Intiki Deepam Illalu January 2 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో క్యారేజీలో అన్నం ఖాళీ అయిపోవడంతో అత్తని నిలదీస్తుంది వర్షిణి. నేనే తిన్నాను అయితే ఏంటి నా కొడుకు సంపాదన నువ్వు మీ అమ్మ తప్పితే నేను తినకూడదా ఉంటుంది దమయంతి. మీరు ఇలా చేస్తారని చేస్తే వంట చేయటం మానేసి హోటల్ నుంచే క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోయే దాన్ని.
అత్త ఆడ పడుచులకి చీవాట్లు పెట్టిన వర్షిణి..
మీరు పురుగుల కంటే హీనం అంటే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వర్షిణి. మరోవైపు పూల కొట్టు దగ్గరికి లేటుగా వచ్చిన లీలావతిని కసురుకుంటుంది వాళ్ళ హౌస్ ఓనర్. త్వరగా తెమ్మని చెప్పాను కదా అయినా లేట్ ఎందుకు అయింది రేపు పూల ఆర్డర్ ఉంది. నేను వెళ్లి పువ్వులు తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైనా చూస్తే పువ్వులు అమ్ము అంటుంది ఆవిడ. అలాగే అన్న లీలావతి దగ్గరికి పూలు కొనడానికి వస్తారు ఆమె ఫ్రెండ్స్.
అక్కడ లీలావతిని చూసి షాక్ అవుతారు. జనాల్ని మోసం చేద్దాం అంటే బ్రతుకులు ఇలాగే ఉంటాయి ఇక్కడ పూలు కొంటే ఆ పాపం మనకి తగులుతుంది అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
హాస్పిటల్ వాళ్లకి నా నెంబరు ఇచ్చానని చెప్పావు కదా వాళ్ళు డబ్బులు కట్టమని గట్టిగా అడుగుతున్నారు వెంటనే వెళ్లి కట్టి రండి అంటుంది ఆ హౌస్ ఓనర్. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం ఎలా కట్టడమో ఏంటో అని బాధపడుతుంది లీలావతి.
తల్లిని ఓదార్చుకున్న వర్షిణి..
మరోవైపు తల్లి దగ్గరికి వచ్చిన రాలేదు ఎందుకు ఇంకా రిలీజ్ అవ్వలేదా అని అడుగుతుంది మహేశ్వరి. అందరూ ఆ ప్రయత్నంలోనే ఉన్నారు నువ్వేమీ కంగారు పడకు అంటుంది వర్షిణి. జ్యూస్ తాగమంటే వద్దంటుంది మహేశ్వరి. నేను హాస్పిటల్లో ఉన్నందుకు కృష్ణ ఎంత బాధ పడుతుందో అంటుంది మహేశ్వరి. హాస్పిటల్లో ఉన్నావని వదిన పెద్దమ్మ వాళ్ళు చాలా బాధపడుతున్నారు,వాళ్ళు బాధపడకుండా ఉండాలంటే నువ్వు ఈ జ్యూస్ తాగు అని ఒక్కొక్కరి పేరు చెప్పి జ్యూస్ తాగిస్తుంది వర్షిణి.
వర్షిణి వాళ్ళ అత్తింటి వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతుంది మహేశ్వరి. వాళ్లు ఎవరూ నిన్ను చూడడానికి రారు నువ్వే అందరి గురించి ఆలోచిస్తూ ఇలా మంచాన పడ్డావు అంటుంది వర్షిణి. ఒక హాస్పిటల్ కి వెళ్తే మరొక హాస్పిటల్ కి అక్కడి నుంచి ఇంకొక హాస్పిటల్ కి హారికని తిప్పిస్తూ ఉంటాడు అగంతకుడు. నిజంగా హర్షాయి చేస్తున్నాడేమో అనుకొని కంగారు పడిపోతూ అన్ని హాస్పిటల్స్ కి తిరుగుతుంది హారిక. చివరికి తను ఉన్న దగ్గరికి రప్పించుకుంటాడు ఆ అగంతకుడు.
అగంతకుడు ఎవరో తెలుసుకొని షాక్ అయిన హారిక..
