Intinti Gruhalakshmi April 19 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కూతురు బ్రతుకు నాశనమైపోయినందుకు ఒంటరిగా ఏడుస్తాడు నందు. చేతులు ముడుచుకొని నిస్సహాయంగా ఉండిపోయేను చేసింది తప్పు ఒప్పు కూడా తెలియనంత అయోమయంగా ఉంది. అరచేతుల్లో పెట్టి పెంచుకొని నిన్ను ఆ రాక్షసి చేతులకి అప్పగింతలు పెట్టాను.
నిస్సహాయంగా కన్నీరు పెట్టుకుంటున్న నందు..
నా చేతులతోనే నా కూతుర్ని నరకానికి పంపించాను. తాళి కడుతున్నప్పుడు దివ్య మొహం లో సంతోషం, తృప్తి చూసి నిజం చెప్పలేకపోయాను అంటూ ఏడుస్తాడు. ఇప్పుడు భయం వేస్తుంది, మీ అమ్మకి నిజం చెప్తే తట్టుకోలేదు చాలా ఎమోషనల్ అవుతాడు. మరోవైపు గుమ్మంలో దంపతులను చూసి నీ పర్మిషన్ తో మేనల్లుడిని ఒక ప్రశ్న అడుగుతాను అంటాడు బసవయ్య.
అడుగు నా పర్మిషన్ ఎందుకు అంటుంది రాజ్యలక్ష్మి. నువ్వు ఇష్టపడిన అమ్మాయిని అక్క ఏమాత్రం ఆలోచించకుండా నీతో పెళ్లి చేసింది ఒకవేళ అతను ఒప్పుకోకపోయి ఉంటే ఏం చేసే వాడివి అని అడుగుతాడు బసవయ్య. మౌనంగా ఉన్న విక్రమ్ తో నిన్నటి వరకు టకాటక సమాధానం చెప్పేవాడివి ఈరోజు ఎవరు లేవటం లేదు ఏంటి అని అడుగుతాడు.
వక్రబుద్ధి చూపించి తిట్లు తింటున్న బసవయ్య..
ఇప్పుడు ఈ ప్రశ్న అవసరమా అంటాడు విక్రమ్. నీకు నాకు అవసరం లేదు కానీ వాడికి అవసరం గుమ్మంలో ఉండగానే అత్త కోడల మధ్య మనస్పర్ధలు సృష్టించి ఆనందపడే రకం దానికి మీ అమ్మ సపోర్టు. సమాధానం వాడు కాదు నేను చెప్తాను విను అంటూ పెళ్లికి మీ అమ్మ ఒప్పుకోకపోతే నేను దగ్గరుండి చేసేవాడిని అంటాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య.
నేనేదో భాణం వేద్దాం అనుకుంటే తిరిగి నాకే గుచ్చుకుంటుంది అనుకుంటాడు బసవయ్య. పరువుని పక్కనపెట్టి ప్రియనే కోడలుగా ఒప్పుకున్నారు నన్ను కోడలుగా ఒప్పుకోవడం పెద్ద విషయం కాదు అంటుంది దివ్య. వేరే దారి లేకపోవడంతో రాజ్యలక్ష్మి కూడా బసవయ్యని మందలిస్తుంది. ఆ బాధ భరించలేక టాపిక్ మార్చేస్తాడు బసవయ్య. పిల్లలకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురండి అంటాడు.
తల్లికి కోలుకోలేని షాకిచ్చిన విక్రమ్..
హారతి ఇస్తున్న రాజ్యలక్ష్మి ఈరోజుకి ఇది హారతి కానీ రేపటికి ఇదే నీ సంతోషానికి చితిమంట అనుకుంటుంది రాజ్యలక్ష్మి. పేర్లు చెప్పి లోపలికి రమ్మంటాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. దివ్య ధైర్యంగా పేర్లు చెప్తుంది విక్రమ్ మాత్రం సిగ్గుపడుతూ ఉంటాడు.దివ్యమ్మ ని చూసి నేర్చుకోండి అంటాడు దేవుడు. విక్రమ్ కూడా పేర్లు చెప్తాడు. దివ్య పెళ్లి అయ్యాక అత్తింటి పేరే తన ఇంటిపేరు అవుతుంది మళ్లీ చెప్పండి అంటాడు బసవయ్య.
అక్కర్లేదు నాకు ఇలా పిలవటమే బాగుంది అంటుంది దివ్య. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది పెళ్లయితే ఆడపిల్ల ఇంటిపేరు మారిపోతుంది అంటుంది రాజ్యలక్ష్మి. ఇప్పుడే కదా దివ్య మన ఇంటికి వచ్చింది వస్తూనే తన మనసు నొప్పించడం ఎందుకు అంటూ దివ్యని తనతో పాటు తీసుకెళ్లిపోతాడు విక్రమ్. కొడుకు ప్రవర్తనకి షాక్ అవుతుంది రాజలక్ష్మి.
