Intiki Deepam Illalu January 7 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నేను నీ పేరున ఇల్లు రాయాలంటే అంతకంటే ముందు నేను చెప్పిన పని చేయాలి అంటుంది దమయంతి. ఏం చేయాలి అని కృష్ణ అడిగితే బట్టలు సర్దుకొని రా మనం ఉండవలసింది ఇక్కడ కాదు అంటుంది. మరి ఇంకెక్కడ అంటే హరి నారాయణ గారి ఇంట్లో అంటుంది. ఆ మాటకి షాక్ అయిన సూర్య మన శత్రువుల ఇంటికి వెళ్లడం ఏంటి అంటాడు.
రాఖికి థాంక్స్ చెప్పిన కృష్ణ లీలావతి..
నీకు కావాల్సింది డబ్బులా? ఆరాలా? అంటుంది రాశి. అలా అని కాదు మన శత్రువుల ఇంట్లో ఉండడం ఏంటని నా అనుమానం అని సూర్య అంటే, అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుంది ముందే చెప్పేస్తే కదా ఎలా ముందుకు వెళుతుంది వెళ్లి నీ పెళ్ళానికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో త్వరగా బట్టలు సర్దుకొని రా అంటుంది దమయంతి. అంతలోనే సూర్యకి కృష్ణ ఫోన్ చేసి మనోవాళ్ళకి బెయిల్ వచ్చిన విషయం చెప్తుంది. ఇప్పుడే వస్తాను అంటూ ఆనందంగా బయలుదేరుతాడు సూర్య.
మరోవైపు జైలు నుంచి రిలీజ్ అయిన మనో వాళ్ళ దగ్గరికి వచ్చిన కృష్ణ వాళ్ళు ఆనందంతో ఏడుస్తారు. అక్కడే ఉన్న రాఖిని చూపించి ఈయనే మాకు బెయిల్ ఇచ్చింది అంటే కృష్ణ వాళ్ళకి చూపిస్తాడు మనో. అతనికి సంతోషంతో కృతజ్ఞతలు చెప్పుకుంటారు కృష్ణ వాళ్ళు. పర్వాలేదండి మళ్లీ కలుద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాఖి.అంతలోనే సూర్య ఆనందంతో అక్కడికి వస్తాడు.
సూర్యకి థాంక్స్ చెప్పిన మనో..
మీరు రిలీజ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది మీకు బెయిల్ కోసం చాలా ట్రై చేసాం కానీ కుదరలేదు అంటాడు సూర్య. మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు చాలా అండగా ఉన్నావు థాంక్స్ అంటాడు మనో. మనలో మనకి థాంక్స్ ఎందుకు బావ అంటాడు సూర్య. మహేశ్వరి రాలేదేమి అని అడుగుతాడు జగదీష్. తడబడుతున్న లీలావతిని అడ్డుకొని ఆమె మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు అంటుంది కృష్ణ.
అందరూ ఇంటికి వెళ్లబోతుండగా సూర్య లీలావతిని ఆపి మీరు వెళ్లిన ఇంట్లో అన్ని వస్తువులు ఉండవు కదా అందుకే నేను వండించి తీసుకువస్తాను అంటాడు. వద్దు బాబు మళ్లీ మీ అమ్మ తిడుతుంది అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతారు లీలావతి వాళ్ళు. మరోవైపు ఇంటికి వచ్చినా సూర్య వర్షిణికి జరిగిందంతా చెప్తాడు. ఆనందపడిన వర్షిణి, ఈ సంగతి తెలిస్తే అమ్మ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది మనం వెళ్దాం సూర్య అంటుంది.
నిజం తెలుసుకొని షాకైన తల్లి కూతుర్లు..
ఇందాక పెళ్ళాం అన్నం కొన్నాడు ఇప్పుడు ఫెవికాల్ లాగా అతుక్కుంటున్నాడు వీడిని అంత తొందరగా నమ్మడానికి వీల్లేదు అనుకుంటుంది దమయంతి. ఏంటి అంత సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు అంటుంది రాశి. ఏం మా సంతోషాన్ని చూడలేకపోతున్నావా అంటుంది వర్షిణి. దీన్ని వదిలించుకుంటానని చెప్పి దాంతోనే కులుకుతున్నావేమి అని కొడుకుని నిలదీస్తుంది దమయంతి.
