Intiki Deepam Illalu: మూర్ఖత్వంతో తన కాపురాన్ని, జీవితాన్ని పాడు చేసుకుంటున్న తన అక్క జీవితాన్ని సరిదిద్దడం కోసం భర్తతో కలిసి ప్రయత్నం చేస్తున్న ఒక చెల్లెలు కథ ఇంటికి దీపం ఇల్లాలు.

భర్తని తలుచుకొని బాధపడుతున్న వర్షిని దగ్గరికి వచ్చి నీ ధైర్యాన్ని నేను అవుతాను నీకోసం నేను ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను ఒక్క సూర్య అని తిరిగి తీసుకురావడం తప్ప అంటూ చెల్లెల్ని ఓదారుస్తాడు మనో. తను ఇలా ఇంట్లోనే ఉంటే బాధపడుతూ ఉంటుంది అలా బయటకు తీసుకెళ్తాను అని బయటికి తీసుకుని వెళ్తుంది కృష్ణ. మరోవైపు రాశిని బయటికి తీసుకువచ్చిన రాఖి పోయిన వాళ్ళ కోసం బాధపడితే వాళ్లు రారు కదా మీకోసం నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్తాడు.

కొబ్బరి బొండాలు తాగుదామని కిందికి దిగి కావాలని ఆమెతో క్లోజ్ గా మూవ్ అవుతాడు. అది చూసిన హర్ష ఇబ్బంది పడతాడు. అదే విషయాన్ని వచ్చి రాశిని నిలదీస్తే పెళ్ళాం పక్కన ఉండగా మరొక దానితో నువ్వు తిరిగితే తప్పులేదు కానీ నేను తిరిగితే నీకు తప్పుగా అనిపిస్తుందా అంటూ ముందుగా మాట్లాడుతుంది రాశి. తను నీ భార్యని తెలియదు అంటూ అమాయకంగా చెప్పాడు రాఖి. మనసులో మాత్రం నాకు కావాల్సిన రియాక్షన్ ఇదే అనుకుంటాడు.

మీరు ఆమెకి డైవర్స్ ఇస్తే నాకు లైన్ క్లియర్ అయిపోతుంది అని రాఖి అంటే నేను ఎప్పుడో ఇచ్చేశాను తనదే లేటు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్ష. మరోవైపు డిప్రెషన్ లో ఉన్న వర్షిని చావడానికి సిద్ధపడుతుంది. ఎంత వరించినో వెనుకపోవటంతో ఆమెని చెంప మీద కొడుతుంది కృష్ణ. నిన్ను చంపుకోవటానికా మేము బ్రతికి ఉన్నది అలా అయితే నీకంటే ముందు నేనే చస్తాను అంటుంది కృష్ణ. ఆమె మాటలకు కన్విన్స్ అయినా వర్షిణి ఆమెని పట్టుకుని ఏడుస్తుంది.

మరోవైపు కృష్ణ ప్రెగ్నెన్సీ పోవడానికి ఇతనే కారణం అని తెలిసిన దగ్గర నుంచి గిల్టిగా ఫీల్ అవుతూ ఉంటాడు మనో. అదే విషయాన్ని కృష్ణతో చెప్పి బాధపడతాడు. ఇంట్లో వాళ్లకు కూడా చెప్పేస్తాను అంటే వద్దు మన వల్ల వాళ్ళు బాధపడకూడదు ఇప్పటికే వర్షిని కోసం చాలా బాధపడుతున్నారు అంటూ భర్తకి సర్ది చెప్తుంది కృష్ణ. మరోవైపు రాఖీ,రాశీకి సారీ చెప్తాడు నేను నీ పక్కన ఉండటం వల్లే తను నీ క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడాడు అంటాడు.

సంస్కారం లేని అలాంటి వాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటుంది రాశి. జరిగిందంతా తల్లితో చెప్తే ఆమె మరింత మండిపడుతుంది. అలాంటి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తాను అన్నా నేను పంపించను అంటుంది దమయంతి. రాఖీని పెళ్లి చేసుకో నీ జీవితం బాగుంటుంది అంటూ సలహా ఇస్తుంది. ఈ విషయం అనవసరంగా తల్లికి చెప్పాను అనుకుంటుంది రాశి. మరోవైపు తల్లి కూతుర్లని పలకరించడానికి వచ్చిన కృష్ణని నానా మాటలు అంటారు.

భర్త లేకపోతే ఆడదాని జీవితం చాలా భారంగా ఉంటుంది అందుకే మనం అక్క నీ హర్షాన్ని కలుపుదాము అంటే మీరు వద్దు మీ సంబంధం వద్దు నా కూతురు బాగోగులు నేను చూసుకుంటాను అంటూ కృష్ణ మీద కేకలు వేస్తుంది. హర్ష మంచివాడు పిన్ని హారిక వల్ల అలాగా తయారయ్యాడు తెలుసుకునే రోజు తనే అక్కని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అని కృష్ణ అంటే వాళ్ల గురించి అంతా మంచిగా మాట్లాడుతున్నావు అయినా కూడా నిన్ను వాళ్ళు ఇంట్లోంచి గెంటేశారు సిగ్గు లేకుండా నువ్వు ఇంకా అక్కడే ఉంటున్నావు అంటూ కృష్ణ కి చివాట్లు పెడుతుంది దమయంతి.

