Intiki Deepam Illalu January 11 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పాపం హారిక నేను మనోవాళ్ళకి బెయిల్ ఇప్పించానని తెలిసి షాక్ అయిపోయింది. హర్ష హారిక మాయలో ఉన్నాడు కాబట్టి మనోహర్ వైపు నుంచి నరుక్కు రావాలి. హారిక చేసిన కుట్రవల్లే కన్స్ట్రక్షన్ కూలిపోయింది అని అతనికి తెలిసేలాగా చేయాలి అనుకుంటాడు రాఖి. అందులోనే నడుస్తున్న మనోహర్ని చూసి మనోహర్ లాగా ఉన్నాడు అనుకోని కారు ఆపి రాజుని సింహాసనం మీద చూడాలి అంతేకానీ ఇలా నడిరోడ్డు మీద నడవటం కాదు అంటాడు రాఖి.

మీ సేవకి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అంటున్న రాఖి..

నాకు నడక కొత్త కాదు అంటాడు మనొ. మీరు ఊ అనండి మీ నడకలో నేను చక్కటి మలిపేస్తాను అంటాడు రాఖి కరెన్సీ తో ఆడుకున్న మీరు కష్టాలతో కుస్తీ పడుతున్నారు నా గెస్ట్ హౌస్ లో ఉండండి అంటాడు రాఖి. ఎందుకు నామీద అంత కన్సన్స్ అని అడుగుతాడు మనొ. చెప్పాను కదా మిమ్మల్ని మ్యాగజైన్ కవర్ మీద మీ ఫోటో చూసి ఇన్స్పైర్ అయ్యను మీరు అంటే అంత క్రేజ్ నాకు అంటాడు రాఖి. ఎప్పుడు నా చేయి పెట్టే స్థాయిలోనే ఉండాలి కానీ ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉండకూడదని అనుకుంటాను.

అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఒక దారిని ఓపెన్ చేశారు మీరు అంటాడు మనొ. అప్పటినుంచి మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నింటిని తెలుసుకుంటున్నాను మీకు ఒక దారి చూపించాలని అంటాడు రాఖి. ముళ్ళ దారిని చదును చేసి పదిమందికి నడిచే రహదారిగా చేయాలనుకునే వాడిని నేను, ఇంకొకరు జాలి చూపించే దారిలో నడవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటాడు మనో.

నా మాటలకి ఫీల్ అవ్వద్దు అంటున్న రాఖి..

మీ దారిలో ఎవరు రాళ్లేశారో ఎవరిముళ్లేశారో తెలుసుకోవాలంటే ముందు ప్రశాంతత ఉండాలి కదా అంటాడు రాఖి. ప్రశాంతత అనేది బయట నుంచి రాదు మనలో మనం ఫీలయ్యేది అంటాడు మనో. నా మాటలకి మీరు ఫీల్ అయ్యారా అని రాఖి అడిగితే లేదు మీ వల్ల నేను కొత్త ఎనర్జీని పొందాను అంటాడు మనో. నా అనుకునే వాళ్ళు నా వల్ల సహాయం పొందిన వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు.

కానీ మీరు అని ఏదో అనే లోగా నేను మీకు అనుకొని అతిది నే కానీ మీ అభిమానిని మీకు వచ్చిన ఇబ్బందులు అన్నీ ఎవరో కావాలనే సాలే గూడులాగా అల్లారు అనిపిస్తుంది అంటాడు రాఖి. అదే తెలుసుకుంటాను అంటాడు మనో. దానికి నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది అంటాడు రాఖీ. మీకు ఏ సహాయం కావాలన్నా నా నెంబర్ కి కాల్ చేయండి అంటాడు రాఖి. నా కీర్తిని కిరీటాన్ని ఎలా పొందాలో నాకు తెలుసు అంటాడు మనో.

మీ సాయం వెనక నా స్వార్థం ఉంది అంటున్న రాఖి..

మీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది అందుకే మీరంటే నాకు ఇష్టం అంటాడు రాఖి. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను నావల్ల మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా రుణాన్ని తీర్చుకోవటానికి రెడీగా ఉంటాను వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనో. మీకు చేసే ప్రతి సాయం వెనక నా స్వార్థం ఉంది అనుకుంటాడు రాఖీ. సీన్ కట్ చేస్తే లేటుగా వచ్చిన కృష్ణని ఎందుకు లేటుగా వచ్చావు అని అడుగుతుంది లీలావతి.

