Intiki Deepam Illalu February 9 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఆ కృష్ణ తెలివైనదో అమాయకురాలు అర్థం కావట్లేదు అంటాడు హరి నారాయణ. తను పిచ్చిది ఆస్తి కన్నా ఆత్మీయులు అనుబంధాలు ముఖ్యం అనుకునే పిచ్చిది. ఆ పిచ్చితోనే భర్తే దేవుడు అనుకొని ఆస్తి మొత్తాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టేస్తుంది ఆ మను తెలివైనవాడు ఆస్తిని తన చేతిలోకి తీసుకొని చక్రం తిప్పేయడానికి ముందే మనమే చక్రం తిప్పాలి అంటాడు దీపక్.

సడన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చిన కృష్ణ..

ఎలా అంటాడు హరి నారాయణ. మనవాళ్లు ఏదో అన్నారని హర్ట్ అయ్యి ఆస్తి పత్రాలని తిరిగి తన భార్య చేతిలో పెట్టాడు. అదే ఫీలింగ్స్ ని అడ్డం పెట్టుకొని తనని ఇంట్లోంచి వెళ్లిపోయేలాగా చేయాలి అంటాడు దీపక్. అలా చేయకపోతే మనం వాళ్ళ కింద జేతగాళ్లలాగా ఉండాల్సి వస్తుంది అంటాడు హరి నారాయణ. కృష్ణకి ఊరి వాళ్ళ సపోర్టు ఉంది కాబట్టి తింగరి వేషాలు వేస్తే వాళ్ళ ముందు మనం మైనస్ అయిపోతాం ఏం చేసినా మన చేతికి మట్టంటకుండా చేయాలి అంటాడు దీపక్.

కృష్ణ ఒక్కటే వస్తుంది అనుకుంటే తన ఫ్యామిలీని కూడా వెంటేసుకుని వచ్చింది. వాళ్ళని కూడా వెళ్లిపోయేలాగా చేయాలి అంటాడు హరి నారాయణ. అంతలోనే అక్కడికి వచ్చిన కృష్ణని చూసి షాక్ అవుతారు తండ్రి, కొడుకులు. కానీ అదేమీ పట్టించుకోని కృష్ణ,హరి నారాయణ దగ్గర తాళాలు అడిగి తీసుకొని లాకర్ నుంచి కొన్ని పత్రాలు తీసుకొని తాళాలు మళ్లీ హరి నారాయణకి ఇచ్చి వెళ్ళిపోతుంది. మరోవైపు మందుల కోసం బయటకు వచ్చిన దమయంతి తను తెచ్చి పెట్టకుండా నన్నే తెచ్చుకోమంది అంటూ రాశిని తిట్టుకుంటూ ఉంటుంది.

దమయంతిని రెచ్చగొడుతున్న హారిక..

అటువైపుగా వెళ్తున్న హారిక,దమయంతిని చూసి కారు ఆపుతుంది. హారికని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోబోతున్న దమయంతిని ఆపి నేను మీ శత్రువుని కదా అయినా అలా కానుగా వెళ్ళిపోతున్నావేంటి భయమా భక్తా అని అడుగుతుంది హారిక. ఏదేదో చేస్తానంటూ ప్రగల్బాలు పలికావు కానీ ఏమీ చేయలేకపోయాను అంటుంది హారిక. దేనికైనా టైం రావాలి అంటుంది దమయంతి. కృష్ణా ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేశావు కానీ అడ్డంగా దొరికిపోయి అందరి ముందు చులకనైపోయావు.

కృష్ణని ఏమి చేయలేని జాతకాని దానివి ఇంక నన్నేం చేయగలవు. కాటేయడం చేతకాని వానపాము వి నువ్వు. మహేశ్వరి ఫ్యామిలీ నీ కొడుకుని పట్టణ పట్టుకుందని ఏడుస్తూ కూర్చోవడం తప్పితే ఏమీ చేయలేవు అంటూ రెచ్చకొడుతుంది. వాళ్లు నీ కొడుకుని చంపిన నీ కూతురు జీవితాన్ని పట్టించుకోకపోయినా ఏమీ చేయకుండా ఊరుకున్నావు అంటే నీకు సిగ్గు అభిమానం రోషం ఏమీ లేనట్లుగా ఉన్నాయి, అదే నీ ప్లేస్ లో నేను ఉంటే వాళ్ళ చేత జైల్లో చెప్పకూడదు తినిపించేదాన్ని అంటూ చులకనగా మాట్లాడుతుంది.

అతి తెలివికి పోయి నోరు జారిన దమయంతి..

ఆ మాటలకి రెచ్చిపోయిన దమయంతి నువ్వు అనుకునే అంత చేతకాని దాన్ని కాదు నేను, దెబ్బకు దెబ్బ అందరూ తీస్తారు కానీ దెబ్బకి నాలుగు దెబ్బలు తీయడం ఈ దమయంతి స్టైల్ అంటూ మహేశ్వరి ఇంట్లో బ్లాక్ మనీ పెట్టింది దాని గురించి చెప్పేస్తుంది.నన్ను అన్యాయం చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఈ దమయంతి నువ్వు అనుకునేంత ఆ అమాయకురాలు ఏమి కాదు. దమయంతి వానపామేమి కాదు కాటు వేయకుండా వదలను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దమయంతిని రెచ్చగొట్టేసరికి నిజం చెప్పేసింది అంటూ మురిసిపోతుంది హారిక.

