Intiki Deepam Illalu January 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అంటుంది రాశి. నిజంగానా అయినా ఇప్పటివరకు ఏ ఫ్లవర్ ఐస్ క్రీమ్ కావాలో ఆర్డర్ చేయలేదు అంటాడు రాఖి. నాకు పైనాపిల్ అంటే ఇష్టం అంటుంది రాశి. పైనంత ముందు లోపల స్వీట్ అచ్చు మీలాగే నాకు కూడా అదే ఇష్టం అంటూ ఐస్ క్రీమ్ వాటర్ చేస్తాడు రాఖి.
రాఖిని తిట్టుకుంటున్న రాశి..
మీరు బాగా షార్ప్ అని రాఖి అంటే ఏం లాభం నీ దగ్గర బుక్ అయిపోయాను కదా అనుకుంటుంది రాశి. తనని అలాగే చూస్తున్న రాఖీని ఏమైంది అని అడుగుతుంది రాశి. అన్నం తింటున్నట్లు అలాగా తింటున్నారు ఐస్క్రీమ్ ఎలా ఉందో కూడా చెప్పలేదు అంటాడు రాఖి. ఐస్ క్రీమ్ చాలా బాగుంది అమేజింగ్ అని రాశి అంటే అయినా నేను హర్ట్ అయ్యాను ఈ విషయం ముందే చెప్పాల్సింది అంటూ రాశిని చూస్తూ ఐస్ క్రీమ్ తింటుంటాడు రాఖి.
వీడు ఐస్ క్రీమ్ కాదు నన్ను తింటున్నట్లుగా ఉంది అయినా వీటితో పంపించినందుకు మా అమ్మని అనుకోవాలి అనుకుంటుంది రాశి. నా ఫ్రెండు వచ్చేస్తాడు కానీ అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను. నేను చెప్పాక మీరు కోప్పడ కూడదు ఒకవేళ కోప్పడిన నలుగురిలో నన్ను అవమానించకూడదు, నీకు ఇష్టం లేకపోతే టైం కావాలని చెప్పండి అలా అయితే నేను మనసులో మాట ఫ్రీగా చెప్పగలను అంటాడు రాఖి.
రాశికి లవ్ ప్రపోజ్ చేసిన రాఖి..
వీడి మాటలు ఏదో తేడాగా ఉన్నాయి అనుకుంటుంది రాశి. నాకు మీరంటే చాలా ఇష్టం లవ్ ఎట్ ఫస్ట్ సైట్, పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. నీ ఒపీనియన్ ఇప్పుడే చెప్పక్కర్లేదు నిదానంగా ఆలోచించి ఒక మెసేజ్ చేస్తే చాలు, కాదు కూడదు అనుకున్నా కూడా నో ప్రాబ్లం అంటాడు రాఖి. ఆ మాటలకి షాక్ అయిన రాశి వీడి వాలకం చూసినప్పుడే అనుకున్నాను ఇప్పుడు పెళ్లి వరకు తీసుకువచ్చాడు అనుకుంటుంది.
నాకు పెళ్లయింది అంటుంది రాశి,తెలుసు అన్ని మీ అమ్మగారు చెప్పారు అంటాడు రాఖి. ముక్కు మొహం తెలియని వాళ్ళకి అన్నీ చెప్పేస్తుంది అంటూ తల్లిని తిట్టుకుంటుంది రాశి. మీకు పెళ్లి ఇష్టం లేకపోయినా మన ఫ్రెండ్షిప్ కి ఎలాంటి అడ్డంకి రాకూడదు అంటాడు రాఖి. హర్షని ఏడిపించాలంటే వీడితో చనువుగా ఉన్నట్లు నటించాలి అనుకొని నాకు కొంచెం టైం కావాలి అంటుంది రాశి. బుట్టలో పడింది అనుకుంటాడు రాఖి.
రాఖీ ప్రవర్తనకి షాక్ అయిన రాశి..
తను చేతి మీద చేయి వేసి రాశితో సెల్ఫీ తీసుకుంటాడు రాఖి. అతని ప్రవర్తనకి చిరాకు పడినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతుంది రాశి. మీ ఫ్రెండు ఈరోజు రాడనుకుంటాను అంటుంది రాశి. రాడు నేను ఈ విషయం మాట్లాడటం కోసమే నిన్ను ఇక్కడికి తినిపించాను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను అయినా మీ అన్నయ్య డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఎప్పుడో పై ఆఫీసర్లకి పంపించాను ముందు తన విషయం తేలిన తర్వాతే మన విషయం మాట్లాడదాము అంటాడు రాఖి.
