Intiki Deepam Illalu January 14 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో లీలావతి, మహేశ్వరులను హర్ష, హారికలు అడ్డుకుంటారు. ఇంటికి రండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాము అని వాళ్ళు అనగా మేము నీ ఇంటికి మాత్రం రాను మాకు మర్యాదలు ఉన్నాయి మేము ఇప్పుడు పేదగా ఉండొచ్చు కాని మేము కలిసి మెలిసి ఆనందంగా ఉన్నాము. మీకు కారులు ఉండొచ్చు మాకు కాళ్లు ఉన్నాయి మీ కార్లు ఎక్కితే మా కాళ్లు కోసుకున్నట్టే లెక్క.

హర్షని ఛీ కొట్టిన తోటి కోడళ్ళు..

ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానని మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఉన్న గౌరవం కూడా పోతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాధగా ఉన్న హర్షని హారిక ఓదారుస్తూ నేను నా సాయి శక్తుల ప్రయత్నించాను హర్ష కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని బాధపడుతుంది. సరేలే నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు అని హర్ష అంటాడు. ఆ తర్వాత సీన్లో వర్షిణి దేవుడి దగ్గర దీపం పెట్టి నా భర్త సూర్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లాడో నాకు అర్థం కావడం లేదు.

నాకు సూర్య అంటే చాలా ఇష్టం మొదట్లో నేను సూర్యని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎన్నో అపార్థాలకు దారి తెచ్చాను కానీ ఇప్పుడు సూర్య లేకుండా నేను ఉండలేను. దయచేసి సూర్య త్వరగా ఇంటికి వచ్చేలా చూడు అని దేవుని దీపం పెడుతూ ఉండగా ఇంతలో దమయంతి అక్కడికి వస్తుంది. దమయంతి తలుపు తీసిన గాలికి దీపం కొండెక్కిపోతుంది. నేను ఎన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన సరే వాళ్ళు ఇంకా సూర్య దొరకలేదని అంటున్నారు.

కోడలు మీద నిందలు వేస్తున్న దమయంతి..

కావాలంటే కొత్తగా వచ్చిన డెడ్ బాడీలను, హాస్పిటల్లో చేరిన పేషంట్లను చూపిస్తాము అంటున్నారు అని ఏడుస్తూ అంటుంది దమయంతి. ఇంతలో వర్షిణి ని చూసి సూర్య కనిపించడం లేదు అని నేను బయట ఊర్లన్నీ తిరుగుతుంటే నువ్వు నీటిగా చీర కట్టుకొని తయారయ్యావా ఎవడి కోసం అని అంటుంది. దానికి వర్షిణి కోప్పడి నేనేం చేస్తున్నానో తెలియకుండా మాట్లాడొద్దు అత్తయ్య ఇప్పుడే దేవుడికి సూర్య త్వరగా ఇంటికి రావాలి అని కోరుకున్నాను.

ఇంతలో మీరు వచ్చి దీపాన్ని కొండెక్కిలా చేశారు అని అంటుంది. అయ్యో దీపం కొండెక్కిందా నేను ఇంటికి రాకుండా ఎవడే నిన్ను దీపం వెలిగించుమన్నారు అయినా అన్ని ఇలా జరుగుతున్నాయంటే ఏదో ఆపశకునంగా ఉన్నది అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది దమయంతి. వర్షిణి కూడా అలాగే ఏడుస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత సీన్లో మను తన పాత స్నేహితులకు అందరి దగ్గరకు వెళ్లి తను ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతాడు.

హారికను అనుమానిస్తున్న మనో..

కానీ ఎవరూ తిరిగి ఇవ్వరు పైగా మనోని తప్పు చేసిన వాడిలా అసహ్యంగా చూస్తారు అలాగే ఒక స్నేహితుడు దగ్గరికి వెళ్లి ఉద్యోగం అడగగా వాడు మనూని తిట్టిందే కాక అయినా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంతేనేమో కదా, పెద్ద పెద్దోళ్ళు అందరూ చేసేదే మీరు చేశారు అందరినీ అన్యాయంగా నమ్మించి డబ్బులు తీసుకున్నారు అయినా హారికని ఎందుకు వదిలేసారు తను కూడా మీ దాంట్లో భాగమే కదా.

ఇంత జరిగినా తనకు ఒక విషయం కూడా తెలియకుండా ఉంటుందా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మనో హారిక కి దీనికి ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా అని ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత సీన్లో రాశి తన ఇంట్లో పేపర్ చదువుతూ ఉండగా హర్ష అక్కడికి వస్తాడు వీడేంటి ఇక్కడికి వస్తున్నాడు బతిమిలాడి ఇంటికి తీసుకెళ్తాడా లేక గొడవ పెట్టుకుంటాడా ఏమైనా తేల్చేయాలి అనుకుంటుంది.