మరోవైపు ఊరు వాళ్ళ మాటలకి బాధపడుతుంటాడు మనో. అంతలోనే అక్కడికి వచ్చిన జగదీష్ దంపతులు ఈ ఊర్లో ప్రజలకి కృష్ణ తల్లిదండ్రులు అంటే ఎంత అభిమానం. వాళ్ల అమ్మానాన్నలకి ఉన్న మంచితనమే కృష్ణకి వచ్చిందని ఇప్పుడు అర్థమైంది అంటుంది లీలావతి. ఆ మాటలకి ఏమాత్రం రియాక్ట్ అని మనోని చూసి ఏమైంది అని అడుగుతుంది లీలావతి. ఈ ఊర్లో కూడా మనకి అవమానాలు తప్పట్లేదు. నావల్ల జరిగిన తప్పు కారణంగా అయిన వాళ్లతోనే అప్పుల వాళ్ళతోనే కాకుండా ఇలాంటి వాళ్లతో కూడా మాటలు పడవలసి వస్తుంది.

గిల్టీగా ఫీల్ అవుతున్న మనో..

నా కారణంగా వాళ్ళ అభిమానం తనకి అవమానంగా మారొచ్చు అంటూ బాధపడతాడు మనో. కృష్ణ కి మనం ఏంటో తెలుసు నువ్వు అలా బాధపడకు అంటాడు జగదీష్. నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశాను అనిపిస్తుంది అంటాడు మనో. ఈ మాటలన్నీ గుమ్మం లోంచి విన్న కృష్ణ మీ మంచితనం గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడారు, నీ గురించి ఏమీ తెలియని వాళ్ళు ఏదో అన్నారని బాధపడవలసిన అవసరం మీకు లేదు అంటూ భర్తకి ధైర్యం చెబుతుంది. మనకి మన వ్యక్తిత్వాలు ముఖ్యం తప్పితే వాళ్ళ మాటల ముఖ్యం కాదు.

నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటే బాధపడాలి కానీ ఎవరో ఏదో అంటే బాధపడటం ఎందుకు. బాబాయ్ నాకు ఇచ్చిన ఆస్తిలో పొలాలు మిల్లులు చాలా ఉన్నాయి వాటి తాలూకా పత్రాలు. ఇంటి మీద బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు వచ్చే ఆ డబ్బులతో అప్పులు తీర్చేసి మీ మీద కేసులు లేకుండా చూసుకోండి అంటూ పత్రాలు మనో చేతిలో పెడుతుంది కృష్ణ. నీ ఆశతో నా అప్పులు తీర్చుకోవడం భావ్యం కాదు అంటాడు మనో. మాకు వచ్చిన నష్టాన్ని మేమే పూడుచుకుంటాము అంటాడు జగదీష్. ఎలాగా పూడుచుకుంటారు ఆ అప్పులు తీర్చే మార్గం మనకు ఏమీ కనిపించడం లేదు కదా అంటుంది కృష్ణ.

భర్తకి నచ్చచెప్తున్న కృష్ణ..

ప్రస్తుతానికి ఏమీ లేకపోవచ్చు కానీ ఏదో ఒకటి చేసి అవన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాను అంటాడు మనో. అలా చేయటానికి కొంత టైం పడుతుంది అప్పటికి వడ్డీలు మీద వడ్డీలు పెరుగుతాయి. రుణభారం పెరిగిపోవడంతో పాటు అప్పుల వాళ్ళ వేధింపులు ఇంకా పెరిగిపోతాయి. అప్పుడు అక్కడ గొడవ పెట్టిన వాళ్ళు ఇప్పుడు మాత్రం గొడవ పెట్టరా అంటుంది కృష్ణ. నువ్వు అన్నది నిజమే కానీ మా పరువు కోసం నీ ఆస్తిని ఇవ్వటము మేము తీసుకోవటము పద్ధతి కాదు అంటుంది లీలావతి.

నీ ఆస్తి నా ఆస్తి అంటూ వేరు చేసి మాట్లాడుతారు ఏంటి అయినా భార్యని అంటే మీ మనిషిని అలాంటప్పుడు నాకు సంబంధించిన ప్రతిదీ మనదే అవుతుంది. ఇది నా ఇల్లు కాదు మన ఇల్లు అలాంటప్పుడు ఆస్తి కూడా మన ఆస్తి అంటుంది కృష్ణ. ఆ మాటల్ని విన్న తండ్రి కొడుకులు కోపంతో రగిలిపోతారు. ఈ వాస్తు పత్రాలు నేను తీసుకుంటే ఈ ఊరి వాళ్లు అన్నమాటలో నిజమవుతాయి భార్య ఆస్తితో అప్పులు తీర్చుకున్న చేతకాని వాడిగా ముద్ర వేస్తారు.

