Intiki Deepam Illalu January 6 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో హర్ష ఆఫీస్ కి వచ్చిన రాఖి తనని తాను పరిచయం చేసుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన హారిక వీడు ఎక్కడికి వచ్చాడు ఏంటి అని కంగారుపడుతుంది. నేను, హారిక బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాడు రాఖి. హారిక దాక్కుకుంటుంది. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోవటంతో రాఖి నా గురించే అంతా చెప్పేస్తున్నాడు అని భయపడుతుంది.
టెన్షన్ తట్టుకోలేకపోతున్న హారిక..
హర్ష తో మాట్లాడిన రాఖి నేరుగా హారిక దగ్గరికి వచ్చి పార్ట్నర్ దగ్గర కొన్ని విషయాలు చెప్పకపోవడం ఎంత మంచిదో,కొన్ని విషయాలు చెప్పడం అంతే మంచిది. అందుకే నువ్వు హర్ష దగ్గర దాచిన నిజాన్ని నేను చెప్పేశాను అంటూ కూల్ గా అక్కడినుంచి వెళ్ళిపోతాడు రాఖి. ఆ మాటలకి చెమటలు పట్టిన హారిక ఇప్పుడు ఏమని చెప్పి హర్షని నమ్మించాలి అనుకుంటుంది. హర్ష దగ్గరికి వచ్చిన హారిక ఎందుకు సీరియస్ గా ఉన్నావు అని అడుగుతుంది.
రాఖి వచ్చాడు తను మీ బెస్ట్ ఫ్రెండ్ కదా నీ గురించి చాలా చెప్పాడు అంటాడు హర్ష. ఏమని చెప్పాడు అని హారిక అడిగితే, తను నా గురించే చెప్పాడు ఎవరో కావాలనే నా ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పాడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటాడు హర్ష. అంటే ఆ రాఖి నా గురించి ఏమీ చెప్పలేదు అన్నమాట ఈ సైకోలు ఎప్పుడూ ఇంతే చేసేది చెప్పరు చెప్పేది చేయరు అనుకుంటుంది హారిక. తను నీ గురించి చాలా పాజిటివ్ గా చెప్పాడు చాలా మంచోడు అంటాడు హర్ష.
ఆలోచనలో పడ్డ సూర్య..
మరోవైపు తల్లి అన్న మాటలకి ఆలోచనలు పడతాడు సూర్య. వాళ్లకి ఉన్నట్టుండి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు కోసం అమ్మ ఏమైనా పిచ్చి పనులు చేయబోతుందా అంటూ ఆలోచనలో పడతాడు. అంతలోనే అక్కడికి వచ్చిన వర్షిణి ఆలోచనలో ఉన్న సూర్యని ఎందుకలా ఉన్నావ్ అని అడుగుతుంది. మా అమ్మ కొత్త విషయాలు చెబుతుంది, వాళ్లకి ఎక్కడి నుంచో కోట్ల ఆస్తులు వస్తున్నాయంట ఏదో ఊరు వెళ్తున్నారు, నీకు విడాకులు ఇచ్చేసి నన్ను కూడా రమ్మంటున్నారు అంటాడు సూర్య.
అయితే ఎప్పుడూ విడాకులు ఇస్తున్నావ్ అంటూ నవ్వుతుంది వర్షిణి. ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు సూర్య. లేకపోతే ఏంటి సూర్య మనం అన్యోన్యంగా ఉండడం చూసి ఓర్వ లేక పోతుంది మనం ఎలాగో వాళ్ళ మాటలు వినట్లేదు కాబట్టి డబ్బా అసలు చూపిస్తే అయినా టెంప్ట్ అవుతావేమో అని ఇలా ప్లాన్ చేసి ఉంటుంది. మీ అమ్మ ఈ జన్మకి మారదు రాశిని సగం చెడగొట్టింది మీ అమ్మే.
సూర్యకి అదిరిపోయే సలహా ఇచ్చిన వర్షిణి..
రాశిని చెడగొట్టిందే కాక ఇప్పుడు నిన్ను కూడా చెడగొట్టాలని చూస్తుంది ముందు వాళ్ళిద్దర్నీ కలవనీయకుండా చేస్తే వాళ్లు మనల్ని మనశ్శాంతిగా ఉండనిస్తారు అంటుంది వర్షిణి. నాక్కూడా అలాగే అనిపిస్తుంది వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో అంటాడు సూర్య. కోట్లాస్తి అంటున్నారు అంటే ఏదో తప్పుడు పని చేస్తున్నారు అంటుంది వర్షిణి. ఇప్పుడు రాసి కూడా తోడైంది కాబట్టి ఏదైనా జరగకూడదు జరిగితే రాశి ని కూడా ఇరికించేస్తుంది మీ అమ్మ.
లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటే తీర్చే పరిస్థితుల్లో కూడా మనం లేము ఒక పని చెయ్యు మీ అమ్మ చెప్పినట్లు నడుచుకుంటూ వాళ్లు ఏం చేస్తున్నారు జాగ్రత్తగా గమనించు వాళ్ళు ఏ సమస్యల్లో ఇరుక్కోకుండా చూడు అంటూ సలహా ఇస్తుంది వర్షిణి. మరోవైపు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని ఎందుకు విడిపించాలి అనుకుంటున్నారు అంటూ రాఖిని అడుగుతాడు లాయర్. మీకు డబ్బిచ్చింది నేను చెప్పిన పని చేయడానికి అంతేగాని నా ఒపీనియన్స్ తెలుసుకోవడానికి కాదు అంటాడు రాఖి.
మనో కోసం బెయిల్ అరేంజ్ చేసిన రాఖి..
పోలీస్ స్టేషన్కు వచ్చిన రాఖి మా లాయర్ ని తీసుకొని వచ్చాను ఫార్మాలిటీస్ ఒక అరగంట పడుతుంది తర్వాత మిమ్మల్ని రిలీజ్ చేస్తారు అంటాడు రాఖి. ఆ మాటలకి సంతోషిస్తాడు మనో, జగదీశ్ లు. మనో గారు మీరు జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో దాని గురించి మాత్రమే ఆలోచించండి అంటూ సలహా ఇస్తాడు రాఖి. మావల్ల సాయం పొందిన వాళ్ళందరూ మేమున్న పరిస్థితుల్లో మొహం చాటేసారు కానీ మీరు మాకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు చాలా సంతోషంగా ఉంది అంటాడు జగదీష్.
మీ వల్ల బయటకు వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు మనో. అన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినట్లే జరిగితే సాటిస్ఫాక్షన్ తప్పితే త్రిల్లింగ్ ఉండదు అంటాడు రాఖి. మీరు మంచి ఫిలాసఫర్ లా ఉన్నారు అంటాడు మనో. ఫిలాసఫీ ఇస్ నథింగ్ బట్ రియాలిటీ యు నో అంటాడు రాఖి. మా వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి అంటూ రాఖీని ఫోన్ అడుగుతాడు మనో. మన పూలవడికి ఫోన్ చేస్తే తను ఎవరో అనుకొని మాట్లాడేస్తుంది.
కృష్ణ కి గుడ్ న్యూస్ చెప్పిన మనో..
నేను కృష్ణ భర్త నండి ఏదైనా అవసరం ఉంటే ఈ నెంబర్ కి ఫోన్ చేయమని చెప్పింది అంటాడు మనో. సరే ఉండండి ఇప్పుడే ఇస్తాను అంటూ కృష్ణకి ఫోన్ వస్తుంది ఆ పూలావిడ. అప్పుడు మనో జరిగిందంతా కృష్ణకి చెప్తాడు. ఆయనకి మా తరుపున కృతజ్ఞతలు చెప్పండి అంటుంది కృష్ణ. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అంటూ ఫోన్ పెట్టేసి విషయం అంతా లీలావతికి చెప్తుంది కృష్ణ. లీలావతి చాలా సంతోషిస్తుంది.
ఈ విషయం మా అత్తయ్యకి చెప్తే చాలా సంతోషిస్తారు అని కృష్ణకి అంటే అవును ఈ విషయం తెలిస్తే తనకి సగం బెంగ తీరిపోతుంది, మీ అన్నయ్య వాళ్లకి కూడా ఈ విషయం చెప్పు అంటుంది లీలావతి. మరోవైపు ఆలోచిస్తూ కూర్చున్న రాశిని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. నేను దాచుకున్న డబ్బుంతా సిబిఐ వాళ్ళు ఎత్తుకుపోయారు ఇప్పుడు అంత డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్నాను అంటుంది రాశి. గట్టిగా మాట్లాడకు మీ అన్నయ్య వాళ్ళు విన్నారంటే మనల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వేస్తారు.
తన ప్లాన్ అమలు చేస్తున్న సూర్య..
