Intiki Deepam Illalu February 1 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బాధపడుతున్న వర్షిణి దగ్గరికి వచ్చిన లీలావతి నువ్వు పసుపు కుంకాల తో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని ఈ చేతులతోనే దీవించాను. నా దీవెనలు ఫలించలేదు నీకు ఇలాగా అన్యాయం జరిగిపోయింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లని చూసిన నేనే భరించలేకపోతున్నాను అలాంటిది నువ్వు ఎలాగ భరిస్తున్నావు.

వర్షిణిని వోదారిస్తున్న లీలావతి..

భర్త ప్రేమని కడుపు పంటగా మార్చుకోవాలని ఆశపడే వయసు నీది ఆ ఆశ తీరకుండానే దేవుడు నీకు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు అంటూ ఏడుస్తుంది లీలావతి. ఆ దేవుడు నా తలరాతిని ఇలాగా రాశాడు మనం మాత్రం ఏం చేస్తాం, జీవితాంతం తోడుగా ఉండవలసిన భర్త లేకుండా పోయాడు ఇంత దురదృష్టం లో కూడా మీరు అందరూ తోడుగా ఉన్న అదృష్టవంతురాలని నేను.

నన్ను బాధ పడొద్దు అని చెప్పాల్సిన మీరే ఇలా బాధపడితే నేను ఏమైపోవాలి. ఇంత పెద్ద కష్టంలో కూడా మీరందరూ ఉన్నారు అన్న ధైర్యంతోనే బ్రతకగలుగుతున్నాను అలాంటి ధైర్యాన్ని కన్నీటిగా మార్చొద్దు అంటూ తిరిగి లీలావతికే ధైర్యం చెబుతుంది వర్షిణి. మరోవైపు దమయంతి ఇంటికి వచ్చిన రాఖి నన్ను ఎందుకు రమ్మన్నారు ఆంటీ అని అడుగుతాడు. రాశిని పిలిచిన దమయంతి కాఫీ పెట్టమంటుంది.

దమయంతికి ధైర్యం చెబుతున్న రాఖి..

కాఫీ కోసమే ఇంత దూరం వచ్చారా అంటుంది రాశి. అలాంటిదేమీ లేదు మీ అమ్మగారు మాట్లాడాలని రమ్మన్నారు అందుకే వచ్చాను అంటాడు రాఖి. ముందు పెళ్లి కాపీ తీసుకురా పో అంటూ రాశి ని అక్కడి నుంచి పంపించేస్తుంది దమయంతి. చెట్టు అంతా కొడుకు పోవడంతో మా జీవితాలు తలకిందులు అయిపోయాయి. నా కూతురికి నేను నాకు నా కూతురు తప్పితే మాకు ఇంకెవరూ లేరు. మమ్మల్ని ఆదరించే వారు ఎవరు లేరు దిక్కులేని వాళ్ళం అయిపోయాము అంటూ ఏడుస్తుంది దమయంతి.

అదేంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చటానికి అయిన వాళ్లే ఉండక్కర్లేదు మీకోసం నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్తాడు రాఖి. నీ మంచితనం తెలుసు కాబట్టే నీతో నా బాధ చెప్పుకుంటున్నాను కొడుకు ఎలాగూ పోయాడు ఉన్న కూతురు గురించే నా బాధ. భర్త దూరమయి నాతో ఉంటుంది జీవితాంతం మగ తోడు లేకుండా ఎలా ఉంటుందో అంటూ బాధపడుతుంది. నాకు ఏమైనా అయితే నా కూతురు పరిస్థితి ఏంటి అన్నదే నా బాధ, నువ్వు ఏమీ అనుకోనంటే నేను ఒక మాట అడుగుతాను.

దమయంతి ప్రపోజల్ కి షాకైన రాఖి..

రాశి మీద నీ అభిప్రాయం ఏంటి తనని నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటూ స్ట్రైట్ గా అడుగుతుంది దమయంతి. ఆ మాటకి షాక్ అయిన రాఖి తను ఇంత స్ట్రైట్ గా అడుగుతుంది అంటే హర్ష తో జరిగిన గొడవ గురించి ఈవిడకి తెలిసి ఉంటుంది. హర్షని రెచ్చగొట్టి మంచి పని చేశాను అనుకుంటాడు రాఖి. ఆ మాటలు విన్న రాశి అర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావు అంటూ కోప్పడుతుంది. నీ గురించే అడుగుతున్నాను అని దమయంతి అడిగితే నా గురించి ఎవరిని ఏమీ అడగవలసిన అవసరం లేదు అంటుంది రాశి.

