Intiki Deepam Illalu January 23 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న కృష్ణని అలాగే చూస్తుంది మహేశ్వరి. అలా చూస్తున్నారు ముగ్గు బావుందా అని అడుగుతుంది కృష్ణ. నీకు తెలియదేమో పెళ్లి అవ్వకముందు ఇలాంటి ముగ్గు మీ ఇంటి ముందు వేస్తుంటే చూశాను అప్పుడే అనుకున్నాను నువ్వే మా ఇంటి కోడలివి అని. ఇంటి ముందు ముగ్గు చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు అంటుంది మహేశ్వరి.
కృష్ణని అనుమానిస్తున్న మహేశ్వరి,లీలావతి..
ఇంతకుముందు నాకు ఇలాంటి అవకాశం మీరు ఇవ్వలేదు అంటుంది కృష్ణ. ఏం చేస్తావ్ అప్పుడు మన ఇంటి నిండా నౌకర్లే ఉండేవారు నా ఇంటి కోడలు ముగ్గు వేయడం ఏంటా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అవన్నీ తారుమారు అయిపోయాయి అంటుంది మహేశ్వరి. మావయ్య గారికి పొద్దున్నే కాఫీ పడకపోతే ఇబ్బంది పడిపోతారు అంటూ టాపిక్ మార్చేస్తుంది. కాఫీ పెట్టడానికి వెళ్లిన మహేశ్వరిని చూస్తూ నేను వేరే వాళ్ళ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నాను అని తెలిస్తే అత్తయ్య గారు ఇంకా ఎంత బాధ పడతారో అనుకుంటుంది కృష్ణ.
ఇంతలో ఫోన్ రింగ్ కావడంతో ఫోన్ లిఫ్ట్ చేయబోయిన మహేశ్వరి దగ్గర ఫోన్ లాక్కొని నాకోసమే ఫోన్ అంటుంది కృష్ణ. మాట్లాడు అని మహేశ్వరి అంటే వెళ్తూ వెళ్తూ మాట్లాడతా అని వెళ్ళిపోతుంది కృష్ణ. అదేంటి అంతకంగారుగా వెళుతుంది అని అనుమాన పడతారు లీలావతి, మహేశ్వరి. మరోవైపు మళ్లీ కృష్ణ కి ఫోన్ చేసిన వాళ్ల ఓనరు త్వరగా పనుంది రమ్మన్నాను కదా అంటుంద. వచ్చేస్తున్నాను అమ్మ అంటూ కంగారుగా బయలుదేరుతుంది కృష్ణ.
మేనేజర్ ని చూసి టెన్షన్ పడిన హారిక..
మరోవైపు పూలావిడ వచ్చి పూలదండలు రెడీ అయిపోయాయా అంటూ లీలావతిని అడుగుతుంది. అన్ని సిద్ధమైపోయాయి అని లీలావతి అంటే వాళ్ళ ఇంట్లో వ్రతం త్వరగా తెమ్మన్నారు అంటూ అడ్రస్ ఇస్తుంది హౌస్ ఓనర్. బావగారు డ్యూటీ కి వెళ్లడానికి లేటవుతుంది నువ్వు వంట చేసి క్యారేజీ కట్టు నేను ఈ పువ్వులు ఇచ్చి వస్తాను అంటూ బయలుదేరుతుంది మహేశ్వరి. మరోవైపు ఇంటికి వచ్చిన మేనేజర్ ని చూసి షాక్ అవుతుంది హారిక.
కంగారుగా అతన్ని ఇంటి బయటకి లాక్కెళ్ళి నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని తెలియదా అంటూ కేకలు వేస్తుంది హారిక. మను నీకోసం వెతుకుతున్నాడు దొరికితే చంపేస్తాడు అంటుంది హారిక. కొంచెం డబ్బు అవసరమై ఇలా వచ్చాను అంటాడు మేనేజర్. నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాను కదా అని హారిక అంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని యావలో ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టాను మొత్తం డబ్బులు పోయాయి ఇప్పుడు డబ్బులు అవసరము అంటాడు అతను.
మేనేజర్ ని బెదిరించిన హారిక..
