Intiki Deepam Illalu January 19 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో హర్ష,హారిక ని బాగా నమ్ముతున్నాడు. ఆడదానికి మగాడిని బుట్టలో వేయడం అనేది పుస్తకం ఇచ్చి నేర్పించక్కర్లేదు తను హర్ష ని బాగా మానిప్లేట్ చేసింది. నాలాగా గొర్రెవి అవ్వద్దు అని డైరెక్ట్ గా చెప్పినా నమ్మడు. అందుకే రాశిని ఒప్పించి, మెప్పించి హర్ష ని డిస్టర్బ్ చేసి హారికతో నిజం కక్కిస్తాను. టార్గెట్ ఫిక్స్, ఆపరేషన్ రాశి స్టార్ట్ అనుకుంటాడు రాఖి.

కృష్ణతో తన కష్టాన్ని చెప్పుకుంటున్న వర్షిణి..

మరోవైపు సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది వర్షిణి. కృష్ణ వదిన కి ఫోన్ చేస్తే బాగుండు సూర్య గురించి ఏమైనా తెలిసిందేమో చెప్పింది అని కృష్ణకి ఫోన్ చేసి అడుగుతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి వచ్చాము కానీ వాళ్ళు కూడా వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడున్నావ్ అన్నయ్య వచ్చేస్తాడు నువ్వేమీ కంగారు పడకు, ముందే నీరసంగా ఉన్నావు పస్తులుండదు టైంకి తిను అని చెప్తుంది కృష్ణ.

మీ అత్తయ్య సూటిపోటి మాటలతో బాధపెడుతూ ఉంటారు అందుకే బట్టలు సర్దుకొని ఉండు నిన్ను తీసుకొని వచ్చేస్తాను అంటాడు మనో. సూర్య వచ్చేంత వరకు నేను ఎక్కడికి రాను తను వచ్చిన తర్వాత మేమిద్దరం శాశ్వతంగా వచ్చి అక్కడే ఉండిపోతాం అంటుంది వర్షిణి. నువ్వుంటే సూర్య కూడా ఇక్కడికే వస్తాడు అని మనో అంటే ఒకవేళ సూర్య ఎక్కడికి వస్తే అప్పుడు నేను ఇక్కడ లేకపోతే తను ఫీల్ అవుతాడు.

వర్షిణి మీద కేకలు వేస్తున్న దమయంతి..

సూర్య లేకపోవడంతో నాకు దిక్కు తోచటం లేదు ఏ పని చేసినా తనే గుర్తొస్తున్నాడు. సూర్య ఎక్కడికి వెళ్ళినా నాతో మాట్లాడకుండా ఉండడు అలాంటిది ఎన్ని రోజులైనా తను నాకు ఫోన్ చేయలేదు అంటే కంగారుగా ఉంది అంటూ ఏడుస్తుంది వర్షిణి. నువ్వేమీ కంగారు పడకు సూర్య ని వెతికి నేను తీసుకొని వస్తాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెల్లెలికి ధైర్యం చెప్తాడు మనో.

అప్పుడే అక్కడికి వచ్చిన దమయంతి ఇందాకనగా కూరగాయలు తరగమన్నాను ఇప్పుడు వచ్చి తరగలేదు, వంట ఎలాగు అవుతుంది అనుకున్నావు మీ వాళ్ళతో మాట్లాడడానికి ఇప్పటివరకు టైం లేదా, అయినా తేరగా తిని కూర్చోటానికి నీ బాబు గారి సొమ్ము ఏమి లేదు నీ మొగుడు కూడా అప్పులే మిగిల్చి పోయాడు అంటుంది దమయంతి. నేనేమీ సరదాలు మాట్లాడుకోవడానికి మా అన్నయ్యకి ఫోన్ లేదు అంటూ కేకలు వేస్తుంది వర్షిణి.

అహంకారం ప్రదర్శిస్తున్న దమయంతి..

నువ్వు ఎందుకు చేసావు అని అడగడం లేదు, నువ్వు తేరగా తిని కూర్చోవడానికి ఇది నీ ఇల్లు కాదు ఇది నా ఇల్లు నా సొమ్ము. ఇక్కడ ఉండాలంటే నేను చెప్పిన పని చేయాల్సిందే, కాదు కూడదు అంటే మీ అన్నయ్య చెప్పినట్లు పెట్టి పట్టుకుని బయలుదేరు అంటుంది దమయంతి. నేనేమీ గతిలేక ఇక్కడ ఉండటం లేదు నా సూర్య వచ్చాక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను. మీకు మా మీద,మా వాళ్ల మీద పడి ఏడవటంతోనే సరిపోయింది.