అదేమీ కాదమ్మా అంటూ జరిగిందంతా చెప్తాడు సూర్య. ఆ మాటకి షాక్ అయినా తల్లి కూతుర్లు వాళ్ళకి బెయిల్ ఎవరు ఇచ్చారు అంటారు. ఎవరో ఒకరు ఇచ్చారు దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అంటుంది వర్షిణి. ఏదో ఎంతైనా కేసులు ఎన్ని మాఫీ అయిపోయినట్టు తెగ సంబరపడిపోతున్నావు అని రాసి అంటే ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి అంటుంది వర్షిణి. నీ పెళ్ళాం అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటావా అంటుంది దమయంతి.
తల్లి ఫోన్ చూసి షాకైన సూర్య..
ఎలాగూ వదిలించుకోవాలనుకుంటున్నాను కదా అందుకే ఏమీ మాట్లాడలేదు అంటాడు సూర్య. ఇంతకీ బెయిల్ ఎవరిచ్చారు ఇచ్చారు అంటుంది దమయంతి. సూర్య ఏదో సమాధానం చెప్పే లోగానే ఫోన్ రావటంతో సరేలే ఎవరిస్తే నాకెందుకు నువ్వు వెళ్ళు అని సూర్య అని పంపించేసి తను ఫోన్ మాట్లాడుతుంది. అవతల ఫోన్ చేసింది ఉదయ్, మీ ప్లేస్ చూపించడానికి రెడీగా ఉన్నాం ఎప్పుడు వస్తారు అని అడిగితే రెండు రోజుల్లో వస్తాం.
ఈలోపు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకు వర్షిణికి తెలిసింది అంటే ప్లాన్ అప్సెట్ అవుతుంది అని ఉదయ్ కి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దమయంతి. ఫోన్ చార్జింగ్ పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది దమయంతి. ఆమెకి తెలియకుండా ఆమె ఎవరితో మాట్లాడుతుందో చూసి షాక్ అవుతాడు సూర్య. ఇంతసేపు వాడితో మాట్లాడిందా వాళ్ళతో వీళ్ళకేం పని, అడిగినా నిజం చెప్పరు నేనే వెళ్లి తేల్చుకుంటాను అనుకుంటాడు సూర్య.
నిజం తెలుసుకొని షాకైన మనో,జగదీష్..
అందులోనే అక్కడికి వచ్చిన వర్షిణి అప్పుడే బయటికి వెళ్ళిపోతున్నావా భోజనం చేద్దాం రా అంటే నాకోసం వెయిట్ చేయొద్దు నువ్వు తినేయ్ అంటాడు. వెళ్తున్న సూర్య గుమ్మం తగులుకొని తూలిపోతాడు. నువ్వు నీ పని రేపు పెట్టుకో సూర్య ఇప్పుడు ఏదో అపశకునం లాగా ఉంది అంటుంది వర్షిణి.నాకు సెంటిమెంట్లు ఏమీ లేవు అంటూ వెళ్ళిపోతాడు సూర్య. మరోవైపు మనో వాళ్ళని ఇంటికి తీసుకొస్తారు కృష్ణ వాళ్లు.
ఆ ఇంటిని చూసి చాలా బాధపడతాడు మనో, ఇలాంటి ఇంట్లో ఎలా ఉంటున్నారు అంటాడు మనో, అమ్మ ఎక్కడ అని అడిగితే జరిగిందంతా చెప్తుంది కృష్ణ. ఈ పరిస్థితికి నేనే కారణం, కానీ నేను ఎవరిని మోసం చేయలేదు నిజాయితీగా నా పని నేను చేశాను అంటాడు మనో. ఇప్పుడే అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళండి అంటే లీలావతి. మనం ఎంతోమందికి ఇల్లులు కట్టించాం అలాంటిది ఇప్పుడు మనకి ఇల్లు లేకుండా పోయింది అని ఏడుస్తాడు జగదీష్.
మనో కి ధైర్యం చెబుతున్న అత్తా కోడళ్ళు..
ఏ కష్టమైనా వచ్చేది మన ఆత్మశార్యాన్ని పరీక్షించుకోవడానికి ఆ కష్టంలో నెగ్గితే జీవితంలో నెగ్గినట్టే, అప్పటివరకు కాస్త ఓపికతో వెయిట్ చేయాలి అంతే అంటుంది కృష్ణ. మేము పెళ్లయిన కొత్తల్లో ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాము, నిజాయితీతో పెదనాన్న ఈ స్థాయికి వచ్చారు. మంచితనం ఉంటే ఎక్కడైనా ప్రశాంతంగా జీవించొచ్చు అంతేగాని ఈ ఇంటిని చూసి బాధపడొద్దు అంటూ ధైర్యం చెబుతుంది లీలావతి. మరోవైపు హరి నారాయణ ఇంటికి వస్తాడు సూర్య. దొంగ చాటుగా వాళ్ళు మాట్లాడుకుంటునది వింటాడు.
