Intiki Deepam Illalu January 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో భర్తని తలుచుకొని బాధపడుతుంది వర్షిణి. చెల్లెలి దగ్గరికి వచ్చిన మనో నేను కృష్ణ కలిసుండాలని నువ్వు ఎంతో ఆరాటపడే దానివి, నువ్వు ఏం చేసినా నీకు తోడుగా ఉండేవాడు సూర్య అంటూ చెల్లెల్ని ఓదారుస్తాడు మనో. తోడుగా ఉండడమే కాదు నన్ను ఎవరు ఏమి అనుకున్నా ఊరుకునే వాడు కాదు.
నీ ధైర్యం నేనంటున్న మనో..
తను ఒక్కడు ఉంటే చాలు నేను జీవితాంతం ధైర్యంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఆ ధైర్యమే లేకుండా పోయింది అంటూ ఏడుస్తుంది వర్షిణి. నువ్వు లేదు అనుకుంటున్నా ధైర్యాన్ని నేను ఇవ్వగలను, నీకోసం ఈ అన్నయ్య ఏమైనా చేస్తాడు ఒక్క సూర్య అని తెచ్చి ఇవ్వడం తప్ప అంటాడు మనో. నన్ను మీరు ఎవరు అనుమానించకూడదని, నేను ఆఫీసులో వాడుకున్న డబ్బుని తను కట్నంగా అడిగి తీసుకున్నానని నింద తన మీద వేసుకున్నాడు సూర్య.
మీ అందరి దృష్టిలోనూ చెడ్డవాడైన పర్వాలేదు అనుకున్నాడు, అంతేకాదు ఎంతో ఆత్మ అభిమానం ఉన్నవాడు, అలాంటివాడు లేకపోవడం వర్షిణికే కాదు మనందరికీ కూడా పెద్ద లోటు అంటాడు మనో. మనకి ధైర్యం చెప్పడం కోసం కృష్ణ కష్టపడుతుంది అప్పులు చేసి మన కష్టపడుతున్నాడు అందరికన్నా చిన్న పిల్ల వర్షిణి భర్తని పోగొట్టుకొని బాధపడుతుంది.
తనకి నువ్వే ధైర్యం చెప్పాలంటున్న జగదీష్..
మన పిల్లలు మన కళ్ళముందే ఇలాగ బాధపడుతుంటే మనం ఏమీ చేయలేకపోతున్నాం అంటూ భర్త దగ్గర ఏడుస్తుంది లీలావతి. తన ముందు మీరు ఇలాగా బాధపడకండి అత్తయ్య మీరు బాధపడితే వర్షిణి ఇంకా బాధపడుతుంది అందరికీ ధైర్యం చెప్పవలసిన మీరే బాధపడితే ఎలా అంటూ నిలదీస్తుంది కృష్ణ. వర్షిణిని కాసేపు అలాగా బయటకి తీసుకు వెళ్తాను అంటూ లీలావతికి చెప్తుంది కృష్ణ. తనకి నువ్వంటే చాలా ఇష్టం నువ్వే వర్షినికి ధైర్యం చెప్పాలి అంటాడు జగదీష్.
బయటికి వెళ్దాం అంటే వర్షిణిని పిలిస్తే రాను అంటుంది. నేను నీకోసం రమ్మనట్లేదు నా మనసు కుదిరితే పడుతుంది అందుకే నా కోసం రా అంటూ బ్రతిమాలి తీసుకువెళ్తుంది. మరోవైపు కారులో వెళ్తున్న రాఖి పక్కనే ఉన్న రాశిని చూస్తూ అన్నయ్య పోయిన బాధలో ఉంది లేకపోతే సరదాగా కబుర్లు చెబుతూ లైన్లో పెట్టేవాడిని అనుకుంటాడు. ఆ హర్ష గాడు వస్తానన్నాడు, మా ఇద్దర్ని ఇలా చూస్తే చాలా హర్ట్ అవుతాడు. వాడిని డిస్టర్బ్ చేయాలి అనుకుంటాడు.
రాశిని అలా చూసి హర్ట్ అయిన హర్ష..
బయటికి మాత్రం పోయిన వాళ్ళ కోసం బాధపడుతూ ఉన్నంతమాత్రాన పోయిన వాళ్ళు రారు కదా, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిన షేర్ చేసుకోవడానికి సాల్వ్ చేయటానికి నేనున్నాను అంటూ రాశికి ధైర్యం చెప్తాడు రాఖి. ఎక్కువ బాధపడిన ఏడ్చిన గొంతు కొంచెం కొబ్బరి నీళ్ళు తాగితే ఎనర్జీ వస్తుంది అంటాడు రాఖి. నాకు దాహంగా ఉంది మీరు కాకుండా నేను ఎలా తాగుతాను అంటాడు రాఖి. ఫార్మాలిటీస్ అవసరం లేదు మీరు వెళ్లి తాగండి అంటుంది రాశి. పక్క వాళ్ళు తాగకుండా నేను మాత్రం ఎలా తాగుతాను అని రాఖీ అంటే సరే రండి అంటూ కొబ్బరి బొండం తాగడానికి వెళ్తారు రాఖి వాళ్ళు.
రాశిని మింగేసేలాగా చూస్తూ కంట్లో ఏదో నలకబడినట్లుగా ఉంది కాస్త ఊదండి అంటాడు రాఖి. తనకి ఇష్టం లేకపోయినా ఆ పని చేస్తుంది రాశి. అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష అది చూసి హర్ట్ అవుతాడు. అన్నయ్య పోయిన బాధ లేకుండా ఇలాగా పరాయి మగ వాడితో తిరగటానికి సిగ్గు లేదా అని అడుగుతాడు. మీరు ఆ హారికతో తిరిగితే తప్పులేదు పెళ్ళాం ఉండగా దాన్ని పక్కన పెట్టుకుంటే తప్పులేదు నేను తిరిగితే మీకు తప్పుగా అనిపిస్తుందా అంటుంది రాశి.
