Intinti Gruhalakshmi April 1Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తన పని పూర్తవడంతో విక్రమ్ కి ఫోన్ చేసి నా పని అయిపోయింది నువ్వు కూడా వచ్చేయి అని చెప్తుంది దివ్య. బయటికి వచ్చేసరికి సిస్టర్ శాలరీ ఇస్తున్నారు తీసుకోండి అని చెప్తుంది. సరే అంటూ అక్కడికి వెళ్లిన దివ్యకి విక్రమ్ కనిపిస్తాడు. అనుకోకుండా ఇద్దరినీ ఒకరికొకరు చూసుకోవటంతో షాక్ అవుతారు.
తులసి, నందులకు బాధ్యత లేదంటున్న లాస్య..
మరోవైపు లాస్య, దివ్యకి పెళ్లి సంబంధాలు చూడరా, నాకు పెళ్లి చేయండి అని అడిగే వరకు పెళ్లి చేయరా అంటుంది. ఆ మాత్రం బాధ్యత మాకు తెలుసు మంచి సంబంధం దొరకాలి కదా అంటుంది తులసి. వెతికితే దొరుకుతాయి నేను ఒక మంచి సంబంధం తీసుకువచ్చాను అంటుంది లాస్య. మూడో పెళ్లి వాడా,నాలుగో పెళ్లి వాడా అని వెటకారంగా మాట్లాడుతాడు నందు.
ఈ గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ అసలు విషయం చెప్పు అంటాడు పరంధామయ్య. వాళ్లకి కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది. డబ్బుకి పిల్లలు పుట్టిస్తుంటాడు తల్లి పేరు మీద హాస్పిటల్ కూడా కట్టించాడు అంటుంది లాస్య. అలాంటి వాళ్ళతో మనం తూగగలమా అంటాడు పరంధామయ్య. కూతురిని ఇచ్చేటప్పుడు పెద్ద ఇంటికి ఇవ్వాలి అంటారు ఆ మాత్రం నీకు తెలియదా మావయ్య అంటుంది లాస్య.
సంబంధం ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటున్న నందు..
అందుకే నేనే వెళ్లి మన పిల్లని చేసుకోమని అడిగాను మన పిల్లకి ఏం తక్కువ అంటుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంత గొప్ప సంబంధం ఓకే అయిపోయిందా అంటూ ఆనందపడుతుంది తులసి. అబ్బాయి ఏం చదువుకున్నాడు అని అడుగుతాడు నందు. కుర్రాడు పెద్దగా చదువుకోలేదు అంటుంది లాస్య. ఈ సంబంధం ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటాడు నందు.
మరోవైపు నమ్మకద్రోహం అనే మాటని నేను విన్నాను కానీ దాని అర్థం ఈ రోజే తెలుసుకున్నాను అంటుంది దివ్య. ముందు నేను చెప్పేది వినండి తర్వాత మీకు నమ్మకద్రోహం అనిపిస్తే ఏ శిక్ష అయినా వేయండి అంటాడు. ఇన్నాళ్లు మీరు చేసింది మోసమని తెలిసిపోయింది కదా ఇంకా మీరు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి అంటుంది దివ్య. మీతో జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకున్నాను.
విక్రమ్ నిలువెల్లా విషమే అంటున్న దివ్య..
మీ జీవితాన్ని నాశనం చేయాలనుకోలేదు అపార్థం చేసుకొని నన్ను బాధ పెట్టొద్దు అంటాడు విక్రమ్. బాధ నీకే కాదు నాకు ఉంది నా చుట్టూ తిరిగి నిజం చెప్పకుండా నన్ను దగా చేశారు అంటుంది దివ్య. మీరు ఆవేశంలో ఉన్నారు నేను ఏం చెప్పినా మీరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు అంటాడు విక్రమ్. ప్రేమని పంచాలి అనుకున్న నిన్ను నిందించాల్సి వస్తుంది.
పాములోనే విషం ఉంటుంది అనుకున్నాను మనుషుల్లో కూడా ఉంటుందా అంటుంది దివ్య. నేను మీతోని నిజాయితీగానే ఉన్నాను అంటాడు విక్రమ్. మరి మీరు రాజ్యలక్ష్మి గారి కొడుకు అని ఎందుకు దాచిపెట్టారు అంటుంది దివ్య. మన మధ్య ఆ చర్చ ఎప్పుడూ రాలేదు కదా, మీ వాళ్ల గురించి నేను, నా వాళ్ళ గురించి మీరు ఎప్పుడూ మాట్లాడుకోలేదు అలాంటప్పుడు నన్ను ఎందుకు తప్పు పడుతున్నారు అంటాడు విక్రమ్.