నేను నీ తల్లిని నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను అంటుంది దమయంతి. నేను ఏం చేయాలో నాకు తెలుసు అని దమయంతి అంటే నా గురించి నీకు ఏం తెలుసు నా గురించి నేను ఏమనుకుంటున్నానో, నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అంటుంది రాశి. నేను ఏం చేసినా నీ మంచి కోసమే నువ్వు కాదన్నావంటే నేను చచ్చినంత ఒట్టు అంటూ రాశిని ఇరకాటంలో పెట్టేస్తుంది దమయంతి. నా అల్లుడు హర్ష మంచివాడు అనుకున్నాను కానీ తను నా కూతురు జీవితాన్ని నాశనం చేసేసాడు.

రాఖి నిర్ణయానికి షాకైన రాశి..

అలాంటివాడు నా కూతురికి భర్తగా ఉండడం నాకు ఇష్టం లేదు వాడు రెండో పెళ్లి చేసుకున్నట్లే నేను కూడా నా కూతురికి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటుంది దమయంతి. మీ అల్లుడని నాకు నిన్ననే తెలిసింది ఉన్నాను అలాంటివాడు మీకు కరెక్ట్ కాదని నాకు కూడా అనిపించింది అంటాడు రాఖి. వాడు ఎలాంటివాడు నీకు కూడా అర్థమయింది కదా అందుకే నేను నిన్ను అడగడంలో తప్పులేదు కదా అంటుంది దమయంతి. అడగకపోతేనే తప్పు మీ కూతురు బంగారం తనని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరము లేదు అంటాడు రాఖి.

ఆ మాటకి షాక్ అవుతుంది రాశి. పెళ్లికి ముహూర్తం తీసుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాఖి. అలాంటి అందగాడు ఆస్తిపరుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ అత్తింటి వాళ్ళు నీ గురించి మన ఇంటి గడప తొక్క కూడదు, వాళ్ల పీడ శాశ్వతంగా తొలగించుకోవాలి అంటే ముందు ఈ సంగతి వాళ్లకే చెప్పాలి పని రాశి ఎంత చెప్పినా వినిపించుకోకుండా అక్కడ నుంచి బయలుదేరుతుంది దమయంతి. మరోవైపు కృష్ణ దగ్గరికి వచ్చిన మను ఆరోజు తన సంపాదనని ఆమెకి ఇచ్చి ఎందుకు అలాగా ఉన్నావు నిన్న మీ పిన్ని అన్న మాటలకి బాధపడుతున్నావా అని అడుగుతాడు.

ఆ బాధ్యత మనదే అంటున్న కృష్ణ..

తను నన్ను మాటలు అన్నందుకు కాదు, అక్కని, హర్షని కలుపుదామని ప్రయత్నం చేస్తానంటే అందుకు ఒప్పుకోలేదు. తన కూతురు జీవితం పాడైపోవటానికి తన కొడుకు చనిపోవటానికి కారణం మనమే అంటుంది. ఒక మనిషి తప్పు చేస్తే మొత్తం కుటుంబాన్ని వంశాన్ని ఎందుకు నిందిస్తారో అర్థం కావట్లేదు. కుటుంబాన్ని తిట్టడం అంటే మీ అందరిని అవమానించటమే కదా అందుకే నాకు బాధగా అనిపిస్తుంది అంటుంది కృష్ణ. సంస్కారం లేని అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉండాల్సింది అంటాడు మనో.

అక్కని,హర్షని కలపాల్సిన బాధ్యత మనదే, అక్కడికి వెళ్లకుండా ఎలా ఉండగలను అంటుంది కృష్ణ. వాళ్ళిద్దరూ కలుస్తారని నమ్మకం నాకు లేదు రాసి నేను మార్చొచ్చేమో గాని హారిక మాయలో ఉన్న హర్షిని మార్చలేము ఈ విషయం అర్థం చేసుకుంది కాబట్టే మీ పిన్ని మనతో సంబంధాన్ని వద్దనుకుంటుంది అంటాడు మనో. మనకెందుకులే అని ఊరుకోవటానికి ఇదేమైనా వ్యాపారానికి సంబంధించిన విషయం రెండు జీవితాలకి సంబంధించిన విషయం అంటుంది కృష్ణ.

త్వరగా పని పూర్తి చేయాలంటున్న హరి నారాయణ..

