Intiki Deepam Illalu January 4th Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రాఖి హారిక తో మాట్లాడుతూ, మోసం చేసిన వారిని క్షమించవచ్చు కానీ నమ్మించి మోసం చేసిన వారిని క్షమించలేము నువ్వే ఆ ఇంటి బాధకు కారణం అయ్యావని హర్షకు తెలిస్తే మళ్లీ ఒంటరిదానివి అవుతావు అని బెదిరిస్తాడు. ఈ విషయం బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది హారిక.
హారికను బెదిరించిన రాఖి..
ఎంత కావాలంటే అంత డబ్బు ఇవ్వాలి అని అంటాడు రాఖి. మరి ఇప్పుడు డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ బెదిరించవని గ్యారెంటీ ఏంటి అని అంటుంది హారిక. కదా, నాలాంటి వాళ్ళని నమ్మడానికి వీలు లేదు ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాఖి. మరోవైపు హర్ష దీర్ఘ ఆలోచనలలో ఉంటూ హారిక నా ఫ్యామిలీ కోసం చాలా ఆలోచిస్తుంది.
ఇంక తనని ఇబ్బంది పెట్టకుండా అమ్మని వదినని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హారిక హర్ష కోసం వెతుకుతూ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని కంగారుపడుతుంది. ఇలాంటి సమయంలో హర్ష వెళ్ళాడు ఏంటి నన్ను భయపెట్టడానికి రాఖి మళ్ళీ హర్షిని కిడ్నాప్ చేసినా చెయ్యొచ్చు అని కంగారు పడుతుంది. ఆ తర్వాత సీన్లో లీలావతి ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది.
లీలావతి కి ధైర్యం చెబుతున్న కృష్ణ..
కృష్ణ అక్కడికి వెళ్లి బాధపడకండి అత్తయ్య మీరు మావయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లారు కదా వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతుంది.వాళ్ళు జైల్లో ఉన్నారు అని కన్నా మనం ఇక్కడ ఎన్ని బాధలు పడుతున్నాము అని వాళ్ళు బాధపడుతున్నారమ్మా. మీ మావయ్య ఒక పెద్ద ఆఫీస్ కి ఓనరు అలాంటి ఆయన జైల్లో ఉండడం ఏంటి వాళ్లకి ఎలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతుంది. ఇప్పుడు మనం వాళ్ళ గురించి బాధపడుతున్నామని తెలిస్తే వాళ్లు మన గురించి ఇంకా బెంగపెట్టుకుంటారు అత్తయ్య.
మీరు బాధపడొద్దు అని ధైర్యం చెబుతుంది కృష్ణ. ఆ తర్వాత సీన్లో హర్ష ఒకడిని కలిసి నాకు నువ్వు ఒక సహాయం చేయాలి అని అడుగుతాడు. ఏంటి సార్ అని అతను అనగా నువ్వు నాకు ఒక సహాయం చేయాలి నేను నిన్ను పంపించాను అని తెలియకుండా మా అమ్మ వదినలను నా గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాలి. మా అన్నయ్య నాన్న జైల్లో ఉన్నారు ఇలాంటి సమయంలో నేను వాళ్లకి సహాయంగా ఉండాలి నా మీద కోపంతో వాళ్ళు నా ఇంటికి రాను అంటున్నారు.
తన అమ్మ, వదినలను ఇంటికి రప్పించే ప్రయత్నంలో హర్ష..
కానీ నేను వాళ్ళని అలా వదిలేయను ఈ యొక్క సహాయం చెయ్యు అని అనగా సరే ఇప్పుడే వెళ్లి మాట్లాడుతాను సార్ అని వాడు బయలుదేరుతాడు. ఆ తర్వాత సీన్లో రోడ్డుమీద హారిక రాశిలు ఎదురవుతారు. లిఫ్ట్ కోసం వచ్చావా అని హారిక అడగగా లేదు నీ దగ్గరికే వచ్చాను నువ్వు డబ్బున్న దానివని కోటీశ్వరులు అని విర్రవీగి నా భర్తని నీ గుప్పెట్లో ఉంచుకున్నావు కదా నేను త్వరలోనే కోటీశ్వరురాలిని అవ్వబోతున్నాను డబ్బులు వచ్చిన తర్వాత నిన్ను ఒక ఆట ఆడిస్తాను.
