Intiki Deepam Illalu: అనుకోని పరిస్థితుల్లో ఉన్న ఇంటిని,కంపెనీని పోగొట్టుకొని రోడ్డుని పడ్డ ఒక కుటుంబం మళ్లీ నిలదొక్కుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ ఇంటికి దీపం ఇల్లాలు.

హారికని సారీ చెప్పమంటూ టార్చర్ పెడుతుంటాడు రాఖి. జరిగిందంట్లో ఇద్దరి తప్పు ఉంది అందుకని సారీ చెప్పే ప్రసక్తే లేదు అంటుంది హారిక. హర్షకి ఏది చెప్పాలో అదే చెప్పాను నిన్ను నా దాన్ని చేసుకుంటాను అంటూ వెటకారంగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాఖి. వీడి నస వదిలే లాగా లేదు అనుకుంటుంది హారిక.

మరోవైపు హారిక ఇంటికి వచ్చిన మనో ఆమెని నానా మాటలు అంటాడు. ఆధారాలు లేకుండా నన్ను ఏమీ అనకండి కావాలంటే నా ఆస్తి పత్రాలు తీసుకోండి అంటూ మనో ముందు మంచి దానిలాగా నటిస్తుంది హారిక. ఏమి చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతే మీరు చాలా మంచి వాళ్ళు మిమ్మల్ని బురిడి కొట్టించడం చాలా ఈజీ అనుకుంటుంది హారిక. మరోవైపు జాబ్స్ కోసం ఆఫీసులకి వెళ్తుంటే మనోని చాలా అసహ్యంగా మాట్లాడుతారు వాళ్ళు. లాభం లేదు అనుకొని ఆటో నడపటానికి సిద్ధమవుతాడు.

మరోవైపు తను పనిచేస్తున్న ఇంటి వాళ్ళ కుక్కర్ బాగు చేయించడం కోసం రోడ్డుమీద నించున్న కృష్ణ, ఆటో డ్రైవర్ గా మారిన మన ఇద్దరూ ఎదురవుతారు. ఒకరు చేస్తున్న పనులు ఒకరు తెలుసుకొని బాధపడతారు. సూర్య కనిపించాడేమో అని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎంక్వయిరీ చేస్తారు. వాళ్లు తిరిగి వేళా కుటుంబ సభ్యులందరి గురించి చెప్పి మాకు ఇంకా టైం పడుతుంది ఈలోపు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పండి. మా ఇన్వెస్టిగేషన్ కి అది యూస్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు ఎస్సై.

మరోవైపు మన జీవితాలు ఇలా అయిపోయాయి అని బాధపడుతున్న లీలావతి దంపతులని మనం మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటాము. మనో మనల్ని కారులో తిప్పుతాడు చూడండి అని మహేశ్వరి అంటూ ఉండగా అప్పుడే ఆటోలో బిగిన సూర్య ని చూసి షాక్ అవుతారు మహేశ్వరి వాళ్లు. అతని పరిస్థితికి జాలి పడతారు. ఇంటర్వ్యూలకి వెళ్లితే ఎదురైనా పరిస్థితిని ఇంట్లో వాళ్లకు చెప్పి ఇప్పుడు మనకి ఇదే ఆధారం అని చెప్తాడు. మరోవైపు దీపం ఒడిగట్టిన సంగతి తల్లికి చెప్పి బాధపడుతుంది వర్షిని.

అలాంటిదేమీ జరగదు భయపడకు మీ అన్నయ్య వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు అంటూ జరిగిందంతా చెబుతుంది మహేశ్వరి. మరోవైపు దమయంతిని సంతకం పెట్టడానికి రమ్మని దీపక్ వాళ్ళు అడిగితే నా కొడుకు కనిపించడం లేదు వాడు వచ్చేవరకు నేను సంతకం పెట్టడానికి రాను అంటూ తెగేసి చెప్తుంది దమయంతి. మరోవైపు హర్షని రాశితో విడాకులు తీసుకోమంటూ పోరు పెడుతుంది హారిక. అందుకోసం రాసి ఇంటికి వెళితే అక్కడ హర్షని నానా మాటలు అంటారు తల్లి కూతుర్లు.

వర్షిణి కూడా హర్షని తిట్టి పంపించేస్తుంది. వెళ్లిన పని ఏమైంది అని హారిక అడిగితే రాశి సంతకం పెట్టలేదు పైగా నన్ను మాటలు అంది అంటూ జరిగిందంతా చెప్తాడు హర్ష. సరే ఇంటికి వస్తున్నావా అంటే లేదు ఆఫీస్ కి వెళ్తున్నాను రాఖీ వస్తాడంట, మా అన్నయ్యని మోసం చేసిన వాళ్ల గురించి తెలిసంట చెప్తాడంట అని చెప్తాడు. అందుకు కంగారుపడిన హారిక నేను కూడా వస్తాను అంటూ రాఖీ కంటే ముందే ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. అక్కడ హర్ష కి మనో ఇంటికి వచ్చిన విషయం చెప్తుంది.