నువ్వైనా అర్థం చేసుకో అని రాశి తో అంటే తను కూడా ఏమీ పట్టించుకోదు. మరోవైపు కోపంగా ఇంటికి వచ్చిన హర్షని చూసి నా గురించి రాఖీ నిజం చెప్పేసాడు అని టెన్షన్ పడుతుంది హారిక. కానీ హర్ష,రాశి గురించి చెప్పి హారిక కి షాక్ ఇస్తాడు. తనకి నువ్వు డైవర్స్ ఇచ్చే ప్రయత్నంలోనే కదా ఉన్నావు మరి ఇతను ఎలా తిరిగితే నీకేంటి అంటుంది హారిక. తనకి నేను దూరంగా ఉన్నప్పటికీ నా మనసులో ఇప్పటికీ రాశి ఉంది అయినా రాఖి నీ ఫ్రెండే కదా ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దని తనతో చెప్పు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు హర్ష.

అంటే ఇంకా వర్షం మనసులో రాశి ఉందన్నమాట అనుకుంటుంది హారిక. మరోవైపు నేను చేసిన పనికి హర్ష కి బాగా కాలినట్లుగా ఉంది అని ఆలోచనలో పడతాడు రాఖి. హారిక గురించి నిజం చెప్పటానికి ఇదే సరియైన సమయం పడుకుంటాడు ఇంతలో దమయంతి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది. ఇంటికి వచ్చిన రాఖీ తో నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది దమయంతి. రాశి వారిస్తున్న ఊరుకోకుండా తనని అక్కడి నుంచి వెళ్లిపోమంటుంది.

స్ట్రైట్ గా అడుగుతుంది అంటే హర్ష తో గొడవ గురించి తెలిసిపోయి ఉంటుంది హర్షని రెచ్చగొట్టి చేశాను అనుకుంటాడు. హలో అడిగినందుకు రాసి తల్లిని కోప్పడుతుంది. నేను నీ తల్లిని నీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందో నాకు తెలుసు అని దమయంతి అంటే ఏం తెలుసు నా గురించి నీకు నా అభిప్రాయంతో నీకు పని లేదా అని రాశి అంటే నేను ఏం చేసినా నీ మంచి కోసమే వద్దు అన్నావంటే నేను చచ్చినంత ఒట్టు అని ఒట్టు వేయించుకుంటుంది దమయంతి.

మీ కూతురు బంగారము తనని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అంటాడు రాఖి. ఆ మాటలకి దమయంతి సంతోషపడితే రాశి షాక్ అవుతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ అత్తింటి వాళ్ళు మళ్ళీ ఈ గడపకూడదు ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పాలి అంటూ మా ఇంటికి బయలుదేరుతుంది దమయంతి. మరోవైపు పక్కనే హర్షిని కలపాల్సిన బాధ్యత మనదే అంటుంది కృష్ణ.

వాళ్ళిద్దరూ కలుస్తారని నాకు నమ్మకం లేదు రాశిని అయినా ఒప్పించొచ్చేమో గాని హర్ష ఇంకా ఆహారికనే నమ్ముతూ ముందుగా ప్రవర్తిస్తున్నాడు అంటాడు మనో. అలా అని చూస్తూ ఊరుకోలేము కదా ఎలా అయినా వాళ్ల జీవితాన్ని చక్కదిద్దాలి అంటుంది కృష్ణ. మరోవైపు సూర్యని చంపిన దగ్గర ఫోన్ దొరికింది అంటూ రౌడీలు ఆ ఫోన్ తీసుకొని వచ్చి దీపక్ కి ఇస్తారు. అందులో ఉన్న వాయిస్ మెసేజ్ ని తిన్న దీపక్, హరి నారాయణ షాక్ అవుతారు. తన ఆస్తికి అసలు కాశీ కాదని కృష్ణ అని సూర్య మాటలు ద్వారా తెలుసుకుంటారు.

దమయంతి ఇంత మోసం చేసిందా అంటూ హరి నారాయణ కోపంతో రగిలిపోతాడు. మరోవైపు కృష్ణ ఇంటికి వచ్చిన దమయంతిని సాదరంగా ఆహ్వానిస్తుంది. వదిలింది అనుకున్న పీడని పలకరించాలని ఇది రాలేదు నేను నా కూతురికి మరో పెళ్లి చేస్తున్నాను అంటూ నిజం చెప్పి అందరికీ షాక్ ఇస్తుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అంటాడు జగదీష్. తప్పు చేసింది జైలుకెళ్ళింది మీరు అంటూ వాళ్ళు తల దించుకునే లాగా మాట్లాడుతుంది దమయంతి.