నా భర్తను నా దగ్గర నుంచి లాక్కున్నందుకు నీకు తగిన శాస్తి చేస్తాను అని అంటుంది. పగటి కలలు కనడం ఆపు మొన్న మీ అమ్మ కూడా అలాగే వచ్చి వార్నింగ్ ఇచ్చింది గట్టిగా మాట్లాడేసరికి ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోయింది చేతనైన చేసుకొ అని చెప్పి వెళ్ళిపోతుంది హారిక. ఆ తర్వాత సీన్లో మహేశ్వరి హాస్పిటల్ మంచం మీద కూర్చుని బాధపడుతూ ఉంటుంది. భోజనం చేయలేదేందుకు అని నర్స్ అడగగా తినాలని లేదు అని అంటుంది.
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే తినాలి. మీరు కోలుకొని వెళ్తే ఈ బెడ్ ఇంకొకరికి ఇస్తాము. బెడ్లు లేక చాలామంది ఉన్నారు అని అంటుంది. ఆ తర్వాత కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ మావయ్య బెయిల్ కావాలంటే సొంతిల్లు ఉన్న వాళ్ళు లేకపోతే ఉద్యోగస్తులు ఇప్పిస్తేనే వస్తాది అని అన్న మాటలు గుర్తు తెచ్చుకొని వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళదామని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత సీన్లో హారిక సోఫాలో కూర్చుని ఉంటుంది.
హారిక మెడ పట్టుకున్న హర్ష..
కోపంతో హర్ష వచ్చి హారిక మెడ పట్టుకొని నువ్వు ఇంత పని చేసావేంటి అసలు నిజం చెప్పు నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నీకు గండం ఉన్నది అని నటించావు. నా భార్య రాశి చెడ్డదై ఉండొచ్చు. అన్న,వదినలకు ఎన్నో గొడవలు పెట్టి ఉండొచ్చు కానీ నా వరకు తను ఎప్పుడూ ఎటువంటి హాని కలిగించలేదు నీలా నమ్మించి మోసం చేయలేదు ఇలాంటి వాళ్ళని చంపాలి. కాదు కాదు నేనే తప్పు చేశాను అంటూ తను షూట్ చేసేసుకుంటాడు.
అదే సమయంలో హారిక,హర్ష అని గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడుతుంది. ఆ అరుపులకు పరిగెత్తుకుంటూ వచ్చిన హర్ష ఏమైంది అని అడగగా ఏమీ లేదు నువ్వు నా పక్కనే ఉండు ధైర్యంగా ఉంటుంది అని చెప్తుంది హారిక. ఆ తర్వాత సీన్లో నేను ఎలాగైనా డబ్బు ఉన్న దాన్ని అవ్వాలి అని రాసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో దమయంతి వచ్చి నువ్వు డబ్బున్న దానివైతే ఎలాంటి బంగ్లాలో ఉండాలా అని ఆలోచించుకుంటున్నావా అని అడుగుతుంది.
దమయంతి దగ్గర సహాయం కోరిన కృష్ణ..
ఇంతలో కృష్ణ అక్కడికి వస్తుంది కృష్ణుని చూసిన రాశి ఇక్కడికి ఎందుకు వచ్చావు చిల్లర కోసం వచ్చినట్టున్నారు. ఇస్తే మళ్లీ మళ్లీ వస్తారు ఓ రెండు పాత చీరలు ఉంటే ఇచ్చేయ్ అమ్మ అని అంటుంది. నేను దానికోసం రాలేదు అని కృష్ణ అనగా మరి దేనికోసం వచ్చావు అని దమయంతి అంటుంది. మా మావయ్య వాళ్లకి బెయిల్ రావాలంటే ఒక సొంతిల్లు ఉన్న వారు అయినా లేక ఉద్యోగం ఉన్న వారు అయినా బెయిల్ ఇప్పించాలట.
Intiki Deepam Illalu January 4th Today Episode:
ఈ ఇంటికి యజమానురాలివి నువ్వే కదా పిన్ని దయచేసి వాళ్లకి బెయిల్ ఒప్పించి పుణ్యం కట్టుకొ అని అడుగుతుంది. ఒకప్పుడు నేను మీ ఇంటికి వస్తే నన్ను అంత చులకన చేశారు మళ్ళీ నా దగ్గరికి వచ్చి సహాయం చేస్తున్నారు బయటకు పో అని అంటుంది. అప్పుడు కృష్ణ రాశి తో అది నీ అత్తల్లే కద అక్క నువ్వైనా ఏదో ఒకటి చెయ్ అని అనగా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా వెళ్లి ఇక్కడి నుంచి అని గట్టిగా ఉంటుంది రాశి.
తరువాయి భాగంలో రాఖి, మనో వాళ్లకి బెయిల్ ఇప్పిస్తాడు. ఈ విషయాన్ని మనం రాఖీ ఫోన్ తోనే తన భార్యకి చెప్తాడు. ఆనందించిన కృష్ణ,లీలావతి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కి వస్తారు.