ఒకరు ఏదో అన్నారని మరొకరు ఏదో చేశారని వదిలేస్తే సంసారాలు జీవితాలు ఏవి నిలబడవు. మా అన్నయ్య లేకపోతే వాళ్ళిద్దరూ మగదిగ్గు లేని వాళ్ళు అయిపోయారు ఎలాగైనా హర్షని రాశిని కలిపే ప్రయత్నం మనమే చేయాలి అంటుంది కృష్ణ. ప్రతి ఇంట్లో నీలాంటి కూతురు కోడలు ఉంటే సమస్యలన్నీ సంతోషంగా మారిపోతాయి అంటూ భార్యని మెచ్చుకుంటాడు మనో. మరోవైపు టెన్షన్ పడుతున్న హరినారాయణని ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు దీపక్.

సగం ఆస్తి మనకి వస్తుంది అని ఆనందం కన్నా సగం ఆస్తి వాళ్ళకి వెళ్ళిపోతుంది అని బాధ ఎక్కువగా ఉంది అంటాడు హరి నారాయణ. దానికి టెన్షన్ పడటం ఎందుకు సంతకాలు అయిపోయిన వెంటనే సాక్ష్యం లేకుండా లేపేస్తే సరిపోతుంది అంటాడు దీపక్. అందుకే ఆలస్యం చేయకుండా దమయంతిని తీసుకువచ్చి సంతకాలు చేయించాలి అంటాడు హరి నారాయణ. మరోవైపు సూర్య అని పట్టుకున్న దగ్గర ఈ ఫోను దొరికింది అంటూ సూర్య ఫోన్ తీసుకొని వస్తారు రౌడీలు.

నిజం తెలుసుకుని కోపంతో రగిలిపోతున్న హరి నారాయణ..

ఆన్ చేయబోతున్న హరి నారాయణని ఆపి ఇప్పుడు నువ్వు ఆన్ చేస్తే సిగ్నల్స్ ద్వారా మనం పోలీసులకి దొరికిపోతాము అంటూ తండ్రిని ఆపి సిగ్నల్స్ లేకుండా జోనర్ ఆఫ్ చేయమంటాడు దీపక్. ఆ తరువాత ఫోను ని చూసిన దీపక్ వాడు వాళ్ళ బావకి ఏదో మెసేజ్ పంపించాడు అంటూ మెసేజ్ ని వింటారు దీపక్ వాళ్ళు. అందులో సూర్య నన్ను దీపక్ వాళ్ళు బంధించారు. వాళ్ల రహస్యాలు నేను తెలుసుకున్నాను కాబట్టి నన్ను ఖచ్చితంగా చంపేస్తారు నేను తెలుసుకున్న ఇంకొక నిజం ఏంటంటే అనాధ అనుకున్న కృష్ణ హరి నారాయణ అన్న కూతురు.ఆ కోట్ల రూపాయల ఆస్తికి కృష్ణ వారసురాలు.

Intiki Deepam Illalu February 1 Today Episode

కానీ మా అమ్మ రాశిని ఆస్తికి వారసురాల్ని చేయాలన్న దుర్బుద్ధితో కృష్ణ మీ అన్న కూతురు కాదు రాశి మీ అన్న కూతురు అని అబద్ధం చెప్పింది. పని పూర్తయిన తర్వాత వాళ్లు అమ్మ వాళ్ళని చంపేస్తారు వాళ్ళని ఎలాగైనా కాపాడు అంటూ చెప్తాడు సూర్య. ఈ వాయిస్ మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పటికే వాళ్ళు మనమీద పోలీస్ కంప్లైంటు ఇచ్చి ఉంటారు అంటాడు హరినారాయణ. మనం టెన్షన్ పడవలసిన పనిలేదు ఇలాంటిదేదో జరుగుతుందని సిగ్నల్స్ లేకుండా జోనరు ఆన్ చేయమని చెప్పాను. ఈ మెసేజ్ ని మనకి అనుకూలంగా మార్చుకోవాలి అంటూ తన అనుచరులని తీసుకొని వెళ్ళిపోతాడు దీపక్.

దమయంతి ఇంత మోసం చేస్తుందా అంటూ కోపంతో రగిలిపోతాడు హరి నారాయణ. తరువాయి భాగంలో నువ్వు చదువుకున్న దానివి ఇలాగా చేయడం ఏమీ బాగోలేదు అంటూ రాశిని మందలిస్తాడు మనో. దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని రాశి అడిగితే నీ రెండవ పెళ్లి గురించి పిన్నికి జ్ఞానం లేకపోతే నీకైనా ఉండాలి కదా అంటుంది కృష్ణ. అందులో తప్పేముంది అంటుంది రాశి.