Intinti Gruhalakshmi April 12 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో చూడటానికి మొద్దబ్బాయిలా ఉంటావు కానీ లెటర్ మాత్రం భలే రాసావు చదివినకొద్దీ చదవాలనిపిస్తుంది అనుకుంటుంది దివ్య. అంతలోనే అమ్మమ్మ రావడం గమనించి లెటర్ ని దిండు కింద దాచేస్తుంది. సరస్వతి వచ్చి దివ్యని పలకరిస్తుంది. కానీ దివ్య బుంగమూతి పెట్టుకుంటుంది. అలకలో బలే ముద్దుగా ఉన్నావు కానీ ఎందుకలిగావో చెప్పు అంటుంది సరస్వతి.

 

భర్త ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న తులసి..

 

 

మనవరాలి పెళ్ళంటే నెల రోజులు ముందే పెట్టే సర్దుకొని రావాలి కానీ రేపు పిల్లను గా ఈరోజు ఊపుకుంటూ వచ్చావు అంటుంది దివ్య. ఆ మాటకొస్తే నేను బుంగమూతి పెట్టుకోవాలి అంటుంది సరస్వతి. నువ్వు కూడా భలే ముద్దొస్తున్నావ్ కానీ నువ్వు ఎందుకు బుంగమూతి పెట్టుకోవాలి అంటుంది దివ్య. ప్రేమించినప్పుడు, పెళ్లి ఫిక్స్ అయినప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు ఈ అమ్మమ్మ గుర్తు రాలేదు.

 

కానీ అన్ని మర్చిపోయి ప్రేమగా పెళ్లికి వస్తే ఎగిరి గంతెయ్యాలి కానీ ఇలా బుంగమూతి పెడతావా అని అడుగుతుంది సరస్వతి. సారీ అమ్మమ్మ ఇంకా ఈ టాపిక్ వదిలేయ్ నన్ను బ్లెస్ చెయ్యు అంటూ సరస్వతి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది దివ్య. మరోవైపు భర్త దగ్గరికి వచ్చిన తులసి నాకోసం మీరు మీ ఈగోని పక్కన పెట్టారా అని అడుగుతుంది. ఈగో ఉండేది కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు అంటాడు నందు.

 

పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేస్తున్నానంటున్న నందు..

 

 

మీలో ఇంత మార్పు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నీ పంతాన్ని పక్కనపెట్టి పెళ్లికి రమ్మంటే నువ్వు బలవంత పెడితే మనసు చంపుకొని రావాలి అంతేగాని మనస్ఫూర్తిగా రాలేను అంది మా అమ్మ అలాంటిది ఈరోజు గుమ్మంలో తనని చూసేసరికి చాలా ఆనందం వేసింది నిజంగా మీరు రుణం తీర్చుకోలేను అంటుంది తులసి. అలాంటిదేమీ లేదు ఇది నా పాపాన్ని కడుక్కునే ప్రయత్నం అంతే అంటాడు నందు.

 

మరోవైపు పెళ్లి పనులు అందరూ హడావిడిగా చేస్తూ ఉంటారు. ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ పసుపు దంచుతారు. పసుపు దంచేటప్పుడు మొగుళ్ళని తలుచుకోకుండా మంచి జరగాలని దంచండి అంటూ మాధవి భర్త ఆడవాళ్లందరినీ ఆట పట్టిస్తాడు. తలంబ్రాలు బియ్యం ఎండబెడుతున్న తండ్రిని చూసి ఎమోషనల్ అవుతుంది దివ్య.

 

తండ్రిని చూసి ఎమోషనల్ అవుతున్న దివ్య..

 

అంతలోనే అక్కడికి వచ్చిన తులసితో నేను నా తండ్రితో అనుబంధాన్ని కోరుకున్నప్పుడు నాన్న ఇలా లేరు అప్పుడు నాన్నని నేను చాలా మిస్ అయ్యాను కానీ ఇప్పుడు అత్తారింటికి వెళ్లే సమయంలో నాన్న చూపిస్తున్న ప్రేమ నా కాళ్ళకి అడ్డం పడుతుంది నాన్నను వదిలి వెళ్లాలని లేదు అంటుంది. మనం కావాలి అనుకున్నప్పుడు అన్ని దొరకవు దొరికిన వాటితోనే సరిపెట్టుకోవాలి అంటుంది తులసి.

