Intiki Deepam Illalu: తనను ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ అత్తింటి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయం చేయాలనుకునే ఒక కోడలి కధ ఈ ఇంటికి దీపం ఇల్లాలు. ఈవారం ఏం జరిగిందో చూద్దాం.
ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లు వచ్చి రైడ్ చేస్తారు. మా ఇంట్లో రైడింగ్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అని ఇల్లంతా సోదా చేస్తారు. వాళ్లకి వాటర్ ట్యాంక్ లో డబ్బు కనిపిస్తుంది. ఆఫీసర్లతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. లీలావతి నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్తుంది.
అదంతా మాకు అనవసరం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటారు ఆఫీసర్లు. హార్ట్ ప్రాబ్లమ్ అండి హాయ్ అని అరెస్ట్ చేయొద్దు అంటుంది లీలావతి. ఇవన్నీ కోర్టులో చూసుకోండి మా డ్యూటీకి అడ్డు రావద్దు అంటూ మనోని జగదీష్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోతారు. మరోవైపు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్లారు అంటూ అతనే ఆడపడుచుని నిలదీస్తుంది వర్షిణి. మా సంగతి నీకెందుకు అయినా మా మీద నిఘా పెట్టావా అంటుంది రాశి.
ఇంటి తలుపులు తీసి ఉంటే ఇంట్లో దొంగలు పడ్డారు మీరే దొంగల్ని తరుముతున్నారో తెలుసుకోవాలి కదా అంటుంది వర్షిణి. అయినా అర్ధరాత్రి మీకు బయటకి వెళ్లవలసిన అవసరం వచ్చింది అని సూర్య నిలదీస్తాడు. కడుపునొప్పి అంటే మెడికల్ షాప్ కి వెళ్ళాం కావాలంటే బిల్ చూసుకో అంటుంది దమయంతి. అంతలోనే లీలావతి ఫోన్ చేసి అరెస్ట్ విషయం చెప్తుంది. అదే విషయాన్ని సూర్యకి చెప్తుంది వర్షిణి. ఆ మాటల్ని విన్న రాశి, దమయంతి,వర్షిణి పుట్టింటి వాళ్ళని దెప్పుతారు.
నేనేదో అడ్డమైన పనులు చేశానని ఆరోజు నన్ను అన్ని మాటలు అన్నారు మరి ఈరోజు వాళ్ళు ఏం చేశారు అంటుంది రాశి. కొంపల్లి కూల్చేసిన డబ్బు అయిఉంటుంది అది అంటుంది దమయంతి. మీరు మారతారు అనుకోవడం మాది బుద్ధి తక్కువ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు సూర్య వాళ్ళు. వాళ్ల ప్లాంట్ సక్సెస్ అయినందుకు హ్యాపీ ఫీలవుతారు తల్లి కూతుర్లు. హారిక వాళ్ళకి ఈ విషయాన్ని వాళ్ళ వర్కర్ చెప్తాడు. షాక్ లో ఉన్న హర్ష కంగారుగా పోలీస్ స్టేషన్ కి పరిగెడతాడు. ఏది ఏమైనప్పటికీ ఇది మన మంచికే ఇప్పటికైనా వాళ్ళు నా కాళ్లు పట్టుకోవాల్సిందే అనుకుంటుంది హారిక.
పోలీస్ స్టేషన్ కి వచ్చిన కృష్ణ వాళ్ళని ప్రెస్ వాళ్ళు నానా ప్రశ్నలు అడుగుతారు. వాళ్ల నుంచి తప్పించుకొని లోపలికి వచ్చిన మహేశ్వరి వాళ్లు మనో వాళ్లకి ధైర్యం చెప్తారు. అంతలోనే అక్కడికి వచ్చిన హర్ష నేను సాయం చేస్తాను అంటే కుటుంబ సభ్యులందరూ అతన్ని చీదరించుకుంటారు. ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోతాడు హర్ష. వాళ్లని విడిపించండి అని కృష్ణ వాళ్ళు అడిగితే ఇప్పుడు కేసు మరింత స్ట్రాంగ్ అయింది బెయిల్ కూడా దొరకకపోవచ్చు అంటాడు పోలీస్.అక్కడికి వచ్చిన వర్షిణి తల్లికి ధైర్యం చెప్తుంది.