అయినా అంతకు మించిన ఆస్తి నీ చేతికి వచ్చేలాగా ప్లాన్ చేశాను అందుకే ఆ పోయిన డబ్బు కోసం ఆలోచించకు అంటుంది దమయంతి. అంతలోనే అక్కడికి వచ్చిన సూర్య నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచించానమ్మ, ఇప్పుడు వర్షిణి వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా మాకు ఆస్తులు ఇచ్చే లాగా లేరు, ఈ పేద బతుకు మీద అసహ్యం వేసింది అమ్మ అంటాడు సూర్య. నేను ఇలా మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నారు కదా అంటాడు సూర్య.
నువ్వే అన్నావు కదా మనకి ఆస్తులు వస్తాయి నాకు రెండో పెళ్లి చేస్తానని, అప్పుడంటే వర్షిని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి తను చెప్పినట్లు చేశాను ఇప్పుడు నువ్వు చెప్పినట్లు చేస్తాను అంటాడు సూర్య. ఆ మాటలకి ఆనందంతో ఆశ్చర్యంతో ఎగ్జైట్ అయిపోతుంది దమయంతి. ఎన్నాళ్ళకి నా కొడుకు లాగా మాట్లాడావ్ రా పెళ్లికి ముందు ఇలాగే ఉండేవాడివి ఈ మొదలిస్టుకు దాన్ని పెళ్లి చేసుకున్నకే నువ్వు మారిపోయావు ఇప్పటికైనా మారావ్ అంతే సంతోషం అంటుంది దమయంతి.
సూర్యని అనుమానిస్తున్న రాశి..
రెండో పెళ్లి చేసుకుంటే నాకు హర్ష కి తేడా ఏంటి అని అడుగుతాడు సూర్య. ఆ హర్ష తో నీకేంటి పోలిక, రాశికి విడాకులు ఇవ్వకముందే వేరొక దాంతో ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ నువ్వు అలా కాదు వర్షిణి కి విడాకులు ఇచ్చాకే రెండో పెళ్లి చేసుకుందువుగానివి అంటుంది దమయంతి. నువ్వు నిజంగానే మారావా అసలు నీ మనసులో ఏముందో నిజం చెప్పు నువ్వు ఇంత సడన్గా మారావంటే నమ్మలేకపోతున్నాం అంటుంది రాశి. నువ్వు ఈ ఇల్లు ఎప్పుడైతే రాసిపోయినా రాసిస్తానన్నావు అప్పుడే నా ఆలోచనలు మారాయమ్మ.
Intiki Deepam Illalu January 6 Today Episode:
సరైన సంపాదన లేక, ఇల్లు లేకపోతే వర్షిణి ఏ కాదు ఏ పెళ్ళాం అయినా నాతో కాపురం చేయదు చేతకాని చవటలాగా చూస్తుంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను కానీ ఒక కండిషన్ ఈ ఇల్లు నా పేరు మీద రాయాలి అంటాడు సూర్య. ఆ మాటలకి షాక్ అవుతారు తల్లి కూతుర్లు. తల్లిని పక్కకు తీసుకొని వెళ్లి అలా ఎప్పటికీ ఒప్పుకోకమ్మ ఈ ఇల్లు వాడి పేరు మీద మారిపోతే కృష్ణ కోసం ఖర్చు పెడతాడేమో అంటుంది రాశి. కానీ ఇప్పుడు నమ్మక తప్పదు ఎందుకంటే మనకి మగ తోడు చాలా అవసరం ఆ హరి నారాయణ మహా డేంజర్.
అదే సూర్య మన దగ్గర ఉంటే వాడు కొంచెం భయపడతాడు. ముందు మన పని కానీ తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అంటుంది దమయంతి. అదే విషయాన్ని సూర్యతో చెప్పి ఈ ఇల్లు నీ పేరు మీదే రాస్తాను కానీ ముందు నేను చెప్పినట్లుగా విను అంటుంది దమయంతి. తరువాయి భాగంలో మహేశ్వరిని, మనో, జగదీష్ లోని తీసుకుని వాళ్ళు ఉండే ఇంటికి వస్తారు కృష్ణ,లీలావతి. మనం ఎక్కడికి ఎందుకు వచ్చావు అని మహేశ్వరి అడిగితే ఇప్పుడు ఇదే మన ఇల్లు అంటూ జరిగిందంతా చెబుతుంది కృష్ణ.