెంటేసింది. మీరందరూ ఉండి కూడా నన్ను పట్టించుకోకపోతే నేను అనాధని అయిపోతాను నన్ను అనాధలు చేసేస్తావా పిన్ని అని అడుగుతాడు హర్ష. మీ అమ్మని నాన్నని కాదని నేను ఏమీ చేయలేను, నిన్ను నేను క్షమిస్తే నీవల్ల అన్యాయమైన ఒక ఆడపిల్లకి నేను ద్రోహం చేసిన దాన్ని అవుతాను ఆ పని నేను చేయలేను అంటుంది మహేశ్వరి.
దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపొండి అంటుంది మహేశ్వరి. సరే ఆంటీ మిమ్మల్ని చూద్దామని మీకు సేవ చేసే అదృష్టం దొరుకుతుందని ఆశపడ్డాను. మీ మనసుని గాయపరచడం మాకు ఇష్టం లేదు అందుకే మేము వెళ్ళిపోతాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు హర్ష,హారిక. బయటికి వచ్చాక నా మనసేమీ బాగోలేదు నువ్వు ఇంటికి వెళ్ళు నేను అలా బయటకు వెళ్లి వస్తాను అంటాడు హర్ష. మరోవైపు ఆలోచనలో ఉన్న కృష్ణ అన్నం పొంగిపోతున్న పట్టించుకోదు.
Intiki Deepam Illalu December 30 Today Episode: అయోమయంలో అత్తా కోడళ్ళు..
ఏమాలోచిస్తున్నావ్ కృష్ణ అంటుంది లీలావతి. మావయ్య వాళ్ళని చాలా విడిపించాలో అర్థం కావడం లేదు అత్తయ్య పెద్దగా చదువు లేదు, తెలివితేటలు లేవు. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది కృష్ణ. నా పరిస్థితి కూడా అలాగే ఉంది కృష్ణ అంటుంది లీలావతి. అడవిలో జంతువులు కూడా ఒక గుంపుగా ఉంటాయి కానీ మన కుటుంబం మాత్రం కలిసి లేదు చెల్లాచెదు రైపోయింది అంటూ బాధపడుతుంది లీలావతి.
మరోవైపు బార్ లో ఉన్న హర్ష నేను హారికని పెళ్లి చేసుకునందుకు అందరూ నన్ను తిడుతున్నారు కానీ ఎందుకు చేసుకున్నానో ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని బాధపడతాడు. తరువాయి భాగంలో కృష్ణ పనిమనిషిగా ఒక ఇంటికి వెళుతుంది నీ పని చూశాక జీతం మాట్లాడుతాను అంటారు వాళ్ళు.