Intiki Deepam Illalu January 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో జాబ్ గురించి వెతుక్కుంటున్న మనోహర్ నిన్న ఏ పని దొరకలేదు కనీసం ఈ రోజైనా పని దొరికితే బాగుండు అమ్మ పెద్దమ్మ కష్టపడక్కర్లేదు అనుకుంటాడు. ఓ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వెళ్తే అతను మనోహర్ని నమ్మడు. మనోహర్ ఎంత వినిపించుకోకుండా మిమ్మల్ని నమ్మడం కుదరదు మిమ్మల్ని నమ్మి జాబ్ ఇవ్వలేను అంటూ ఫోన్ పెట్టేస్తాడు అవతల వ్యక్తి.
మనో మీద చిరాకు పడుతున్న కానిస్టేబుల్..
బయటికి వచ్చిన మనోహర్ అందరూ చూసిందే నమ్ముతున్నారు కానీ జరిగింది ఎవరు నమ్మటం లేదు. జాబ్ దొరకకపోతే వేరే పని ఏదైనా చూసుకోవాలి అనుకుంటాడు మనోహర్. అంతలోనే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ నీకు ప్రతిసారి బొట్టు పెట్టి చెప్పాలా బెయిల్ మీద బయటకు వచ్చారు ప్రతిరోజు టైం పెట్టకపోతే మీ బెయిల్ క్యాన్సిల్ చేసేస్తారు అంటాడు కానిస్టేబుల్. సారీ సార్ ఏదో పనిలో ఉండి మర్చిపోయాను సాయంత్రం వచ్చి నేనే సంతకం పెడతాను అంటాడు మనోహర్.
అతన్ని చూసిన ఇద్దరు వ్యక్తులు చులకనగా మాట్లాడుకుంటూ ఉంటారు. మంచి చెప్పడం మంచి చేయటం తెలియని ఈ ప్రపంచంలో నాకు జాబ్ రావడం జరగని పని అనుకుంటాడు మనోహర్. నేరుగా ఒక ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్లి నాకు ఒక సాయం చేయండి అద్దెకి ఆటో ఇప్పించండి అని అంటాడు. మీరు ఎవరో తెలియదు కానీ చూడ్డానికి బాగా బ్రతుకులు వారిలాగా ఉన్నారు కావాలంటే డబ్బులు ఇస్తాను అంటాడు అతను.
మనోహర్ కి హెల్ప్ చేసిన ఆటోవాలా..
అయ్యయ్యో డబ్బులు ఏమీ వద్దు నాకు పని ఇప్పించండి అంటాడు మనోహర్. నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు కావాలంటే అతని దగ్గరకు వెళ్లి అడిగి చూద్దాం అంటూ అక్కడికి తీసుకొని వెళ్తాడు ఆ ఆటో అతను. అక్కడికి వెళ్లిన తరువాత మనోహర్ ని పరిచయం చేసి సాయం చేయమంటాడు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అని మనోహర్ని అడుగుతాడు అతను. నేను కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ని అని చెప్తే నాకు నీ పరిస్థితి అర్థమయింది కానీ ఆటో కావాలి అంటే డిపాజిట్ కట్టాలి అంటాడు.
డిపాజిట్ కట్టడానికి నా దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు అని మనోహర్ అంటే సరే నువ్వు సంపాదించింది దాంట్లో 25% డిపాజిట్ కట్టి 75% శాలరీ కింద తీసుకో అంటాడు అతను. అందుకు ఒప్పుకున్న మనోహర్ ఆటో తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు రాఖీ మాటలు, మనోహర్ మాటలు తలుచుకొని టెన్షన్ పడుతుంది హారిక. పొద్దున వెళ్ళిన వాడు ఇప్పటికి వచ్చి రాలేదు, ఫోన్ కూడా కలవట్లేదు. డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టించుకు రమ్మంటే ఇప్పటివరకు పత్తా లేదు అంటూ చిరాకు పడుతుంది హారిక.
వెళ్లిన పని అవ్వలేదు అంటున్న హర్ష..
అంతలోనే హర్ష ఫోన్ చేయటంతో నీకు వందేళ్లు నీకోసమే అనుకుంటున్నాను ఇంతకీ రాశి డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టిందా అని అడిగితే, లేదు హారిక, రాసి వాళ్ళ అమ్మ రచ్చ రచ్చ చేశారు కోర్ట్ లోనే చూసుకుందామని చెప్పి పంపించేశారు అంటాడు హర్ష. నువ్వు ఇంత అమాయకుడివి కాబట్టే అందరూ నిన్ను చులకనగా చూస్తున్నారు అంటుంది హారిక.