మరోవైపు హారిక నన్ను చీట్ చేసి మోసం చేసి నా లైఫ్ ని స్పాయిల్ చేసినట్లే ఏదో ఒక రోజు హర్ష లైఫ్ ని కూడా స్పాయిల్ చేసేస్తుంది ఇప్పుడే హారిక ఎలాంటిదో హర్షకి చెప్పాలి అనుకుంటూ హర్షకి ఫోన్ చేసి ఇప్పుడు నీకు ఏమైనా ఇంపార్టెంట్ పని ఉందా అని అడుగుతాడు. లేదు అని హర్ష అంటే లొకేషన్ షేర్ చేస్తాను మీతో ఒక ఇంపార్టెంట్ మేటర్ మాట్లాడాలి రమ్మంటాడు మనో. మన దగ్గరికి వచ్చిన భార్య ఏదో ఇంపార్టెంట్ మేటర్ మాట్లాడాలి అన్నావు ఏంటది, ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగితే, నువ్వు నాకేమీ హెల్ప్ చేయక్కర్లేదు నీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా చూసుకో చాలు అంటాడు మనో.
హర్ష కి నిజం చెప్పి షాక్ ఇచ్చిన మనో..
అయినా ఆ హారిక కరెక్ట్ పర్సన్ కాదని నీకు ఎప్పుడో చెప్పాను కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నా అనుమానం నిజమే అయింది నువ్వు చాలా గుడ్డిగా నమ్ముతున్న ఆహారిక పెద్ద చీటర్ తను మనుషులతోనే కాదు జీవితాలతో ఆడుకుంటున్న క్రిమినల్. తనని గుడ్డిగా నమ్మి సగం జీవితాన్ని నాశనం చేసుకున్నావు, దాని మాయలో పడి తను ఎలాంటిదో తెలుసుకోలేకపోతున్నావు అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా మధ్యలోనే అడ్డుకుంటాడు హర్ష. తన గురించి ఎవరైనా చెప్పినా నేను నమ్మను తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు.
తను మాయలో ఉన్నావు కాబట్టే ఏం చెప్పినా నమ్మలేకపోతున్నావు, నీ బ్రెయిన్ ని అలాగా ట్యూన్ చేసింది తను అదే నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటాడు మనో. నువ్వు నా అన్నయ్యని కాబట్టి నువ్వు ఏం చెప్పినా వినాల్సి వస్తుంది కానీ వేరే ఎవరైనా హారక గురించి ఇలాగా మాట్లాడితే నా రియాక్షన్ వేరే లాగా ఉండేది. అయినా తను మీకు ఏమన్యాయం చేసిందని తన మీద అందరూ ఇలా కక్ష కట్టారు అంటాడు హర్ష. ఒక ఆడదానిమీద కక్ష కట్టి పగ సాధించాలనుకునే కుసంస్కరం మా ఎవరికీ లేదు.
మనో మీద నోరు పారేసుకున్న హర్ష..
మీ అన్నయ్య ఎలాంటి వాడు నీకు తెలియదా, తనే సైట్ మేనేజర్ కి డబ్బులు ఇచ్చి నా కన్స్ట్రక్షన్ కూలిపోయేలాగా చేసింది. నిన్ను వదిలేయమన్నందుకు తనని టైప్ నుంచి తీసేసినందుకు కోపంతో తను ఇలా చేసింది. కన్స్ట్రక్షన్స్ కూలిపోవడం వల్లే కస్టమర్స్ అందరూ అడ్వాన్స్ ఇవ్వమని ఇంటి మీదకి వచ్చారు, లోలిచిన బ్యాంకు వాళ్లు మన ఇంటిని సీజ్ చేసి మమ్మల్ని రోడ్డుపడేలాగా చేశారు. పేరు పరువు ఆస్తి అన్ని పోయాయి. ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చిన స్టేజ్ నుంచి రోజు గడవడం కోసం ఆటో తోలుకొని స్టేజ్ కి వచ్చేసాం దీని అంతటికి కారణం ఆ హరికే.
ఇంత చేసిన హారిక బ్లాక్ మనీ కేసు కూడా తనే చేయించి ఉంటుంది అంటే మేనేజర్ కి ఇచ్చిన చెక్ చూపిస్తాడు మనో. ఇది ఆ మేనేజర్ శాలరీ చెక్కు కాదు ఇంత అమౌంట్ అతని పేరు మీద ఇచ్చింది అంటే విషయం అర్థం చేసుకో అంటాడు మనో. నువ్వు ఎన్ని చెప్పినా ఇలాంటి సాక్షాలు ఎన్ని చూపించిన నాకు హారిక మీద ఉన్న ఒపీనియన్ మారదు ఇంతకుముందు కూడా అలాగే అపార్థం చేసుకున్నావు ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నావ్ అంటాడు హర్ష. నువ్వు కూడా నాలాగా జైలుకు వెళ్తేనే గాని మీకు నిజం రాదు. నిజం తెలిసిన రోజు పిచ్చోడివి అయిపోతావు అంతా నీ కర్మ అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనో.
మొత్తానికి డాక్యుమెంట్స్ మీద సైన్ చేసిన రాశి..
