Intiki Deepam Illalu January 18 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మిమ్మల్ని చీట్ చేసిన వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మీ దగ్గర తీసుకొద్దాం అనుకున్నాను కానీ ప్రస్తుతానికి ఎస్కేప్ అయిపోయాడు అంటాడు రాఖి. మీకు ఎవరి మీద అనుమానం ఉందో చెప్పండి వాళ్ళని నేను ఫాలో అవుతాను అంటాడు హర్ష. పేరు చెప్తే అసలు పట్టుకునే అవకాశం లేకుండా పోతుంది ఈ విషయం నేను చెప్పలేదు మీ అన్నయ్య చెప్పాడు అంటాడు రాఖి.
హారిక ని పూర్తిగా నమ్ముతున్న హర్ష..
అంటే అన్నయ్య ఎవరినైతే అనుమానిస్తున్నారో వాళ్ళని మీరు కూడా అనుమానిస్తున్నారా అంటే అలా ఏమీ కాదు అలా అయితే మీ అన్నయ్య మిమ్మల్ని కూడా అనుమానిస్తున్నాడు అంటాడు రాఖీ. కరెక్ట్ గా చెప్పలేదు కానీ ఒకవేళ మీరే అని ఎవరైనా అంటే, ఎందుకంటే టైఅప్ ఉన్నది మీ ఇద్దరే కదా అంటాడు రాఖి. నన్ను ఎవరో ఎన్ని మాటలు అన్నా పడతాను అంతేకానీ హారిక జోలికి వస్తే మాత్రం ఊరుకోను ఆ దేవుడే వచ్చి హారిక మీద నిందలు వేసిన నమ్మను.
ఆ రాస్కెల్ కి ఎవడో తెలిస్తే చెప్పండి లేకపోతే మమ్మల్ని ఇలా వదిలేయండి అంటాడు హర్ష. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చూద్దామని అలా అన్నాను వాడు ఎవడో నాకు తెలుసు కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు నేను చెప్పలేను. వాడి ఉనికి బయట పెడితే మీ అన్నయ్య వాళ్లకి అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతాడు రాఖి. అతని వెనుక వెళ్లిన హారిక బాగా డిసప్పాయింట్ అయినట్లు ఉన్నావు.
రాఖీతో చాలెంజ్ చేసిన హారిక..
నువ్వే కాదు ఆ దేవుడే చెప్పిన హర్ష ఏమి నమ్మడు అంటుంది హారిక. నేను చెప్పే కాదు నీ నోటితో నువ్వు చెప్తే నమ్ముతాడు కదా అంటాడు రాఖి. అది నీ వల్ల కాదు కావాలంటే ట్రై చేసుకో అంటుంది హారిక. నిన్ను చూస్తే ముచ్చటగా ఉంది లైఫ్ చాలా బోర్ గా ఉంది అనుకున్నాను కానీ చాలెంజులు విసిరుతున్నావు కుదరదు అని ఛాలెంజ్ చేసావు కదా, చూడు నీతో ఎలా కుదిరిస్తానో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాఖి. సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎస్ఐ గారిని అడుగుతారు మనో వాళ్ళు.
మీరు సూర్య మిస్సింగ్ కేసు కదా అంటాడు కానిస్టేబుల్. అవునండి ఏమైనా తెలిసిందా అని కృష్ణ అడిగితే తెలిస్తే మీకు ఈపాటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళం కదా అంటాడు కానిస్టేబుల్. ఎస్సైని కలిసిన మనో తను వచ్చిన విషయం చెప్తాడు. కానిస్టేబుల్ని సూర్య ఫైల్ తీసుకొని రమ్మంటాడు ఎస్సై. ఫైన్ చూసిన ఎస్ఐ ఈ కేసు సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కి పంపించాం, దర్యాప్తు కూడా జరుగుతుంది. ఇతనికి కర్రీ పాయింట్ ఉంది అని ఇందులో చెప్పారు దీనికి సంబంధించి ఎవరైనా శత్రువులు ఉన్నట్టు మీకు తెలుసా అంటాడు ఎస్ఐ.