తల్లి, కూతుర్లకు షాక్ ఇచ్చిన హర్ష..

ఇంతలో హర్ష వచ్చి డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు అని అంటాడు సంతకం పెట్టడమేంటి అని లెగుస్తుంది రాశి. ఇంతలో అక్కడికి వచ్చిన దమయంతి హర్షని తిడుతుంది. ఇది నేను నువ్వు మాట్లాడుకుంటున్నాం రాశి మీ అమ్మను మధ్యలో దూరొద్దు అని చెప్పు అని అంటాడు హర్ష. నేను ఒద్దు గాని నా కూతురు కావాలి నా కూతురు పెట్టే సంతకం కావాలా.

అయినా నా కూతురే ఏమి నీలాంటిది కాదు అన్యాయంగా మనుషుల్ని మోసం చేయడానికి. వెనకటికి నీలాంటి ఒక్కడే అల్లం బెల్లం ఎదురింటిది నా పెళ్ళాం అన్నాడట అని అనగా ఎదురింటిది కాదు మమ్మీ హరికే నా పెళ్ళాం అంటున్నాడు అని అంటాది రాశి . మధ్యలో హారికని తేవద్దు రాశి నువ్వు ఇంటిని ఎప్పుడైతే రెండు ముక్కలు చేద్దామనుకున్నావో అప్పుడే నీకు విడాకులు ఇద్దామనుకున్నాను ఇది నీకు నాకు మధ్య ఉన్నది మధ్యలో ఎవరిని రానివ్వదు అని అంటాడు.

హర్ష మీద కోప్పడిన వర్షిణి..

ఇంతలో అక్కడికి వచ్చిన వర్షిణి, అన్నయ్య సూర్య కనిపించడం లేదు అని ఇక్కడ అందరూ బాధపడుతుంటే ఇలాంటి సమయంలో నువ్వు విడాకులు కావాలి అని అంటున్నావు. నువ్వు ఇంతలా మారిపోతావు అని అనుకోలేదు అన్నయ్య అని అనగా నువ్వు దీనిలో దూరొద్దు వర్షు అని హర్ష అంటాడు. ఇప్పుడు నువ్వు రాశికి విడాకులు ఇస్తున్నావు తర్వాత సూర్య నాకు విడాకులు ఇవ్వడు అని గ్యారెంటీ ఏంటి అన్నయ్య అని అడుగుతుంది.

సూర్య రాశి అంత చెడ్డవాడు కాదు అని అంటాడు హర్ష. ఇంకొక్క మాట నా కూతురు గురించి చెడ్డగా మాట్లాడితే బాగోదు అని దమయంతి అంటుంది. నువ్వు ఇలాగే చేస్తే నిన్ను ఎలాగైనా జైలుకు పంపించకపోతే నా పేరు మార్చుకుంటాను అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది రాశీ. వర్షిణి కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య అని హర్షను ఏడుస్తూ పంపించేస్తుంది. ఆ తర్వాత సీన్లో రాఖి మందు తాగుతూ హారిక దగ్గరికి వస్తాడు.

Intiki Deepam Illalu January 14 Today Episode:హారిక ఇంటికి వచ్చిన రాఖి..

ఎందుకు ఇక్కడకు వచ్చావు అని హారిక అడగగా నీ పాత ప్రియుడు నీ దగ్గరికి వచ్చాడు అంటే అందుకు అని అడుగుతున్నావు ఏంటి. నిన్ను కార్తీకదీపం రోజు చూశాను. నా గుప్పెడంత మనసు నీకు ఇచ్చి, నా ఇంటికి గృహలక్ష్మిని చేద్దామనుకున్నాను నిండు జాబిల్లిలా చూసాను నువ్వే నా ఇంటికి దీపం ఇల్లాలు అనుకున్నాను అని అంటాడు. తరువాయి భాగంలో మనో ఆటో నడుపుతూ ఉండగా కృష్ణ ఆటో ని ఆపుతుంది.

మీరు ఆటో ఎందుకు నడుపుతున్నారు అని అనగా ఆటోమొబైల్ కంపెనీ పెట్టినోడు ఆటో నడుపుతున్నాడు అని చిన్నగా చూస్తున్నావా సరే పద అని చేతిలో ఉన్న కుక్కర్ ని చూస్తాడు మనో. ఇది మన ఇంట్లోది కాదు కదా అని అనగా నేను ఒక ఇంటికి పనికి వెళ్తున్నానండి పనిమనిషి లాగా అని అంటుంది కృష్ణ.