అన్నయ్య తన గురించి ఇలా మాట్లాడాలని తెలిస్తే హారిక చాలా బాధపడుతుంది అందుకే తనతో చెప్పకూడదనుకుంటాడు హర్ష. మరోవైపు భయంగా తన ఇంట్లో అడుగుపెట్టిన దమయంతిని భయపడకు నువ్వు ఎలాగూ పోలీసులకు చెప్పే వచ్చి ఉంటాయి కదా అంటాడు హరి నారాయణ. ఈ బ్యాగ్ లో ధనలక్ష్మి ఉంది సిరి వద్దనుకోవద్దు అంటాడు హరి నారాయణ. ఈ డబ్బు కేవలం మీ కొడుకుని వెతికించడానికి కథను చేసినప్పుడు తీర్చడానికే, నువ్వు డాకుమెంట్స్ మీద నా పెదనాన్న కూతురు చేతుల మీదగా సంతకం పెట్టిస్తే ఈ డబ్బు కన్నా పది రెట్లు డబ్బు ఎక్కువ ఇస్తాను అంటాడు దీపక్.
వాళ్లు చూపించిన డబ్బుల బ్యాగ్ కి వాళ్ళ మాటలకి ఆనందంతో ఉబ్బి తబ్బి అయిపోతారు రాశి,దమయంతి. చూసావా ఆ రాఖి వచ్చినా వేళా విశేషం అంటూ మురిసిపోతుంది దమయంతి. ఈ డబ్బు తీసుకొని రాఖిని పొగుడుతున్నావేంటి అయినా దానికి దీనికి ఏంటి సంబంధం అంటే సంబంధాలు కలుపుకుంటే కలుస్తాయి అంటుంది దమయంతి. అయినా ఈ డబ్బులతో మనమే సూర్య అని వెతుక్కుందాము. హరి నారాయణ గారు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి రాసి సంతకం పెడుతుంది కానీ నా కొడుకు వచ్చిన తర్వాత ముందు ఊరు వెళ్లి ఆస్తులను ఎక్కడ ఉన్నాయో మీరే చూపించాలి అంటూ కూతురు చేత సంతకం పెట్టిస్తుంది దమయంతి.
రాఖి అన్ప్రొడక్టబుల్ అంటున్న హర్ష..
సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ కొన్ని వాళ్ళు ఉంచుకొని కొన్ని రాశి వాళ్ళకి ఇచ్చేస్తారు హరి నారాయణ వాళ్లు. ఆనందంగా దమయంతి వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత సగం ఆస్తి మనం చేతికి వచ్చేసింది, మిగతా ఆస్తి కూడా మన పేరు మీద రాయించుకొని వాళ్ళిద్దర్నీ కూడా లేపేద్దాం అనుకుంటారు తండ్రి,కొడుకులు. మరోవైపు రాఖి దగ్గరికి వచ్చిన హర్షతో, వచ్చావా నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటాడు రాఖి. నేను ఇంపార్టెంట్ విషయం అని అంటే అంత కూల్ గా ఉంటావేంటి అంటాడు రాఖి. మీరు చెప్పిన విషయాన్ని బట్టి అది ఇంపార్టెంట్ అవును కాదు రియాక్ట్ అవుదామని అంటాడు రాఖి.
Intiki Deepam Illalu January 24 Today Episode:
నాతో మాట్లాడుతానని చెప్పి గేమ్ ఆడుకుంటున్నారు ఏంటి అంటాడు హర్ష. నేను అర్జెంటు అంటే నువ్వు కూల్ గా వింటాను అని డిసైడ్ అయి వచ్చావు, నువ్వు చెప్పినట్లే ఒక ఆట ఆడుకుంటూ నిదానంగా మాట్లాడుకుందాము. అక్కడ బెయిల్ కి టైం అయిపోయి మీ అన్నయ్య మళ్లీ జైలుకి వెళ్లిపోతాడు అంతవరకు మనం నిదానంగా గేమ్ ఆడుకుందాం అంటాడు రాఖి. మీరు కొంచెం అన్ప్రొడెక్టబుల్గా ఉంటారు కదా అందుకే, ప్లీజ్ రాఖి గారు విషయం ఏంటో చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు హర్ష.
నిజం చెప్పి హర్ష కి షాక్ ఇచ్చిన రాఖి..
నేను అన్ ప్రొడెక్టబులా? అర్థం చేసుకోవలసిన వాళ్ళని అర్థం చేసుకోరు అర్థం చేసుకోలేని వాళ్ళని పెట్టుకొని తిరుగుతారు. కల్తీ చేసిన కన్నింగ్ ఫెలో ఎవరంటే ఆ గోడౌన్ మేనేజర్ సంజయ్ అంటూ నిజం చెప్తాడు రాఖి. తర్వాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్ లో చూద్దాం.