ఆవిడ రావడం లేట్ అయింది అత్తయ్య పువ్వులు ఇచ్చేటప్పటికీ లేట్ అయింది అంటుంది కృష్ణ. లేట్ అయినప్పుడు ఒక ఫోన్ చెయ్ కృష్ణ పాపం లేదా అన్ని పనులు చేసుకుంటుంది అంటుంది మహేశ్వరి. నీకు ఒంట్లో బాగోలేదు మళ్ళీ తడిలో కాళ్లు చేతులు పెడితే జ్వరం వస్తుంది అంటుంది లీలావతి. అక్కడికి వచ్చిన వర్షిణి సూర్య ఇక్కడికి వచ్చాడా నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు అంటూ ఏడుస్తుంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు నాకు భయంగా ఉంది అంటుంది వర్షిణి.

నిజాన్ని తెలుసుకుని షాకైన మనొ..

కంగారు పడకు ఫోన్ చేసావా అని అడుగుతాడు జగదీష్. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంటుంది వర్షిణి. అంతలోనే అక్కడికి వచ్చిన మనో ఎందుకు వర్షు ఏడుస్తున్నావ్ అని అడుగుతాడు. జరిగిందంతా చెప్తుంది కృష్ణ. నాకు ఎందుకో కంగారుగా ఉంది పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటుంది వర్షిణి. పోలీస్ స్టేషన్ కి వెళ్దాం రా పెద్ద నాన్న అంటే నేను కూడా వస్తాను అన్నయ్య చివరిసారిగా నేనే కదా చూశాను అంటుంది వర్షిణి. సరే అని ముగ్గురు అక్కడి నుంచి వెళ్తారు.

తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి సూర్య వచ్చాడేమో అడుగు అని కృష్ణకి చెప్తుంది లీలావతి. అదే సమయంలో ఎలాగైనా లీల అత్తయ్య వాళ్ళని ఒప్పించి దగ్గరవుదాం అనుకుంటే వాళ్లు దగ్గరికి కూడా రానివ్వడం లేదు అని బాధపడుతుంది హారిక. అంతలోనే అక్కడికి వచ్చిన రాఖి ఏంటో చాలా గట్టిగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు. ఎవరినైనా ముంచడానికి అని అడుగుటాడు. ఎక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా అరుస్తుంది హారిక.

హారిక కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాఖి..

రోజుకి ఒక్కసారైనా చూడకపోతే నా గుండె హారిక హారిక అని కొట్టుకుంటుంది ఏం చేస్తాం చెప్పు అంటాడు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై నన్ను డిస్టర్బ్ చేయకు అంటుంది హారిక. నేను మత్తులో ఉండగా నా ఆస్తి సగం రాయించుకొని పారిపోయావు ఇప్పుడు మా ఆస్తితోనే బిజినెస్ చేస్తున్నాను సంగతి హర్షకు తెలియకుండా ఉండాలంటే అని ఏదో అనబోతు ఉండగా పాత విషయాలన్నీ అడ్డుపెట్టుకొని నన్ను టార్గెట్ చేస్తున్నావా అంటుంది హారిక.

నాకు నచ్చని పదం టార్గెట్, అలాంటప్పుడు నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తాను అంటాడు రాఖి. ఏం కావాలని నా వెంట పడుతున్నావ్ అని హారిక అంటే ఒకప్పుడు నిన్ను గుడ్డిగా నమ్మి తప్పు చేశాను అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఒక చిన్న సారీ చెప్తే అన్ని వదిలేస్తాను అంటాడు రాఖి. వదిలేస్తాను అంటున్నాడు అంటే ఏదో ప్లాన్ చేసే ఉంటాడు అనుకుంటుంది హారిక. అది జరిగే పని కాదు అంటుంది హారిక. నేను అనుకుంటే జరిగి తీరుతుంది అంటాడు రాఖి.

పోలీస్ స్టేషన్లో మనోవాళ్ళకి జరిగిన ఘోర అవమానం..

ఒకవేళ నీకు సారీ చెప్పాల్సిన రోజు వస్తే అది నా చావు అవుతుంది అంటుంది హారిక. బ్రహ్మ గీసే గీతని ఈ రాఖీ రాసే రాతని మార్చాలి అనుకోకు అంటూ హారికని హెచ్చరించి వెళ్లిపోతాడు రాఖి. వీడికి సారీ చెప్పిన వదిలే రకం కాదు వీడి గురించి ఒకసారి ఆలోచించాలి అనుకుంటుంది హారిక. మరోవైపు పోలీస్ స్టేషన్ కి వచ్చిన మన సిఐ గారిని అడుగుతాడు మనో.

