Intiki Deepam Illalu January 31 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కృష్ణ తల్లి కాళ్ళకోవటానికి కారణం నేనే అని తెలియక తనని నానా మాటలు అని అవమానించాను అని బాధపడతాడు మనో. అదే విషయాన్ని కృష్ణతో చెప్పి నేనే నీ ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం అని తెలిసిన తర్వాత నన్ను శిక్షిస్తే బాగుండేది, నువ్వు క్షమించటం వల్ల తప్పు చేశానన్న బాధ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది నా మనసుకి శిక్ష అవుతుంది అంటాడు మనో.

నిజం చెప్పేస్తాను అంటున్న మనో..

దురదృష్టాన్ని గుర్తుచేసుకొని బాధపడకండి. మీరు నాకు నిజం చెప్పిన తర్వాత నేను హారిక దగ్గరికి వెళ్లి నిలదీశాను. హర్ష కి కూడా చెప్పాను కానీ అతను ఎంతకీ నమ్మటం లేదు. హారికనే ఇంకా గుడ్డిగా నమ్ముతున్నాడు అంటుంది కృష్ణ. వాడు నమ్మడని నాకు తెలుసు మనం ఇంత చెప్పి నమ్మకపోతే అది వాడి కర్మ అంటాడు మనో. చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు నేను చేసిన తప్పుని నువ్వు ఎలాగైతే క్షమించావో అలాగే అమ్మ వాళ్ళు కూడా క్షమిస్తారు అందుకే నేను వాళ్లకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను అంటాడు మనో.

అలా చేయకండి ఇప్పటికే పరిస్థితుల వల్ల ఇంట్లో వాళ్ళందరూ కృంగిపోయారు. వర్షిణికి అలాగా జరిగినందుకు కుమిలిపోతున్నారు. ఇప్పుడు మీరు నిజం చెప్తే మరింత బాధపడతారు ఈ విషయాన్ని ఎప్పటికీ ఎవరికీ చెప్పొద్దు అంటుంది కృష్ణ. అర్ధాంగి అంటే అర్థం చేసుకునేది అనుకున్నాను కానీ నాన్నలాగా నడిపించేది అమ్మ లాగా బుజ్జగించేది అవుతుంది అనుకోలేదు అంటూ భార్యని దగ్గరికి తీసుకుంటాడు మనో.

రాశికి సారీ చెప్పిన రాఖి..

మగ తోడు లేక రాశి, పిన్ని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఒకసారి వెళ్లి పలకరించి వస్తాను అంటుంది కృష్ణ. నువ్వు పలకరించడానికి వెళ్లిన తను నిన్ను అవమానిస్తుంది అని మనో అంటే అలా అని వాళ్ళని వదిలేసుకోలేము కదా, వెళ్లి పలకరించి వస్తాను అంటూ బయలుదేరుతుంది కృష్ణ. మరోవైపు ఇంటికి వచ్చిన రాశి, రాఖీకి థాంక్స్ చెప్తుంది. రాఖీ మాత్రం రాశికి సారి చెప్తాడు. ఎందుకు అని అడిగితే నేను నీ పక్కన ఉండటం వల్లే ఆయన మీ క్యారెక్టర్ గురించి అంతా అసహ్యంగా మాట్లాడారు.

అతను మీ భర్త అని నాకు తెలియదు అంటాడు రాఖి. సంస్కారం లేకుండా మాట్లాడే అలాంటి వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించకండి నేను మాట్లాడకుండా ఉంటే అతను కొంచెం రెచ్చిపోతాడు అందుకే నేను కూడా కాస్త గట్టిగా మాట్లాడవలసి వచ్చింది అంటుంది రాశి. నడిరోడ్డు మీద భార్యతో అలాగా మాట్లాడాడు అంటే వాడికి భార్య మీద ప్రేమ గౌరవం లేదు అని అర్థం. అలాంటి వాళ్ళు మీకు కరెక్ట్ కాదు డైవర్స్ ఇచ్చేయండి అంటాడు రాఖి. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి నేను చేసి పెడతాను అంటాడు రాఖి.

జరిగిందంతా తల్లికి చెప్పిన రాశి..

అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాశి. అక్కడ వాడికి కాలిపోయేలాగా చేశాను ఇక్కడ నువ్వు ఆలోచించేలాగా చేశాను ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోవడం నాకు బాగా అలవాటు అనుకుంటాడు రాఖి. సూర్య డెత్ సర్టిఫికెట్ చూసి ఏడుస్తుంది దమయంతి. చచ్చిన వాడితో పాటు బ్రతికున్న వాళ్లు కూడా మనల్ని ఏడుపిస్తున్నారు అంటూ దారిలో జరిగిన సంగతి అంతా చెప్తుంది రాశి. వాడు దాంతో తిరుగుతున్నప్పుడే చెప్పు తీసుకొని కొట్టుంటే వాడికి పెళ్ళాం విలువ తెలిసి ఉండేది, ఆ పని చేయలేదు కాబట్టే ఇప్పుడు ఇలాగా మాట్లాడుతున్నాడు.

