Intiki Deepam Illalu January 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో సూర్యని తలుచుకొని కుటుంబ సభ్యులందరూ ఏడుస్తుంటారు. నాకే ఇంత బాధగా ఉంది అలాంటిది కృష్ణ ఇంక ఎంత బాధ పడుతుందో అనుకుంటూ భార్య దగ్గరికి వెళ్తాడు మనో. చనిపోయింది మా అన్నయ్య కాదు అలాంటి అన్నయ్య ఉండడం నా అదృష్టం ఇప్పుడు నా అదృష్టం చనిపోయింది అంటూ ఏడుస్తుంది కృష్ణ.

వర్షిణి కోసం బాధపడుతున్న కృష్ణ దంపతులు..

మనమే ఇంత బాధ పడుతున్నాము అలాంటిది సూర్యనే తన ప్రాణంగా భావించే నా చెల్లెలు ఇంకెంత బాధపడుతుందో, మా చెల్లెలు ఎంత చిన్న వయసులో ఒక భర్తని పోగొట్టుకొని బాధపడడం నేను భరించలేకపోతున్నాను అంటూ ఏడుస్తాడు మనో. మనం పని ముందు బాధపడితే తను ఇంకా బాధపడుతుంది మనమే తనకి ధైర్యం చెప్పాలి. ప్రాణంగా ప్రేమించే భర్త లేకపోయినా కంటికి రెప్పలా కాపాడుకునే అన్నయ్య ఉన్నాడు అని మీరే తనకి తెలియ చెప్పాలి.

లేకపోతే తనకి భవిష్యత్తు భయంగా మారిపోతుంది. అలాంటి ధైర్యం చెప్పవలసిన మీరే బాధపడితే ఎలా అంటూ బాధపడుతుంది కృష్ణ. మరోవైపు కృష్ణ ఫోటో చూస్తూ దమయంతి, రాశి ఇద్దరు ఏడుస్తారు. నేను ఏం చేసినా మీ ఇద్దరి కోసమే చేశాను వాడు నన్ను ఎన్ని మాటలు అన్నా నా కొడుకే నాకు ధైర్యం అనుకునేదాన్ని అలాంటి నా కొడుకే చచ్చిపోయాడు అంటూ ఏడుస్తుంది దమయంతి. అన్నయ్య చనిపోయాడు అంటే నాకు నమ్మకం కలగటం లేదు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నట్టున్నాడు అంటూ ఏడుస్తుంది రాశి.

దమయంతిని తిట్టుకుంటున్న తండ్రి కొడుకులు..

అంతలోనే అక్కడికి హరి నారాయణ,దీపక్ వస్తారు. నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మాకు అండగా ఉండవలసిన వాడు మమ్మల్ని దగా చేసి పోయాడు. ఆస్తులు వచ్చాక బెంజ్ కారులో తిరుగుతాడు అనుకుంటే అవి రాకముందే వాడు తొందరపడి వెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తుంది దమయంతి. కొడుకు పోయిన బాధలో కూడా ఇది ఆస్తులు గురించే మాట్లాడుతుంది అనుకుంటాడు హరి నారాయణ.

మిమ్మల్ని ఎలా ఓదార్చాలో మాకు అర్థం కావట్లేదు, ఆస్తి వ్యవహారాలు గురించి మీకు చెప్పాలనుకున్న టైంలో ఇలా జరిగింది అంటాడు హరి నారాయణ. పోయిన వాళ్ళ కోసం ఏవి ఆగవు కదా పెద్దకర్మ అయిపోయిన వెంటనే ఆ సంగతులు చూద్దాం అంటుంది దమయంతి. సంతకాలు అయిపోయిన వెంటనే నీ కొడుకు పట్టిన గతే నీకు పడుతుంది అనుకుంటాడు హరి నారాయణ.

అవసరమైతే రాఖీ ఫోటోకి కూడా దండేద్దాం అంటున్న దీపక్..

సూర్య స్థానంలో నేను ఉంటాను బాధపడొద్దు అక్క అంటూ రాశిని ఒదారిస్తాడు దీపక్. అదే టైంలో రాఖీ అక్కడికి వచ్చి మీరు ఇలాంటి బ్యాడ్ సిచువేషన్ ఫేస్ చేయవలసి వస్తుందని నేను అసలు అనుకోలేదు అంటూ ఓదార్చుతాడు. మీరేమీ బాధపడకండి అవసరమైతే మీకోసం నేను మీ ఇంట్లో ఉండిపోవడానికైనా సిద్ధమే అంటాడు రాఖి. రాఖీ గురించిన వివరాలు కనుక్కుంటాడు హరి నారాయణ.

సూర్య డెత్ సర్టిఫికెట్ అవీ కావాలంటే అయిన వాళ్ళ సంతకం మాత్రమే ఉండాలి రాఖి. అమ్మ బాధలో ఉంది ఇతను రాలేదు అంటే మీరు వచ్చినా పర్వాలేదు అని రాశి తో చెప్తాడు రాఖి. సరే అంటూ అతను వెనక వెళ్తుంది రాశి. బయటికి వచ్చిన తరువాత అవసరమైతే ఇక్కడే ఉండిపోతాను అంటున్నాడు ఎవడ్రా వీడు అని రాఖీ గురించి అంటాడు హరి నారాయణ. ఎవడైతే మనకేంటి మన దారికి అడ్డు వస్తే సూర్యకి పడినట్టే వీడి ఫోటో కూడా దండ పడుతుంది అంటూ ఇద్దరు నవ్వుకుంటారు.

హారిక చంప చెళ్ళుమనిపించిన కృష్ణ..