సూర్య వివరాలు అడుగుతున్న ఎస్సై..
లేదు సార్ తను చాలా మంచివాడు ఎవరితోనూ అంత త్వరగా గొడవలు పడడు. మాకు తెలిసి అతనికి ఎవరు శత్రువు లేరు అంటాడు మనో. మీకు తెలియకుండా 1% శత్రువులైన ఉండొచ్చు కదా, మేము ఎంక్వయిరీ చేసిన దాంట్లో కొన్ని విషయాలు బయట పడ్డాయి. కరక్కాయలు వ్యాపారం చేసి దమయంతి అందరిని మోసం చేస్తే ఆ డబ్బు సూర్య ను సెటిల్ చేశాడని తెలిసింది ఇది నిజమేనా అంటాడు ఎస్సై.
మా పిన్ని ఎవరినో నమ్మి మోసపోయింది అంతేకానీ మా పిన్ని ఎవరిని మోసం చేయలేదు అంటుంది కృష్ణ. సూర్య భార్య సంగతి ఏంటి అంటాడు ఎస్సై. తను నా చెల్లెలు తనకి భర్త అంటే ప్రాణం సూర్య కనిపించని దగ్గర్నుంచి ఏడుస్తూ కూర్చుంది అంటాడు మనో. మీ చెల్లి ఎవరు నువ్వు ప్రేమించి ఇంటి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చారు అంట కదా దాని గురించి ఏమంటారు అంటాడు ఎస్ఐ. పెళ్లికి ముందు ఉదయనే వ్యక్తిని ప్రేమించింది కానీ పెళ్లి అయిన దగ్గర్నుంచి మాత్రం భర్తే ప్రాణంగా బ్రతుకుతుంది అంటాడు మనో.
మేము మొదట కుటుంబ సభ్యుల్నే అనుమానిస్తామంటున్న ఎస్ఐ..
మీ తల్లి చెల్లి కాబట్టి మీకు మంచిగా అనిపించొచ్చు కానీ నాలుగు రోజులుగా ఒక మనిషి కనిపించకపోతే మేము మొదటిగా అనుపరించేది కుటుంబ సభ్యుల్ని మాత్రమే. అతని మొబైల్ ని ట్రేస్ చేస్తే అనుమానించదగ్గ కాల్స్ ఏమీ లేవు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండటంవల్ల అతను ఉన్న ప్లేస్ ని ట్రేస్ చేయలేకపోతున్నాం. మీరు కూడా బాగా ఆలోచించి అతని గురించి ఏమైనా వివరాలు తెలిస్తే మాకు కాల్ చేయండి మీరిచ్చే ఇన్ఫర్మేషన్ తోనే మా ఇన్వెస్టిగేషన్ సులువవుతుంది అంటాడు ఎస్సై.
సూర్య శుక్రవారం తన బైక్ మీద బయటకి వెళ్ళాడు తను ఉండే ప్లేస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ప్లేస్ అక్కడ సీసీ కెమెరాలు ఉఉండవు కానీ తను సిటీ వైపు వెళ్లేటప్పుడు బైక్ ప్లేట్ నెంబర్స్ చూసి గుర్తించడం అవ్వదా అంటాడు మనో. ఇన్ని చేసిన వాళ్లని అది మాత్రం చేయకుండా ఉంటామా ఓ ఆర్ హైవే మీద పది గంటల ప్రాంతంలో కనిపించింది 10 నిమిషాల తర్వాత యూటర్న్ తీసుకుని ఎటు వెళ్ళాడు కానీ అటు కిలోమీటర్లు ఇటు పది కిలోమీటర్లు అడవి ప్రాంతం అందువల్ల అతను ఎక్కడికి వెళ్లింది మాకు తెలియలేదు.
ఎస్సై ని రిక్వెస్ట్ చేస్తున్న హారిక..
అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మీకు తెలియని శత్రువులు ఎవరైనా సూర్యకి ఉన్నారా, కానీ ఆ శత్రువులు మీతోనే ఉన్నారేమో చెక్ చేసుకోండి. అతను ఎక్కడో సేఫ్ గానే ఉన్నాడు అనిపిస్తుంది అంటాడు ఎస్ఐ. నాకు ఎవరి మీద ఎలాంటి అనుమానాలు లేవు కానీ కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంది కృష్ణ. మీరు వర్రీ అవ్వకండి మాకు విషయం తెలియగానే మీకు ఇన్ఫామ్ చేస్తాం అంటాడు ఎస్ఐ. అతనికి థాంక్స్ చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతారు కృష్ణ దంపతులు.
పోలీస్ స్టేషన్ కి వచ్చి వెళ్ళిన విషయం వర్షినికి చెబుదాం, తనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది మనో. నిజమేనండి నాలుగు రోజులుగా మనిషి కనిపించకపోతే ఎవరికైనా భయంగానే ఉంటుంది అని కృష్ణ అంటే మన ప్రయత్నం చేస్తున్నాను కదా మిగతాది కాలమే నిర్ణయించాలి అంటాడు మనో. మరోవైపు ఆలోచనలో ఉన్న భర్త దగ్గరికి వచ్చి ఎందుకలా ఉన్నారు అంటుంది లీలావతి.
మనోని అలా చూసి షాక్ అయిన మహేశ్వరి..
మన పాత రోజులు గుర్తుకు వచ్చాయి అని జగదీష్ అంటే మనకి ఆ పాత రోజులు మళ్లీ వస్తాయంటావా అంటుంది లీలావతి. తప్పకుండా అక్క కావాలంటే చూడు కృష్ణ మనందరినీ కారులో ఆ పాత ఇంటికి తీసుకొని వెళ్తాడు అంటుంది మహేశ్వరి. అంతలోనే ఆటోలో దిగిన మనో ని చూసి షాక్ అవుతుంది మహేశ్వరి. ఈ డ్రెస్ ఏంటి అని కొడుకుని అడిగితే మనకి ఏ అడ్రస్సు లేనప్పుడు ఈ డ్రెస్సే ఆధారం అవుతుంది అంటాడు మనో.
మాకు ఏమీ అర్థం అవట్లేదు అంటారు వాళ్ళు. ప్రముఖ మ్యాగజైన్ కవర్ మీద బెస్ట్ బిజినెస్మెన్ అవార్డుతో ఫోటో పడిన మనోహర్, కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన మనోహర్ ఇప్పుడు ఆటో నడుపుతున్నాడు అంటాడు మనో. అంటే నువ్వు ఆటో నడుపుతున్నావా అంటుంది మహేశ్వరి. నిన్ను ఇలా చూస్తామనుకోలేదు అంటుంది లీలావతి. కొందరి మనుషుల్ని చూసినప్పుడు ఇలా ఉంటారా అని నేను కూడా ఊహించలేదు అంటాడు మనో.
ఖాకి డ్రెస్ లో నిజాయితీ ఉందంటున్న కృష్ణ..
ఏంట్రా నువ్వు అనేది హనీ మహేశ్వరి అంటే తన ఫ్రెండ్స్ మాట్లాడిన మాటలన్నీ చెప్తాడు మనో. నిన్ను ఇలా చూడ్డానికి బ్రతుకుంది మంచి వాళ్ళకి రోజులు లేవు అంటుంది మహేశ్వరి. కష్టపడుతున్నప్పుడు ఏ పని అయితే ఏముంది అత్తయ్య ఈ కాకి డ్రెస్ లో నిజాయితీ ఉంది అంటుంది కృష్ణ. అందరూ మన మీద పడ్డారు నందలి నిజాలు అనుకుంటున్నారు. వీడికి జాబ్ ఇస్తే ప్రాబ్లంలో విరుక్కుంటామని భయపడుతున్నారు మనో.