నాకెందుకో సూరి అని మీరే దాచేసారు అనిపిస్తుంది తను వస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి అంటుంది వర్షిణి. వాడిని దాచేసి నీతో మాటలు పడాలని నాకు లేదు అంటుంది దమయంతి. సూర్య వచ్చాక మీ విషయం తేల్చుకుని మేమే దూరంగా వెళ్లిపోతాం అంటూ కోపంగా వెళ్ళిపోతుంది వర్షిణి. నువ్వు తేల్చుకుంటావో నేను తేల్చుకుంటాను వాడిని రాని అయినా ఎక్కడ చచ్చాడో ఏంటో దీన్ని నా నెత్తికి అంటగట్టాడు అని తిట్టుకుంటుంది దమయంతి. మరోవైపు కుట్టిన పోలని ఎక్కడ తీసుకువెళ్లాలి అంటుంది మహేశ్వరి.

గిల్టీగా ఫీల్ అవుతున్న జగదీష్..

సనత్ నగర్ అంటుంది లీలావతి. అక్కడికి వెళ్లాలంటే చాలా దూరం నడుచుకొని వెళ్లలే మనోని ఆటో మీద తీసుకెళ్లమందం అంటే కిరాయి ఉందని పొద్దున్నే వెళ్ళిపోయాడు అంటుంది లీలావతి. తను మన కోసం చాలా కష్టపడుతున్నాడు వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఆటోలో తీసుకెళ్తామంటే మన దగ్గర డబ్బులు కూడా లేవు నడుస్తూనే తీసుకెళ్లాలి అంటుంది లీలావతి. సరే అని మహేశ్వరి అంటే ఏంటి నువ్వు మోసుకొస్తావా అంటుంది లీలావతి. తప్పేముంది అలా నడుచుకొని వస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటుంది లీలావతి.

అంతలోనే వచ్చిన కృష్ణని పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయావు అంటుంది. తను పనిచేసిన ఇంట్లో వాళ్ళు ఇచ్చిన టిఫిన్ ని తనే కొన్నట్లుగా చెప్తుంది కృష్ణ. అప్పుడే వచ్చిన జగదీష్ కి పెట్టమంటుంది మహేశ్వరి. మరి మీరు అని అడుగుతుంది కృష్ణ. మేము తింటే ఎక్కువ దూరం నడవలేవమ్మా పూలు ఇచ్చి వచ్చాక తింటాము అంటారు లీలావతి వాళ్ళు. జగదీష్ కి టిఫిన్ తీస్తే మీరందరూ కష్టపడుతుంటే నేను తిని కూర్చోవాలా అంటూ బాధపడతాడు. ఒకప్పుడు మీరు కష్టపడ్డారు ఇప్పుడు మేం కష్టపడుతున్నాము అందులో తప్పేముంది అంటుంది కృష్ణ.

వర్షిణి మీద నిందలు వేస్తున్న దమయంతి..

మీరు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఏ పని చేయట్లేదు. మేము అనారోగ్యంతో ఉంటే మాత్రం చేస్తామా అంటూ మామ గారికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి బయలు దేరుతారు కృష్ణ వాళ్ళు. మరోవైపు సూర్యుని చూస్తూ ఏడుస్తుంది వర్షిణి. అది చూసిన దమయంతి అలా ఏడుస్తూ కూర్చుంటే నా కొడుకు వచ్చేస్తాడా? ముందే నా మాట విని ఉంటే బాగుపడేవాడు. కాశీ కోసం అడిగితే నన్ను రాక్షశి లాగా చూసి నానా మాటలు అన్నారు.

ఈరోజు ఆ డబ్బే ఉండి ఉంటే మిలటరీ ఫోర్స్ తెప్పించి నా కొడుకుని వెతికించి ఉండేదాన్ని. అయినా మీకు లేని బుద్ధి నాకెందుకు నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఇంట్లో పని అంతా ఎవడు చేస్తాడు లేచి పని చూడు అంటూ కేకలు వేస్తుంది దమయంతి. అప్పుడే వచ్చిన రాసి అయినా అన్నయ్య కైనా బుద్ధి ఉండాలి కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఏంటి? ప్రతిదానికి పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగి ఇలా ఇంతవరకు తెచ్చుకున్నాడు. ఎప్పుడైనా మన మాట వింటే కదా అంటుంది.

రాశికి వార్నింగ్ ఇస్తున్న వర్షిణి..

ఇంకొక మాట మీ అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటుంది వర్షణి. ఊరుకోకపోతే ఏం చేస్తావ్, నీవల్లే వాడికీ గతి పట్టింది అంటుంది దమయంతి. నీ మొహం చూడలేక వాడు ఇంట్లోంచి వెళ్లిపోయాడు అంటుంది రాశి. ముందు మీ ఇంటి నుంచి నువ్వు బయటికి పో నీకు వస్తుంది బుద్ధి అంటుంది వర్షిణి. నన్ను అలా ఆడిపోసుకోవడం వల్లే మీ వాళ్ళందరూ రోడ్డు మీదకు వచ్చారు, మీ చిన్నఅన్నయ్య కి బుద్ధి రావాలని ఇప్పుడు గుడికి వెళుతున్నాను అంటుంది రాశి.

