Intiki Deepam Illalu January 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో ఏదేదో మాట్లాడుతున్న రాఖీని అసహ్యించుకుని గదిలోకి వెళ్ళిపోతుంది హారిక. నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి బంగారం నేను వస్తున్నాను ఉండు అంటూ తన వెనకే వస్తాడు రాఖి. హర్ష వచ్చే టైం అయింది అతను వచ్చే లోపల నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే అంటుంది హారిక.

హారిక ని టార్చర్ పెడుతున్న రాఖి..

లేదంటే ఏం చేస్తావ్, లేదంటే నేనే హర్ష కి ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు అప్పుడే రావద్దు నాకు హారిక కి ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది అని చెప్పేదా అంటాడు రాఖి. ఫైనల్ సెటిల్మెంట్ ఏంటి అని హారిక అంటే ఒకే ఒక చిన్న సారీ చెప్పు అంటాడు రాఖి. అది జరగని పని అని హారిక అంటే మళ్లీ మొదలైంది అంటూ తనని పాటలు పాడుతూ ఆట పట్టిస్తుంటాడు రాఖి. నీ స్వార్థం కోసం నన్ను ప్రేమించావు నా అవసరం కోసం నిన్ను వాడుకున్నాను ఇద్దరికీ చెల్లిపోయింది.

ఇందులో ఇద్దరు తప్పు ఉంది కాబట్టి ఒకరికొకరు సారీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మూసుకొని బయలుదేరు అంటుంది హారిక. ఈ మాట నువ్వంటున్నవా హారిక హర్ష కి తెలియజేయవలసింది తెలియచేస్తాను. నిన్ను నా దాన్ని చేసుకుంటాను అంటే వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతాడు రాఖి. నా జీవితంతో ఒక ఆట ఆడుకుంటున్నాడు అంటూ చికాకు పడిపోతుంది హారిక.

ఏడుస్తూ అసలు విషయాన్ని చెప్పిన వర్షిణి..

మరోవైపు వెలిగించిన దీపం ఒడి గట్టి పోయిందని తల్లికి ఫోన్ చేసి ఏడుస్తుంది వర్షిణి. నువ్వేమీ బాధపడొద్దు ఇలాంటి సమయంలోనే గుండె నిబ్బరం చేసుకోవాలని ధైర్యం చెబుతుంది మహేశ్వరి. మీరు ఉండే కష్టాల్లో నేను ఇవన్నీ మీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పకుండా ఉండలేకపోయాను అంటుంది వర్షిణి. నేను నీ తల్లిని నా కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావు అని మహేశ్వరి అంటుంది. సూర్య వస్తాడంటావా నాకు చాలా భయంగా ఉంది అంటుంది వర్షిణి.

తను తప్పకుండా వస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు అని కూతురికి ధైర్యం చెబుతుంది మహేశ్వరి. పూలు గుచ్చుతున్న లీలావతి కంట్లో ఏదో పడితే జగదీష్ ఊదుతాడు. పోయిందా అని భార్యని అడిగితే పోయింది కానీ కలత మాత్రం అలాగే ఉండిపోయింది అంటుంది లీలావతి. అలా అని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు పక్కకి వెళ్తాయా అంటూ భార్య ని ఓదరుస్తాడు జగదీష్.

లీలావతికి ధైర్యం చెబుతున్న మహేశ్వరి..

లీలావతిని కాఫీ అడిగితే పాలు లేవు అంటుంది. ఆ మాటలు విన్న మహేశ్వరి డికాషన్ పెట్టి ఇస్తుంది. డికాషన్ చాలా బాగుంది ఆంటాడు జగదీష్. కాస్త నవ్వుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మహేశ్వరి అంటే నవ్వడం వేరు నవ్వుల పాలు అవ్వడం వేరు అంటుంది లీలావతి. నిజమే మనకంటూ ప్రతిష్ట ఉండేది అని మహేశ్వరి అంటే అవన్నీ ఏమైపోయాయి ఇప్పుడు పప్పుకి ఉప్పుకి కూడా వెతుక్కునే పరిస్థితి వచ్చింది ఈ కష్టానికి ముగింపు లేదా అంటుంది లీలావతి.

హర్ష చేసిన తప్పుకి మనం అందరినీ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. తన తప్పు లేకపోయినా నిందలు భరిస్తున్నాడు అంటుంది మహేశ్వరి. ఈ కష్టాల్లో సూర్య కనిపించకపోవడం ఒకటి అంటాడు జగదీష్. వర్షిణి తో మాట్లాడావా అని లీలావతి అడిగితే ఇందాకే మాట్లాడాను అని మహేశ్వరి అంటే కాస్త ధైర్యం చెప్పడం తప్పితే మనం ఏం చేయగలవు అంటుంది లీలావతి.