ఈ కాకి డ్రెస్ ఖరీదైన సూటుగా మార్చే ప్రయత్నం మీ అబ్బాయి తప్పకుండా చేస్తారు అంటుంది కృష్ణ. ఏమగాడికైనా తన భార్య అందించే సహకారమే ఎక్కువ నమ్మకాన్ని ఇస్తుంది. ఏ మగాడైనా పూర్తిగా నమ్మగలిగేది కన్నతల్లిని కట్టుకున్న భార్యని అంటుంది మహేశ్వరి. నిజమే హర్ష కన్నతల్లిని నన్ను నమ్మలేదు కట్టుకున్న భార్య అతన్ని నమ్మలేదు చివరికి ఎటు కాకుండా పోయాడు అని బాధపడుతుంది లీలావతి. హర్ష మంచివాడే అత్తయ్య, మా అక్క వాళ్ళ మనసు చెడి అలా దారి తప్పడు మనమే అతని దారిలో పెట్టాలి అంటుంది కృష్ణ.
హర్ష మీద కోపంతో జగదీష్..
దారిలో పెట్టలేనంత దారి తప్పడు వాడు అంటూ కోప్పడతాడు జగదీష్. వాడు సక్రమంగా ఉండి ఉంటే మనకి ఇన్ని సమస్యలు వచ్చావా అంటుంది లీలావతి. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చిన మనో ఇలా ఆటో నడపాల్సిన పరిస్థితి వచ్చేదా? మహేశ్వరి చెప్పినట్లు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే సగం సమస్యలు సమసిపోతాయి అంటుంది లీలావతి. కృష్ణ నువ్వు కోడలుగా రావడం మా అదృష్టం అంటూ ఆమెని దగ్గరికి తీసుకుంటుంది మహేశ్వరి.
నువ్వు మా వెనక ఉంటే అష్టలక్ష్మిలు మా దగ్గర ఉన్నట్లే ఉంది అని మహేశ్వరి అంటే ఈ ఆనందం ఎప్పటికి మీ దగ్గరే ఉండేలా చూస్తాను అంటుంది కృష్ణ. మాకు ఆడపిల్లలు లేరు ఇన్నాళ్లు ఆ లోటు వర్షం ద్వారా తీర్చుకున్న ఇప్పుడు నీ ద్వారా తీర్చుకుంటున్నాం నువ్వు మా బిడ్డవే అంటుంది లీలావతి. సూర్య గురించి ఏమైనా తెలిసిందా అని జగదీష్ అడిగితే మేము ఆవేశంగానే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము కానీ అక్కడ ఏ క్లూ దొరకలేదంట అంటాడు మనో.
Intiki Deepam Illalu January 18 Today Episode: అంత డబ్బు మన దగ్గర లేదంటున్న మనో..
ఏం జరిగిందో మనకి తెలియాలి కదా అంటుంది మహేశ్వరి పోనీ స్పెషల్ టీం ను పెట్టి వెతికిద్దామా అని జగదీష్ అంటే దానికి చాలా ఖర్చవుతుంది పెదనాన్న అంటాడు మనో. మనమే వీలైనంత చోట్ల విచారిద్దాం ముందు వర్షిణి కి ధైర్యం చేద్దాం అంటుంది కృష్ణ. తరువాయి భాగంలో చేసుకుని వాళ్ళకి చేసుకున్నంత నా ఉసిరి తగిలే మీరందరూ ఇలా దిగజారిపోయారు అంటుంది రాశి. అక్క, అత్తయ్య వాళ్ళతో మాట్లాడడం ఇలాగేనా అంటుంది కృష్ణ.
ఏంటి మాట్లాడుతున్నావు దిక్కుమక్కు లేని దాన్ని తీసుకొచ్చి మా అమ్మ ఎంగిలి మెతుకులు పడేసింది నువ్వు కుక్కలాగా ఏం మాట్లాడకుండా పడి ఉండు అంటుంది రాశి . కృష్ణ నా కోడలు తనని ఏమైనా అన్నావంటే నీ స్వరపేటిక తెగిపోతుంది జాగ్రత్త అంటూ హెచ్చరిస్తుంది మహేశ్వరి.