Intinti Gruhalakshmi April 11 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో దివ్య కి ఫోన్ చేసిన విక్రం నీకు ఒక కొరియర్ పంపించాను అది నువ్వు మాత్రమే రిసీవ్ చేసుకో వేరే ఎవరైనా రిసీవ్ చేసుకుంటే గొడవలు అయిపోతాయి తర్వాత నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఈ పార్సిల్ ఏంటో అందులో ఏం పంపించాడో ఏమీ అర్థం కావట్లేదు దేవుడా నువ్వే కాపాడాలి అనుకుంటుంది దివ్య.
అల్లుడి ప్రవర్తనకి ఆశ్చర్యపోయిన సరస్వతి..
మరోవైపు అత్తగారింట్లో అడుగుపెట్టిన నందుని నానా మాటలు అంటుంది సరస్వతి వచ్చిన విషయం ఏంటో చెప్పి వెళ్ళమంటుంది. నేను చేసింది తప్పే కాదనట్లేదు కానీ నా మీద ఉన్న కోపాన్ని తులసి మీద పిల్లల మీద చూపించకండి వాళ్ళకి దూరంగా ఉండకండి వాళ్లకి మీ ప్రేమ కావాలి అంటూ అత్త కాళ్ళ మీద పడతాడు నందు. కొద్ది సంవత్సరాల క్రితం మీ ఆఫీస్ కి వచ్చి ఇలాగే దీనంగా నా కూతురికి అన్యాయం చెయ్యొద్దు అంటూ బ్రతిమాలుకున్నాను.
పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకుంటున్నాను నా తప్పేమీ లేదు అన్నట్టు మాట్లాడవు అంటుంది సరస్వతి. ఇప్పుడు నేను కూడా పరిస్థితులను బట్టి నడవాలి కదా అంటుంది తులసి తల్లి. అప్పుడు నేను అలా చేసి ఉండవలసింది కాదు నేను చేసింది తప్పే అందుకు మానసికంగా శిక్ష కూడా అనుభవిస్తున్నాను అంటాడు. తులసి మీరు పక్కన లేరు అని బాధపడుతుంది దయచేసి తనకి ఆ బాధని దూరం చేయండి అంటూ కన్నీటితో రిక్వెస్ట్ చేస్తాడు నందు.
దివ్య దగ్గర కొరియర్ లాక్కున్న ప్రేమ్..
నీ మీద కోపమే కానీ శత్రుత్వం లేదు. ఇప్పుడు నేను ఎంత నా కూతురు జీవితాన్ని నిలబట్టలేను కానీ అది సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అంటూ కొడుకు కోడలు తో సహా బయలుదేరుతుంది తులసి తల్లి. మరోవైపు కాలు కాలిన పిల్లి లాగా గుమ్మం ముందే తిరుగుతున్న దివ్యని ఆట పట్టిస్తుంటారు ప్రేమ్, పరంధామయ్య.
ఇంతలో కొరియర్ రావటంతో సైన్ చేసి తీసుకుంటుంది దివ్య. ఇంట్లోకి వెళ్లిపోదాం అనుకుంటే ఎదురుగా నిలబడతారు ప్రేమ్, పరంధామయ్య. ఏంటది అన్నట్లుగా చూస్తాడు ప్రేమ్. హాస్పిటల్ నుంచి కొరియర్ వచ్చింది అంటుంది దివ్య. అలాంటప్పుడు దాచుకొని దాచుకొని ఎందుకు వెళ్తున్నావు అంటూ ఆమె దగ్గర నుంచి కొరియర్ లాక్కుంటాడు ప్రేమ్.
దివ్య అబద్ధం చెప్తుందంటున్న ప్రేమ్..
అమ్మ నీ కూతురు అబద్దాలు కూడా నేర్చుకుంది ఇది హాస్పిటల్ నుంచి రాలేదు మీ అల్లుడు దగ్గరనుంచి వచ్చింది అంటాడు ప్రేమ్. అయితే అసలు ఇవ్వద్దు చదివాక ఇద్దాము అంటుంది శృతి. చదవొద్దు పాపం తగులుతుంది అంటుంది శృతి. ఏం పర్లేదు అంటూ కొరియర్ని ఓపెన్ చేస్తాడు ప్రేమ్. తొందరగా చదవమంటూ కంగారు పెడతాడు పరంధామయ్య.