అక్కడ అతన్ని చూసిన హారిక షాక్ అవుతుంది. నువ్వు అంటూ ఆలోచనలో పడుతుంది హారిక. నేను రాఖి ని ఎక్స్ లవర్ ని మర్చిపోయావా అంటాడు రాఖీ. నువ్వు మర్చిపోయిన నేను మర్చిపోను ఎందుకంటే నువ్వు ఇచ్చిన హ్యాండ్ ని ఎలా మర్చిపోతాను? నా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేసావ్, నన్ను వద్దనుకున్న అమ్మాయిని వెంటపడ్డావెందుకు అని అనుకున్నాను కానీ నిన్ను కాకుండా వేరే అమ్మాయిని ఇష్టపడటానికి నా మనసు ఒప్పుకోలేదు, కానీ మనసు మాట వినదు కదా అది నువ్వే కావాలని చెప్పింది.
నువ్వు నా గుండె గుడిలోకి రాకపోయినా అంత బాధ పడే వాడిని కాదు కానీ నా గుండెని బద్దలుకొట్టేసావు నువ్వు. మనసు మారటానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం నీకు ఇవ్వటం కోసం నేను అమెరికా వెళ్లాను కానీ నేను అట్నుంచి వచ్చేసరికి నువ్వు ఎవరితోనో రిలేషన్ లో తట్టుకోలేకపోయాను. వాళ్లే పెళ్లి చేసుకుందాం అని తెలిసి భరించలేకపోయాను. గుడి కట్టినవాడు బాధపడుతుంటే గుడిని కూల్చేసిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు కదా అంటాడు రాఖి.
హారిక కి చెమటలు పట్టిస్తున్న రాఖి..
అంటే ఇన్నాళ్లు నాకు ఫోన్ చేసి బెదిరిస్తుంది నువ్వేనా అంటుంది హారిక. నిజం తెలుసుకున్నందుకు థాంక్స్ అంటాడు రాఖీ ఆ మాటకి షాక్ అవుతుంది హారిక.నిన్ను హ్యాపీగా ఉంచుకోకూడదు ఇదే నా డ్యూటీ అంటాడు రాఖి. అంటే నాకు ఫోన్ చేసింది నువ్వేనా అంటుంది హారిక. అవును అంటాడు రాఖి. అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని ఇది హర్ష ఫోను తనని ఏం చేశావు అంటూ కంగారుగా అడుగుతుంది హారిక. పరిచయం చేసుకొని మంచి పార్టీ ఇద్దాం అనుకున్నాను. ఓవర్ డోస్ వేసుకొని ఇంకా మత్తులోనే ఉన్నాడు అంటాడు రాఖి.
ఇప్పుడు హర్ష ఎక్కడ ఉన్నాడు అని అడిగితే నీ హస్బెండ్ నీ దగ్గరే ఉంటాడు. చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికారు అంట నీలాంటి వాళ్ళు,సి యు అగైన్ అంటూ వెటకారంగా నవ్వుతూ వెళ్ళిపోతాడు రాఖి. హర్ష ఎక్కడున్నాడో చెప్పమని బ్రతిమలాడిన చెప్పడు. చంకలో మేక పిల్లని పెట్టుకొని వెతుకుతున్నావు అని రాఖీ మాటలు గుర్తొచ్చి తన కార్ డిక్కీ ఓపెన్ చేస్తుంది హారిక అందులో ఉన్న హర్షను చూసి షాక్ అయిపోతుంది.
చెల్లెలికి చివాట్లు పెడుతున్న సూర్య..
మరోవైపు కారణం చెప్పకుండా రాశిని బయటికి వెళ్దాం త్వరగా రా అంటుంది దమయంతి. ఎదురుగా వచ్చిన సూర్య పెళ్లికి వెళుతున్నట్టుగా రెడీ అయి వెళ్తున్నారు ఎక్కడికి అని అడుగుతాడు. శుభవాని బయటకు వెళ్తుంటే అలా అడుగుతావేంట్రా అంటుంది దమయంతి. మీరు నిజం చెప్పి ఉంటే నేను అడిగేవాడిని కాదు కదా అంటాడు సూర్య. నీకు అన్నీ చెప్పాలా మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అంటుంది దమయంతి.
