Intinti Gruhalakshmi April 10 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇంటికి వచ్చిన మాధవిని అందరూ అభిమానంగా ఆహ్వానిస్తారు. దగ్గరుండి మేనకోడలు పెళ్లి చేస్తావ్ అనుకుంటే ఇలా చుట్టూ చూపుగా వస్తావనుకోలేదు అంటూ ఆట పట్టిస్తుంది తులసి. వదిన గారి పిలుపులు చాలలేదు అందుకే అలిగాను అంటుంది మాధవి. మరదలు కి ఏం లోటు చేశాను పల్లకిని పంపించమంటావా అంటూ సరదాగా అంటుంది తులసి.

 

దివ్య మాటలకి ఎమోషనల్ అవుతున్న ప్రేమ్..

 

నీకు అల్లుడు వస్తున్నాడు అన్న ఆనందంలో ఇంటి అల్లుడిని మర్చిపోకు ఒక కన్నేసి ఉంచు అంటూ నందు తో అంటుంది అనసూయ. అందరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. నీ మొగుడిని నువ్వే వెతికున్నవన్నమాట అంటూ చెల్లెల్ని ఆటపట్టిస్తాడు ప్రేమ్. ఏం చేస్తాం మా అన్నయ్యలు నన్ను వదిలేశారు అందుకే నా దారి నేను చూసుకోవాలి కదా అంటుంది దివ్య.

 

మొగుడు వస్తున్నాడు అనేసరికి అన్నయ్య కంటికి కనిపించడం లేదు బావగారిని కాశీకి వెళ్లకుండా నేనే ఆపాలి చూసుకో అంటూ ఏడిపిస్తాడు ప్రేమ్. నేను వెళ్ళిపోయాక ఎవరిని ఏడిపిస్తావు అంటుంది దివ్య. నేనే ఏడుస్తాను అంటూ ఎమోషనల్ అవుతాడు ప్రేమ్. మా అన్నయ్య కూడా నా పెళ్ళికి ముందు ఇలాగే ఏడిపించేవాడు. కొన్ని బంధాలు ఆనందాన్నే కాదు అప్పుడప్పుడు బాధను కూడా ఇస్తాయి.

 

తులసి మనసులో బాధని చెప్పమంటున్న మాధవి..

 

 

కానీ భరించాలి తప్పదు అంటుంది . పెళ్ళికి ముందు తనదైన సామ్రాజ్యానికి వెళ్లి అయిన తరువాత తను ఒక అతిధి అవుతుంది అంటుంది మాధవి. ఉన్నట్టుండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. ఆమె వెనకే వెళ్లిన మాధవి నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడుగుతుంది. అలా ఏమీ లేదు ఆడదాని జీవితాన్ని ఆవిష్కరించావు అంతే అంటుంది తులసి.

 

నువ్వు ఏ విషయం గురించో బాధపడుతున్నావు ఎందుకు అని అడుగుతుంది మాధవి. కూతురు పెళ్లి జరుగుతున్నప్పుడు నా పుట్టిన వాళ్ళు ఇంట్లో ఉండాలనుకోవడం తప్పా అని అడుగుతుంది తులసి. తప్పెందుకు అవుతుంది ఇది ప్రతి ఆడది కోరుకునేదే ఉంటుంది మాధవి. కానీ నా విషయంలో ఎందుకు కుదరటం లేదు అంటుంది తులసి.

 

తన కోరిక తీరదంటూ ఎమోషనల్ అవుతున్న తులసి..

 

వాళ్లని పిలిచావా, రానన్నారా అంటుంది మాధవి. పిలవకుండా ఎలా ఉంటాను అలా అని రాను అని కూడా అనలేదు పెళ్లి మండపంలో కలుసుకుందాము అన్నారు అంటుంది తులసి. అమ్మమ్మ లేకపోతే ఎలాగా అంటుంది మాధవి.ఈ ఇంట్లో వాళ్లకి జరగరాని అవమానాలు జరిగాయి ఏ మొహం పెట్టుకుని వస్తారు. ఆయన నా భర్తగా ఉండేటప్పుడు ఎన్ని అవమానాలు జరిగినా తప్పదు కాబట్టి భరించారు.