ఇప్పుడు ఇవ్వకపోతే మళ్లీ వస్తాడు అనుకుంటూ 20 లాక్స్ కి చెక్కించి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. మళ్లీ వస్తే మనుషుల్ని పెట్టి చంపించేస్తాను అని బెదిరిస్తుంది. అక్కడ నుంచి బయలుదేరిన మేనేజర్ లక్ష రెండు లక్షల ఇస్తుంది అనుకున్నాను కానీ ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చింది అని సంతోషపడుతూ ఆ చెక్ ని జేబులో పెట్టుకుంటాడు. మనో కి దొరికిపోతాను అని భయంతో మొహానికి గుడ్డకట్టుకుంటాడు మేనేజర్. కరెక్ట్ గా మనో ఆటోని ఆపుతాడు. మేనేజర్ ని మనో గుర్తుపట్టడు కానీ మేనేజర్ మాత్రం మనోని గుర్తుపట్టి పారిపోతాడు.
ఆ కంగారులో అతని జేబులో చెక్ జారిపోతుంది. మీ జేబులో నుంచి ఏదో పేపర్ పడిపోయింది అని మనో ఎంత అరిచినా వినిపించుకోడు. ఆ చెట్ని చూసిన మను ఇది హారిక సంతకం నన్ను చూసి పరిగెడుతున్నాడు అంటే వీడు వాడే అంటూ మేనేజర్ని వెంబడించి పట్టుకుంటాడు. నన్ను చూసి భయపడి పారిపోతున్నారు ఎందుకు అని అడిగితే భయంతో కాదు సార్ కొంచెం పని ఉంది అందుకే అంటాడు ఆ మేనేజర్. నిజం చెప్పు అని అతనికి నాలుగు తగిలించి నిజం కక్కిస్తాడు మనో. నిజం చెప్పిన మేనేజర్ పారిపోతాడు. నా అనుమానమే నిజమైంది అంటూ హారిక మీద కోపంతో రగిలిపోతాడు.
హారికని నిలదీసిన మనో..
మరోవైపు హర్ష తో పాటు ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతుంది హారిక. మేనేజర్ ని హర్ష కంటపడకుండా పంపించేసాను అని సంతోష పడుతుంది. అంతలోనే అక్కడికి వచ్చిన మనోని చూసి ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఆటోమొబైల్ కంపెనీ నుంచి ఆటో నడుపుకునే స్థాయికి దిగజారి పోయాడు అంటే డబ్బులు అడగడానికి వచ్చుంటాడు అనుకుంటుంది హారిక.
బయటికి మాత్రం మీ తమ్ముడు ఇప్పుడే వెళ్లిపోయారు మీరు లోపలికి రండి అంటుంది హారిక. కోపాన్ని ఆపుకోలేని మన చేతిలో ఉన్న గ్లాసు విసిరేస్తాడు నా మీద చేయి చేసుకుంటారేంటి అని హారిక అంటే నోరు ముయ్యి నా అనుమానమే నిజమైంది నీకు మేము ఏ ద్రోహం చేశామని మా జీవితాలతో ఆడుకున్నావు ఎందుకు మా మీద క్లబ్ సాధిస్తున్నావ్ అంటూ నిలదీస్తాడు మనో. నేను నీ మీద పక్ష సాధించడమేంటి అంటే మేనేజర్ కి ఇచ్చిన చెక్కిని చూపించి ఎంత డబ్బు మేనేజర్ కి ఎందుకు ఇచ్చావు వాడు నువ్వు చేసినవన్నీ నాకు చెప్పాడు నీలాంటి దాన్ని అసలు క్షమించకూడదు అంటూ హారిక మెడ పట్టుకుంటాడు మనో.
నిజం తెలుసుకుని కుప్ప కూలిపోయిన మనో..
నువ్వు ఆడదానివి అయ్యి బ్రతికి పోయావు నువ్వు ఇలాంటి దానివని తెలియక నా తమ్ముడు నిన్ను గుడ్డిగా నమ్ముతున్నాడు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోబోతుంటే అతని కాళ్లు పట్టుకుంటుంది హారిక. హర్ష గారు నన్ను పెళ్లి చేసుకోవటానికి మీరెవరు అంగీకరించలేరని బాధతో అలా చేశాను, హర్ష గారు నాకు దూరం కాకూడదని స్వార్థంతో అలా చేశాను నన్ను క్షమించండి అంటూ బ్రతిమాలు కుంటుంది హారిక. నీ దొంగ ఏడుపులు నమ్మేంత పిచ్చివాడిని కాదు, నువ్వు ఎంత ఏడ్చినా ఆ దేవుడు నిన్ను కాపాడలేడు అంటూ తనని వదిలించుకుని వెళ్ళిపోబోతాడు మనో.
