Intiki Deepam Illalu February 3 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నువ్వు చదువుకున్న దానివి, ఏది మంచో ఏది చెడు నీకు తెలియదా, నీ లైఫ్ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో కూడా నీకు తెలియదా అంటాడు మనో. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని రాశి అంటే నీ పెళ్లి గురించి అంటుంది కృష్ణ. పెళ్లి అనేది ఎవరైనా తమ కలల్ని పండించుకోవడం కోసం చేసుకుంటారు, పిల్లా పాపలతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చేసుకుంటారు అంతేగాని కోసం పట్టింపుల కోసం జీవితం నాశనం చేసుకోవడం కోసం ఎవరు పెళ్లి చేసుకోరు.

రాశికి నచ్చచెప్తున్న కృష్ణ దంపతులు..

హర్ష ఏదో చేశాడని నువ్వు కూడా అలాగే చేస్తానంటే ఎలాగా మీ ఇద్దరినీ కలపాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. అన్నయ్య పోయిన బాధలో పిన్ని పిచ్చిపిచ్చి తెలియదు తీసుకుంటే దానికి నువ్వు సరే అనటమేంటి అయినా నీ బుద్ది ఏమైంది అంటుంది కృష్ణ. వీళ్ళని రెచ్చగొడితే వీళ్లు వెళ్లి హర్ష మీద పడతారు అప్పుడు హర్ష దారిలోకి వస్తాడు అనుకొని నన్ను నిలదీసారేంటి అయినా ఆ హర్షనే అడగొచ్చు కదా, నిజంగా మీకు కలిపే ఉద్దేశమే ఉంటే అక్కడికి వెళ్ళవలసింది నా దగ్గరికి ఎందుకు వచ్చారు.

ఆయన రెండో పెళ్లి చేసుకోగలిగింది నేను చేసుకుంటే తప్పేంటి అంటూ పొగరుగా మాట్లాడుతుంది. ఒకరు తప్పు చేశారని మరి ఒకరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా అంటుంది కృష్ణ. నాకు విడాకులు ఇవ్వాలనుకున్నది ఆయన ఆ అడిగేదేదో ఆయన్ని అడగండి. ఈ నిర్ణయం మా అమ్మ తీసుకున్నది మా అమ్మ నిర్ణయాన్ని నేనెప్పుడూ కాదనను అంటుంది రాశి. మీ అమ్మ నీ జీవితానికి నష్టం కలిగించే పని చేసిన ఇలాగే అంటావా అంటాడు మనో.

కోపంతో కృష్ణని తీసుకెళ్ళి పోయిన మనో..

నా జీవితం నా ఇష్టం అయినా మీరు జోక్యం చేసుకోవడం ఏంటి అంటూ ఎదురు మాట్లాడుతుంది. నీకు జీవితం విలువ తెలియటం లేదు అందుకే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అంటాడు మనో. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పండి నాకేమీ చెప్పొద్దు నేను వినను అంటూ కరకండిగా చెప్తుంది రాశి. కృష్ణ ఏదో చెప్పబోతుండగా ఇంకేమీ మాట్లాడొద్దు అంటూ ఆమెని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు మనో. మరోవైపు దమయంతికి దగ్గర ఉండి భోజనం వడ్డిస్తూ ఉంటారు హరి నారాయణ, దీపక్.

మా ఇద్దరిదీ ఏకాకి జీవితాలు నా భార్య పోయింది నా బిడ్డకి పెళ్లి కాలేదు అందుకే నేను వడ్డించాల్సి వస్తుంది ఏమీ అనుకోవద్దు అంటాడు పరి నారాయణ. నేను వడ్డించుకుంటానండి పర్వాలేదు అంటూ మొహమాటపడుతుంది దమయంతి. వద్దమ్మా భోజనానికి పిలిచి వడ్డించకపోతే పెట్టిన ఫలితం గానీ పుణ్యం గాని రాదట అంటాడు హరి నారాయణ. మీరే అన్నారు కదా పంపకాలు అయిపోయిన తర్వాత అందరిని కలిసే ఉందాము అని అప్పుడు మీరు ఇలా ఏకాకి జీవితాలు బ్రతకవలసిన అవసరం లేదు అంటుంది దమయంతి.

భయంతో వణికిపోతున్న దమయంతి..

చాలా మంచి మాట చెప్పావు భోజనం చెయ్యు అంటాడు హరి నారాయణ. పిల్లలకి తల్లిదండ్రుల పోలికలు వస్తాయి అంటారు కదా మరి రాశికి మా అన్న పోలికలు కానీ మా వదిన పోలికలు కానీ రాలేదేంటి అని అడుగుతాడు హరి నారాయణ. ఆ మాటలకి భోజనం తింటున్న దమయంతి పొలమారిపోతుంది. మంచినీళ్లు తాగిన తర్వాత పోలికలు అంటే రూపంలోనే కాదు గుణంలోనూ చేతల్లోనూ ఉంటాయి రాశితో మీకు పరిచయం లేదు కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఉండరు అంటుంది దమయంతి.

