Intinti Gruhalakshmi April 18 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నందుని కలిసిన ప్రియ జరిగిందంతా చెబుతుంది. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి పెళ్లి జరగడానికి వీల్లేదు అంటూ పెళ్లిని రావడానికి ప్రయత్నిస్తాడు నందు.కానీ అప్పటికే విక్రమ్, దివ్య కి మూడు ముళ్ళు వేసిస్తాడు. బాధతో కన్నీళ్లు పెట్టుకుంటాడు నందు. భగవంతుడా దివ్య జీవితాన్ని రక్షించే అవకాశాన్ని ఇచ్చావు అంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంది ప్రియ.
నిజం తెలుసుకొని బాధతో కుమిలిపోతున్న నందు..
ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇదిగోండి అక్షింతలు వేయండి అంటూ ఎంతో సంబరంగా మాట్లాడుతూ ఉంటుంది తులసి. దివ్య జీవితాన్ని మన చేతులతోనే నాశనం చేసేసాము అని మనసులోనే అనుకుంటాడు. బాధపడుతున్న నందుని చూసి ఎందుకు అలా బాధపడతావు నువ్వు బాధపెట్టి దివ్యని కూడా బాధ పెడతావు నీ బాధని నీలోనే ఉంచుకో అంటుంది అనసూయ.
అయినా కన్నీరు ఆపుకోలేక పోతాడు నందు. కూతురు వెళ్ళిపోతుందని బాధపడుతున్నారా తను చూడండి ఎంత ఆనందంగా ఉందో అంటుంది తులసి. పెళ్లి ఫెయిల్ అయినట్లుగా తన జీవితం నాశనం అయిపోయింది అని దివ్య సూసైడ్ చేసుకున్నట్లుగా బ్రమపడతాడు నందు. బాగా ఎమోషనల్ అవుతున్న నందుని మీ అల్లుడు మీ కూతుర్ని మీరు చూసుకున్నంత బాగా చూసుకోలేదని బాధపడుతున్నారా?
చేతిలో చేయి వేసి అల్లుడిని మాట ఇమ్మంటున్న నందు..
కచ్చితంగా మీ కన్నా బాగానే చూసుకుంటాను మీకేమైనా అభ్యంతరమా అంటాడు విక్రమ్. అంతకన్నా అదృష్టం ఏముంది అయినా నోటి మాటతో కాదు చేతిలో చేయి వేసి చెప్పండి అంటాడు నందు. చేతిలో చేయి వెయ్యబోతుండగా అల్లుడు మీద అంత నమ్మకం లేదా అంటుంది రాజ్యలక్ష్మి. అల్లుడిని నమ్మకపోతే నన్ను నేను నమ్మలేనట్లే నేనేదో మామూలుగా అడిగాను అంతే అంటాడు నందు.
విక్రమ్ ని మాట ఇవ్వకుండా అడ్డుకున్నందుకు నీకు కోపంగా ఉందా అని కోడల్ని అడుగుతుంది రాజ్యలక్ష్మి. లేదు అత్తయ్య మీ మాటల్లో కూడా న్యాయం ఉంది అంటుంది దివ్య. ఇన్నేళ్ల నా పెంపకంలో నీ విషయంలో నా బిడ్డ నోటి మాటగా చెప్పింది కూడా తప్పు అవలేదు అంటుంది రాజ్యలక్ష్మి. ఇక మీదట కూడా తప్పు అవ్వదు అంటాడు విక్రమ్.
కూతురికి ధైర్యం చెబుతున్న తులసి..
మరోవైపు అత్తారింటికి బయలుదేరబోతు కన్నీరు పెట్టుకుంటుంది దివ్య. నువ్వు కోరుకున్న వాడినే కదా పెళ్లి చేసుకున్నావు ఎందు కా కన్నీరు అంటుంది తులసి. నేను కోరుకున్న వాడిని చేసుకున్న మాట నిజమే కానీ నేను కన్నీరు పెట్టుకుంటునది నేను చేయి వదిలి వెళ్ళిపోతున్న నా వాళ్ళ గురించి ఇన్నాళ్లు నన్ను చేయి పెట్టి నడిపించిన వాళ్ళ చేయి వదిలేసి వెళ్ళిపోతున్నందుకు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది దివ్య.