కీళ్ల నొప్పులు అంటూ నా హాస్పిటల్ కి వస్తావు కదా అప్పుడు నీ పని చెప్తాను అంటూ ఉడుక్కుంటుంది దివ్య. అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే నువ్వు కానీరా మనవడా అంటాడు పరంధామయ్య. అందరి ముందు కూర్చుని ఆ లెటర్ ని వర్ణించి మరీ చదువుతాడు ప్రేమ్. సిగ్గు పడిపోయిన దివ్య ఆ లెటర్ ని ప్రేమ్ దగ్గరనుంచి లాక్కొని పారిపోతుంది.
తులసికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన నందు..
అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. ఇంతలో సరస్వతమ్మ వాళ్ళని తీసుకొని వస్తాడు నందు. మీరు ఈ ఇంటికి వచ్చిన అతిధులు మిమ్మల్ని మర్యాద చేయటం నా బాధ్యత అంటాడు నందు. వాడు అతిధి కాదు పెళ్లి కూతురికి మేనమామ. పాతికేళ్ళు నీ కూతుర్నే నువ్వు గుండెల మీద మోస్తే వాడు మేనకోడల్ని బుట్టలో మోయాలి అంటుంది సరస్వతి. ఇంటికి వచ్చిన పుట్టింటి వాళ్ళని చూసి షాక్ అవుతుంది తులసి.
ఆనందంతో తల్లిని హత్తుకుంటుంది. పుట్టింటి వాళ్ళు లేకుండా ఇంట్లో శుభకార్యం జరుగుతుందని చాలా బాధపడింది మా వదిన అంటుంది మాధవి. నేను పిలిస్తే రానున్నావు అంటుంది తులసి. దివ్య వాళ్ళ నాన్నగారు వచ్చి పిలిస్తే వచ్చాను అంటుంది సరస్వతమ్మ. కూతురి పెళ్లి పేరు చెప్పుకొని దొరగారు మళ్లీ చుట్టరికాలు స్టార్ట్ చేశారన్నమాట.
Intinti Gruhalakshmi April 11 Today Episode:ఆనందంలో నందు కుటుంబం..
ఎంతమందిని పోగేసుకుంటారో పోగేసుకోండి ఎలాగూ దివ్య జీవితం మంట కలిసిపోతుంది అనుకుంటుంది లాస్య. పెళ్లిళ్లు కొత్త బంధాలని కలపటమే కాదు దూరమైన బంధాలని దగ్గర చేస్తుంటాయి అంటాడు దీపక్. నీ పెద్దకొడుకు కోడలు ఏరి అని అడుగుతుంది సరస్వతి అమ్మ. వాళ్లకి రావడానికి వీలుపడదంట అంటుంది తెలుసు. ఇంటికి పెద్ద కొడుకు పెళ్ళిలో లేకపోతే ఎలా అంటుంది సరస్వతి. ఎవరి సమస్యలు వాళ్ళవి సర్దుకుపోవాలి అంతే అంటుంది తులసి.
మనవరాలు ఎక్కడ అంటుంది సరస్వతి. తను ఎక్కడుంటే ఏంటి మనసు మాత్రం ఎప్పుడో అత్తారింటికి వెళ్లిపోయింది అంటాడు ప్రేమ్. చెల్లిని ఏడిపించడం తప్పితే వేరే పని ఏమీ లేదు అంటుంది తులసి. మనమే పెళ్లి పెద్దలం. పెళ్లి బాధ్యత అంతా మనదే అంటూ దీపక్ తో చెప్తాడు ప్రేమ్. ఆనందంగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే అది చూసి సంతోషిస్తాడు నందు. తరువాయి భాగంలో ఇద్దరి ఇళ్లల్లో మంగళ స్నానాలతో పెళ్లి పనులు ప్రారంభమవుతాయి.