ఊరుకోక ఏం చేయను ఆఖరికి నా చెల్లెలు కూడా నన్ను ప్రశ్నిస్తుంటే ఏం చేయమంటావు సూర్య కనిపించక మేం బాధపడుతుంటే ఇప్పుడు నీకు డైవర్స్ కావాలా అంటూ నన్నే అంటున్నారు నేను నీకు ముందే చెప్పాను ఇది సరి అని టైం కాదు అని కానీ నువ్వే వినలేదు అంటాడు హర్ష. సరే ఇంటికి వచ్చేయ్ మాట్లాడుకుందాం అని హారిక అంటే ఇప్పుడు రావటం కుదరదు ఇందాకే రాఖీ ఫోన్ చేశాడు అని చెప్తాడు హర్ష. ఎందుకు అని కంగారుగా అడుగుతుంది హారిక.
నేను వస్తాను అంటున్న హారిక..
బిల్డింగు కొలప్స్ ఎవరు చేశారో చెప్తాను అన్నాడు వాడు గనుక ఎవరో తెలిస్తే వాడి ప్రాణం తీస్తాను. మన అన్నయ్య వాళ్ళని రక్షించుకోవడానికి కూడా అవుతుంది అంటాడు హర్ష. అలా అయితే నేను కూడా వస్తాను అంటుంది హారిక. మరోవైపు కుక్కర్ మూత బాగు చేయించిన కృష్ణ ఇంటికి వెళ్ళటం కోసం ఆటోని ఆపుతుంది. ఆటోలో ఉన్న మనోని చూసి షాక్ అవుతుంది. మీరు ఆటో నడుపుతున్నారా ఎంత పెద్ద చదువులు చదివారు మీరు అంటూ భర్తని ప్రశ్నిస్తుంది కృష్ణ.
నిజమే చదువుకి ఉద్యోగం వస్తుంది కానీ నాకు మాత్రం ఆ అవకాశం లేదు. అదేంటి మీకెం తక్కువ అని కృష్ణ అడిగితే తక్కువైంది క్వాలిఫికేషన్ కాదు క్యారెక్టర్. దగా కోరు, దగుల్బాజీ, అంటున్నారు. మనం చేసిన మంచి కన్నా మనమీద పడిన నిన్నే బలంగా ఉంది అంటాడు మనో. మీరు చాలామందికి సహాయం చేశారు కదా ఒక్కరు కూడా మీకు తిరిగి సాయం చేయలేదా అంటే వాళ్లే మోహన్ చాటేసారు ఎందుకంటే రేపు వాళ్ళకి అదే ప్రాబ్లమ్ అవుతుందని. ఈ వ్యాపార ప్రపంచంలో ప్రతి పరిచయం వెనకా ఒక స్వార్థం ఉంటుంది.
ఒకరిని చూసి ఒకరు షాక్ అయిన కృష్ణ దంపతులు..
నా పరిచయం వల్ల లాభం కన్నా నష్టమే అని వాళ్ళు మ్యారేజి వేశారు అందుకే నన్ను వదిలేశారు అంటాడు కృష్ణ. మరి స్నేహితులు అని ప్రశ్న అడిగితే వాళ్ళు కూడా నన్ను వదిలేశారు అందుకే ఈ ఆటో ఈ డ్రెస్. గమ్యం వైపు వెళ్లే వాళ్ళు నా ఆటో ఎక్కుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూడ్డం మానేసి ఆటో నడపాలనుకున్నాను. ఆటోమొబైల్ కంపెనీ నడిపే భర్త ఆటో నడుపుతున్నాడని చిన్నతనంగా ఉందా అని మనో అడుగుతాడు.
అలాంటిదేమీ లేదు అని కృష్ణ అంటే సరే ఇంటికే కదా అంటాడు మనో. మళ్లీ కృష్ణ చేతిలో బ్యాగ్ చూసి ఏంటిది అని అడిగితే కుక్కర్ బాగు చేయించడానికి తెచ్చాను అంటుంది కృష్ణ. ఇది మన ఇంట్లో లేదు కదా నిజం చెప్పు ఇది ఎక్కడిది అని అడుగుతాడు మనో. అప్పుడు తను పనిమనిషిగా చేస్తున్న విషయం చెప్తుంది. ఆ మాటలు విన్న మన కోపంతో కేకలు వేస్తాడు నేను చచ్చాను అనుకున్నావా నా భర్త చేతకాని వాడు వెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు అందరికీ తెలియాలనే ఇలా పని మనిషిగా చేస్తున్నావా, చెప్పు నీకు ఏం తక్కువ చేశాను అంటూ నిలదీస్తాడు మనో.
కృష్ణ మాటలకి కరిగిపోయిన మనో..
తక్కువైంది నాకు కాదు అత్తయ్య వాళ్ళ మందులకి బాగా బతికిన వాళ్లని రోడ్డుమీద వదిలేయలేం కదా, అందుకే వీధి లేని పరిస్థితుల్లో అంటూ కన్నీరు పెట్టుకుంటుంది కృష్ణ. సారీ కృష్ణ నాలోని అహంకారం బయటకు వచ్చింది ఆడదాని సంపాదన భర్త చేతకానితనాన్ని చూపిస్తుంది. అందుకే మాకాడనే అహంకారం అనుకోకుండా బయటికి వచ్చేసింది అంటాడు మనో. మీరు ఇలా తిట్టారంటే నామీద కోపంతో కాదు ప్రేమతో. నువ్వు మా కోసం పడుతున్న తపనని అర్థం చేసుకోలేకపోయాను.