మీరు అన్నది నిజమే ఆ దేవుడు చేయలేని పనులు కూడా ఈ ఫోన్ చేయగలదు. మీకు నా గురించి నిజం తెలిసిపోయిందని ఆవేశపడుతున్నారు తప్ప మీ గురించి ఎవరికీ తెలియని నిజం ఈ ఫోన్లో ఉందని మీకు తెలియదు అంటూ తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది హారిక. ఆ వీడియో కృష్ణకి యాక్సిడెంట్ అయ్యి అబార్షన్ అయినప్పటిది. యాక్సిడెంట్ కి తెలియ కారణం అని తెలుసుకున్న మన అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. బాధపడుతున్న మనోని చూసి నవ్వుతూ మీరు యాక్సిడెంట్ చేయడం వల్ల మీ భార్య కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది అన్న విషయం మీకు కూడా తెలియదు అది తెలియక మీరు మీ భార్యని అనవసరంగా తిట్టారు.
ఇదంతా నా సేఫ్టీ కోసమే అంటున్న హారిక..
మీ భార్యని ఇంట్లోకి అడుగుపెట్టనివ్వకుండా తనకి నరకం చూపించారు. మీ భార్య మీకు విడాకులు ఇవ్వడం లేదని, మీరే తనని చంపటానికి యాక్సిడెంట్ చేశారని, మీరే తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడానికి కారణమని ఈ వీడియో కోర్టులో సబ్మిట్ చేస్తే మీ మీద మర్డర్ హెడ్ అండ్ కేసు ఫైల్ అవుతుంది మీ జీవితం జైల్లోనే ముగిసిపోతుంది అంటూ బెదిరిస్తుంది హారిక.
మీరు తెలివైన వారు ఎప్పుడో ఒకప్పుడు నా గురించి నిజం తెలుసుకుంటారు అందుకే నన్ను నేను కాపాడుకోవడానికి ఈ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు క్షమించండి. అయినా మీరు కంగారు పడకండి ఈ వీడియోస్ నా దగ్గర తప్పితే ఇంకెక్కడ లేదు సీసీ కెమెరాలో కూడా ఈ వీడియోని డిలీట్ చేయించాను. నా నేను ప్రాణంగా ప్రేమించే భర్త మీద ఒట్టేసి చెప్తున్నాను మీ కన్స్ట్రక్షన్ కూలిపోయేలాగా చేశాను తప్పితే మీ ఇంట్లో బ్లాక్ మనీ పెట్టింది నేను కాదు.
మనోని బ్లాక్ మెయిల్ చేస్తున్న హారిక..
మీరు నా గురించి నిజాన్ని బయటపడితే నా లైఫ్ స్పాయిల్ అవుతుంది కానీ ఈ వీడియో నేను బయటపడితే ఏం జరుగుతుందో తెలుసా మిమ్మల్ని దైవంగా భావిస్తున్న మీ భార్య మిమ్మల్ని అసహ్యించుకుంటుంది. అప్పుడు మీరు ఎంత అడిగినా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోని మీ భార్య ఇప్పుడు అడక్కుండానే విడాకులు ఇచ్చేస్తుంది. కోడలు విషయంలో చిన్న తప్పు జరిగినందుకే కీళ్లు బదులు వెళ్లిపోయిన మీ అమ్మగారు మీరే తన భార్యని చంపడానికి ప్రయత్నించారని తెలిస్తే మీ అమ్మగారు మిమ్మల్ని జన్మలో క్షమించరు. నన్ను పెళ్లి చేసుకున్నందుకే మీ పెదనాన్న గారికి వచ్చింది అలాంటిది మీరు హంతకుడని తెలిస్తే మరి క్షణమే గుండె ఆగి చస్తారు.
సో టోటల్గా మీరు మీ ఫ్యామిలీనే లాస్ అవుతారు అందుకని మీరు నా గురించి చెప్పనంత కాలం ఈ వీడియో నా దగ్గరే ఉంటుంది, చెప్పాలనుకుంటే మాత్రం ఇది మీ వాళ్ళ దగ్గర ఉంటుంది అంటూ మనోని బెదిరిస్తుంది హారిక. బాధతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు మనో. మరోవైపు దమయంతి ఇంటికి వచ్చిన రాఖీని సాదరంగా ఆహ్వానించి మీకు నూరేళ్లు అంటూ సంబరపడిపోతుంది దమయంతి. అప్పుడే వచ్చిన రాసి ఇతను ఏంటి ఆస్తమానం మా ఇంటికి వస్తున్నాడు పని పాట లేదా అనుకుంటుంది. నేను మీ కోసమే వచ్చాను ఆంటీ అంటాడు రాఖి.