మనం బ్రతుకుతున్నాను అలాంటి వాళ్ళతో సంబంధం మనకు వద్దు అంటుంది దమయంతి. సంబంధాన్ని వదులుకుంటే మనకి ఏం దొరుకుతుంది మెల్లగా హర్ష గారిని నా దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటుంది రాశి. పోయి పోయి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటాను అంటావేంటి, అలాంటి వాడితో నీకు ఎలాంటి సుఖము సంతోషం ఉండదు వాళ్ల వల్లే నీ జీవితం ఇలాగ తగలబడింది, నా కొడుకు నాకు కాకుండా పోయాడు. అలాంటి వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తానంటావా ఒకవేళ నువ్వు వెళ్తాను అన్నా నేను ఒప్పుకోను.

నిజం చెప్పి తప్పు చేశాను అనుకుంటున్న రాశి..

నేను చెప్పినట్లు రాఖీని పెళ్లి చేసుకో నీ జీవితం బాగుంటుంది అంటుంది దమయంతి. రోడ్డు మీద జరిగిన సంగతి అమ్మకి చెప్పకుండా ఉండాల్సింది అనుకుంటుంది రాశి. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణని ఎందుకు వచ్చావు నా కొడుకుతో పాటు మమ్మల్ని కూడా చంపుదామని అంటుంది దమయంతి. అలాగ మాట్లాడుతావేంటి పిన్ని, మా వాళ్ళందరూ పరువు కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటారు కానీ ఎదుటి వాళ్ళకి చెడు చేయాలనుకోరు అంటుంది కృష్ణ.

మీ వాళ్లకు డప్పు కొట్టడానికి వచ్చావా అంటుంది దమయంతి. నేను ఏం మాట్లాడినా అపార్థం చేసుకుంటావు ఎందుకు పిన్ని. ఆస్తులు ఉన్న లేకపోయినా ఆడదానికి భర్తని కోల్పోతే ఆ జీవితం చాలా భారంగా ఉంటుంది. కష్టాలు చెప్పుకోవటానికి పక్కన ఒక మనిషి ఉంటే బాగుంటుంది అందుకే మనం రాశిని, హర్ష ని కలుపుదాం. కూతురి జీవితం గురించి భయపడవలసిన అవసరం నీకు కూడా ఉండదు అంటుంది కృష్ణ. నాకు మీరు పొద్దు మీతో సంబంధం వద్దు, నా కూతురు బాగోగులు నేను చూసుకుంటాను ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ కృష్ణ మీద కేకలు వేస్తుంది దమయంతి.

దమయంతిని అర్థం చేసుకోమంటున్న కృష్ణ..

కొంచెం అర్థం చేసుకో పిన్ని హర్ష మంచివాడే తను అలా తయారవ్వటానికి కారణం హారిక.నిజం తెలుసుకున్నాక హర్ష గురించి రాశి, రాశి గురించి హర్ష బాధపడతారు. పరిస్థితి రాకముందే మనం వాళ్ళని కలుపుదాం అంటుంది కృష్ణ. తను మంచిది కాదు అని ఇప్పుడు మీకు తెలిసిందా తనని పూజలకి పునస్కారాలకి పిలిచి నెత్తిన పెట్టుకున్నారు మీ వాళ్ళు అంటుంది దమయంతి. అప్పుడు తెలియకే అవన్నీ చేశారు, ఇప్పుడు నిజాలు తెలిసాయి అంటుంది కృష్ణ. హర్ష, రాశిలు కలవడం అన్నది ఈ జన్మలో జరగని పని.

నా కూతురు కన్నా నువ్వే మంచి దానివి అని నిన్ను కూడా నెత్తిన పెట్టుకున్నారు అలాంటిది నిన్ను కూడా అవమానించి ఇంట్లోంచి గెంటేశారు అయినా సిగ్గు లేకుండా నువ్వు కాబట్టి ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నావు. కానీ అలాంటి అవసరం నా కూతురికి లేదు నువ్వు ముందు ఇంట్లోంచి బయటికిపో అంటుంది దమయంతి. పిన్నికి నువ్వైనా చెప్పు అని రాసి తో అంటుంది కృష్ణ. తను ఏమీ మాట్లాడకపోవటంతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి పోతుంది. మరోవైపు రాసి మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతాడు హర్ష.

నిజం చెప్పి హారిక కి షాక్ ఇచ్చిన హర్ష..