చిన్నప్పటినుంచి తప్పించుకుని తిరిగింది ఇది గట్టి పిండం అంటూ కృష్ణ చిన్నప్పటి ఫోటోని కోపంతో విసిరేస్తాడు హరి నారాయణ. ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు సూర్య. మా నాన్న ఆస్తిని రెండు భాగాలు చేయమంటే చేయలేదు ఆ కోపంతో మా అన్న వదినల్ని చంపేశాను కానీ ఇది తప్పించుకుంది అంటాడు హరి నారాయణ. టైం చూసుకొని దాన్ని ఫినిష్ చేయాలి అంటాడు దీపక్. లేపేద్దాం అంటే నువ్వే కదా అడ్డుకున్నావంటాడు హరి నారాయణ. దమ్ముంటే నీ రాశిని అప్పుడే వేసేస్తే ప్రాబ్లం మనదే అవుతుంది.
తల్లిని తిట్టుకుంటున్న సూర్య..
ఎందుకంటే తొందరగా నమ్మడానికి వీల్లేదు, చెప్పింది నిజమో కాదో తేలాలి అంటాడు దీపక్. ఈ మాటలు అన్నింటిని ఫోన్లో రికార్డు చేస్తాడు సూర్య. దమయంతి రాసి మన ఇంటికి వచ్చి పత్రాలు మీద సంతకాలు చేశాక మనకి రావాల్సిన ఆస్తి మనకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దర్నీ లేపేయొచ్చు అంటాడు దీపక్. అంతవరకు దమయంతికి మన మీద ఎలాంటి అనుమానం రాకుండా చూసుకుంటే చాలు అంటాడు దీపక్. వాళ్లని మన ఊరు తీసుకెళ్లి అక్కడ ఫినిష్ చేయాలి అంటాడు దీపక్.
కృష్ణ హరి నారాయణ అన్న కూతురా రాసిని కృష్ణ ప్లేస్ లో చూపిస్తుందా అమ్మ, ఇద్దరి ప్రాణాల్ని ప్రమాదంలో పడేసింది అమ్మ వీళ్ళని ఎలాగైనా రక్షించాలి అనుకుంటాడు సూర్య. నాకు దమయంతి మీద ఇంకా అనుమానం పోలేదు అంటాడు హరి నారాయణ, నువ్వు ఆపావు కాబట్టి లేకపోతే ఆ వర్షిని తీసుకొచ్చి నిజం చెప్పించేవాడిని అంటాడు హరి నారాయణ. వర్షిణి తో చెప్పించడం ఏంటి అంటే నిజం వర్షిణికి తెలుసా అనుకుంటాడు సూర్య.
Intiki Deepam Illalu January 7 Today Episode ప్రమాదంలో పడ్డ సూర్య..
వర్షినిణి కూడా నమ్మటానికి లేదు ఎందుకంటే అప్పట్లో కృష్ణ మీద కోపంతో తనని చంపించమని, తనతో నా పెళ్లి జరిపించడం కోసం కృష్ణ మీ అన్న కూతురు అని అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా అంటాడు దీపక్. వర్షిణి,కృష్ణని చంపమని చెప్పిందా అసలు ఈ నిజం వర్షిణికి ఎలా తెలుసు, పెళ్లయిన కొత్తలో నేనంటే ఇష్టం లేదని తెలుసు ఈ దీపక్ వల్ల మోసపోయిందని తెలుసు కానీ ఈ విషయం నాకు చెప్పలేదు ఎందుకు అనుకుంటాడు సూర్య.
అంతలో సూర్య ఫోన్ రింగ్ అవ్వటంతో అందరూ సూర్యని చూసేస్తారు. తరువాయి భాగంలో మహేశ్వరిని ఇంటికి తీసుకువస్తే ఇది మన ఇల్లు కాదు అంటుంది. అప్పుడు లీలావతి వాళ్ళు జరిగిందంతా ఆమెకి చెప్తారు. మన ఇంటిని జప్తి చేస్తే కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది అని కృష్ణ ఏడుస్తూ చెప్తుంది.