తెలియని మనుషుల మధ్యకి వెళ్ళటం లేదు కదా, ఆ ఇల్లు తప్పితే అక్కడ ఉన్న మనుషులందరూ నీకు పరిచయమే. నువ్వు కోరుకున్న భర్త నిన్ను కోరుకున్న అత్తగారు. నీ తండ్రి ప్రేమ నీ భర్తలో దొరుకుతుంది నా ప్రేమ నీ అత్తగారిలో దొరుకుతుంది అంటుంది తులసి. నీ నానమ్మ తాతయ్య వాళ్ళ ప్రేమ నా దగ్గర పొందవచ్చు అందుకు నాది గ్యారెంటీ అంటాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య.
కూతురికి ధైర్యం చెప్పమని నందు కి చెప్తున్న పరంధామయ్య..
అయినా ఈ ఊర్లోనే ఉంటావు కదా నీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఫోన్ చెయ్యు రెక్కలు కట్టుకొని వాలిపోతాను అంటుంది తులసి. ఆ రెక్కలని మా అక్కయ్య కత్తిరించేస్తుంది అనుకుంటాడు బసవయ్య. మరోవైపు కన్నీరు పెట్టుకుంటున్న నందుని చూసి నీ కూతురు వెళ్ళిపోతుంది దాంతో ఏమైనా మాట్లాడు దానికి ధైర్యం చెప్పు అంటాడు పరంధామయ్య. నేనే ధైర్యాన్ని కోల్పోయాను ఇంక తనకేం ధైర్యం చెప్తాను అనుకుంటాడు నందు.
చెప్పలేని బాధతో కూతురిని పట్టుకొని ఏడుస్తాడు. నువ్వు ఇంత బాధపడటం నేను ఎప్పుడూ చూడలేదు నేనంటే ఇంత ఇష్టమా నాన్నా అని అడుగుతుంది దివ్య. రేపటి నీ జీవితం ఎలా ఉండబోతుందో అని భయం అని మనసులో అనుకొని అత్తగారు చేతిలో పెడతాడు నందు. మేకని తీసుకెళ్లి పులికి అప్ప చెప్పినట్లుగా అప్ప చెప్తున్నాడు అనుకుంటుంది లాస్య. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతాడు నందు.
Intinti Gruhalakshmi April 18 Today Episode ఇకపై ఆట ప్రారంభిస్తానంటున్న రాజ్యలక్ష్మి..
నా కొడుకు చూడటానికి ఆరడుగుల ఆజానుబాహుడే కానీ చంటి పిల్లాడి మనస్తత్వం కూతురు వెళ్ళిపోతే చూడలేనని తనే ముందుగా వెళ్ళిపోయాడు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది అనసూయ. ఈ ఊర్లోనే ఉంటావు కదా ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు మీ అత్తగారు వద్దంటుందా ఏంటి అంటుంది అనసూయ. తను ఏమంటుందో మీ అమ్మాయి మా ఇంటికి వచ్చాక తెలుస్తుంది అనుకుంటాడు బసవయ్య.
రాహుకాలం వచ్చేస్తుంది పదండి ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గృహప్రవేశం చేయాలి అంటూ కంగారు పెడతాడు బసవయ్య. విక్రమ్ దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరింత కన్నీరు పెట్టుకుంటుంది తులసి. తరువాయి భాగంలో ఆనందంగా గృహప్రవేశం చేస్తారు దివ్య దంపతులు. చూస్తూ ఉండండి దివ్య జీవితంతో ఎలా ఆడుకుంటానో అంటూ తమ్ముడు మరదలితో చెప్తుంది రాజ్యలక్ష్మి.