నాకు ఒక చిన్న అనుమానం ఉంది, తనని చూస్తే నాకు ఎందుకో మా పెదనాన్న కూతురు లాగా అనిపించడం లేదు అంటాడు దీపక్. అంటే వర్షిణి అసలు వారసురాలు కృష్ణ అని చెప్పింది కదా అందుకే మాకు డౌట్ గా ఉంది అంటాడు హరి నారాయణ. దాని మాటలు పట్టించుకోకండి అది మంచిది కాదు దానివల్లే మా జీవితాలు నాశనం అయిపోయాయి. దాని సంగతి నాకు తెలుసు కాబట్టి నేను మా ఆయనతో మాట్లాడటం వర్షిణి గమనిస్తుందని తెలిసే అలా అబద్దం చెప్పాను.

ఆస్తి మన చేతికి వచ్చేవరకు జాగ్రత్త పడాలంటున్న దీపక్..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అందుకే అన్నం ముట్టుకొని చెప్తున్నాను రాశి యే మీ అన్న కూతురు అంటూ ఒట్టు పెడుతుంది దమయంతి. నువ్వు చెప్పింది అబద్ధం అని మేము అనలేదు కదా అన్నం మీద ఒట్టు వేసి ఎవరు అబద్ధం చెప్పరు నువ్వు తిను అంటాడు హరి నారాయణ. వీళ్లు భోజనం పెట్టడానికి పిలిచారు హనుమాన్ పడడానికి పిలిచారు అర్థం కావట్లేదు అంటుంది దమయంతి. నీ కొడుకు చెప్పినట్లుగా నువ్వు పీక మీద కత్తి పెట్టినా నిజం చెప్పవని అర్థమైంది.

అందుకే నీకు కడుపునిండా అన్నం పెట్టి నిన్ను చంపాలి అనుకున్నాను అనుకుంటాడు హరి నారాయణ. కొడుకుని పక్కకి రమ్మని పిలిచిఅది చెప్పినవన్నీ అబద్ధాలే అంటుంది హరి నారాయణ. ఇలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదు అని హరి నారాయణ అంటే ఆస్తి మన చేతికి వచ్చినంత వరకు ఎవరిని ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉండాలి మనం. ఆల్రెడీ మనం చంపేసిన సూర్య గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ సమయంలో మనం ఏ చిన్న పొరపాటు చేసిన పోలీసులకి దొరికిపోతాము అంటూ తండ్రికి నచ్చ చెప్తాడు దీపక్.

హారిక దుమ్ము దులిపిన లీలావతి..

నువ్వు దమయంతిని చంపటం కాదు ఆస్తి మన చేతికి రాగానే కృష్ణని,రాశిని, దమయంతిని ముగ్గురిని నేనే చంపేస్తాను అంటాడు దీపక్. మరోవైపు తన ఇంటికి వచ్చిన లీలావతి వాళ్ళని చూసి షాక్ అవుతుంది హారిక. వీళ్ళొచ్చారు ఏంటి కృష్ణ వాళ్ళు నా గురించి నిజం చెప్పేశారా అని భయపడుతుంది హారిక. వస్తూ వస్తూనే హారిక మీద విరుచుకుపడుతుంది లీలావతి. అసలు నువ్వు ఆడదానివేనా ఎంతమంది జీవితాలని నాశనం చేస్తావు. నీవల్ల మా బంధాలు తూట్లు పడుతున్నాయి.

రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములు విడిపోయారు. నా కొడుకు మాకు రాకుండా పోయాడు. ఇప్పుడు మీ వల్ల ఆ రాసి రెండో పెళ్లి చేసుకుంటుంది అలా జరిగితే మా పరువు పోతుంది అంటూ కేకలు వేస్తుంది లీలావతి. వీళ్లు రాశి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అంటే నా గురించి ఇంకా తెలిసి ఉండదు అంటూ రిలాక్స్ అవుతుంది హారిక. మా కోడలు రెండో పెళ్లి చేసుకుంటుంది అంటే మా కొడుకు చెడ్డవాడు చేతకానివాడనని ఊరందరూ అనుకుంటారు ఇదంతా నీ వల్లే అంటాడు జగదీష్.

హర్ష చెంప పగలగొట్టిన లీలావతి..

హర్ష గారు నా మెడలో తాళి కట్టి నా ప్రాణాలు నిలబెట్టారు అలాంటి మా బంధాన్ని మీరు గౌరవించండి అంటూ లీలావతి కాళ్లు పట్టుకుంటుంది హారిక. దయచేసి మా బంధాన్ని గుర్తించండి నేను కూడా మీ కూతురు లాంటిదాన్ని అంటూ బ్రతిమారుతుంది.అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష నేను పిలిచినప్పుడు రాలేదు ఇప్పుడు మీరు అంత మీరే వచ్చారు అంటే ఏదో ఒకటి జరిగే ఉంటుంది ఏం జరిగింది అని తల్లిని అడుగుతాడు హర్ష. ఇంకా ఏమీ జరగాలి భార్య ఉండగా నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నీ భార్య నువ్వు ఉండగా మరో పెళ్లి చేసుకుంటుంది.