దీర్ఘాలోచనలో ఉన్న రాశి..

మన దగ్గర ఏమీ లేనప్పుడే మనం అంటే ఏంటో మనకి తెలుస్తుంది. కష్టాలు సుఖాలు అందరికీ ఉంటాయి కానీ వాటితో పాటు మనకి ప్రేమలు అభిమానులు ఉన్నాయి వాటిని కలిపి ఉంచే దారం లాగా కృష్ణ ఉంది. ఇప్పుడు మనం కోటీశ్వరులమే కదా అంటుంది మహేశ్వరి. మరోవైపు రాశి దీర్ఘంగా హర్ష చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఆహారిక నా భర్తను అంతలా మార్చేసింది అని తిట్టుకుంటూ ఉంటుంది.

ఇంతలో దమయంతి అక్కడికి వచ్చి ఎవరి గురించే బుర్ర బద్దలయ్యేలా ఆలోచిస్తున్నావు ఆహారిక హర్షణ గురించేనా అని అనగా అయినా నాకు హర్ష గారు ఎలా ద్రోహం చేద్దామనుకున్నారు అని అంటుంది రాసి అప్పుడు దమయంతి సకం మగ జాతి అంతా ఎప్పుడు కట్టుకున్న దాన్ని మోసం చేసి రెండో సెట్ అప్ పెడదామని చూసేవారే నీ భర్త అంతకన్నా ఒక అడుగు ముందేసి అని అనగా నేను రచ్చ రచ్చ చేస్తాను మమ్మీ కోర్టుకు వెళ్తాను అని రాసి అంటుంది.

భయంతో వణికిపోతున్న దమయంతి..

నువ్వు ఏదైనా చేయు ఆవిడాకులు పేపర్ మీద సంతకం పెట్టకుండా కోర్టు జోలికి వెళ్లకుండా ఏం చేసినా పర్లేదు నా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అని అనగా వద్దు మమ్మీ కోర్టుకే తీసుకెళ్తాను ఎక్కడో రెండో పెళ్లి లీగల్ అని కోర్టు ప్రకటిస్తే ఈయన నన్ను బెదిరిస్తున్నారు అని అంటుంది రాసి అప్పుడు దమయంతి కోర్టుకు వెళ్లాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా అని అంటుంది ఇంతలో హరి నారాయణ ఫోన్ చేస్తాడు.చెప్పండి హరి నారాయణ గారు అని దమయంతి అనగా ఇక్కడ సంతకాలు చేయడం కోసం పేపర్లో ఎదురు చూస్తూ ఉన్నాయి.

ఎంతసేపు ఎదురు చూడాలి మేము అని అంటున్నాడు హరి నారాయణ ఇక్కడ నా కొడుకు కనిపించడం లేదు నా కూతురు జీవితం అద్దాంతరంగా ఆగిపోయింది ఇప్పుడు నా పిల్లల్ని కాదని మీకు సంతకాలు పెట్టలేను నాకు వాళ్లే ముఖ్యం మీకు సంతకాలు కావాలి అంటే వేచి ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆ సూర్య గాడు చచ్చాడు అని చెప్తే గాని ఇది సంతకాలు పెట్టదేమో అని అనుకుంటాడు హరి నారాయణ.

హారికని నిలదీసిన మనో..

ఆ తర్వాత సీన్లో రాఖీతో జరిగిన విషయం అంత గుర్తు తెచ్చుకున్న హారిక నిజంగానే హర్ష కి రాఖీ అంతా చెప్పేస్తాడా అని భయపడుతుంది. కానీ హర్ష నా మత్తు లో ఉన్నాడు అతనికి ఏం చెప్పినా నమ్మడు. ఒకరి దగ్గర సాక్షాలు లేవు మరొకటి దగ్గర నమ్మకం లేదు అందువల్ల రాకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అని హ్యాపీ ఫీలవుతుంది హారిక. అంతలో మనో వచ్చి హారిక ని పిలుస్తాడు. మనో గొంతుకు విన్న హారిక,రాఖీ అతనికి నిజం చెప్పేసాడా అని భయపడుతుంది.