మరోవైపు హారిక ఇంటికి వచ్చిన కృష్ణ పెద్దగా హారికని పిలుస్తుంది. ఏంటి ఇలా వచ్చావ్, ఏమైనా హెల్ప్ కావాలా మొహమాట పడొద్దు ఎంత కావాలో చెప్పు అంటుంది హారిక. ఆమె చెంప పగలగొడుతుంది కృష్ణ. హెల్ప్ చేస్తాను అంటే కొడతావేంటి అంటుంది హారిక. నేనొచ్చింది హెల్త్ కోసం కాదని నీకు ఇంకా అర్థం కాలేదా నీ వల్లే మా కుటుంబం ఈరోజు రోడ్డున పడింది. మా ఆస్తులు పోయేలాగా చేసి మా వాళ్ళని జైలు పాలు చేసావు అంటుంది కృష్ణ.

అలా అంటావేంటి అని హారిక అంటే వెధవ నాటకాలు వాడితే పళ్ళు రాలగొడతాను. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు అనుమానం కలిగింది నీ కళ్ళలో గాని నీ ప్రవర్తనలో గాని ఎక్కడా నిజాయితీ లేదు ఆఖరికి నా అనుమానమే నిజమైంది. నువ్వు హర్షిని పెళ్లి చేసుకోవడానికి మేము ఎవరిమీ ఒప్పుకోలేదని మా అందరి జీవితాలతో ఆడుకుంటావా? ఆడదానివేంటి నిజానికి పాల్పడటానికి సిగ్గు లేదా నీ గురించి అంతా మనో గారు నాకు చెప్పారు.

అసలు నిజాన్ని చెప్పి కృష్ణకి షాక్ ఇచ్చిన హారిక..

నువ్వు చేసింది చాలక తిరిగి నా భర్తని బెదిరిస్తావా అంటూ హారిక పీక పట్టుకుంటుంది కృష్ణ. నా కుటుంబానికి ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే చంపేస్తాను. నా సహనాన్ని మంచితనాన్ని చేతకానితనం అనుకున్నావా, తెగిస్తే నీలాంటి వాళ్ళని గొయ్యి తీసి పాతేస్తాను ఉంటుంది కృష్ణ. వదులు అని హారిక అంటే నేను వచ్చింది వదిలేయటానికి కాదు సంస్కారానికి నిలువెత్తు రూపం నా భర్త అలాంటి ఆయన్ని నువ్వు బెదిరిస్తావా అంటూ మళ్ళీ కొడుతుంది.

నీలాంటి దాన్ని క్షమించడం కూడా పాపమే అంటూ మళ్ళీ కొట్టబోతే ఆమె చేయి పట్టుకుంటుంది హారిక. వీరనారి లాగా రెచ్చిపోతున్నావేంటి చేయి చేసుకోవడం నాకు కూడా వచ్చు అంటుంది హారిక. జీవితాలతోటి ఆడుకోవడం వచ్చిన దానివి చేయి చేసుకోవడం రాదు అని ఎలా అనుకుంటాను. అన్నావు కదా ఏది నా మీద చెయ్యెత్తి చూపించు అంటుంది కృష్ణ. నీ భర్త నా గురించి చెప్పగానే యుద్ధానికి వచ్చేసావు కానీ నీ భర్త నీకు చేసిన మోసం గురించి చెప్పలేదు అన్నమాట అంటుంది హారిక.

నీ భర్త మంచివాడా అంటూ నిలదీసిన హారిక..

నా భర్త నీకు లాగా మోసగాడు కాదు అంటుంది కృష్ణ. నిజం తెలియక ముందు అందరూ ఇలాగే స్టేట్మెంట్లు ఇస్తారు. సంస్కారవంతుడైన నీ భర్త నీకు చేసిన మోసం గురించి తెలిస్తే భరించగలను అంటే చెప్పు తను చేసిన ద్రోహం గురించి నీకు చెప్తాను అంటుంది హారిక. నన్ను నా భర్తని విడదీయడానికి నాటకం మొదలు పెట్టావా అంటుంది కృష్ణ. నేను చెప్తే నమ్మవు కదా చూపిస్తాను అంటూ యాక్సిడెంట్ సీన్ చూపిస్తుంది హారిక. నీ ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి నీకు యాక్సిడెంట్ అయ్యోలా చేశాడు.

Intiki Deepam Illalu January 27 Today Episode

ఇప్పుడు చెప్పు కట్టుకున్న భార్య ప్రెగ్నెన్సీ పోగొట్టినవాడు మంచివాడా? చెడ్డవాడా? నీ భర్త సంస్కారవంతుడు అంటున్నావు నిన్ను తల్లిని కాకుండా చేయడమేనా సంస్కారం అంటే అంటూ నిలదీస్తుంది హారిక. కసాయి వాడిని నేను ఎత్తిన పెట్టుకొని పూజిస్తున్నావు. నా గురించి తెలుసుకున్నావు కాబట్టి నా మీద రెచ్చిపోయావు. మంచితనం మూసుకుని ఈ భర్త ఇలాంటివి ఎన్నో చేశాడు అంటుంది హారిక.

ఇంక ఆపు అంటూ కేకలు వేస్తుంది కృష్ణ.తరువాయి భాగంలో నాకు చచ్చిపోవాలని ఉంది అంటూ ఏడుస్తుంది వర్షిణి. పోయిన వాళ్ళు తిరిగిరాని అర్థం చేసుకో అంటూ ఓదారుస్తుంది కృష్ణ. సూర్య లేకుండా బ్రతకలేను చావడమే మంచిది అంటూ లారీకి ఎదురుగా పరుగులు తీస్తుంది వర్షిణి.