Intiki Deepam Illalu: అనుకోకుండా కోడలికి ఆస్తి కలిసి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెతోపాటు వెళ్లి అవమానాల పాలవుతున్నా, ఆమె బాధ పడుతుందని సర్దుకుపోతున్న ఒక కుటుంబం కథ ఇంటికి దీపం ఇల్లాలు.

ఇందాక ఆస్తి పెట్టుకొని బయటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటుంది కృష్ణ. నేను ఆత్మ అభిమానుల్ని చంపుకొని పనిచేయలేను బయట చేస్తాను అంటాడు కృష్ణ. మరోవైపు ఉదయ్ అలమరలో డబ్బులు దమయంతి దొంగిలిస్తుంది అది గమనించిన హరి నారాయణ ఆమెని నిలదీస్తే తన నెత్తి తనే పగలగొట్టుకొని హరి నారాయణ పగలగొట్టినట్టుగా ఇంట్లో అందరి ముందు సీన్ క్రియేట్ చేస్తుంది దమయంతి. కృష్ణతో సహా అందరూ హరి నారాయణని మందలిస్తారు.

మరోవైపు ఎక్కడా ఉద్యోగం దొరకకపోవడంతో నిరాశగా ఉన్న మనోని చూసి కారు ఆపి విషయాన్ని కనుక్కుంటాడు రాఖి. అభిమానిని చంపుకొని అతని ఉద్యోగం చూడమంటాడు మనో. దగ్గర్లో ఉన్న ఫ్యాక్టరీలోనే ఎమ్మెల్యే తో మాట్లాడి ఉద్యోగం వేయిస్తానని చెప్తాడు రాఖి. మరి రేపు ఎక్కడికి వచ్చి మంచి పని చేసాము తిండికి గుడ్డకి లోటు లేదు అంటుంది దమయంతి. ఇంతకుముందు కూడా ఇలాగే చేసి అందరి ముందు సిగ్గుతో చచ్చిపోయేలాగా చేసావు అంటూ తల్లిని మందలిస్తుంది రాశి. కృష్ణ అమాయకురాలు కాబట్టి మన పేరు మీద కొంచెం ఆస్తి రాయించుకుందాము అంటుంది దమయంతి.

అదే విషయాన్ని కృష్ణతో చెప్తే నా ఆస్తి సంగతి నేను చూసుకుంటాను ముందు నీ సంసారం సంగతి నువ్వు చూసుకో అంటూ రాశికి మెత్తగా గడ్డి పెడుతుంది కృష్ణ. దీనికి ఆస్తి రాగానే తెలివితేటలు బాగానే పెరిగిపోయాయి అని తిట్టుకుంటారు తల్లి కూతుర్లు. మరోవైపు వర్షిణి తో అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఉదయ్. అంతలో అక్కడికి లీలావతి రావటంతో టాపిక్ మార్చేస్తాడు. ఇవేమీ తెలియని లీలావతి చిన్న చిన్న విషయాలకే బాధపడొద్దు అంటూ వర్షినికి చెప్తుంది. మరోవైపు హర్ష మారిపోయాడో లేదో అనుకుంటూ పెట్టిన పరీక్షలో అడ్డంగా దొరికిపోతాడు.

రాఖీ మాటలు నిజమేనేమో అని అనుమాన పడుతుంది కృష్ణ. జరిగిందంతా హారిక కి చెప్తాడు హర్ష. అలా అనుమానించకూడదు అంటే ఇలా చెయ్యి అని ప్లాన్ చెప్తుంది హారిక. అదే సమయానికి రాఖీ వచ్చి వాలెంటైన్స్ డే విషెస్ చెప్పి తనతో వచ్చేయమంటాడు. కుదరని పని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది హారిక. మరోవైపు అర్ధరాత్రి షుగర్ డౌన్ అవటంతో వంటగదిలోకి వెళ్లిన దమయంతిని చూసి కావాలనే దొంగ అని చెప్పి చితక్కొట్టేస్తాడు ఉదయ్. నిజంగానే దొంగ అనుకోని ఇంట్లో వాళ్ళు కూడా తలుపు చెయ్యి వేస్తారు. కానీ దమయంతి అని తెలుసుకొని ఆశ్చర్యపోతారు.

ఇదంతా నువ్వు కావాలనే చేశావు అంటూ ఉదయిని శాపనార్ధాలు పెడుతుంది దమయంతి. తనమీద ఎవరికీ అనుమానం రాకూడదని ఇంట్లో అందరూ చూస్తుండగా రాశికి డైమండ్ గిఫ్ట్ ఇస్తాడు హర్ష. అందుకు మురిసిపోతుంది రాశి. ఖర్చులకి డబ్బులు లేనప్పుడు ఇదంతా అవసరమా అంటూ హరి నారాయణ మందలిస్తాడు. అందుకు కృష్ణ హరి నారాయణ ని మందలిస్తే ఇంట్లో ఆడపిల్ల ఉంది తన గురించి ఆలోచించడం లేదు అందుకే ఇలా అన్నాను అంటాడు హరి నారాయణ.

అందరూ వెళ్లిపోవడంతో ఇంత ఖరీదైన గిఫ్ట్ నీకు ఎక్కడిది అంటూ నిలదీస్తుంది కృష్ణ. నా సేవింగ్స్ నుంచే తీశాను అని అబద్ధం చెప్తాడు కృష్ణ. మరోవైపు గిఫ్ట్ ఏమీ ఇవ్వలేనందుకు బాధపడుతున్న మనోని మీరే నాకు పెద్ద గిఫ్ట్ అయినా నాకు ఒక గిఫ్ట్ కావాలి అంటూ ఊరంతా తిప్పి చూపించమంటుంది. మరోవైపు వాలెంటైన్స్ డే కి నీకేమి గిఫ్ట్ కావాలి అంటూ వర్షిని దగ్గరికి వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడతాడు ఉదయ్. ఉదయ్ చంప పగలగొడుతుంది వర్షిణి.