అప్పుడే అక్కడికి వచ్చిన హారిక హర్ష ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడు మనో గాని రాఖి గాని నా గురించి ఏమైనా చెప్పుంటారా అని అనుమాన పడుతుంది. అతని దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతుంది. ఆడవాళ్లు ఒకప్పటి లాగా లేరు చాలా మారిపోయారు అంటాడు హర్ష. ఎవరి గురించి మాట్లాడుతున్నారు నా గురించేనా అనుకుంటుంది హారిక. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగితే రాశి గురించి మాట్లాడుతున్నాను పెళ్లయిన ఆడది పరాయి మగ వాడితో తిరగడం ఏంటి? బుద్ధిలేని వాళ్ళకి సిగ్గు ఉంటుంది అనుకోవడం పొరపాటే తను నీ ఫ్రెండ్ రాఖీ తో తిరుగుతుంది అంటాడు హర్ష.

ఆ మాటకి షాక్ అయిన హారిక రాశి,రాఖీ తో ఫ్రెండ్షిప్ చేస్తుందా అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగా కాదు లవర్స్ లాగా తిరుగుతున్నారు. ఎందుకలా చేస్తున్నావ్ అని అడిగితే నువ్వు నీకు నచ్చిన వాళ్ళతో తిరుగుతున్నప్పుడు నేను నాకు నచ్చిన వాళ్ళతో తిరిగితే తప్పేంటి అంటూ ఎదిరించి మాట్లాడుతుంది దానికి నీ ఫ్రెండ్ రాఖీ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. వాడు అలాంటి ఇడియట్ అని అనుకోలేదు తను నీ ఫ్రెండే కదా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు అని చెప్పు అని హారికతో చెప్తాడు హర్ష.

మనకి వాళ్లే ఇంపార్టెంట్ అంటున్న హారిక..

నువ్వు డైవర్స్ ఇవ్వాలనుకున్న తర్వాత తను ఎవరితో తిరిగితే నీకేంటి అయినా నువ్వు ఆలోచించవలసింది తన కోసం కాదు నీ కుటుంబం కోసం. మీ వాళ్ళు మనల్ని కాదనుకున్నా, మనం వాళ్ళని వద్దనుకోలేదు ఇప్పుడు మనకి వాళ్లే ఇంపార్టెంట్. దాని గురించి ఆలోచించు అంటుంది హారిక. ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నాడు అంటే ఇంకా రాశిని మర్చిపోలేదన్నమాట అనుకుంటుంది హారిక. ఏంటి అలా ఆలోచిస్తున్నావు రాశి నీ గతం, ఇప్పుడు నీ లైఫ్ లో నేను ఉన్నాను నువ్వు రాసిని మర్చిపో అంటుంది హారిక.

మరిచిపోవటం అనుకున్నంత సులువు కాదు ఎంత వద్దనుకున్నా నా మనసు రాసి గురించి ఆలోచించకుండా ఉండలేక పోతుంది అనుకుంటాడు హర్ష. నువ్వు డిస్టర్బ్ గా ఉన్నట్టు ఉన్నావు నిన్ను ఎక్కువ ఆలోచించొద్దు అన్నాను కదా అంటుంది హారిక. నేను లైట్ తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే ప్రేమించిన వాళ్ళని మనం వద్దనుకున్న మనసు మాత్రం వాళ్ల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. నేను ఇతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టే నేను వద్దనుకున్న నా మనసులో ఒక మూలన తను ఎప్పటికీ ఉంది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్ష.

Intiki Deepam Illalu January 31 Today Episode రాఖి కావాలనే చేస్తున్నాడు అంటున్న హారిక..

రాఖి కావాలనే హర్షని డిస్టర్బ్ చేస్తున్నాడా అనుకుంటుంది హారిక. మరోవైపు డ్రింక్ చేస్తూ హర్ష మాటల్ని తలుచుకుంటాడు రాఖి. నీ పెళ్ళాంతో రిలేషన్ పెట్టుకుంటానంటే ఎవరికైనా కాలుతుంది అలాగే హర్ష కి కూడా బాగా కాలినట్టుగా ఉంది. హర్ష ఇలా డిస్టర్బ్ మూడ్ లో ఉన్నప్పుడే హారిక గురించి నిజం తెలిసేలాగా ప్లాన్ చేయాలి అనుకుంటాడు రాఖి. అంతలోనే దమయంతి ఫోన్ చేయటంతో ఈ టైం అప్పుడు ఫోన్ చేశారేంటి ఏదైనా ప్రాబ్లమా అంటాడు రాఖి.

నీతో మాట్లాడాలి రేపు ఒకసారి ఇంటికి రా అంటుంది దమయంతి. సరే అంటూ ఫోన్ పెట్టేసిన రాఖి కొడుకు చచ్చిన బాధలో ఉండి నాతో ఏదో మాట్లాడాలి అన్నాదంటే అంటూ ఆలోచనలో పడతాడు రాఖి. తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన దమయంతిని వర్షిణిని పరామర్శించడానికి వచ్చినందుకు సంతోషం ఉంటుంది కృష్ణ. నేను వచ్చింది అందుకు కాదు,చావు ఇంట్లో శుభం జరగాలంట అందుకే నా కూతురు రాసికి వేరే సంబంధం చూశాను అంటుంది దమయంతి.