Intinti Gruhalakshmi April 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కన్యాదానం చేసే సమయం ఆసన్నమైంది తల్లిదండ్రులు పీటల మీద కూర్చోండి అంటారు పంతులుగారు. ఆలోచిస్తున్న తులసిని ఎందుకు ఆలోచన వెళ్లి కూర్చో అంటుంది అనసూయ. ఆ అధికారం నాకు ఉందో లేదో అని ఆలోచిస్తున్నాను అంటుంది తులసి.
కన్యాదానం నేనే చేస్తానంటూ ట్విస్ట్ ఇచ్చిన లాస్య..
ఇలా మంచితనానికి పోయే పరిస్థితి ఎంత వరకు తెచ్చుకున్నావు తల్లిగా అది నీ హక్కు వెళ్లి పీటల మీద కూర్చో అంటుంది సరస్వతి. అప్పుడే వచ్చిన లాస్య నేను నందు భార్యని పీటల మీద కూర్చోవలసింది నేను అంటుంది. నవ మాసాలు మోసి కన్న తల్లిని నేను ఆ అధికారం నాకే ఉంది అంటుంది తులసి.
అసలు ఈ ఇంటికి నీకు ఏం సంబంధం అసలు నువ్వు మా ఇంటి మనిషివే కాదు అంటుంది లాస్య. తాళి కట్టే ఇలాంటి టైం లో గొడవకి దిగుతుంది అసలు బుద్ధి ఉందా అని లాస్యని మనసులో తిట్టుకుంటుంది రాజ్యలక్ష్మి. రోడ్డుమీద నీళ్ల కొళాయి దగ్గర గొడవల్లాగా ఉన్నాయి మా అక్క పరువు తీసేస్తున్నారు తనకి సమాజంలో ఎంత పేరు ఉందో తెలుసా అంటాడు బసవయ్య.
అనసూయ ప్రవర్తనకి షాకైన బసవయ్య..
విషయం తెలుసుకోకుండా మాట్లాడొద్దు మా ఇంటి పరిస్థితి మీకు ముందే చెప్పాము అన్నీ తెలుసుకొనే కదా సంబంధం కుదుర్చుకున్నారు అంటూ కోప్పడుతుంది అనసూయ. పెళ్ళికొడుకు మేనమామ నేను కూడా చూడకుండా ఆవిడేంటి అంత మాట అనేసింది అనుకుంటాడు బసవయ్య. నువ్వే ఏదో ఒకటి తేల్చాలి వదిన లేకపోతే ఈ సమస్య తీరేటట్టు లేదు అంటుంది బసవయ్య భార్య.
ఇది వాళ్ళ ఇంటి సమస్య మనం ఏం జోక్యం చేసుకుంటాము వాళ్ళే తేల్చుకోవాలి అంటుంది రాజ్యలక్ష్మి. సరే అయితే నువ్వే కన్యాదానం చేయు కానీ నా భర్తని అప్పుగా నేను ఇవ్వను అంటుంది లాస్య. త్వరగా తేల్చుకోండి అల్లుడుగారు మీ నిర్ణయాన్ని బట్టి మేము ఎక్కడ ఉండాలో వెళ్ళిపోవాలో నిర్ణయించుకోవాలి అంటుంది సరస్వతి. బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అంటుంది లాస్య.
భయంతో వెనకడుగు వేసిన లాస్య..
ఇదంతా వింటున్న విక్రమ్ పెళ్లి ఆగిపోతుందేమో అని కంగారు పడతాడు. నాన్న నువ్వు అమ్మ తో వచ్చి కన్యాదానం చేస్తే పెళ్లి చేసుకుంటాను లేకపోతే అసలు ఈ పెళ్లి చేసుకోను అంటుంది దివ్య. పెళ్లికూతురే పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోతాను అంటుంది ఇంక మేమెందుకు ఇక్కడ విక్రమ్ పెళ్లి పీటల మీద నుంచి రా వెళ్ళిపోదాం అంటూ వెళ్ళిపోబోతుంటుంది.