అక్కడికి వచ్చిన దేవయాని నేనేదో మాట వరస కంటే అదే నిజమైపోతుంది అనుకోలేదు నా కూతురు బంగారం తనని మీ ఇంటికి తీసుకువెళ్లండి అంటుంది దమయంతి. లేనిపోని తెలివితేటలు ప్రదర్శించొద్దు ఇకనుంచి వెళ్ళండి అని వాళ్ళని కసురుకుంటుంది మహేశ్వరి. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన మహేశ్వరి వాళ్ళని మళ్లీ పిచ్చి ప్రశ్నలు వేస్తారు ప్రెస్ వాళ్ళు. వాళ్లకి నాలుగు చివాట్లు పెట్టి మహేశ్వరి వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది లీలావతి.
ఇంటికి వచ్చిన హర్ష వాళ్లు తనని యాక్సెప్ట్ చేయలేదని చెప్పి బాధపడతాడు హర్ష. నేను కంపెనీలో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు అంటుంది హారిక. నువ్వేమీ బాధపడొద్దు నేను లాయర్ తో మాట్లాడతాను అంటుంది హారిక. కానీ అలా చేయకుండా క్లైంట్లు అందర్నీ మనోగారు అరెస్ట్ అయ్యారు మీ డబ్బులు ఎగ్గొట్టే అవకాశం ఉంది మీరు ఇప్పుడే వెళ్లి వాళ్ళని నిలదీయండి అంటూ వాళ్ళని రెచ్చగొడుతుంది. మళ్లీ హర్ష దగ్గరికి వచ్చి లాయర్ తో మాట్లాడినట్టుగా అబద్ధం చెప్పేస్తుంది.
మహేశ్వరి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి క్లైంట్లు అందరూ మహేశ్వరి వాళ్ళని నిలదీస్తారు. మమ్మల్ని మోసం చేసి జనం డబ్బు ఇంట్లో దాచుకొని దర్జాగా తిరుగుతున్నారు అంటూ అవమానంగా మాట్లాడుతారు.మా డబ్బుల మాటేంటి అంటూ నిలదీస్తారు. వాళ్లకి సూర్య ఏదో సర్ది చెప్తుంటే, మా మీదే రివర్స్ అవుతున్నారా మిమ్మల్ని వదిలేసే లేదు ఏం చేస్తామో చూడండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు క్లైంట్లు. బాధపడుతున్న మహేశ్వరికి ధైర్యం చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లి పోతారు సూర్య వాళ్ళు.
అవమానం భరించలేక కుప్పకూలిపోతుంది మహేశ్వరి. ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్తారు కృష్ణ వాళ్ళు. మరోవైపు బాధపడుతున్న జగదీష్ ని ఓదార్చుతాడు మనో. సాయం చేయటానికి వచ్చిన హర్షని నానా మాటలు అని పంపిస్తారు మనో, జగదీష్. నన్ను అర్థం చేసుకోండి అని హర్ష ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోరు. మనం హెల్ప్ చేద్దామన్న మనల్ని అవమానిస్తున్నారు అంటూ హర్ష మనసు విరిగిపోయేలాగా మాట్లాడుతుంది హారిక.
భార్యని బాధ పెట్టిన పాపం నన్ను బాధిస్తుంది అని బాధపడతాడు మనో. మరోవైపు బాధపడుతున్న వర్షిని ఓదార్చకుండా వంట చేయనందుకు తిడతారు దమయంతి వాళ్ళు. తను బాధలో ఉంటే ఓదార్చడం మానేసి తిడుతున్నావు నువ్వు అసలు మనిషివేనా కావాలంటే వెళ్లి వండుకొని తిను అని తల్లిని మందలిస్తాడు సూర్య. వండుకోవలసిన కర్మ మాకు ఏంటి అని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు తల్లి కూతుర్లు. నిస్తేజంగా పడి ఉన్న మహేశ్వరీని చూసి బాధపడతారు లీలావతి, కృష్ణ. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లటానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు అని బాధపడతారు.
వర్షిణి కి చెబుదామని కృష్ణ అంటే ఈ రాత్రి కూడా వద్దు రేపు పొద్దున చెబుదాం అంటుంది లీలావతి. మరోవైపు మనో గారితో పార్ట్నర్ అయినందుకు హారిక ని కూడా అనుమానించి ఆమెను కూడా ఇంటరాగేట్ చేస్తాడు పోలీసు. కానీ తను ఆధారంతో సహా నాకు ఆ ఫ్రాడ్ కి ఏ సంబంధం లేదు అని నిరూపిస్తుంది హారిక. తనని తాను చాలా మంచి దానినని హర్ష దగ్గర నిరూపించుకోవడానికి తెగ ట్రై చేస్తుంది హారిక. వాళ్ల పిన్నిని హాస్పిటల్లో జాయిన్ చేశారని అప్పుడే తెలుసుకున్న హర్ష హడావుడిగా హాస్పిటల్ కి బయలుదేరుతాడు.