మనోని టార్గెట్ చేసిన దీపక్..

ఇప్పటివరకు జరిగిన అవమానాలతో పాటు నిందలు కూడా మోసే శక్తి నాకు లేదు అర్థం చేసుకో అంటాడు మనో. మనం భార్యాభర్తలు ఇది మీది అది నాది అనుకుంటే అది వ్యాపారం అవుతుంది తప్పితే సంసారం అవ్వదు అంటుంది కృష్ణ. సంతోషమైన సమస్య అయినా మనది అనుకుంటేనే సంసారం అవుతుంది నీది నాది అనుకుంటే స్వార్థం అవుతుంది. ఈ పాత్రలో తీసుకోకపోతే మీ మన బంధాన్ని మీరు అవమానించినట్లే అంటూ బలవంతంగా మనో చేతిలో పెడుతుంది కృష్ణ.

ఈ మాటలన్నీ వింటున్న తండ్రి, కొడుకులు ఆవేశంతో రగిలిపోయి నన్ను ఒక్క మాట కూడా అడగకుండా పట్టుకెళ్ళి మొగుడు చేతిలో పెట్టింది అంటాడు హరి నారాయణ. మనం ఇలాగ చూస్తూ ఊరుకుంటే మొత్తం ఆస్తంతా తన వాళ్ళకి దోచుపెడుతుంది అంటాడు దీపక్. అలా జరగకూడదు అంటే వాళ్ళని వీలైనంత తొందరగా ఈ ఇంట్లో నుంచి తరిమేయాలి అంటాడు హరి నారాయణ. ముందు మన టార్గెట్ దాని మొగుడు మీద పెట్టాలి అంటాడు దీపక్.

నిజాన్ని చెప్పి హర్షకి షాకిచ్చిన హారిక..

మరోవైపు కృష్ణకి వాళ్ళ అమ్మానాన్న ఆస్తి రావటం, మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా చెట్లు అవడం చాలా ఆనందంగా ఉంది అంటూ హర్ష కి చెప్తుంది హారిక. ఇప్పుడు వచ్చినా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు హర్ష. వాళ్లు హ్యాపీగానే ఉంటారు కానీ మన సంగతి ఏంటి వాళ్ళు ఎలాగు నన్ను కోడలిగా యాక్సెప్ట్ చేయరు, మొదటి పెళ్లి కాకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ రాసి మన మీద కేసు పెడితే విడాకులు తీసుకోకుండా మన పెళ్లిని కోర్టు సమర్ధించదు. పరిస్థితుల్లోనూ నేను రాశితో కలిసి ఉండను అంటాడు హర్ష.

కానీ కోర్టు యాక్సెప్ట్ చేయనప్పుడు మనం కూడా కలిసి ఉండడానికి అవ్వదు. డైవర్స్ అవ్వలేదు కాబట్టి కోర్టు రూల్స్ ప్రకారం మీరిద్దరూ కలిసి ఉండాల్సి వస్తుంది. జరగకూడదు అంటే రాశి,దమయంతికి ఇద్దరు మంచివాళ్లు కాదు అందుకే వాళ్లు ని వద్దనుకొని నన్ను పెళ్లి చేసుకున్నట్లుగా కోర్టు వాళ్ళని నమ్మించాలి మీ ఫ్యామిలీ కూడా అలాగే అనుకోవాలి. ఈ రెండు జరగాలి అంటే రాశి దమయంతులు మీ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలియాలి అంటూ బ్లాక్ మనీ గురించి హర్షకి చెప్పేస్తుంది హారిక.

Intiki Deepam Illalu February 9 Today Episodeకోపంతో రగిలిపోతున్న హర్ష..

ఒక్కసారిగా షాక్ అయిన హర్ష ఏం మాట్లాడుతున్నావు అంటాడు. నా నోటితో చెప్తే నువ్వు నమ్మవు వాళ్లతో నోటితో చెప్పిందే నమ్ముతావు అంటూ దమయంతి మాటల్ని రికార్డు చేసిన రికార్డింగ్ వినిపిస్తుంది హారిక. ఆ మాటలన్నీ నిన్ను హర్ష కోపంతో రగిలిపోతాడు. తరువాయి భాగంలో హారికలను మోసం చేసింది అందుకే నేను దాన్ని వదిలేసి వచ్చేసాను అంటూ తల్లిదండ్రుల దగ్గర కి వస్తాడు హర్ష.

నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేదు కానీ ఇప్పుడు అదే నిజమైంది అంటూ కృష్ణ దగ్గర ఏడుస్తాడు హర్ష. నేను మీతోనే ఉండిపోతాను అంటూ మనో దగ్గర కన్నీరు పెట్టుకుంటాడు. నువ్వు నాతోనే ఉండాలి అంటే రాశికి క్షమాపణ చెప్పాలి అంటుంది కృష్ణ.