 

కానీ వాళ్ళకి ఇప్పుడు ఆ అవసరం ఏముంది. అల్లుడుతో సంబంధం తెగిపోయిన తర్వాత వాళ్లు ఈ ఇంటికి ఎలా వస్తారు. ఒకవేళ వచ్చినా నోరు జారీ మీ అన్నయ్య వాళ్ళని ఏమైనా అంటే తలెత్తుకోలేను. ఈ సమస్యకి నా దగ్గర పరిష్కారం లేదు అంటుంది తులసి. ఈ మాటలు అన్ని పక్కనుంచి నందు వింటాడు. తులసికి పుట్టింటి వాళ్ళని లేకుండా చేసి తప్పు చేశాను.

 

నందు కి తులసి పుట్టింటిలో జరిగిన ఘోర అవమానం..

 

విరిగిపోయిన వాళ్ళ మనసులని తిరిగి అతికేలాగా చేయడం మామూలు విషయం కాదు. కూతురి పెళ్లి చేస్తున్నానన్న ఆనందం తులసి మనసులో లేదు నన్ను చీకొట్టినా పర్వాలేదు కానీ అత్తయ్య గారిని ఇక్కడినుంచి తీసుకొని వెళ్లకుండా కదిలేదే లేదు అనుకుంటూ అత్తగారింటికి వెళ్తాడు నందు. ఇంటికి వచ్చిన నందుని చూసి షాక్ అవుతారు తులసి పుట్టింటి వారు.

 

గుమ్మం బయటే నిలబెట్టి మాట్లాడుతుంది తులసి తల్లి. గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడుతున్నాం అంటే అక్క బాధపడుతుంది ఒకసారి ఆలోచించు అంటాడు దీపక్. మీ అక్క బాధపడుతుంది అని ఒకే ఒక్క కారణంతో ఆయన చేసిన అవమానాలన్నీ భరించాము. చేయాల్సిందంతా చేసి ఏ మొహం పెట్టుకుని వచ్చాడో అడుగు అంటూ కొడుకుతో చెప్తుంది తులసి తల్లి.

 Intinti Gruhalakshmi April 10 Today Episode:అత్తగారిని క్షమాపణ కోరుతున్న నందు..

 

నేను చాలా తప్పులు చేశాను క్షమించమని అడగడానికే వచ్చాను అంటాడు నందు. నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఈలోగా లోపలికి వచ్చి చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపో అది కూడా నా కూతురి మొహం చూసి ఒప్పుకుంటున్నాను. ఆరో నిమిషంలో నువ్వు ఏం చెప్పినా నేను వినటానికి సిద్ధంగా ఉండను అంటుంది తులసి తల్లి. మరోవైపు విక్రమ్ ఫోన్ చేసి నీకు ఒక కొరియర్ పంపించాను చూడు అంటాడు.

 

ఏం పంపించారు అంటూ కంగారుగా అడుగుతుంది దివ్య. ఆనందంగా అడగవలసింది అంత కంగారుగా అడుగుతావేంటి అంటాడు విక్రమ్. మా వాళ్ళ సంగతి మీకు తెలియదు ఇప్పటికే మోసేస్తున్నారు రేపు పెళ్లి అయ్యాక వాళ్ళ అల్లరి మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఆ కొరియర్ వాళ్ళ చేతిలో గాని పడిందంటే అల్లరి మామూలుగా ఉండదు అంటుంది దివ్య.

 

కొరియర్ అస్సలు వాళ్ళ చేతిలో పడకూడదు అది నీకు నాకు సంబంధించింది మాత్రమే ఒకవేళ వాళ్ళ చేతిలో పడితే గొడవలు అయిపోతాయి అంటాడు విక్రమ్. తరువాయి భాగంలో దివ్యకి, విక్రమ్ కి వెళ్లి స్నానాలు చేయించడంతో ఇద్దరి ఇళ్లల్లోనూ పెళ్ళి హడావిడి ప్రారంభమవుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 10, 2023 at 8:23 ఉద.