Intiki Deepam Illalu February 2 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇంటికి వచ్చిన దమయంతిని నువ్వు కొడుకు పోయిన కోపంలో మాట్లాడావని నాకు తెలుసు పిన్ని వర్షిణిని పలకరించడానికి వచ్చినందుకు సంతోషం అంటుంది కృష్ణ. అయినా ఇంట్లో దరిద్రం ఉండకూడదని తనని ఇంట్లోంచి పంపించేశాను.
అసలు విషయం చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన దమయంతి..
వదిలించుకున్న పీడని మళ్లీ పలకరించాలని పరామర్శించాలని ఎవరు అనుకోరు, నేను వద్దు అన్నా కూడా నా కూతురి కోసము లేకపోతే కోడలు పంపుతాను మా ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తారు అందుకే మీకు ఈ విషయం చెప్పటానికి ఈ గుమ్మం తొక్కవలసి వచ్చింది అంటూ రాశికి సంబంధం చూసిన విషయం చెప్తుంది దమయంతి. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు.
నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ అని జగదీష్ కంటే తప్పుచేసి జైలుకెళ్లి వచ్చింది మీరు, తప్పులు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అంటుంది దమయంతి. మీ కూతురుతో ఎలాంటి సంబంధం లేదు అని హర్షయే తెగించి చెప్పాడు అందుకే నేను శాశ్వతంగా సంబంధాలు తెంచుకుందామని నా కూతురికి వేరే సంబంధం చూశాను అంటుది. మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, మీ కొడుకు చనిపోయాడన్న బాధ కానీ నా చెల్లెలు జీవితం నాశనం అయిపోయిందన్న బాధగానే ఏమీ లేదా మీకు.
మీ కూతురికి అన్యాయం చేయొద్దు అంటున్న మనో..
నా మీద నా తమ్ముడు మీద ఉన్న కోపంతో మీ కూతురికే అన్యాయం చేస్తున్నారు అంటాడు మనో. అయితే మీరు చేసిన న్యాయం ఏమిటో చెప్పండి అయినా నేను ఇక్కడికి వచ్చింది విషయం మీకు చెప్పడానికే అంతేగాని మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి కాదు అంటూ పెళ్లికి రావద్దు అని మొహం మీదే చెప్తుంది దమయంతి. హర్ష,అక్క ఎప్పటికైనా కలుస్తారు నువ్వు అక్కకి పెళ్లి చేయాలనుకోవటం తప్పు అంటుంది కృష్ణ. పెద్ద బుడింగు లాగా నాకేమీ సలహాలు ఇవ్వకు అంటుంది దమయంతి.
కృష్ణ అన్నది నిజమే హర్ష,రాశి ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్లు బ్రతికేవారు, సమస్యలు గొడవలు వచ్చినంత మాత్రాన వాళ్ల మధ్య బంధం చచ్చిపోదు. మనం వాళ్లని కలపటానికి ప్రయత్నించాలి కానీ విడకొట్టడానికి కాదు అంటుంది లీలావతి. నీ పంచాయతీలు కి ఒక నమస్కారం, ఇప్పటివరకు నీతో చేసిన సావాసం చాలు మా బ్రతుకులు ఏమో మమ్మల్ని బ్రతకనివ్వండి. ఆరోజు నా కూతురికి ఆస్తిలో వాటా ఇవ్వండి అనేటప్పుడు ఎందుకు అప్పుడు కూర్చొని మాట్లాడదాము అనలేదు అంటూ నిలదీస్తుంది దమయంతి.
నాకు సలహాలు వద్దంటున్న
నా కూతురు జీవితం నా ఇష్టం.
సలహాలు ఇవ్వొద్దంటున్న దమయంతి..
మీరు నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు మీరే తప్పు చేశాడని నీ కొడుకుని బయటికి పంపించేశారు అలాంటి వాడితో మళ్ళీ నా కూతుర్ని కలుపుతారా? మాట్లాడడానికి కొంచమైనా సిగ్గుండాలి అంటే వాళ్ళని అసహ్యించుకొని వెళ్ళిపోతుంది దమయంతి. మా పిన్ని మాటలు పట్టించుకోవద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కృష్ణ. అది పక్కన పెట్టు కానీ రాశి పెళ్లికి ఎలా ఒప్పుకుంది అంటుంది లీలావతి. మా పిన్ని బలవంతంగా ఒప్పించి ఉంటుంది, నేను వెళ్లి మా అక్క తో మాట్లాడుతాను అంటుంది కృష్ణ.