మేము పోలీసులం కాదా అంటూ అసహ్యంగా మాట్లాడుతారు కానిస్టేబుల్ వాళ్లు. సార్ సిఐ గారు ఏ టైం కి వస్తారు అని మర్యాదగా అడుగుతాడు జగదీష్. ఆయన టైంకి ఆయన వస్తారు ఆయనతో మీకేం పని అంటాడు మరొక కానిస్టేబుల్. వర్షిణిని చూపించి తను మా చెల్లెలు నిన్న రాత్రి నుంచి ఆమె భర్త కనిపించడం లేదు అందుకే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను అంటాడు మనో. ఇప్పటివరకు చేసింది చాలదని ఇదో కొత్త నాటకమా అంటాడు కానిస్టేబుల్.

కోపంతో రెచ్చిపోయిన మనొ..

చెల్లెలు మొగుడు కనిపించట్లేదని డ్రామాలు వేస్తున్నావా ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను వెళ్ళు అంటూ కసురుకుంటాడు కానిస్టేబుల్. నేను కంప్లైంట్ ఇచ్చాను తీసుకునే బాధ్యత మీది అంటాడు మనో. నేరెస్టుడు కూడా న్యాయం మాట్లాడుతున్నాడు అంటాడు కానిస్టేబుల్. నేరస్తుడిని కాదు నిందితుడిని మాత్రమే, మాట్లాడే ముందు మాటలు జాగ్రత్తగా రానివ్వండి అంటూ కోపంగా మాట్లాడుతాడు మనో. అంతలోనే అక్కడికి వచ్చిన ఎస్ఐ తో నా భర్త కనిపించట్లేదు అంటూ జరిగిందంతా చెప్తుంది వర్షిణి.

కానిస్టేబుల్ వాళ్ళని మందలించి మీ కంప్లైంట్ నేను తీసుకుంటాను ఫోటో ఏదైనా ఇచ్చివెళ్లండి అంటాడు ఎస్ఐ. నా భర్త అమాయకుడు తను లేకపోతే నేను ఉండలేను అంటూ ఏడుస్తుంది వర్షిణి. ముందు కంప్లైంట్ రాసిద్దాం రామ్మా అంటూ డీటెయిల్స్ అన్ని ఇప్పిస్తారు జగదీష్. మరోవైపు అన్నయ్య గురించి ఆలోచిస్తున్నారా అత్తయ్య పిన్ని బోర్ పడలేక ఎక్కడికో వెళ్లి ఉంటాడు అంటుంది కృష్ణ. వర్షిని అంటే సూర్యకి చాలా ఇష్టం అలాంటిది తనకి కూడా తెలియదంటే ఏం జరిగిందో అని అనుకుంటారు వాళ్లు.

Intiki Deepam Illalu January 11 Today Episode: మహేశ్వరి తో కయ్యానికి దిగిన దమయంతి..

అంతలోనే అక్కడికి వచ్చిన దమయంతి వాళ్ళు మాయం చేసిన వాళ్ళే మాయ గురించి మాట్లాడుకుంటున్నారు మర్యాదగా నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు మహేశ్వరి అంటుంది దమయంతి. మర్యాదగా మాట్లాడు, మాటలు తిన్నగారానీ అంటుంది మహేశ్వరి. పరాయి సొమ్ము కు ఆశపడే వాళ్ళకి దొంగ సొమ్ములు దాచుకునే వాళ్ళకి గారు చేర్చాలని నాకు తెలియదు అంటుంది దమయంతి. మేము మోసపోయే వాళ్ళం కానీ మోసం చేసేవాళ్లం కాదు అంటుంది కృష్ణ.

నీ మరిది రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి నా కూతురు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజార్చింది మీరే కదా అని దమయంతి అంటే నీ కూతురుతో సంబంధం ఉందని పెళ్లి మండపంలో నిజానికి దిగజారింది మీరే కదా అంటుంది లీలావతి. అందరూ డ్రామాలు బాగానే ఆడుతున్నారు అందరూ నా కూతురు మీద కోపంతో ఆ హర్షని మీరే హారిక కి అప్పజెప్పి ఉంటారు. ఇప్పుడు నా మీద కోపంతో నా కొడుకుని మీరే దాచేసి ఉంటారు అంటుంది దమయంతి.

సూర్య నీ కొడుకె కాదు మాకు అల్లుడు కూడా అంటుంది లీలావతి. మీరే ఏదో ప్లాన్ చేసి ఉంటారు అందుకే మా అన్నయ్యని దాచేసారు అంటుంది రాశి. మూర్ఖంగా మాట్లాడొద్దు అని మహేశ్వరి అంటే మీ కుటుంబాన్ని నమ్మిన మేమంతా నిజంగా మేము మూర్ఖులమే అంటుంది రాశి. తరువాయి భాగంలో మామూలుగా భోజనాలు చేయమంటే చేయట్లేదని తనే అన్నం కలిపి అందరికీ పెడుతుంది కృష్ణ.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 11, 2023 at 1:47 సా.