రాజ్యలక్ష్మి ని రెచ్చగొడుతున్న బసవయ్య..
అందరూ వెళ్ళిపోయిన తరువాత ఇప్పటికైనా అర్థం చేసుకో గుమ్మం బయటే భార్యకి వత్తాసు పలికాడు ఇంక అతని మీద ఆశలు వదిలేసుకో అంటాడు బసవయ్య. అప్పుడే కధ అయిపోలేదు వాడిని నా చేతి కిందకి ఎలా తెచ్చుకుంటానో చూడు అంటూ కోపంగా మాట్లాడుతుంది రాజలక్ష్మి. మరోవైపు దివ్య కుటుంబ సభ్యులు ఫస్ట్ నైట్ కోసం పంతులు గారితో ముహూర్తం పెట్టిస్తూ ఉంటారు.
త్వరగా పెట్టండి అని పరంధామయ్య గారు తొందర పెడుతుంటే నీకేదో ముహూర్తం పెడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావు ఏంటి, కొంచెం తగ్గు అంటూ తాత గారిని ఆటపట్టిస్తాడు ప్రేమ్. అందరినీ ఉన్నాము నందు ఏడి అంటుంది అనసూయ. అంతలోనే అక్కడికి వచ్చిన నందు కామ్ గా తన గదిలోకి వెళ్ళిపోతుంటే ఆపుతుంది తులసి.
భర్త ప్రవర్తనకి అనుమాన పడుతున్న తులసి..
దివ్య ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెడుతున్నారు అందరూ ఇక్కడే ఉన్నారు మీరు కూడా ఇక్కడే ఉండండి అంటుంది తులసి. నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఆ పని మీరు చూసుకోండి అంటాడు నందు. రెస్ట్ తీసుకోవటానికి ఇంకా మన బాధ్యత పూర్తవ్వలేదు అంటుంది తులసి. కన్యాదానం చేసి అలసిపోయావా అంటాడు పరంధామయ్య. అలసిపోవటం కాదు నా కూతుర్ని నరకానికి పంపించిన బాధ అనుకుంటాడు నందు.
బోన్ లో నిలబడ్డ ఖైదీ లాగా ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనుకుంటుంది తులసి. అప్పటికే నీరసంగా ఉన్న నందు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఏమైంది అంటూ అందరూ కంగారు పడతారు. అందరూ సంతోషంగా ఉన్నారు నిజం చెప్పి బాధ పెట్టలేను అనుకుంటాడు నందు. ఈ రాత్రికి మంచి ముహూర్తం ఉంది అంటారు పంతులుగారు. మరింకేమి ఈ విషయాన్ని మీ వియ్యపురాలికి కి ఫోన్ చేసి చెప్పు అంటాడు పరంధామయ్య.
Intinti Gruhalakshmi April 19 Today Episode నందుకి అడ్డంగా దొరికిపోయిన లాస్య..
ఇలాంటి విషయాలు నేరుగా వెళ్లి చెప్తే నేను బాగుంటుంది అంటుంది తులసి. నేను కూడా వస్తాను అంటుంది లాస్య. ఇలాంటి వాటికి ముగ్గురు వెళ్లకూడదు అంటుంది అనసూయ. నా దగ్గరికి వచ్చేసరికి అన్ని పద్ధతులు గుర్తొస్తాయి ముసలావిడకి అని తిట్టుకుంటుంది లాస్య. మరోవైపు తండ్రి దగ్గరికి దివ్యని తీసుకువచ్చి అతని దగ్గర ఆశీర్వచనం తీసుకుంటారు విక్రమ్, దివ్య.
కోడలి మొహంలో స్వచ్ఛత కనిపిస్తుంది నాలో చనిపోయిన ఆశలు మళ్లీ బ్రతుకుతున్నాయి అనుకుంటాడు ప్రకాశం. సంతోష పడుతున్న తండ్రిని చూసి ఈ మధ్యకాలంలో మా నాన్న ఎప్పుడు ఎంత సంతోష పడలేదు అంటాడు విక్రమ్. అందరూ కిందన సంబరాలు చేసుకుంటే మీరు మాత్రం ఇలా చేయకట్ల ఎందుకు ఉండిపోయారు అని ప్రశ్నిస్తుంది దివ్య.
వెలుతురులో జరిగే గోరాలు చూడలేక అని మనసులో అనుకుంటాడు ప్రకాశం. తరువాయి భాగంలో నేను మీ మనిషిగా ఇక్కడ విషయాలు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీ ఇంటికి నందు తులసి రాబోతున్నారు అంటూ రాజ్యలక్ష్మి కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది లాస్య. వాళ్లు మళ్లీ ఈ ఇంటికి రాకుండా బుద్ధి చెప్తాను అంటుంది రాజ్యలక్ష్మి. లాస్య ఫోన్ పెట్టి వెనక్కి తిరిగేసరికి నందు కోపంగా తననే చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది లాస్య.