కానీ నా కోపాన్ని నువ్వు ప్రేమగా తీసుకుంటున్నావ్,నీలాంటి భార్య దొరికితే ఎలాంటి భర్త కైనా గెలుస్తానని నమ్మకం వస్తుంది అంటాడు మనో. మీ గెలుపు తొందరలోనే ఉందని నేను బాగా నమ్ముతున్నాను అంటూ ఈ విషయం ఇంట్లో చెప్పొద్దు అంటూ భర్తకు చెప్తుంది కృష్ణ. ఎందుకు అని అడిగితే ఆవిడ బాధపడతారు అసలే ఆరోగ్యం బాగోలేదు, వర్షిణి విషయంలో కూడా చాలా చాలా మదన పడుతున్నారు అంటుంది కృష్ణ. పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఏమైందో ఎంక్వయిరీ చేద్దాం అంటాడు మనో. మరి ఈ కుక్కర్ అని కృష్ణ అంటే మీ ఓనర్ ఇంట్లో ఇచ్చేసాకే వెళ్దాం అంటాడు మనో. సరే అంటూ ఇద్దరూ బయలుదేరుతారు.
భయంతో వణికి పోతున్న హారిక..
మరోవైపు ఈ రాఖి ఇప్పుడే రావాలా అంటూ చిరాకు పడుతుంది హారిక. రాఖీ ఆఫీస్ కి రాకముందే నేను ఆఫీస్ కి వెళ్ళిపోవాలి, హర్ష కి రాఖీ మీద ఉన్న నమ్మకాన్ని డిస్టర్బ్ చేయాలి లేకపోతే నా పని అయిపోతుంది అనుకుంటుంది హారిక. మరోవైపు హర్ష, రాఖీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆఫీస్ కి వచ్చిన హారిక రాఖీ లేకపోవడం చూసి రిలాక్స్ ఫీల్ అవుతుంది. రాఖి వచ్చాడా అని హర్ష అని అడిగితే లేదు అతని కోసమే వెయిట్ చేస్తున్నాను అంటాడు హర్ష.
మీ అన్నయ్య వాళ్ళని వీధిలోకి లాగిన్ వాడు ఎవరో రాఖీ చెప్పిన వెంటనే వాడి అంత చూస్తాను ఎందుకంటే మీ అన్నయ్య మనల్ని అనుమానిస్తున్నారు అంటే మనో ఇంటికి వచ్చిన విషయం అంతా చెప్తుంది హారిక. మీ అన్నయ్యకి తన బాధ పంచుకోవడానికి తన భార్య ఉంది కానీ నా పరిస్థితి చూడు నాకు ఏమైనా అయితే నా బాధ పంచుకోవడానికి నువ్వు ఒక్కడివే ఉన్నావు నన్ను నేను ఇంటి దూరం చేస్తే నా పరిస్థితి ఏంటి అంటూ ఏడుస్తుంది హారిక. నన్ను నీ నుంచి ఎవరు దూరం చేయలేరు.
Intiki Deepam Illalu January 17 Today Episode: హారిక కి చెమటలు పట్టిస్తున్న రాఖి..
అన్నయ్య మనసుని జీవితాన్ని పాడు చేసిన వాడిని చూడాలి వాడిని జీవితాంతం జైల్లో పడేసి చెప్పకూడదు తినేలాగా చేయాలి అంటాడు హర్ష. అంతలోనే అక్కడికి వచ్చిన రాఖి నువ్వు అన్నది 100% కరెక్ట్ అంటాడు. మీ అన్నయ్యని నాన్నని అవమానించిన వాళ్ళకి నువ్వు వెయ్యాలనుకున్న శిక్ష కరెక్ట్ అంటాడు. జైల్లో చెప్పకూడదు ఈ మాటే సూపర్ కదా హారిక అంటాడు రాఖి. కంగారుగా అవును అంటుంది హారిక.
ఇంతకీ వాళ్ళు ఎవరో చెప్పండి అని హర్ష కంగారుగా అడిగితే కంగారు పడొద్దు నాకు ఉన్నది డౌట్ మాత్రమే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తీసుకొచ్చి నీ ముందు పడేయాలని చూసాను. కానీ నా నుండి ఆ పర్సన్ ప్రస్తుతానికి ఎస్కేప్ అయింది అంటాడు. తరువాయి భాగంలో ఆటోలో వచ్చిన మనో దంపతులని చూసి మహేశ్వరి వాళ్ళు షాక్ అవుతారు.
ఈ డ్రెస్ ఏంటి అని మహేశ్వరి అడిగితే మనకంటూ అడ్రస్ లేనప్పుడు ఈ డ్రెస్సే ఆధారం అవుతుంది అంటాడు మనో. నువ్వు ఆటో నడపడం ఏంటి నేను దీనికి అసలు ఒప్పుకోను అంటుంది మహేశ్వరి.