Intiki Deepam Illalu: బయటి వాళ్ళ కుట్రకు బలై నడిరోడ్డు మీదికి వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండి మళ్ళీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఒక కుటుంబం కథ ఈ ఇంటికి దీపం ఇల్లాలు.

ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న కోడల్ని మెచ్చుకుంటుంది మహేశ్వరి. అదే సమయంలో ఫోన్ రావటంతో లిఫ్ట్ చేయబోయిన మహేశ్వరి దగ్గర ఫోన్ లాక్కున్న కృష్ణ మీద అనుమాన పడతారు లీలావతి, మహేశ్వరి. మరోవైపు ఇంటికి వచ్చిన మేనేజర్ ని చూసి హర్షకి ఎక్కడ తెలిసిపోతుందో అని కంగారుపడి మేనేజర్ కి చెక్ ఇచ్చి మళ్ళీ కనిపించొద్దు అంటూ బెదిరించి పంపించేస్తుంది హారిక.

ఆ మేనేజర్ వెళ్లి మనో కంట్లో పడతాడు. వాడికి హారిక పెద్ద మొత్తంలో చెక్ ఇవ్వటంతో అనుమానించి వాడికి నాలుగు తగిలించి నిజం కక్కిస్తాడు మనో. మరోవైపు దమయంతి దగ్గరికి వచ్చిన రాఖి మీ అబ్బాయి గురించి నా ఫ్రెండ్ తో మాట్లాడాను అతనితో మాట్లాడానికి మీ అమ్మాయిని పంపించండి అంటాడు. అన్నయ్య కోసం తప్పదు వెళ్ళు అంటూ బలవంత పెడుతుంది దమయంతి. ఇదంతా గమనించిన వర్షిణి, దమయంతిని మందలిస్తుంది.

దమయంతి ఊరుకోకుండా తిరిగి వర్షిని మీద కేకలు వేస్తుంది. హోటల్ కి వెళ్ళిన తర్వాత తన లవ్ ని ప్రపోజ్ చేస్తాడు రాఖి. ముందు షాక్ అయినప్పటికీ హర్షని దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటే ఇతన్ని వాడుకోవాలని టైం అడుగుతుంది రాశి. ఇదంతా హారిక చేసిందని తెలుసుకొని ఆమెని నిలదీస్తాడు మనో. హారిక తిరిగి నీ భార్య ప్రెగ్నెన్సీ పోవడానికి నువ్వే కారణం అంటూ వీడియో చూపించి ఇది మీ ఇంట్లో వాళ్ళందరికీ చూపించేస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేస్తుంది.

కడుపులో బిడ్డని నేనే చంపుకున్నాను అంటూ కుప్పకూలిపోతాడు మనో. మరోవైపు హర్ష కి మీ అన్నయ్య జైలుకు వెళ్ళటానికి కారణం సంజయ్ అని చెప్తాడు. వాడి హెల్త్ చూస్తారు అని హర్ష అంటే వాడు పావు మాత్రమే వాడి వెనకాతల ఉన్న మనుషుల్ని పట్టుకోవాలి ఆ సంగతి నేను చూసుకుంటాను అంటాడు. తర్వాత పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం అని రాసి తో తీసుకున్న సెల్ఫీ చూపించి ఈమె నా ప్రేయసి అని చెప్తాడు రాఖి.

అది చూసి షాక్ అయిన హర్ష ముందు బాధపడిన తరువాత మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే విషయాన్ని హారికతో చెప్పి బాధపడతాడు హర్ష. అంటే హర్ష కి ఇంకా రాసి మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు ఉంది అనుకుంటుంది హారిక. మరోవైపు హర్ష ని పిలిచి జరిగిందంతా చెప్తాడు మనో. నువ్వు ఎన్నైనా చెప్పు అంతేకానీ హారికని ఏమీ అనకు అంటూ ఆమెని వెనకేసుకొస్తాడు హర్ష.

నీ కర్మ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మనో. మరోవైపు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే కుటుంబ సభ్యులందరూ అక్కడికి పరిగెడుతారు. సూర్య డెడ్ బాడీని గుర్తించిన వర్షిణి బాధతో కుప్పకూలిపోతుంది. అంత బాధలో కూడా దమయంతి నీవల్లే నా కొడుకు చనిపోయాడు అంటూ లీలావతి వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తుంది. అందరూ కలిపి సూర్య దహన సంస్కారాలు చేస్తారు. తర్వాత వర్షిని ఇంట్లోంచి పొమ్మంటూ తన బ్యాగ్ బయటకి విసిరేస్తుంది దమయంతి.

ఇది అన్యాయం అంటూ ఎంతమంది చెప్పిన వినిపించుకోదు. మరోవైపు అన్నదమ్ముల కోసం ఏడుస్తున్న కృష్ణ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పి హారిక నన్ను బెదిరిస్తుంది అంటాడు. నేను నిజంగానే కావాలని నీకు యాక్సిడెంట్ చేయలేదు అంటూ భార్య చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతాడు. ఇందులో మీ తప్ప ఏమీ లేదు దయచేసి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకండి అందరూ బాధపడతారు అంటుంది.

Intiki Deepam Illalu:

నేరుగా హారిక ఇంటికి వెళ్లి నా భర్త జోలికి వస్తే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే వచ్చిన హర్ష ఎందుకు హారిక అని తిడుతున్నావు అని అడిగితే జరిగిందంతా చెప్తుంది. ఇంత జరిగినా కూడా హారికని వెనకేసుకొస్తాడు హర్ష. హర్షకి కూడా నాలుగు చివాట్లు పెట్టి వచ్చేస్తుంది కృష్ణ. తను వెళ్ళిపోయిన తర్వాత మొన్న మీ అన్నయ్య కూడా అలాగే నన్ను నానా మాటలు అన్నారు, ఇప్పుడు మీ వదిన కూడా నన్నే ఉంటుంది అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ వెళ్ళిపోతుంది హారిక.

తమ మనసు గెలుచుకోవడంలో వెనుకబడుతుంది, కథనంలో మార్పు అవసరమేమో అంటున్న ప్రేక్షకులు..

హారిక మీద జాలి పడతాడు హర్ష. రాఖి,రాశిని ఎలా వాడుకుంటాడు? హారిక గురించి హర్ష నిజం తెలుసుకుంటాడా? హరి నారాయణ ఆస్తులు దమయంతి వాళ్ళకి అప్పగిస్తాడా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.