Intinti Gruhalakshmi April 3 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తల్లి స్థానంలో ఉండి నేను నెరవేర్చవలసిన బాధ్యతని నువ్వు నెరవేర్చావు థాంక్యూ అంటుంది తులసి. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు సరే కానీ మరి ఎందుకు ఆలస్యం రేపే వాళ్ళని పెళ్లిచూపులుకి రమ్మంటాను ఓకేనా అంటుంది లాస్య. తులసి ఓకే చెప్పటంతో దివ్యకి పెళ్లికళ వచ్చేసింది అంటూ పరంధామయ్య ఆట పట్టిస్తాడు.
పెళ్లి బాధ్యత కూడా నీదే అంటున్న రాజ్యలక్ష్మి..
మరోవైపు రేపే పెళ్లిచూపులు అన్న విషయాన్ని ఫోన్ చేసి రాజ్యలక్ష్మి కి చెప్తుంది లాస్య. నిజం చెప్పి ఒప్పించావా చెప్పకుండా ఒప్పించావా అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. మామూలుగా అయితే నేను తెచ్చిన సంబంధాన్ని ఒప్పుకునేది కాదు కానీ కూతురు మనసు పడిన సంబంధం కదా అందుకే ఒప్పుకుంది. బలి ఇవ్వటానికి మేకని రెడీ చేస్తున్నట్లుగా రేపు తన కూతుర్ని తనే రెడీ చేస్తుంది.
పెళ్లయ్యాక నిజం తెలుసుకొని గుండెలు బాదుకొని ఏడుస్తుంది అంటుంది లాస్య. ఒక్క రోజుతో ఆ ఏడుపు ఆగకూడదు. దివ్య నాకు చేసిన పరాభవానికి నా పగ తీరాలి అంటూనే పెళ్లి కూడా నీదే బాధ్యత అంటుంది రాజ్యలక్ష్మి. దివ్య మీ చేతికి చిక్కినట్లే ఏం సందేహం పెట్టుకోవద్దు అంటూ ఫోన్ పెట్టేస్తుంది లాస్య. మరోవైపు విక్రమ్ తల్లి దగ్గరికి వచ్చి తన ప్రేమ విషయం చెప్పబోతాడు కానీ రాజ్యలక్ష్మి అందుకొని నువ్వు చెప్పక్కర్లేదు.
తల్లి మాటలకు షాకైన విక్రమ్..
నీ మనసు నాకు తెలుసు. అమ్మాయి పేరు దివ్య కదా అంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు విక్రమ్. నా మనసెరిగి నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు నీ మనసు నేను తెలుసుకోలేనా అంటుంది. ఆ మాటలకి పొంగిపోయిన విక్రమ్ దివ్య గురించి నాకన్నా నీకే బాగా తెలుసు, తన వల్ల ఈ ఇంట్లో ఎలాంటి సమస్య రాదు అందుకు నాది పూచి అంటాడు విక్రమ్.
నువ్వు ఇంతలా చెప్తున్నప్పుడు నేను ఎందుకు కాదంటాను రేపే పెళ్లిచూపులు వెళ్లి ప్రశాంతంగా పడుకో అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు ఆలోచనలో ఉన్న భర్త దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది తులసి. పెళ్లి చూపులకి తొందరపడి ఒప్పుకున్నామేమో అనిపిస్తుంది. కాస్త టైం తీసుకోవాల్సింది అంటాడు నందు. మీ అనుమానం ఏమిటి అని అడుగుతుంది తులసి.
లాస్యని అనుమానిస్తున్న నందు..
నాకు తన మీద అపనమ్మకం. ఈ సంబంధం పట్ల తను ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకు తొందర పెడుతుంది ఏ లాభము లేకపోతే తను ఇంట్రెస్ట్ చూపించదు అంటాడు నందు. అలాంటి మనిషితోనే కదా మీరు ఇన్నాళ్లు కాపురం చేస్తున్నది. తను అప్పుడు అంతే ఇప్పుడు అంతే కానీ మీ ఆలోచనలోనే తేడా వచ్చింది. కానీ నా ఆలోచనలో తేడా రాలేదు నేను అప్పుడు ఇప్పుడు లాస్య నమ్మలేదు.