కూతుర్ని రాఖి వెంట పంపించిన దమయంతి..
నాకోసమే వచ్చావా అంటూ ఆనంద పడిపోతుంది దమయంతి. అవునంటే మీ అబ్బాయి కనబడలేదని చెప్పారు కదా ఆరోజు పేరు మాత్రమే చెప్పారు నా ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. తనకి సూర్య గురించి కొన్ని డీటెయిల్స్ కావాలని చెప్పాడు. మీరు సూర్య గురించి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పి నేనేమీ అతనికి ఇన్ఫర్మేషన్ చెప్తే ఇన్వెస్టిగేషన్ లేట్ అవుతుంది అందుకే నాతో రాశి పంపించండి అంటాడు రాఖి. మరీ ఎక్కువ చేస్తున్నాడు అనుకుంటుంది రాశి.
రాశి ఒప్పుకునేది ఏముంది నేనే తనని పంపిస్తాను అంటూ రాశిని వెళ్ళమంటుంది దమయంతి. మాటలకి షాక్ అయినా రాశి వెళ్ళను అన్నట్లుగా తల ఊపుతుంది. అతను ఇప్పుడు మన ఫ్రెండు మనకి మంచి చేయడానికి చూస్తున్నాడు మీ అన్నయ్య కోసం వెళ్ళాక తప్పదు అంటూ చెవిలో చెప్తుంది దమయంతి. అమ్మ చెప్పింది కదా వెళ్దాం పదండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు. అంతలోనే అక్కడికి వచ్చిన వర్షిణి వాడెవడో వచ్చి సూర్య గురించి చెప్తాను అంటే రాశిని వాడితో పంపించడమేంటి అంటూ అత్తగారిని నిలదీస్తుంది.
కోడల్ని ఆడిపోసుకుంటున్న దమయంతి..
వాడు ఎవడో కాదు,ఇంటికి కావలసిన వాడు నాకు చెప్పక్కర్లేదు నోరు మూసుకొని వెళ్ళు అంటుంది. కొందరికి కాలుతుంది అని చెప్తే వినరు కాలితేనే గాని తెలియదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వర్షిణి. అతను ఎంత మంచివాడు నా రాశికి ముందే ఎందుకు కనిపించలేదు, వాళ్ళిద్దరూ ఒక్కటైతే అంటూ రాశి,రాఖి పెళ్లి చేసుకున్నట్లుగా ఊహించుకుంటుంది దమయంతి. ఆ హర్ష గాడిని నమ్ముకుంటే చేతికి చిప్పే మిగులుతుంది.
Intiki Deepam Illalu January 23 Today Episode:
ఎలాగైనా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగేలాగా చూడాలి అని మురిసిపోతుంది దమయంతి. మరోవైపు రెస్టారెంట్లో ఏమి మాట్లాడకుండా తననే చూస్తున్న రాఖిని తిట్టుకుంటుంది రాశి. మీ ఫ్రెండు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చారు. కొంపదీసి ఐస్ క్రీమ్ డిపార్ట్మెంట్ అనబోయి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారా అంటుంది రాశి. మీరు జోక్స్ బానే వేస్తున్నారు కానీ నేను చెప్పింది కరెక్టే తను పోలీస్ డిపార్ట్మెంట్ లోనే చేస్తున్నాడు కానీ తనకిప్పుడు డ్యూటీ అవర్స్.
మీలాంటి బ్యూటిఫుల్ ఏంజెల్ ని ఫస్ట్ టైం బయటికి తి తీసుకొచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే ఏం బాగుంటుంది అందుకే కూల్ గా ఉండే ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువచ్చాను అంటాడు రాఖి. ఏడ్చినట్టే ఉంది అని తిట్టుకుంటుంది రాశి. నేను మిమ్మల్ని ఫ్లాట్ చేస్తున్నాను అనుకుంటారా అంటాడు రాఖి. ఛ, ఛ అలా ఎందుకు అనుకుంటాను మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అంటుంది రాశి. తరువాయి భాగంలో సూర్య చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులందరికీ తెలుస్తుంది.