Intinti Gruhalakshmi April 15 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నీ కాళ్లు పట్టుకుంటాను దయచేసి దివ్యని వదిలేయండి అంటుంది ప్రియ. ఈ బుద్ధి ఇప్పుడు కాదు రోడ్డుకి నా బరువుని బజారున పెట్టారు కదా అప్పుడు ఉండాలి. మీడియా ముందు నన్ను పిచ్చి పుల్లమ్మని చేశారు. అందుకు ఫలితం అనుభవించాలి అంటూ పనిమనిషిని పిలిచి నేను వెళ్ళాక ఈ గదికి తాళం వేయండి.
ప్రియని గదిలో బంధించిన రాజ్యలక్ష్మి..
మళ్లీ నేను చెప్పే వరకు తాళం తీయొద్దు. కాదు అని తలుపు తీస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అంటూ హెచ్చరించి వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి. మరోవైపు లగేజ్ అంతా కారులో పెట్టుకుంటూ ఉంటారు నందు కుటుంబసభ్యులు. లగేజీ సంగతి నువ్వు చూసుకో అని ప్రేమ్ తో చెప్తుంది తులసి. మనుషుల సంగతి నువ్వు చూసుకో అసలే నీ కూతురు ఫోన్లో పడి ఏ మూలనో కూర్చుంటుంది.
ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది అంటాడు ప్రేమ్. అంతలో కారులోంచి ఫోన్ మాట్లాడుతూ ప్రేమ్ ని పిలుస్తుంది దివ్య. హడావుడిలో పడి నన్ను మర్చిపోతారేమో అని ముందే వచ్చి కార్లో కూర్చున్నాను అంటూ నవ్వుతుంది. అనసూయ దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టడంతో అందరూ పెళ్లికి బయలుదేరుతారు.ఏం కావాలన్నా నువ్వే చూసుకోవాలి.
లాస్యని జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్న నందు..
ఆ బాధ్యత నీదే అంటూ మాధవికి అప్పజెప్తుంది తులసి. అందరికీ పనులు చెప్తుంది కానీ అన్ని తనే చేసుకుంటుంది మీ వదినకి కాళ్లు చేతిలో ఆగవు అంటూ ఆటపట్టిస్తుంది అనసూయ. నందు హడావిడి చూసి ఈయన కూతురు పెళ్లి అయ్యేలోపు మా పెళ్లయిందని మర్చిపోయాలా ఉన్నారు అనుకుంటుంది లాస్య. ఇంతలో మగపెళ్లి వాళ్ళు రావడంతో ఎదురెల్లి ఆహ్వానిస్తారు నందు వాళ్లు.
రాజ్యలక్ష్మి తో పడి పడి మాట్లాడుతుంది లాస్య. వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు రాజ్యలక్ష్మి గారితో రాసుకు పూసుకొని తిరుగుతున్నావు ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఊరుకోను జాగ్రత్త అని హెచ్చరిస్తాడు నందు. మరోవైపు పీటల మీద కూర్చుంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్టు అవుతుంది వింటున్నావా దివ్య అంటుంది ప్రియ.
గౌరీ పూజ విశిష్టత చెప్తున్న సరస్వతి..
ఇలా అరవటం తప్పితే నేను ఏం చేయగలను అనుకుంటుంది. ఇంతలో బయటనుంచి సౌండ్ రావడంతో మీరు బయటే ఉన్నారని తెలుసు దివ్య జీవితాన్ని కాపాడాలి దయచేసి తలుపులు తీయండి అని బ్రతిమాలుకుంటుంది ప్రియ. బయటనే ఉన్న పనివాళ్ళు మేము చీమల లాంటి వాళ్ళని మా పరిస్థితి మీకు తెలుసు మీ పెద్ద వాళ్ళు పంచాయతీలోకి మమ్మల్ని లాక్కండి అంటారు.