నేను నమ్మింది దివ్యని మాత్రమే తను చాలా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి అంటుంది తులసి. లాస్య కూడా అప్పుడప్పుడు మంచి పనులు చేస్తుందేమో ఎందుకు ప్రతిసారి అనుమానించడం. తన సంగతి వదిలేసి మన జాగ్రత్తలో మనం ఉందాము అంటుంది తులసి. మరోవైపు పెళ్లి చూపులకు వచ్చిన రాజ్యలక్ష్మి తులసి నిజాయితీని తెగ పొగిడేస్తూ ఉంటుంది. దివ్యకి కూడా మీ నిజాయితీయే వచ్చింది.
దేవుడు తన కోరిక తీర్చాడంటున్న రాజ్యలక్ష్మి..
అప్పుడే తను నా కోడలు అయితే బాగుండు అనుకున్నాను దేవుడు నా కోరిక తీర్చాడు అంటుంది రాజ్యలక్ష్మి. నిలబెట్టే మాట్లాడుతున్నాను అంటూ సంజయ్ పెళ్లి విషయం మాట్లాడుతుంది తులసి. మా అక్క ఏమీ బాధపడలేదు ఒక ఆడపిల్ల జీవితాన్ని బాగు చేసిందని గర్వపడింది అంటాడు బసవయ్య. మరోవైపు తనని కూడా అందరితోపాటు కూర్చోబెట్టొచ్చు కదా.
వాళ్ళు రమ్మనటము నేను స్పెషల్ ఎంట్రీ ఇవ్వటము ఏంటో ఇదంతా అంటూ చిరాకు పడుతుంది దివ్య. విక్రమ్ కూడా అదే తొందరలో ఉంటాడు. దివ్యని తీసుకువచ్చి అందరి దగ్గర ఆశీర్వచనం తీసుకోమంటుంది తులసి. ప్రొఫెషన్ లో సెటిలైన వరకు పెళ్లి చేసుకోను అంది సెట్లైన కొద్ది రోజులకే ఇలా పెళ్లి చూపుల్లో కూర్చుంది అంటూ నవ్వుతాడు నందు.
పెళ్లి ఇష్టం లేదంటూ షాక్ ఇచ్చిన విక్రమ్..
మా వాడు ఆడపిల్లలకి ఆమడ దూరంలో ఉంటాడు. సడన్గా ఎలాగ మారాడు నువ్వే చెప్పాలి అంటూ దివ్యని ఆటపట్టిస్తాడు బసవయ్య. ఫార్మలిటీ కోసం మాత్రమే అడుగుతున్నాము మా అమ్మాయిని చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతుంది లాస్య. నాకు ఇష్టం లేదు అంటాడు విక్రమ్. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. దివ్యని చేసుకోవటం నా అదృష్టం అనటంతో అందరూ నవ్వుకుంటారు.
నా సూట్ కేస్ నాకు దక్కినట్లే అనుకుంటుంది లాస్య. నేను నందగోపాల్ గారు విడాకులు తీసుకున్నాము కూతురు ఇద్దరు బాధ్యత కాబట్టి కలిసి వివాహం చేస్తాము అంటుంది తులసి. అన్ని తెలిసే ఈ సంబంధానికి ముహూర్తం పెట్టుకొని మరీ వచ్చాను అంటుంది రాజ్యలక్ష్మి. అంతా మా దివ్య అదృష్టం అంటుంది తులసి. మా చిన్నవాడు చేసిన పనికి నాకు చాలా గిల్టీగా ఉంది అందుకే పెళ్లి సింపుల్గా గుడిలో చేద్దాము అంటుంది రాజ్యలక్ష్మి.
Intinti Gruhalakshmi April 3 Today Episode:దివ్య కోరికకి తల పట్టుకున్న తులసి..
అందుకు విక్రమ్, దివ్య ఇద్దరు ఒప్పుకుంటారు. ఒత్తిడికి మరోవైపు ఒత్తిడికి తలవంచి ప్రియని కోడలుగా చేసుకొని ఒక తప్పు చేసావు. ఇప్పుడు దివ్యని కోడలుగా తెచ్చుకుని రెండో తప్పు చేస్తున్నావు. నీకు అర్థమవుతుందా అంటాడు బసవయ్య. తరువాయి భాగంలో ఇప్పటివరకు బానే ఉన్నావు కదా ఇంతలోనే ఏమైంది అంటాడు పరంధామయ్య. మా అమ్మానాన్న పీటల మీద కూర్చొని కన్యాదానం చేయాలి అంటుంది దివ్య. దివ్య కోరికకి తల పట్టుకుని కూర్చుంటుంది తులసి.