బయటి తిరగడం తప్పు కాదు కానీ మొగుడు ఉండగా బయటపడితే తిరగడం తప్పు కదా అంటాడు హర్ష.
మొండిగా ప్రవర్తిస్తున్న రాశి..
ఎవడితోనో తిరిగితే వాడు నా లవరు బాయ్ ఫ్రెండు అయిపోతాడా అంటుంది రాశి. నాకు డైవర్స్ ఇచ్చేశాక నీ ఇష్టం వచ్చినట్లు చెయ్ అంటాడు హర్ష. మీ మాటల్ని బట్టి మీ ఇద్దరూ బాయ్ఫ్రెండ్ హస్బెండ్ అని అర్థమైంది ఈవిడ మీ భార్యని తెలియక నేను తనని లవ్ చేస్తున్నాను అంటాడు రాఖి. మీరేమీ ఆయన్ని రిక్వెస్ట్ చేయక్కర్లేదు నేను ఎలా ఉండాలో ఎలా తిరగాలో మీరేమీ నాకు చెప్పక్కర్లేదు, నాకు నచ్చినట్లుగా ఉంటాను నాకు నచ్చింది చేస్తాను అడగడానికి మీరెవరు అంటూ పొగరుగా మాట్లాడుతుంది రాశి.
నాకు కావలసిన రియాక్షన్ ఇదే అనుకుంటాడు రాఖి. హర్షని పక్కకి తీసుకువెళ్లి మీరు ఎలాగూ డైవర్స్ తీసుకుని లాగా ఉన్నారు కాబట్టి మీరు త్వరగా సైడ్ అయిపోతే నాలయన్ క్లియర్ అయిపోతుంది. ఇలా చెప్పటం కాస్త అంబారిజంగానే ఉంది కానీ ప్రేమిస్తున్నాను కదా అందుకే ఇలా చెప్పాల్సి వస్తుంది అంటారు రాఖి. డైవర్స్ నేను ఎప్పుడో ఇచ్చేశాను ఇవ్వాల్సింది తనే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు హర్ష. అప్పుడే అక్కడికి వచ్చిన రాశి మీరేమీ ఆయన్ని బ్రతిమాలక్కర్లేదు, ఆయన మాటలు పట్టించుకోకండి అని రాఖికి చెప్తుంది.
షాకింగ్ డెసిషన్ తీసుకున్న వర్షిణి..
మరోవైపు బయటికి వచ్చిన కూడా మూడిగా ఉన్న వర్షిణి తో నువ్వు ప్రశాంతంగా ఉంటావని బయటకి తీసుకొని వచ్చాను, బాధని మర్చిపోండి అని చెప్పటం సులభమే కానీ అది చేయడం చాలా కష్టం అయినా బాధని దిగమింగి ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించు అంటూ వర్షిణికి వాటర్ బాటిల్ ఇస్తుంది కృష్ణ. నాకు చనిపోవాలని ఉంది అంటూ ఏడుస్తుంది వర్షిణి. మనం ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు తిరిగిరాని అర్థం చేసుకో, నిన్ను చూస్తూ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు వాళ్ల కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి నీకోసం మేమందరం ఉన్నాం కదా అంటూ ధైర్యం చెబుతుంది కృష్ణ.
ఇంతలో తనకి ఏదో ఫోన్ రావడంతోపక్కకు వెళ్లి మాట్లాడుతుంది. ఈలోపు సూర్య లేకుండా నేను బ్రతకలేను జీవితాంతం ఏడుస్తూ కుములిపోవడం కన్నా చనిపోవడం మంచిది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వర్షిణి. అది గమనించిన కృష్ణ ఆమె వెంటపడుతుంది. కృష్ణ కి అందకుండా కొండ ఎక్కి దూకేయబోతుంది వర్షిణి. అప్పుడే ఆమెని చేరుకున్న కృష్ణ,వర్షిని చేయి పట్టుకుని ఆపుతుంది.
Intiki Deepam Illalu January 30 Today Episode వర్షిణి చెంప పగలగొట్టిన కృష్ణ..
ఆమెని లాగి చెంపమీద కొడుతుంది. నిన్ను చంపడానికా మేమందరమే బ్రతికి ఉన్నది నిజానికి బ్రతకటానికి అంటే చనిపోవటానికి ధైర్యం ఎక్కువ కావాలి ఆ ధైర్యం నీ కన్నా నాకే ఎక్కువ చూస్తావా అంటూ వర్షిని మీద కేకలు వేస్తుంది. ఏడుస్తూ వదినని హత్తుకుంటుంది వర్షిణి. మరోవైపు పని చేసుకుంటున్న కృష్ణకి పసిపిల్లల కేరింతలు వినబడుతాయి. నాకు కూడా పసిపిల్ల ఉండి ఉంటే నా కష్టాలన్నీ మర్చిపోయి ఉండేదాన్ని అనుకుంటుంది.
అదే సమయంలో మనం కూడా ప్రెగ్నెన్సీ కావాలని పోగొట్టుకున్నది అనుకొని కృష్ణని ఎన్ని మాటలు అన్నాను అంటూ బాధపడుతుంటాడు. తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన దమయంతిని వర్షిణిని ఓదార్చటానికి వచ్చావా అంటూ పలకరిస్తుంది కృష్ణ. చావు ఇంట్లో శుభం జరగాలంటారు అందుకే నా కూతురు రాశికి మరో సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నాను అంటుంది దమయంతి.