మరోవైపు గౌరీ పూజ చేస్తున్న దివ్యకి ఆ పూజ ఎందుకు చేస్తారో, ఆడపిల్ల కాపురంలో ఎంత ఓపికగా ఉండాలో అన్ని మనవరాలకి వివరంగా చెప్తుంది సరస్వతి. పాపం అమ్మమ్మ చాలా కలలు కంటోంది ఎన్ని పూజలు చేసిన ఇకమీదట దివ్య బతుకు నాశనమే అనుకుంటుంది లాస్య. అమ్మమ్మ చెప్పింది అర్థమైంది కదా అత్తారింట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికగా భరించాలి అంటుంది తులసి.
ప్రాణాలు తీసుకుంటానంటూ బెదిరిస్తున్న ప్రియ..
నా బంగారు తల్లి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది కష్టాలు దాని గుమ్మంలోకి కూడా రావు అంటాడు నందు. మరోవైపు దివ్య కోసం ఆత్రుత పడుతూ పూజని పరధ్యానంగా చేస్తూ ఉంటాడు విక్రమ్. వీడివాలకం చూస్తుంటే నాకు ఏదో కంగారుగా ఉంది అమ్మ ప్రేమ అమ్మతోనే జీవితం అంటూ సినిమా సినిమా పేర్లు చెప్పేవాడు రేపటి నుంచి పెళ్ళాం చెప్తే వినాలి అంటూ కొత్త సినిమా పేర్లు చెప్తాడేమో అంటూ రాజ్యలక్ష్మి ని పొల్యూట్ చేస్తుంటాడు బసవయ్య.
మరోవైపు బుట్టలో దివ్యని కూర్చోబెట్టి మేనమామ, ప్రేమ్ మండపానికి తీసుకొని వస్తారు. విక్రమ్ తెర తొలగించడానికి ప్రయత్నిస్తుంటే అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి ఊరుకోండి అంటూ మందలిస్తాడు దేవుడు. మరోవైపు మీ ప్రాణాలను ఫణంగా పెట్టి తలుపు తీయమనట్లేదు కానీ ఒక విషయం చెప్తాను విను కాంతం దివ్య ఈ ఇంట్లో అడుగు పెట్టే లోపలే నేను ప్రాణాలతో ఉండను.
Intinti Gruhalakshmi April 15 Today Episode:మండపానికి చేరుకున్న ప్రియ, దివ్య పెళ్లి ఆపుతుందా?
నేను కళ్ళ ముందు లేకపోతే మీ అమ్మగారికి కోపం తగ్గి కనీసం దివ్యమైన బాగా చూసుకుంటుంది అంటుంది ప్రియ. ప్రాణం తీసుకోవడం ఏంటి అంటుంది కాంతం. వేరే మార్గం లేదు నా కళ్ళముందు దివ్య కష్టపడుతుంటే చూడలేను. తను చాలా మంచి మనిషి. నేను ఎలాగూ వెళ్ళిపోతాను మీరైనా తనకే కాస్త అండగా ఉండండి ఇది నా ఆఖరి కోరిక అంటుంది ప్రియ.
ఆ మాటలకి కరిగిపోయిన కాంతం తలుపు తీస్తుంది. మాకు ప్రాణ భయం ఉంది గాని మనసు లేని కసాయి వాళ్ళం కాదు. ఆడపిల్ల ఉసిరి పోసుకుంటే అంతకన్నా పాపం మరొకటి లేదు ఈ పని కాకపోతే మరో పని మా గురించి ఆలోచించకండి మీరు వెళ్ళండి వెళ్లి దివ్యమ్మ ని కాపాడండి అంటుంది కాంతం.
తరువాయి భాగంలో జరిగిందంతా నందుకి చెప్పి ఈ పెళ్లి జరిగితే దివ్య జీవితం నాశనం అయిపోతుంది అని చెప్తుంది ప్రియ. కిందన ఉన్న నందు పెళ్లి ఆపటానికి కొండమీద మండపం దగ్గరికి పరిగెడుతాడు.