మా మీద కోపంతో మీరు మీ కూతురికి అన్యాయం చేస్తున్నారు అలా చేయకండి అంటాడు మనో. మీరు చేసిన అన్యాయం ఏమిటో చెప్పండి అయినా నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని పెళ్లికి రావద్దు అని చెప్పటానికి అంతేగాని నాకు ఏమీ సలహాలు ఇవ్వకండి అంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దమయంతి. రాశి రెండో పెళ్ళికి ఎలా ఒప్పుకుంది అంటూ బాధపడుతుంది లీలావతి. మా పిన్ని పంపించి ఉంటుంది అక్కకి హర్ష అంటే ఇప్పటికీ ఇష్టమే అంటుంది కృష్ణ.

కృష్ణ దంపతులు రాసి తో రెండో పెళ్లి గురించి మాట్లాడితే నా జీవితం నా ఇష్టం అంటూ మొండిగా మాట్లాడుతుంది. ఇలాగ మాట్లాడితేనే హర్ష గారు లైన్ లోకి వస్తారు అనుకుంటుంది రాశి. మరోవైపు రాసి తో తన పెళ్లి గురించి హర్ష కి చెప్తాడు రాఖి. తను నా భార్య అని హర్ష అంటే నీ భార్య హారిక కదా, తనకి నువ్వంటే ఇష్టం లేదు కాబట్టే నాతో పెళ్లికి ఒప్పుకుంది. నీకు థాంక్స్ నేను తప్పకుండా పెళ్లికి ఇన్వైట్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు రాఖి.

అదే విషయాన్ని కృష్ణ కి ఫోన్ చేసి చెప్తే నువ్వు చేయగా లేనిది తను చేస్తే తప్పేముంది నీ వల్ల మేము అందరం మాటలు పడుతున్నాము అని హర్ష కి చివాట్లు పెడుతుంది. భర్త ఉండగా మన ఇంటి కోడలు మరొకరిని పెళ్లి చేసుకుంటుంది అంటే అది మన బరువుకి నష్టం దీని అంతకీ కారణం హారిక అంటూ హారిక ఇంటికి వెళ్లి ఆమెకి చివాట్లు పెడతారు లీలావతి దంపతులు. అప్పుడు అక్కడికి వచ్చిన హర్ష తనని ఎందుకంటారు తను చాలా మంచిది అంటూ హారికని వెనకేసుకొస్తాడు.

హర్షని చెంప మీద కొట్టి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రాశికి పెళ్లి జరగకుండా చూడవలసిన బాధ్యత నీది లేకపోతే జరిగేదే వేరు అంటూ వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారు లీలావతి దంపతులు. హర్ష హారిక కి ఫోన్ చేసి నువ్వు చేస్తున్నది తప్పు అని అంటే మీరు చేయగలంది నేను చేస్తే ఎందుకు తప్పు అవుతుంది డైవర్స్ పేపర్ తీసుకొని వస్తే రేపు పెద్దల ముందు సంతకాలు చేసుకుందాం అని ఫోన్ పెట్టేస్తుంది రాశి. మరోవైపు రాఖీ కి ఫోన్ చేసి నీవల్ల నాకు మంచే జరిగింది హర్ష రాశిలో విడాకులు చాలా తొందరగా అయిపోతున్నాయి చాలా థాంక్స్ అంటుంది.

నువ్వు జరిగిందానే చూస్తున్నావు కానీ జరగబోయే దాని గురించి ఆలోచించడం లేదు ముందు ముందు ఉంటుంది అంటూ ఫోన్ పెట్టేస్తాడు రాఖి. ఏం చేయబోతున్నాడు అంటూ భయపడుతుంది హారిక. మరోవైపు డైవర్స్ తీసుకోవడానికి వెళ్తున్నట్లుగా కృష్ణకి ఫోన్ చేసి చెప్తాడు హర్ష. ఎలాగైనా డైవర్స్ మీద సంతకం పెట్టకుండా ఆపాలి అని లీలావతి దంపతులు, కృష్ణ దంపతులు కూడా దమయంతి ఇంటికి వెళ్తారు.

Intiki Deepam Illalu చక్కని కుటుంబ కధకి పట్టం కట్టి మంచి రేటింగ్ ఇస్తున్న ప్రేక్షకులు..

అప్పటికే అక్కడ హర్ష ఉండటంతో నీకు నచ్చినట్లు చేయటమేనా పెద్దవాళ్ళని సంప్రదించవలసిన అవసరం లేదా అంటూ కొడుకుని మందలిస్తాడు జగదీష్. దమయంతి కూడా ఊరుకోకుండా వాళ్ళతో వాదనకి దిగుతుంది. మరి రాశి డైవర్స్ పేపర్ మీద సైన్ చేస్తుందా? హర్ష హారిక ని గురించి నిజం తెలుసుకుంటాడా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.