ఇదంతా గమనించిన దమయంతి కోడలికి నాలుగు చివాట్లు పెట్టి దానికి బుద్ధి లేకపోతే పోయింది నీ బుద్ధి ఏమైంది అంటూ ఉదయ్ ని మందలిస్తుంది. నీ కోడలు కాదు అని ఇంట్లోంచి బయటికి గెంటేశాక తనతో నీకేం సంబంధం చూసినట్లుగా ఉండు లేకపోతే నాతో తిరుగుతుందని నేనే అందరితో చెప్పేస్తాను అప్పుడు మీ బరువు పోతుంది అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఉదయ్. మరోవైపు బ్లాక్ మనీ గురించి రాశి తో నిజం చెప్పించాలని ఎంత ప్రయత్నించినా ఆమె దొరకదు పైగా ఎందుకు మళ్ళీ మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నారు అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. అలాంటిదేమీ లేదు క్యాజువల్ గా అడిగాను అంతే అంటాడు హర్ష.

ఊరంతా తిరిగి వస్తారు కృష్ణ దంపతులు.అది చూసిన లీలావతి చాలా ఆనందపడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వర్షిణి ని చూసినిన్ను సౌభాగ్యవతిగా చూడలేకపోతున్నందుకు బాధగా ఉంది అంటుంది. మనకి ధైర్యం చెబుతుంది వర్షిని. అప్పుడే వచ్చిన దమయంతి వర్షిని గురించి అసహ్యంగా మాట్లాడుతుంటే నోరు అదుపులో పెట్టుకోమంటూ హెచ్చరిస్తుంది లీలావతి. మరోవైపు ఇంటికి వచ్చిన అతిధి ముందు మనోని అతని కుటుంబాన్ని చులకన చేసి మాట్లాడుతారు హరి నారాయణ.

ఇదంతా గమనించిన మన ఆస్తి పత్రాలు తీసుకెళ్లి లీలావతి వాళ్ళకి ఇచ్చి నేను ఆస్తి వాడుకోను అంటే కృష్ణ బాధపడుతుంది అలాగని వాడుకుంటే మన ఆత్మ అభిమానం దెబ్బతింటుంది అందుకే ఆమెకే తెలియకుండా ఈ పత్రాలు మీ దగ్గర ఉంచండి అని లీలావతి దంపతులకు ఇస్తాడు మనో. ఇది గమనించిన దమయంతి అవి ఎలాగైనా నొక్కేయాలని ప్లాన్ చేస్తుంది. తండ్రి,కొడుకులు కూడా అదే ప్లాన్ లో ఉంటారు. మరోవైపు హరి నారాయణ బట్టలు కాకుండా దమయంతి బట్టలు ఇస్త్రీ చేయమన్నది అన్న కోపంతో ఆమె నెత్తి బద్దలు కొడతాడు హరి నారాయణ. అయితే అది పనిమనిషి చేసిందేమో అనుకొని ఆమెతో గొడవపడుతుంది దమయంతి.

కానీ హరి నారాయణ మాటలతో అతన్ని అనుమానిస్తుంది. ఈ ఇంటికి వచ్చిన దగ్గరనుంచి మీకు ఏదో ఒకటి అవుతుంది నీకు దిష్టి తీస్తాను అంటూ పిన్నిని తీసుకొని వెళ్ళిపోతుంది కృష్ణ. మరోవైపు వర్షిని గురించి మనం త్వరగా నిర్ణయం తీసుకోవాలి అంటుంది కృష్ణ. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అంటాడు మనో. మరోవైపు తల్లి తల హరినారాయణ పగలగొట్టాడని కోపంతో ఊగిపోతుంది రాశి. వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి అంటూ ఆస్తి పత్రాల గురించి చెప్తుంది దమయంతి. అవి ఎలాగైనా మనం కొట్టేయాలి అంటూ తన ప్లాన్ చెప్తుంది దమయంతి.

Intiki Deepam Illalu: మంచి కుటుంబ కథ కావటంతో ఆదరించి మంచి రేటింగ్ ఇస్తున్న ప్రేక్షకులు..

మరో వైపు కబుర్లు చెప్పుకుంటున్న లీలావతి దంపతులను చూసి కడుపు మంటతో వాళ్లని తిట్టలేక పని వాళ్ళని తిట్టి లీలావతి దంపతులు బాధపడేలాగా చేస్తాడు హరి నారాయణ. ఊరికే తిని కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మా బ్రతుకు మేము బ్రతుకుతాము అని మనో తో చెప్తే అందుకు కృష్ణ ఒప్పుకుంటుందనుకున్నారా అయినా ఈ వయసులో మీరు కష్టపడటం ఏంటి మీ కొడుకుగా నేను ఉన్నాను నేను పోషిస్తాను దయచేసి అందరినీ ఇక్కడే ఉండాలని అంటూ వాళ్ళని పంపిస్తాడు మనో. మరి లీలావతి దంపతులు అక్కడే ఉంటారా? ఆ ఆస్తి పత్రాలని ఎవరు కొట్టేస్తారు? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఫిబ్రవరి 26, 2023 at 12:20 సా.