నువ్వు ఒక్కదానివే వెళ్లి మాట్లాడితే మీ పిన్ని ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలుసు కదా నేను కూడా వస్తాను అంటాడు మనో. మరోవైపు రాఖీ,హర్ష కి ఫోన్ చేసి థాంక్యూ చెప్తాడు. ఎందుకు అని హర్ష అడిగితే, రాశి వాళ్ళ అమ్మగారు రాశిని పెళ్లి చేసుకోమని నన్ను అడిగారు. నేను లవ్ చేస్తున్న విషయం చెప్పడం ఎలాగ అని టెన్షన్ పడ్డాను కానీ వాళ్లే పిలిచి పెళ్లిని ఇస్తానంటున్నారు అంటూ ఆనంద పడిపోతాడు రాఖి. ఇదంతా నువ్వు రాశితో గొడవ పడటం వల్లే ఇదంతా జరిగింది.
హర్షని రెచ్చగొడుతున్న రాఖి..
అందుకే నీకు థాంక్స్ చెబుదామని ఫోన్ చేశాను అంటాడు రాఖీ. తను నా భార్య ని ఇప్పటికైనా నీకు తెలిసింది కదా తెలిసాక కూడా ఇంకా పెళ్లికి సిద్ధపడటం ఏంటి అని అడుగుతాడు హర్ష. ఆల్ ద బెస్ట్ చెప్పకుండా అలా అంటున్నావ్ ఏంటి బ్రో అంటాడు రాఖి. రాసి మీ వైఫ్ అది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు నీ భార్య హారిక కదా, అంటే రాసీను కూడా వదలకుండా ఇద్దరిని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావా, మరి అలాంటప్పుడు తను ఏం చేస్తే నీకు ఎందుకు బ్రో, నువ్వు రాసి లైఫ్ నుంచి వెళ్ళిపోయావు కాబట్టే నేను ఎంట్రీ ఇచ్చాను అంటాడు రాఖి.
రాశి ఇంకా నా మనసులోనే ఉంది అంటాడు హర్ష. మళ్లీ జోక్ చేస్తున్నావ్ బ్రో, నేను సన్నీలియోన్ కి పెద్ద ఫ్యాన్ ని అందుకని తను ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అంటే కుదరదు కదా, అయినా కాశీ కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంటే తన మనసులో నువ్వు లేవనే కదా అర్థం అంటాడు రాఖి. నిన్ను తప్పకుండా పెళ్ళికి ఇన్వైట్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు రాఖి.హర్ష కోపంతో కృష్ణకి ఫోన్ చేసి ఏం జరుగుతుంది వదినా నీ అక్కకి పెళ్లి జరగటం అంటే నీకు తెలియకుండా ఉంటుందా అంటాడు హర్ష.
దీని అంతటికీ నీదే బాధ్యత అంటున్న కృష్ణ..
ఏం నువ్వు రెండో పెళ్లి చేసుకోగా లేనిది తను చేసుకుంటే తప్పేంటి దాని గురించి నువ్వు నన్ను అడగడం ఏంటి అంటుంది కృష్ణ. కానీ నేను ఉండగా రాశి మరో పెళ్లికి ఒప్పుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను అంటాడు హర్ష. నీ అభిప్రాయంతో వేరే వాళ్ళకి ఏం పని, నువ్వు చేసిన పనికి మా పిన్ని వాళ్ళతో అందరినీ మాటలు పడాల్సి వస్తుంది. ఇంతకుముందే పిన్ని మా ఇంటికి వచ్చి జరిగిందంతా వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పి వెళ్లిపోయింది, పిన్ని అక్కకి పెళ్లి చేస్తున్నందుకు సంతోషించాలో బాధపడాలో అర్థం కావట్లేదు.
భర్త ఉన్నా కూడా ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అంటే పరువు పోయినట్లే దీనికి బాధ్యుడివి నువ్వే అంటూ ఫోన్ పెట్టేస్తుంది కృష్ణ. విషయం తెలిసి తట్టుకోలేకపోతున్నాడు అంటే హర్షకి ఇంకా అక్క మీద ప్రేమ ఉందని అర్ధం. అక్కకు కూడా హర్ష అంటే ఇష్టమే కానీ హర్ష మీద కోపంతో ఈ పెళ్ళికి ఒప్పుకొని ఉంటుంది ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి అనుకుంటుంది కృష్ణ. మరోవైపు ఆటో ట్రబుల్ ఇవ్వటంతో నడిరోడ్డు మీదే ఆగిపోతుంది దమయంతి.
దమయంతిని ట్రాప్ చేస్తున్న హరి నారాయణ..
