Intinti Gruhalakshmi April 14 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నా జీవితంలో తల్లి తర్వాతే ఎవరైనా అంటాడు విక్రమ్. తల్లి ప్రేమ కి పోటీ వచ్చేది భార్య ప్రేమ మాత్రమే. తరతరాల నుంచి మగవాడు తల్లా పెళ్ళామా అంటూ జుట్టు పీక్కుంటున్నాడు. పెళ్లయితే నీక్కూడా అనుభవం అవుతుంది అంటాడు బసవయ్య. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను నా జీవితంలో మాత్రం నా తల్లి తర్వాతే ఎవరైనా కావాలంటే రాసి పెట్టుకో అని బసవయ్యకి చెప్తాడు విక్రమ్.
తాతయ్యని అపార్థం చేసుకుంటున్న విక్రమ్..
మరోవైపు విక్రమ్ తండ్రి దగ్గరికి తీసుకు వస్తాడు వాళ్ళ తాతయ్య. తండ్రిని ఆశీర్వదించమంటూ అక్షింతలు చూపిస్తాడు విక్రమ్. మీ నాన్న మనసుతో మాత్రమే దీవించగలడు అంటూ విక్రమ్ తండ్రిగా పాదాలకి దండం పెడితే వాళ్ళ తాతయ్య అక్షింతలు వేసి దీవిస్తాడు. నీకు తల్లిని తీసుకురావటం కోసం బలవంతంగా నేనే వాడికి పెళ్లి చేశాను వచ్చిన తల్లి నీకు తండ్రిని కూడా దూరం చేసింది అంటాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య.
ఎందుకు మీరు అమ్మని అపార్థం చేసుకుంటారు ఇందులో అమ్మ తప్పేముంది ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు అంటూ చిన్నగా కోప్పడతాడు విక్రమ్. మారవలసింది మేం కాదు నువ్వే విదిలేక నేను ఈ చీకటి గదిలో ఉంటే నువ్వు బయట ఉన్నా చీకట్లోనే ఉన్నావు నిజాన్ని అర్థం చేసుకోలేక పోతున్నావు అనుకుంటాడు విక్రమ్ తండ్రి.
కూతుర్ని చూసి ఎమోషనల్ అవుతున్న నందు..
విక్రమ్ తండ్రి దగ్గర కూర్చుని అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది నా గురించి మీరేమీ బాధపడొద్దు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాడు తల్లి మాయలో ఉన్నాడు మనం ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేడు ఇక మన ఆశ వచ్చే కోడలు మీదే తను బాగా చదువుకున్న, లోకజ్ఞానం గల అమ్మాయి అని కొడుక్కి చెప్తాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య.
మరోవైపు పెళ్లికూతురు ముస్తాబులో ఉన్న దివ్యని చూసుకొని ఎమోషనల్ అవుతారు కుటుంబ సభ్యులందరూ. ప్రేమ్ అయితే మా చెల్లెలికి సిగ్గుపడటం కూడా వచ్చేసింది అంటూ ఆట పట్టిస్తాడు. కూతుర్ని పట్టుకొని కన్నీరు పెట్టుకుంటాడు నందు. ఆడపిల్ల పెళ్లి చేయడంతో అమ్మానాన్నల బాధ్యత తీరిపోయినట్టే అని అందరూ అనుకుంటారు.
కొడుకు మాటలకి సంతోషిస్తున్న పరంధామయ్య..
నిజానికి నాకు తెలిసి పెళ్లి చేయటంతోనే బాధ్యత మొదలవుతుందేమో అంటూ ఎమోషనల్ అవుతాడు. అత్తవారింట్లో కూతురు ఎలా ఉందో కూతురు చెప్తేనే గాని తెలుసుకోలేము అంటాడు. అత్తారింట్లో బాధలు ఎప్పుడు కూతురు పుట్టింట్లో చెప్పదు అలా చెప్పకపోబట్టే నా కూతురు పాతికేళ్ళు మీతో కాపురం చేసింది ముందే చెప్పి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అంటుంది సరస్వతమ్మ.
ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటుంది తులసి. తండ్రిగా ఫీల్ అవుతున్నాడు కదమ్మా అన్ని తెలుసుకోవాలి అంటుంది సరస్వతి. నిజమే పెళ్లయింది కదా అని రిలాక్స్ అయిపోను ప్రతిక్షణం నీ వెంటే ఉంటాను అంటూ కూతురుకి ధైర్యం చెప్తాడు. నా కొడుకు మొదటిసారిగా బాధ్యతగా మాట్లాడాడు చాలా సంతోషంగా ఉంది అంటాడు పరంధామయ్య. సంతోషమా గాడిదగుడ్డా ఏం జరిగినా నీ కొడుకు మాటల వరకే అంతకుమించి ఏం చేయలేడు.
అత్తగారికి అడ్డంగా దొరికిపోయిన ప్రియ..
ఎందుకంటే అటువైపు ఉన్నది రాజ్యలక్ష్మి. మీరంతా ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని చిక్కుల్లో పడ్డట్టే అనుకుంటుంది లాస్య. మరోవైపు సంజయ్ కి తీసుకువస్తుంది ప్రియ. ఎప్పుడనగా తీసుకురమ్మని చెప్పాను ఇప్పుడా తీసుకువచ్చేది నాకు ఇప్పుడు టీ తాగే మూడు లేదు అంటూ చిరాకు పడతాడు సంజయ్.
ఇంతలో పనిమనిషి వచ్చి చిన్నబాబు మిమ్మల్ని విక్రమ్ బాబు రమ్మంటున్నారు అంటూ పిలుస్తుంది. సంజయ్ అక్కడినుంచి వెళ్ళిపోవటంతో సంజయ్ ఫోన్ అక్కడ ఉండడం చూసి దివ్యని ఎలా అయినా రక్షించాలి అనుకొని ఆమెకి ఫోన్ చేస్తుంది ప్రియ. అంతలోనే అనుకోకుండా అక్కడికి వచ్చిన రాజ్యలక్ష్మి ఆమె దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుంటుంది.
Intinti Gruhalakshmi April 14 Today Episode: ప్రియ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజ్యలక్ష్మి..
ఆమెని గదిలో బంధించి నీకు ముద్దుగా చెప్పి చూశాను కానీ వినలేదు అంటే నన్ను ఎదిరించడానికి డిసైడ్ అయ్యావు అన్నమాట నన్ను రెచ్చగొడితే నేను ఎంత దూరమైనా వెళ్తాను. దివ్య ని పెళ్లి చేసుకునేది ఆమె కి నరకం చూపించడం కోసమే అనే నిజం నీ నోటి నుంచి బయటికి వస్తే నేను ఎవరు శాశ్వతంగా పడిపోయేలాగా చేస్తాను.
నీ ప్రాణాలతో పాటు మీ తల్లిదండ్రుల ప్రాణాలు కూడా రిస్కులో పడతాయి జాగ్రత్త అంటూ హెచ్చరిస్తుంది రాజ్యలక్ష్మి. ఈ వ్యవహారంలో దివ్య తనంతటతానుగా కల్పించుకోలేదు నేను బ్రతిమాలితేనే కల్పించుకుంది మీ కోపాన్ని నా మీద చూపించండి అంటూ బ్రతిమాలుతుంది ప్రియ. నువ్వు బ్రతిమాలినంత మాత్రాన దాని బుద్ధి ఏమైంది ముందు వెనక ఆలోచించకుండా ఎగేసుకుంటూ వచ్చేయటమేనా.
నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు చేసింది అందుకే దాని జీవితాన్ని నేను బూడిద చేయబోతున్నాను అంటుంది రాజ్యలక్ష్మి. ఈ ఒక్కరోజు మాత్రమే తను సంతోషంతో కేరింతలు కొట్టేది తర్వాత జీవితమంతా నా కింద బానిసగా బ్రతకాల్సిందే అంటుంది. తరువాయి భాగంలో పెళ్లి పీటల మీద కూర్చుంటారు దివ్య, విక్రమ్.