లోపలికి రమ్మని ఆహ్వానిస్తే మగాడు లేని ఇంట్లోకి తలుపులు తీసి ఉన్నాయి కదా అని వచ్చేసే క్యారెక్టర్ కాదు నాది అంటాడు మనో. ఇది ఒంటరి ఆడదని ఇల్లు ఎందుకు అవుతుంది నా భర్త హర్ష ఉన్నాడు అంటే ఇంకొక మాట అలా అనకు నీకు ఆ అర్హత లేదు. వాడిని మాయ చేసి నీ వైపు తిప్పుకున్నావు. వాడు కుటుంబాన్ని రోడ్డుమీదకి విడిచావు నేను పని కోసం వెళ్ళినా ప్రతి చోట అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు.

ఏ ఆధారాలు లేకుండా మాట్లాడొద్దంటున్న హారిక..

నాక్కూడా అదే అనిపిస్తుంది నువ్వు తప్పితే ఇలాంటి పనులు ఇంకెవరు చేయరు అంటాడు మనో. మీ కుటుంబం రోడ్డు మీదకి రావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఏ ఆధారాలు లేకుండా నన్ను అనుమానించొద్దు. నా పార్ట్నర్షిప్ ని కట్ చేసింది మీరు నాకుగా నేను వెళ్ళిపోలేదు. మీతోనే ఉండి ఉంటే ఇప్పుడు మీతో పాటు జైల్లో ఉండి ఉండేదాన్ని నా నెత్తిన నేనే మట్టి పోసుకుంటానా అంటూ నిలదీస్తుంది. ఇవి నా మొత్తం ఆస్తి పత్రాలు కావాలంటే అన్ని తీసుకోండి దీంట్లో నుంచి వెళ్లిపోమన్నా వెళ్ళిపోతాను.

నాకు ఎవరు డబ్బు ఎవరు అధికారం అవసరం లేదు. నేను ఇవన్నీ చేశాను అనటానికి ఒక్క ఆధారం చూపించండి. నేను హర్షిని చూసేటప్పటికి తన జీవితంలో ఒక ఆడది ఉందని తెలియదు అందుకే ప్రేమించాను. ఇదే నేను చేసిన తప్పు అంతే తప్ప నేను ఎవరికీ ఏ హాని చేయలేదు అంటూ చేతులు జోడించి ఏడుస్తుంది. ఏమీ చేయలేక మనో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆడదానికి అన్ని వాళ్ళకి ఏ మగాడైనా కరగాల్సిందే మీ ఇంట్లో మగవాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అదే మీ ప్లస్, మైనస్.

Intiki Deepam Illalu January 16 Today Episode తన నటనకి తనే మురిసిపోతున్న హారిక..

ఇప్పుడు ఆ రాఖీ గాడు కూడా మనో కి ఏం చెప్పినా నమ్మడు అంటూ నవ్వుకుంటుంది హారిక. సీన్ కట్ చేస్తే కృష్ణ పనిచేస్తున్న హింట్ కూడా మా ఇంట్లో కొత్త పనిమనిషి వచ్చింది కిట్టి పార్టీ మన ఇంట్లోనే చేసుకుందామని అంటుంది. అదే విషయాన్ని కృష్ణ కి చెప్పి రేపు త్వరగా రమ్మని చెప్తుంది ఆవిడ. సరే అన్న కృష్ణ అడ్వాన్స్ ఇస్తానన్నారు కదా అంటుంది. మర్చిపోయాను ఇప్పుడే తెస్తాను ఉండు అని శాలరీ తెచ్చి ఆమె చేతిలో పెట్టి, శాలరీ ఇచ్చాను కదా అని రెండు రోజులకి ఒకసారి సెలవు పెట్టొద్దు.

పనిలో డిసిప్లిన్ లేకపోతే నేను అసలు ఊరుకోను అంటుంది ఆవిడ. కుక్కర్ హ్యాండిల్ పాడైపోయింది అని బాగు చేయించి తీసుకురమ్మని కృష్ణకి పురమయిస్తుంది ఆవిడ. ఇంటికి వెళ్లొద్దు కుక్కర్ ఇచ్చేశాక మీ ఇంటికి వెళ్ళు అని చెప్తుంది ఆవిడ. తరువాయి భాగంలో కుక్కర్ బాబు చేయించడానికి వెళ్తున్న కృష్ణ ఆటో ఆపుతుంది అందులో మనొ ని చూసి షాక్ అవుతుంది.

ఆటోమొబైల్ కట్టవలసిన భర్త ఆటో నడుపుతున్నాడని బాధపడుతున్నావా అంటాడు మనో. అది సరే కానీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇదేంటి అని అడిగితే కుక్కర్ అంటుంది కృష్ణ. ఇలాంటివి మన ఇంటిలో లేదు కదా అంటే అప్పుడు తను పని మనిషిగా చేస్తున్న విషయం చెప్తుంది కృష్ణ.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 16, 2023 at 1:47 సా.