అన్నిటికీ నీ పర్మిషన్ తీసుకోవాలా అని రాసి అడిగితే నీకు సిగ్గుందా అని రాశిని తిడతాడు సూర్య. మీ అత్తింటి వాళ్ళు అన్ని కష్టాల్లో ఉంటే నువ్వు ఏమి పట్టనట్టుగా తిరుగుతున్నావు ఏంటి? అమ్మ కంటే బుద్ధి లేదు నీ బుద్ధికి ఏమైంది. ఒకసారి కూడా జైలుకు వెళ్లి మీ మామగారు వాళ్ళని పలకరించలేదు, మీ పిన్ని అత్తగారు హాస్పిటల్ లో ఉన్నారు ఆవిడ దగ్గరికి కనీసం వెళ్లి చూడలేదు ఎప్పటికైనా మీరందరూ కలిసి ఉండవలసిన వాళ్ళు. అందరి ముందు నీకు నువ్వే చులకనయ్యలాగా ప్రవర్తిస్తున్నావ్.
అంత కర్మ నాకు లేదంటున్న రాశి..
వాళ్ల గురించి పట్టించుకోకుండా నువ్వు ఇక్కడ ఉంటే నీకు విలువ ఉండదు. నువ్వు వస్తానంటే చెప్పు నేను వెళ్లి నిన్ను దిగబెడతాను అంటాడు సూర్య. వాళ్ళు చేసుకున్న దానికి వాళ్లు అనుభవిస్తున్నారు నేనెందుకు వాళ్ల కోసం ఆలోచించాలి అంటుంది రాశి. చదువుకున్న దానివి నువ్వు ఇలాగే ఆలోచిస్తావా అంటాడు సూర్య. చదువుకున్న దాన్ని తెలివైన దాన్ని కాబట్టే ఇలా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వెళ్తే వాళ్ళకి సేవలు చేయాలి అంత కర్మ నాకు ఏమీ పట్టలేదు.
అయినా వాళ్ల కన్నీళ్లు తుడవడానికి నీ ముద్దుల పెళ్ళాం ఉంది కదా మళ్లీ నేనెందుకు అంటూ కోపంగా అక్కడి నుంచి తల్లిని తీసుకొని వెళ్ళిపోతుంది రాశి. వాళ్లు ఎక్కడికి వెళుతున్నారో ఎంత ఆలోచించినా సూర్య బుర్రకి తట్టదు. మరోవైపు పూలు మోసుకొస్తున్న లీలావతిని అంత బరువు మీరెందుకు మోసుకొని వచ్చారు అంటుంది కృష్ణ. బరువు ఎవరికైనా బరువే పూలు ఆర్డర్ వచ్చాయంట పొద్దున కన్నా గుచ్చి ఇచ్చేయమన్నారు అంటూ కృష్ణ చేతిలో చాలా డబ్బు పెడుతుంది లీలావతి. ఇంత డబ్బు మీకు ఎక్కడిది అంటుంది కృష్ణ. లీలావతి సమాధానం చెప్పకపోవడంతో ఆమె బోసి చేతిని చూసి గాజులు అమ్మేశారా అంటుంది.
Intiki Deepam Illalu January 2 Today Episode: లీలావతి చేసిన పనికి షాక్ అయిన కృష్ణ..
అవును ఒక్కొక్కసారి మనుషుల కన్నా అవే నయం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాయి అంటుంది లీలావతి. హాస్పిటల్లో ఉన్న మహేశ్వరుని చూస్తే చాలా బాధగా ఉంది అంటుంది లీలావతి. మనోగాని వాళ్ళని చూసిన కూడా అలాగే ఉంది అత్తయ్య ఎలాగైనా వాళ్ళని విడిపించే ఏర్పాట్లు చేయాలి అంటుంది కృష్ణ. సరే వాళ్ళందరినీ చూడడానికి వెళ్దాం అంటూ అత్తా,కోడలు ఇద్దరు బయలుదేరుతారు. తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన హర్షని నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటుంది హారిక. ఎందుకు అబద్ధం చెప్పటానికా? నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నావ్, నువ్వు బ్రతకడానికి వీల్లేదు అంటూ ఆమె తలకి గన్ గురి పెడతాడు హర్ష.