వర్షిణి ని కాఫీ పెట్టి తీసుకురమ్మంటే ఇంట్లో వాళ్ళందరికీ చాకిరీ చేసే ఓపిక నాకు లేదు కావాలంటే మీరే పెట్టి నాకు ఒక కప్పు సూర్యకోకప్పు ఇవ్వండి తాగుతాను అంటుంది. ఆ మాటలకి షాక్ అయిపోతారు తల్లి కూతుర్లు. తల్లి మాటలు నమ్మి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అంటూ రాశికి గడ్డి పెడుతుంది. అదే విషయాన్ని తన భర్తకి కూడా చెప్తుంది వర్షిణి. వాళ్లు మనం చెప్తే వినే రకం కాదు వదిలేయ్ అంటాడు హర్ష. అప్పుడే వాళ్ళ పిన్నిని హాస్పిటల్లో జాయిన్ చేసిన విషయం తెలుసుకొని కంగారుగా అక్కడి నుంచి పరిగెడతారు.
విషయం తెలుసుకున్న హర్ష హాస్పిటల్ కి వచ్చి తల్లిని పరామర్శిస్తే ఆమె అతని మీద కేకలు వేస్తుంది మీ సాయం మాకు వద్దు వెళ్లిపోమంటుంది. మొండిగా పిన్ని దగ్గరికి వెళ్లబోతున్న హర్షాని హాపీ ఇంతకంటే ఎక్కువ చేస్తే మేము నీకు కనిపించకుండా వెళ్ళిపోతామని బెదిరిస్తుంది లీలావతి.చేసేదేం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు హర్ష. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్య వాళ్ళు మహేశ్వరి కండిషన్ ని అడిగి తెలుసుకుంటారు. ఒత్తిడి వల్ల స్ట్రెస్ కి గురి అయిందని అందుకే ఆమె అవయవాలు స్వాధీనం తప్పాయని చెప్తుంది డాక్టర్.
అలా అని పెరాలసిస్ లాంటిది కాదు, పూర్తిగా కోలుకునే వరకు ఆడికి ఎలాంటి ఒత్తిడి కలిగించదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్. సూర్య లాయర్ తో మాట్లాడి మనం వాళ్ళకి బెయిల్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తాడు. కానీ కేసు స్ట్రాంగ్ గా ఉందని విడిపించడం అవ్వదని చెప్తాడు ఎస్ఐ. అదేంటి అంటే ఈ కేస్ తో పాటు క్లైంట్లు కూడా కేసు పెట్టారు అందుకే ఈ కేసు మరింత బలమైంది ఇప్పుడు ఈ కేసు నాన్ బైబుల్ కేస్ అయింది అంటూ ఆ పేపర్స్ లాయర్ కి చూపిస్తాడు ఎస్ఐ.
అతను చెప్పింది నిజమే అంటే లీలావతి కృష్ణ వాళ్లని ఎంతో బ్రతిమాలుతారు. మా చేతిలో ఏమి లేదు అంటూ చేతులెత్తేస్తారు ఎస్సై, లాయర్. అదే దిగులుతో ఇంటికి వచ్చిన లీలావతి వాళ్లకి బ్యాంక్ రికవరీ ఆఫీసర్లు కనిపిస్తారు. మీరు ఎవరు అని అడిగితే మేము బ్యాంక్ కవరి ఆఫీసర్లను మీ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి వచ్చాం అంటారు. మా వాళ్ళు జైల్లో ఉన్నారు వచ్చేస్తారు మీ బాకీ తీసేస్తారు అని ఎంత చెప్పినా వినిపించుకోరు. ఇంట్లో వస్తువులన్నింటినీ కౌంట్ చేసి ఆ ఇంటిని సీజ్ చేసేస్తారు.
Intiki Deepam Illalu: కధ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సీరియల్ కి ఫిదా అవుతున్న ప్రేక్షకులు..
ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి అని ఆలోచిస్తున్న లీలావతి వాళ్ళను మా ఇంటికి రండి నేను మీ కొడుకు లాంటివాడిని అని సూర్య తనతో పాటు వాళ్ళని తీసుకొని వెళ్తాడు. కానీ దమయంతి వాళ్ళని అవమానించి గుమ్మం లోంచే బయటికి పంపించేస్తుంది. మనో వాళ్ళు ఈ కేసు నుంచి బయట పడతారా? మహేశ్వరి ఆరోగ్యం మెరుగుపడుతుందా? రోడ్డును పడిన లీలావతి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.