ఈ సంబంధం తప్పిపోతే మళ్లీ నా బ్రీఫ్ కేసు నాకు రాదేమో అనవసరంగా పంతానికి పోతున్నానేమో అనుకున్న లాస్య రాజ్యలక్ష్మి గారు ఆగండి నా హక్కుని కోల్పోకూడదని అలా ప్రవర్తించాను అంతేకానీ పెళ్లి చెడగొట్టే అంత చెడ్డదాన్ని కాదు అంటుంది. వెళ్లి కన్యాదానం చేయు కానీ మనసులో మాత్రం నన్నే ఊహించుకో అని నందుతో చెప్తుంది లాస్య.
అతి కష్టం మీద గుడికి చేరుకున్న ప్రియ..
మరోవైపు దివ్య పెళ్లి ఎలాగైనా ఆపాలని రోడ్డుమీదికి వచ్చిన ప్రియ ఒక బండి అతన్ని లిఫ్ట్ అడిగి గుడికి చేరుకుంటుంది. మరోవైపు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు దివ్య విక్రమ్. నా కాలి కింద చెప్పు గా మారడానికి ఇంకొక రోజే టైము అనుకుంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు పంతులుగారు పెళ్లికూతురు మేనమామని తాళిబొట్టు ముత్తైదువలందరికీ చూపించి తీసుకు రమ్మంటాడు.
ముందుగా తులసి దగ్గరికి తీసుకువెళ్తే నా జీవితంలా కాకుండా నా బిడ్డ జీవితం బాగోవాలి అని తాళిబొట్టు మీద చేయి పెట్టి దండం పెట్టుకుంటుంది. లాస్య దగ్గరికి తీసుకు వెళ్తే తల్లిలాగే తన జీవితం మొక్కలైపోయి జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి అని మనసులో అనుకొని తాళిబొట్టు మీద చేయి వేస్తుంది. నువ్వు నవ్వుకోవటానికి ఇదే ఆఖరి రోజు బాగా నవ్వుకో అంటూ తాళిబొట్టు మీద చేయిపెడుతుంది రాజ్యలక్ష్మి.
Intinti Gruhalakshmi April 17 Today Episode నిజం తెలుసుకున్న నందు పెళ్లిని ఆపగలడా?
నందు కి ఫోన్ వస్తుంది. తాళికట్టే సమయం అయ్యింది ఎక్కడికి వెళ్ళిపోవద్దు అని తులసి అంటే అర్జెంట్ కాల్ రెండు నిమిషాల్లో వచ్చేస్తాను అని బయటికి వస్తాడు నందు. మరోవైపు గుడికి చేరుకున్న ప్రియ నిజం చెప్పటానికి ముసుగు వేసుకొని తులసి దగ్గరికి వస్తుంది కానీ అప్పుడే రాజ్యలక్ష్మి తులసి దగ్గరికి రావడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ప్రియని సంజయ్ గమనించి షాక్ అవుతాడు.ఆమెని పట్టుకుందామని ప్రయత్నిస్తాడు కానీ ఆమె కనబడదు.
ఈ లోపు ప్రియ కి నందు కనిపిస్తాడు. అంకుల్ నేను రాజ్యలక్ష్మి గారి చిన్న కోడల్ని మీతో మాట్లాడాలి అంటుంది ప్రియ. ముందు పెళ్లి కానీ అమ్మ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అంటే ఇది అంతకంటే ఇంపార్టెంట్ విషయం అంకుల్ రండి అని చేయి పట్టుకొని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోతుంది ప్రియ. తరువాయి భాగంలో నందు కి జరిగిందంతా చెప్తుంది ప్రియ. పెళ్లి నా ఫోటో కోసం పరుగు పరుగున మండపానికి వస్తాడు నందు.