ఆఫీస్ కి వచ్చిన రాఖి ఏదో చెప్తుంటే హారికని ఏమీ అనవద్దు, తన గురించి దేవుడే చెప్పిన నేను నమ్మను అంటాడు హర్ష. వీడికి ఏం చెప్పినా నమ్మేలాగా లేడు అనుకొని వెళ్ళిపోతున్న రాఖీ దగ్గరికి వచ్చి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఛాలెంజ్ చేస్తుంది హారిక. లైఫ్ బోర్ గా అనిపిస్తుంది అనుకున్న టైంలో చాలెంజ్ విసిరేవు ఇక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటాడు రాఖీ. మరోవైపు అందరూ పనిచేస్తుండగా తిని కూర్చుంటున్నందుకు గిల్టీ గా ఫీల్ అవుతాడు జగదీష్.

మీకు ఒంట్లో బాగోలేదు మీరు బాగున్నప్పుడు పనిచేశారు కదా అంటూ అందరూ ఓదార్చుతారు. అయినా వినిపించుకోకుండా వాచ్మెన్ ఉద్యోగం లో జాయిన్ అవుతాడు జగదీష్. భర్తని అలా చూసి ఏడుస్తుంది లీలావతి. పోనీలే అక్క ఆయన సంతృప్తి కోసమైనా జాబ్ చేయని అంటుంది మహేశ్వరి. పెదనాన్నని అలా చూసినా మనోహర్ నా వల్లే మీ అందరికీ ఈ దుస్థితి అంటూ బాధపడతాడు. మరోవైపు అనుకోని పరిస్థితులలో లీలావతి వాళ్ళు పూలు అమ్ముతున్నట్లు, కృష్ణ పాచి పని చేస్తున్నట్లు తెలుసుకొని చాలా అసహ్యంగా మాట్లాడుతుంది రాశి.

కృష్ణని అనాధ అంటూ మాట్లాడితే మహేశ్వరి, లీలావతి రాశిని అడ్డమైన తిట్లు తిట్టి అక్కడ నుంచి వచ్చేస్తారు. అవమానంగా ఫీల్ అయిన రాసి వాళ్ళని తిట్టుకుంటూ వస్తుంటే ఆమెని రౌడీలు వెంబడిస్తారు. ఆ దారిలో వెళ్తున్న రాఖీ హామీని రక్షించి ఆమెతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రాశికి తెలియని విషయం ఏమిటంటే ఆ రౌడీలని రాఖీ పురమాయిస్తాడు. హర్షని ముగ్గులోకి దించటం కోసం రాశిని టార్గెట్ చేస్తాడు రాఖి.

రాశి ఇంటికి వచ్చిన రాఖిని దమయంతికి పరిచయం చేస్తుంది. అతను డబ్బున్నవాడు అని తెలియటంతో చాలా చనువుగా మాట్లాడుతుంది. వస్తు పోతూ ఉండమని కూడా చెప్తుంది. అతను నమ్మదగినవాడుగా లేడు అని వర్షిణి అంటే తనని నానా మాటలు అంటుంది దమయంతి. మరోవైపు దమయంతి సంతకం పెట్టడం లేదు అని తన చేత ఎలాగైనా సంతకాలు పెట్టించాలని ప్లాన్ చేస్తుంటారు హరి నారాయణ, దీపక్. హర్షని ఇంటికి పిలిపించిన రాఖి తన ప్రేమ సంగతి చెప్తే మీకు సూట్ అవ్వదేమో అని హర్ష అంటాడు.

Intiki Deepam Illalu: మరీ ఇంట్రెస్టింగ్ గా లేదు. సో, సో గా ఉంది అంటున్న ప్రేక్షకులు..

ఎందుకు అవ్వదు నువ్వు, హారిక ఒకప్పుడు ఉన్న పొజిషన్లో ఇప్పుడు మేమున్నాము అందుకే నా లవ్ సక్సెస్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ చెప్పు అంటాడు రాఖి. హర్ష రాఖీ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న హారిక త్వరగా ఇంటికి రమ్మంటుంది. ఇంటికి వచ్చిన హర్షతో రాఖీ మంచివాడు కాదు అతనితో స్నేహం వద్దు అంటుంది. అతను ఎలాంటి వాడైనా కానీ అన్నయ్యకి హెల్ప్ చేశాడు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అతని అవసరం మనకి చాలా అవసరం ఉంటాడు హర్ష. హర్ష కి నిజం తెలుస్తుందా? వర్షిణి, సూర్య గురించి నిజం తెలుసుకుంటుందా? రాఖి తన చాలెంజ్ లో గెలుస్తాడా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.