మనసుతో ఆలోచించమంటున్న విక్రమ్..
ఒకసారి ఓపెన్ గా మాట్లాడుకుందాము అసలు హాస్పిటల్ ఓనర్ ని అని తెలిస్తే మీరు కనీసం దగ్గరకైనా రానిచ్చేవారా, ఆస్తులు అంతస్తులు హోదాలు వీటన్నిటికీ దూరంగా నన్ను నన్నుగా మీరు ప్రేమించాలి అని ఆశపడ్డాను అది నిజాయితీ కాదా, అందులో నా మంచితనం కనిపించడం లేదా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి అంటాడు విక్రమ్.
ఇప్పుడు నేను నా కార్ దగ్గరికి వెళ్తున్నాను నేను చేసిన పనిలో ప్రేమ కనిపిస్తే నన్ను పిలవండి వెనక్కి వస్తాను లేదంటే వదిలేయండి నా మానాన నేను వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోతుంటాడు విక్రమ్. పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హగ్ చేసుకుంటుంది దివ్య. మరోవైపు ఎవరైనా ఎందుకు చదువుకుంటారు డబ్బు సంపాదించడానికి కదా అలాంటి డబ్బు అతని దగ్గర అక్కర్లేనంత ఉంది.
కూతురి ప్రేమ విషయం చెప్పి నందు, తులసలకి షాక్ ఇచ్చిన లాస్య..
అప్పుడు చదువుతో పని ఏంటి అంటుంది లాస్య. నేను సంబంధం వద్దు అన్నది చదువు లేనందుకు కాదు ఈ సంబంధాన్ని నువ్వు తీసుకొచ్చినందుకు అంటాడు నందు. నన్ను అవమానించాలని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటుంది లాస్య. అలా ఎందుకు అనుకుంటున్నావు అంటుంది తులసి. నందు సంగతి పక్కన పెట్టు మీ అభిప్రాయం చెప్పు రాజ్యలక్ష్మి గారు మీకు రెండు మూడు సార్లు ఎదురుపడ్డారట కదా ఆ సంగతి ఆవిడే చెప్పారు.
ఆవిడ మర్యాదస్తురాల, కాదా అని అడుగుతుంది లాస్య. ఆ విషయంలో ఎలాంటి సందేహము అక్కర్లేదు అంటుంది తులసి. రాజ్యలక్ష్మి గారి అబ్బాయి మీద మీ కూతురు మనసు పడింది అన్నా కూడా నువ్వు ఒప్పుకోవా అంటుంది లాస్య. అతని మీద మనసు పడటం ఏమిటి అంటూ కంగారుగా అడుగుతుంది తులసి. ఈ మాట దివ్య చెప్తే బాగుంటుందని ఇన్నాళ్లు చూశాను నేను చెప్తే చాడీలు చెప్పినట్లు ఉంటుందని ఆలోచించాను.
Intinti Gruhalakshmi April 1Today Episode:దివ్యతో పెళ్లి ఇష్టం లేదంటున్న విక్రమ్..
ఆఖరికి నేనే చెప్పాల్సి వచ్చింది అంటుంది లాస్య. అంతలోనే అక్కడికి వచ్చిన దివ్య అందరూ ముభావంగా ఉండడం చూసి ఏమైంది అని అడుగుతుంది. నువ్వు విక్రమ్ ప్రేమించుకున్న విషయం నేను చెప్పాను అందుకే అలా ఉన్నారు అంటుంది లాస్య. ఆ మాటలకి కోపంతో నేను మాట్లాడుకుంటాను కదా మీరు ఇన్వాల్వ్ అవ్వవలసిన అవసరం ఏమి వచ్చింది అంటుంది దివ్య.
తల్లికి సారీ చెప్పి కావాలని నేను నిజం దాయలేదు అతని మనసులో ఏముందో తెలుసుకోకుండా ముందే ఓపెన్ అవటం ఎందుకు అని ఊరుకున్నాను అంటూ తల్లిని పట్టుకొని ఏడుస్తుంది దివ్య. తరువాయి భాగంలో పెళ్లి చూపులలో భాగంగా ఫార్మాలిటీ కోసం మా పిల్లని చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతుంది లాస్య. నాకు ఇష్టం లేదు అంటాడు విక్రమ్.