నువ్వు చేసిన పనికి మా పరువు మొత్తం పోయింది ఇప్పుడు రాశి కూడా అలాగే చేస్తుంటే మేం వెళ్లి అక్షింతలు వేసి రావాలా అంటూ కొడుకుకి చివాట్లు పెడతాడు హర్ష. రాశిని నేను వద్దనుకున్నాను కాబట్టే హారిక ని పెళ్లి చేసుకున్నాను. నాకు డైవర్స్ ఇచ్చేసిన తరువాత నాలుగు కాకపోతే 40 పెళ్లిళ్లు చేసుకోమనుండి నాకు ఏమీ అభ్యంతరం లేదు. అయినా రాశి ఎలాంటిదో మీకు తెలుసు కదా, హారిక గురించి కూడా మీకు చాలా సార్లు చెప్పాను తను చాలా మంచిది అంటాడు హర్ష. ఇంకా ఏదో మాట్లాడుపోతు ఉండగా హర్ష చెంప పగలగొడుతుంది లీలావతి.

హర్ష కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన లీలావతి..

నువ్వు మా మాట వినకపోయినా బాధపడలేదు కానీ మా కోడలికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోం అంటూ హర్ష కి వార్నింగ్ ఇస్తాడు జగదీష్. తల్లి,తండ్రి అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు నీకు ఇంత పొగరు ఏంటి? నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు రాశి పెళ్లి జరగకుండా చూడు పెళ్లి జరిగిందంటే మాత్రం ఏం చేస్తామో అప్పుడు చూద్దువు గానివి అంటూ హర్ష కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి భర్తని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లీలావతి. హర్ష కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా గురించి నిజం తెలియదు రాశి పెళ్లి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు అనుకుంటుంది హారిక.

మరోవైపు ఆలోచనలో ఉన్న కృష్ణని మీ అక్క పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు మనో. వాళ్లు చేస్తున్నది కరెక్ట్ కాదని ఎంత చెప్పినా పిన్ని అక్క అర్థం చేసుకోవడం లేదు అంటుంది కృష్ణ. వాళ్ల మూర్ఖత్వానికి అమ్మ పెద్దమ్మ పెదనాన్న కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు, నాక్కూడా అదే పరిస్థితి. హర్ష తప్పు చేశాడు అనుకుంటే రాసి కూడా అదే పని చేస్తుంది. ఇద్దరికీ సర్ది చెప్పాలని చూసాము వినకపోతే మనం ఏం చేస్తాము.

Intiki Deepam Illalu February 3 Today Episodeవాళ్లని కలపటానికి మనమే ఏదైనా చేయాలి అంటున్న కృష్ణ..

వాళ్ల జీవితాన్ని ఎవరూ బాగు చేయలేరు వాళ్ళ ఖర్మ అంతే అంటాడు మనో. అలా అని వదిలేస్తామా అంటుంది కృష్ణ. వదిలేయక ఏం చేస్తాము అయినా మీ అక్కకి అయినా బుద్ధి ఉండాలి కదా అంటాడు మనో. మా అక్కకి హర్ష అంటే చాలా ఇష్టము తనకు పుట్టిన బుద్ధి కాదు ఇది మా పిన్ని తన బుద్ధిని చెడగొట్టింది. ఇది మన ఇంటి పరిమిత సంబంధించిన సమస్య. పెళ్లి జరగకుండా మనం ఏదో ఒకటి చేయాలి లేకపోతే మా పిన్ని కారణంగా రాసి హారికలు శాశ్వతంగా దూరమైపోతారు అంటుంది కృష్ణ.

నువ్వు అన్నది కరెక్టే ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాలు విడిపోతాయి వర్షిణి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. హారిక వల్ల హర్ష జీవితం నాశనం అయిపోతుంది అవన్నీ జరగకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి అంటాడు మనో. మరోవైపు తల్లి ఇచ్చిన వార్నింగ్ ని హర్ష, కృష్ణ ఇచ్చిన వార్నింగ్ ని రాశి తలుచుకుంటూ ఉంటారు. హర్ష హారిక కి ఫోన్ చేస్తాడు. హర్ష గారు ఫోన్ చేస్తున్నారు ఏంటి డైవర్స్ గురించి మాట్లాడడానికి అనుకుంటుంది రాశి. బిజీగా ఉండి లిఫ్ట్ చేయట్లేదా కావాలని లిఫ్ట్ చేయట్లేదా అనుకుంటాడు హర్ష.

తరువాయి భాగంలో కృష్ణ దంపతుల దగ్గరికి వచ్చిన హరి నారాయణ నువ్వే నా అన్న కూతురువి. లెక్కలేని ఆస్తులకి వారసురాలివి. నా అన్న కూతురు రాశి అని చెప్పి ఈ ఆస్తి మొత్తం కొట్టేయాలనుకున్నారు ఈ తల్లి కూతుర్లు అంటూ దమయంతిని ఇరికించేస్తాడు హరి నారాయణ.