అదే సమయంలో అక్కడికి వచ్చిన హరి నారాయణ దమయంతిని చూసి ఆగుతాడు. మమ్మల్ని మోసం చేస్తావా నిన్ను ఇక్కడే చంపేయొచ్చు, కానీ ఇంటికి తీసుకెళ్ళి దాని చేత నిజం తెప్పిస్తాను లేకపోతే ఏం చేయాలని అప్పుడు ఆలోచిస్తాను అనుకొని దమయంతి దగ్గరికి వెళ్లి ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతాడు. ఆటో చెడిపోయింది అందుకే ఇక్కడ ఉన్నాను అంటుంది దమయంతి. నువ్వు పెంచిన రాశి నా అన్న కూతురు అందువలన మనం బంధువులం అయ్యాము.
మన సాంప్రదాయం ప్రకారం ఎవరింట్లోనైనా మనుషులు చనిపోతే వాళ్లని పిలిచి భోజనం పెడతాం అందుకే భోజనానికి పిలవడానికి మీ ఇంటికి వెళ్తున్నాను ఇంతలో నువ్వు కనిపించావు భోజనానికి ఇంటికి వెళ్దాం రా తర్వాత నేను మీ ఇంటికి డ్రాప్ చేస్తాను అంటాడు హరి నారాయణ. తర్వాత ఎప్పుడైనా వస్తాను లెండి అంటుంది దమయంతి. ఆస్తి పంచుకున్నాక ఆత్మబంధువుల్లాగా కలిసి ఉండవలసిన వాళ్ళని మొహమాట పడొద్దు అంటూ దమయంతి కన్విన్స్ అయ్యేలాగా మాట్లాడి ఆమెని తనతోపాటు తీసుకుని వెళ్తాడు హరి నారాయణ.
ఆలోచనలో పడ్డ జగదీష్..
మరోవైపు ఆలోచనలో ఉన్న భర్తని ఏం జరిగింది అని అడుగుతుంది లీలావతి. మన కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది, ఎవరి గురించి ఆలోచించినా బాధపడడం తప్ప సంతోషించడానికి ఏముంది అంటాడు జగదీష్. పిచ్చి వ్యామోహంలో తన దారి తన చూసుకున్నాడు మన బిడ్డ. భర్త అత్తమామలకన్నా తన పంతమే ముఖ్యమని తన దారి తను చూసుకుంది కోడలు, వర్షిణి భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుందో అంటూ భయపడుతుంది లీలావతి.
రాశికి మళ్లీ పెళ్లి చేస్తే మనకి కొడుకు కోడలు పూర్తిగా లేకుండా పోతారు అయినా రాశి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోలేదు అంటాడు జగదీష్. ఇది తనకి పుట్టిన బుద్ధి అయి ఉండదు, ఇదంతా దమయంతి చేస్తుంది మనల్ని తిట్టిన వర్షిని ఇంట్లోంచి పంపించిన వేరే విషయం కానీ ఇలాంటి నీచమైన పనికి కూడా దిగజారుతుందని అనుకోలేదు. మనం దానికి భయపడి ఊరుకుంటే నిజంగానే అన్నంత పని చేస్తుంది అంటుంది లీలావతి.
Intiki Deepam Illalu February 2 Today Episode హారిక కి బుద్ధి చెప్పాలంటున్న లీలావతి..
కానీ మనం ఏం చేస్తాం రాసి వాళ్ళ అమ్మ మాట తప్పితే ఎవరి మాట వినదు అంటాడు జగదీష్. అలా అని ఊరుకుంటే జరగాల్సినంత జరిగిపోయాక నెత్తి కొట్టుకోవడం తప్పితే ఏం ఉపయోగం ఉండదు. అయినా దీని అంతటికి కారణం ఆ హారిక మనం గట్టిగా మాట్లాడకపోబట్టే దానికి భయం లేకుండా పోతుంది. ముందు ఆ హారిక కి బుద్ధి చెప్పాలి అంటుంది లీలావతి. నువ్వు అన్నది నిజమే అంటాడు జగదీష్.
మరోవైపు రాఖీ తో పెళ్లి గురించి ఆలోచిస్తూ నేను వద్దన్నా వినకుండా అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కావడం లేదు అమ్మ చాలా మొండిది నా మాట వినటం లేదు, ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రాశి. అంతలోనే అక్కడికి వస్తున్న ప్రశ్న దంపతులని చూసి వీళ్ళు వస్తున్నారేంటి అని అనుకుంటుంది.
తరువాయి భాగంలో నువ్వు చదువుకున్న దానివి ఇలా చేస్తావని అనుకోలేదు అంటాడు మనో. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని రాసి అంటే నీ రెండో పెళ్లి గురించి అంటుంది కృష్ణ. అయినా పిన్నికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది అంటూ చివాట్లు పెడుతుంది. ఆయన రెండో పెళ్లి చేసుకోగలేంది నేను చేసుకుంటే తప్పేంటి అంటుంది రాశి.