నువ్వు ఆ ఇంట్లో ఉండగా అక్కడ ప్రశాంతత లేదు ఎక్కడ ఉంటే మాకు ప్రశాంతత లేదు అంటుంది వర్షిణి. సూర్య గాడు మీకు ఇచ్చిన జలుబుతోనే నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు అంటూ కోడల్ని తిడుతుంది దమయంతి. దీంతో నాకు మాటలు ఏంటి నేను గుడికి వెళ్లి వస్తాను అంటుంది రాసి. అవతలి వాళ్ళు మారాలి అని దేవుడికి దండం పెట్టుకునే బదులు మనకి ఆ బుద్ధి ఉండాలని తెలుసుకుంటే బాగుంటుంది అంటుంది వర్షిణి. ముందు దీని ఆటలు కట్టించాలి అనుకుంటుంది దమయంతి.

భయంతో వణికిపోతున్న కృష్ణ..

మరోవైపు పూలు కొట్టుకి పూలు తెచ్చిస్తారు మహేశ్వరి వాళ్ళు. అంతలోనే అక్కడికి కృష్ణ పనిచేస్తున్న ఇంటావిడ వస్తుంది. ఆవిడని గమనించిన కృష్ణ ఆవిడ నుంచి తప్పించుకోబోతుంది కానీ ఆవిడకి దొరికిపోతుంది కృష్ణ. నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ కి నిన్ను రికమెండ్ చేశాను వాళ్ళింట్లో పని చేస్తావా నెలకి 3000 ఇస్తారు అంటుంది. మహేశ్వరి వాళ్ళు ఎక్కడ ఉంటారు అని టెన్షన్ పడుతుంది కృష్ణ.ఈ మాటలన్నీ వింటున్న రాసి కృష్ణ ఇంటి పనులు చేస్తుందా అని అనుకుంటుంది.

పూలు కొలుస్తున్న లీలావతి వాళ్ళని చూసి వీళ్ళు పూలు అనుకుంటున్నారా నేను చూస్తున్నది నిజమేనా అంటూ ఆనందంగా పాట పాడుకుంటూ భలే మంచి టైం కి వచ్చాను అనుకుంటుంది. కృష్ణని చూసిన రాసి ఏమీ తెలియనట్లుగా ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఆవిడ ఎవరు అని రాశి అడిగితే తెలిసినావిడ అంటుంది కృష్ణ. ఎంత తెలిసిన ఆవిడ మా ఇంటికి వచ్చి పాచి పనులు చేసి పెట్టు అనేంత తెలిసినవిడా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.

Intiki Deepam Illalu January 19 Today Episode: పైశాచిక ఆనందాన్ని పొందుతున్న రాశి..

వేరే దారి లేక ఈ పని ఒప్పుకున్నాను అందులో తప్పేముంది అంటుంది కృష్ణ. మీకు పరువు ప్రతిష్ట ఆత్మ అభిమానం ఆవకాయ తొక్క ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని అటకెక్కించేశారా అంటుంది రాశి. నేను ఈ పని చేస్తున్నట్టు ఇంట్లో తెలీదు అంటుంది కృష్ణ. ఇంట్లో ఎవరికీ తెలీదా అయితే ఈ విషయం అర్జెంటుగా వాళ్లకి తెలియాలి అంటూ కృష్ణ లాక్కొస్తుంది. అత్తయ్య వాళ్ళకి చెప్పకు అసలే తన ఆరోగ్యం బాగోలేదు అని ఎంత బ్రతిమాలిన వినిపించుకోదు.కృష్ణని లాక్కు రావడం గమనించిన లీలావతి వాళ్లు ఏం జరిగిందో కనుక్కుందామని రాశి దగ్గరికి వెళ్తారు.

ఏం జరుగుతుంది కృష్ణ అని మహేశ్వరి అడిగితే నేను చెప్తాను అంటుంది రాశి. తరువాయి భాగంలో నా ఉసిరి దగ్గరే మీరు ఇలా దిగజారి పోయారు అని రాసి అంటే అత్తయ్య వాళ్ళతో అలాగేనా మాట్లాడడం అంటుంది కృష్ణ. నువ్వు ఒక అనాధవి మేం పెట్టిన భిక్ష తో బ్రతికావు అని రాశి అంటే ఇంకొక మాట నా కోడలు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంటుంది మహేశ్వరి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 19, 2023 at 11:44 ఉద.