 

అంతలోనే ప్రేమ్ అమ్మమ్మ పక్కన కూర్చొని ఎందుకు తండ్రి మాత్రమే తలంబ్రాలు బియ్యాలు ఆరబెట్టాలి అంటాడు. నవమాసాలు మోసి, కని పెంచడం తల్లి బాధ్యత అయితే నా కూతురి ఎదుగుదలతో పాటు పెళ్లి చేసి పంపించడం తండ్రి బాధ్యత ఉంటుంది సరస్వతి. మరోవైపు అందరూ కూర్చున్నప్పుడు ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో పురమాయిస్తుంది తులసి.

 

తన ప్రేయసికి పెళ్లి కార్డు పంపమంటున్న పరంధామయ్య..

 

 

అంతలోనే పెళ్లి కార్డులు రావటంతో మొదటి కార్డు దేవుడి దగ్గర పెట్టండి తరువాత వియ్యాలవారింటికి వెళ్లి స్వయంగా పిలవండి తర్వాతే మిగిలిన వాళ్ళని పిలవండి అంటారు అనసూయ, సరస్వతి. ఎవరెవరుని పిలవాలో లిస్టులో రాసాను ఇంకెవరినైనా మర్చిపోయానేమో చెప్పండి మావయ్య అంటూ పరంధామయ్య అని అడుగుతుంది తులసి.

 

సిగ్గుపడుతూ రాజమండ్రి సుజాతని మర్చిపోయావు అంటాడు పరంధామయ్య. ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది అంటూ చిటపటలాడుతుంది అనసూయ. ఎవరి తాతయ్య సుజాత అంటాడు ప్రేమ్. చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అంటూ మెలికలు తిరిగిపోతూ భార్యని చెప్పమంటాడు పరంధామయ్య. పెళ్ళికి ముందు ఈయన ప్రేమించిన మనిషి అంటుంది అనసూయ.

 

రాజ్యలక్ష్మి కి చీవాట్లు పెడుతున్న ఆమె మామగారు..

 

 

మరి పెళ్లెందుకు చేసుకోలేదు అంటూ ఆట పట్టిస్తాడు ప్రేమ్. ఈ మనిషికి అంత ధైర్యం ఎక్కడ చచ్చింది ఈయన ప్రేమని చెప్పేలోపు వీళ్ళ నాన్న ఈ గుడిబండ ని నాకు ఇచ్చి పెళ్లి చేశారు అంటూ మొగుణ్ణి ఆటపట్టిస్తుంది అనసూయ. మరోవైపు రాజ్యలక్ష్మి ఇంట్లో ఎలాంటి పెళ్లి హడావుడి కనిపించదు అదే కోడల్ని అడుగుతాడు రాజ్యలక్ష్మి మామగారు.

 

విక్రమ్ నా కొడుకు వాడి పెళ్లి ఘనంగా చేయాలని నాకు కూడా ఉంది కానీ తమ్ముడు పెళ్లి ఘనంగా జరగలేదు అందుకే వాడు కూడా ఘనంగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు అంటుంది రాజ్యలక్ష్మి. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు నీ కొడుక్కి జరగలేదని విక్రమ్ కి కూడా తూ, తూ మంత్రంగా పెళ్లి చేస్తున్నావు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య

 

 Intinti Gruhalakshmi April 12 Today Episode దివ్య కి ఫోన్ చేసిన ప్రియ నిజం చెప్పేస్తుందా?

 

అప్పుడే అక్కడికి వచ్చిన బసవయ్య అన్ని తెలిసినప్పుడు మూసుకొని ఊరుకోవచ్చు కదా కావాలని నిన్ను రెచ్చగొడుతున్నాడు అంటాడు. అంతకుమించి ఆయన ఏం చేయగలరు అంటూ మామగారిని తీసి పారేసినట్లుగా మాట్లాడుతుంది రాజ్యలక్ష్మి. తరువాయి భాగంలో ఇన్నాళ్లు మీ జీవితంలో అమ్మ మాత్రమే ఉండేది ఇప్పుడు పోటీగా మరొక అమ్మాయి వస్తుంది అంటాడు బసవయ్య.ఎవరు వచ్చినా మా అమ్మ తర్వాతే అంటాడు విక్రమ్. మరోవైపు ప్రియ, దివ్యకి ఫోన్ చేస్తుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 12, 2023 at 8:42 ఉద.