Intiki Deepam Illalu: కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్న అత్తా, కోడళ్ళ కథ ఈ ఇంటికి దీపం ఇల్లాలు. ఈవారం ఏం జరిగిందో చూద్దాం.
తను రానని ఎంత చెప్తున్నా బ్రతిమలాడి లీలావతి వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు సూర్య దంపతులు. అక్కడ దమయంతి నానా మాటలు అని అవమనిస్తుంది. కొడుకు కోడలు ఎంతవారించినా వినిపించుకోదు దమయంతి. అవమానభారంతో వెనక్కి మళ్ళిన లీలావతి వాళ్లని దారిలో కలుసుకొని తన ఇంటికి రమ్మంటాడు హర్ష. అసలు ఈ కష్టాలన్నీ నీవల్లే వచ్చాయి.
నువ్వు హారిక ని పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు అంటూ హర్షని తిడుతుంది లీలావతి. హర్ష తన కాళ్లు పట్టుకున్నా క్షమించదు. అలసిపోయిన అత్త కోడలు ఒక చెట్టు కింద కూర్చొని ఇంత పంతం ఎందుకు అత్తయ్య హర్ష అని అన్ని మాటలు అనవలసిన పనిలేదు అంటుంది కృష్ణ. నాకు నా భర్త ఓకే నా భర్తని కష్టపెట్టిన కొడుకు నాకు అక్కర్లేదు. నేను హర్ష సైన్ తీసుకున్నాను అంటే ఆయన బాధపడతారు ఆయనకి ఏమైనా అయ్యిందంటే ఆ బాధ నేను తట్టుకోలేను అంటుంది లీలావతి.
కృష్ణ వెళ్లి తన బంగారాన్ని అమ్మేసి కొంత డబ్బు తీసుకొని వస్తుంది. ఆ డబ్బులతో ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని అందులో ఉంటారు. ఆ ఇంటావిడా లీలావతికి పూలు కొట్టే పని అప్పజెప్తుంది. ఇందులో హాస్పిటల్ నుంచి పేషెంట్ కి డబ్బులు కట్టలేదు, అయితే డబ్బులు కట్టండి లేకపోతే మీ పేషెంట్ ని మీరు తీసుకెళ్ళిపోండి అంటూ ఫోన్ వస్తుంది. వందల మందిని పోషించిన మనం ఈరోజు ఈ పరిస్థితికి వస్తాం అనుకోలేదు అంటూ ఏడుస్తుంది లీలావతి.
తన మరో ఫ్రెండ్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్తుంది లీలావతి. ఆమె తప్పించుకోబోతుంది కానీ కృష్ణ రిక్వెస్ట్ చేయడంతో ఇంటికి రమ్మంటుంది. ఆమె ఇంటికి వెళ్ళిన కృష్ణ ని చాలా చులకనగా మాట్లాడుతుంది. జనాలు కడుపు కొట్టి బ్రతికేద్దాం అంటే బ్రతుకులు ఇలాగే ఏడుస్తాయి అంటుంది. డబ్బులు వద్దు ఏదైనా పని ఉంటే ఇప్పించండి అంటుంది కృష్ణ. నా ఫ్రెండు పనిమనిషిని కావాలి అనుకుంటుంది వెళ్లి కలు అని చెప్పి అడ్రస్ చెప్తుంది. ఈ విషయం అంతా మనవాళ్ళకి చెప్తుంది కృష్ణ.
నీకు చేసిన అన్యాయమే ఈరోజు నన్ను ఇంత కష్టపడుతుంది అంటూ బాధపడతాడు మనో. దీని అంతటి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను అని మనసులోని అనుకుంటాడు.మరో వైపు సూర్య వాళ్ళు లీలావతి వాళ్లకి కొన్ని సరుకులు తీసుకొని వెళ్ళాలని సామాన్లు సర్దుతూ ఉంటారు అంతలో అక్కడికి వచ్చిన దమయంతి సంసారం అంతా దోచేస్తున్నారు అంటూ అవమానంగా మాట్లాడుతుంది. నేను నా సంపాదనతో పోషిస్తున్నాను నీ సంపదనేమీ ఖర్చు పెట్టట్లేదు అంటూ తల్లికి నానా చివాట్లు పెట్టి లీలావతి దగ్గరికి వెళ్తారు వర్షిణి దంపతులు.
కానీ అభిమానం గల లీలావతి వాటిని తిరస్కరిస్తుంది. తిరిగి తనే ఒడి బియ్యం పోసి పంపిస్తుంది.ఆ బియ్యాన్ని చూసిన దమయంతి వాళ్ళు చులకనగా మాట్లాడుతారు. నేను బాగోవాలని మా పెద్దమ్మ నాకు ఆశీర్వాదం ఇచ్చింది అదే చాలు, నీకు ఆ భాగ్యం కూడా లేదు అంటూ రాశి ని దెప్పుతుంది వర్షిణి. మరోవైపు రాశి, హర్ష ఇంటికి వెళ్లి నాకు అన్యాయం చేశారు ఊరుకోను మీ మీద కేసు పెట్టి రోడ్డు మీదకి ఈడుస్తాను అంటుంది. నీకు నచ్చింది చేసుకో, నువ్వు చేసిన ఈ పనికి నీ మీద ఉన్న కాస్త జాలి కూడా పోయింది అంటూ ఆమెని బయటికి గెంటేస్తాడు హర్ష.
మరో వైపు మహేశ్వరి ని చూడ్డానికి వస్తారు హర్ష, హారిక. మహేశ్వరి కూడా వాళ్ళకి నానా చివాట్లు పెట్టి పంపించేస్తుంది మహేశ్వరి. మహేశ్వరి ఫ్రెండ్ చెప్పిన అడ్రస్ కి వెళ్లి అక్కడ పని మనిషిగా కుదురుతుంది కృష్ణ. నా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి పనిలో పెట్టుకున్నాను లేకపోతే జైలుకు వెళ్లే వాళ్ళని నేను పనిలో పెట్టుకొని ఈ ఇంట్లో ఏది పోయినా నీదే బాధ్యత అంటుంది ఆ ఇంటావిడ. మహేశ్వరి తిట్టిందన్న బాధతో బార్ లోకి వెళ్లి తాగుతాడు హర్ష. ఆ మైకంలో తన కధంతా ఒక అపరిచితుడికి చెప్తాడు.
Intiki Deepam Illalu: ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్న ఈ సీరియల్ లో మార్పులు కోరుకుంటున్న ప్రేక్షకులు..
అంతలోనే హారిక ఫోన్ చేయడంతో నా భార్య ఫోన్ చేస్తుంది అంటూ అతనికి చూపిస్తాడు హర్ష. హారికని గుర్తుపట్టిన ఆ వ్యక్తి నన్ను మోసం చేసి వీడిని పెళ్లి చేసుకున్నావా? నీ అంతు చూస్తాను అనుకుంటాడు ఆ అపరిచితుడు. రాత్రంతా ఇంటికి రాకపోవటంతో కంగారుగా ఎదురుచూస్తున్న హారిక కి ఆ అపరిచితుడు హర్ష లాగా ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయింది త్వరగా రా అని చెప్తాడు. ఆ మాటలు నమ్మి హారిక కంగారుగా అతను చెప్పిన అడ్రస్ కి వెళ్తుంది. అలా వెళ్లిన హారిక హర్షిని కలుస్తుందా? మనోవాళ్లు జైలు నుంచి బయటికి వస్తారా? హర్ష ని అతని కుటుంబ సభ్యులు క్షమిస్తారా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.