Intinti Gruhalakshmi April 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పెళ్లి వాళ్ళ ఇంట్లో నోరు విప్పకూడదు కాబట్టి ఊరుకున్నాను ఇప్పటికైనా నా మాట విను. ఆ దద్దోజనానికి చెత్త మనిషి తీసుకొచ్చి పెళ్లి చేస్తానన్నావు మళ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్ ఏంటి అని అడుగుతాడు బసవయ్య. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను మార్చుకునే ప్రసక్తే లేదు అంటుంది రాజ్యలక్ష్మి.
నిజం తెలుసుకొని టెన్షన్ పడుతున్న ప్రియ..
హాస్పిటల్లోనే దానితో వేగలేక పోతున్నాము అలాంటిది ఇంటికి పెద్ద కోడలుగా తీసుకువస్తే మనకి పెద్ద కర్మ పెడుతుంది అంటాడు బసవయ్య. నాకు ప్రియ మీద కన్నా దాన్ని మన ఇంటి కోడలు చేసిన దివ్య మీదే పగ ఎక్కువ. విక్రమ్ ని అడ్డుపెట్టుకొని దాని రోగం కుదురుస్తాను అంటుంది రాజ్యలక్ష్మి. ఈ మాటలు అన్నీ ప్రియ అనుకోకుండా వింటుంది. నాకు హెల్ప్ చేసిన దివ్య మేడం ప్రమాదంలో పడబోతున్నారు.
ఈ విషయం ఎలాగైనా దివ్య మేడం కి చెప్పాలి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ప్రియ. మరోవైపు పెళ్లిచూపులు అనుకున్నట్లుగానే సవ్యంగానే జరిగాయి అంటూ దివ్యకి కంగ్రాట్స్ చెప్తుంది లాస్య. ఆస్తి లేకపోయినా సంస్కారవంతురాలైన కోడలు వస్తుంది అంటూ రాజ్యలక్ష్మి గారు మురిసిపోయారు అంటుంది. విక్రమ్ కూడా మా అందరికీ బాగా నచ్చాడు.
కన్నీటితో తన కోరిక బయటపెట్టిన దివ్య..
ఆస్తి ఎంత ఉన్నా చాలా సింపుల్ గా మన పక్కింటి అబ్బాయి లాగా ఉన్నాడు గుడ్ సెలక్షన్ దివ్య ని అప్రిషియేట్ చేస్తాడు నందు. మూడిగా ఉన్న దివ్యని చూసి ఇంతవరకు సంతోషంగానే ఉన్నావు కదా అంతలోనే ఏం ఆలోచిస్తున్నావు అంటాడు పరంధామయ్య. తల్లి తండ్రి లేని వాళ్ళది ఒక కష్టం అయితే ఉండి కూడా విడివిడిగా బ్రతుకుతున్న వాళ్ళది మరో కష్టం దివ్య.
అన్నీ తెలిసి కూడా బాధపడటం ఎందుకు పాతవన్నీ వదిలేసి సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అంటాడు పరంధామయ్య. మా అమ్మానాన్న పీటల మీద కూర్చొని నాకు కన్యాదానం చేయాలి అలాంటి అదృష్టం నాకు ఉంటుందా ఇదేమి గొంతెమ్మ కోరిక కాదు కదా అంటుంది దివ్య. నీ కోరిక ఎవరి చెవిన పడాలో వాళ్ళ చెవిని పడింది.
అత్తగారికి అడ్డంగా దొరికిపోయిన ప్రియ..
చూద్దాం ఏం జరుగుతుందో అంటాడు పరంధామయ్య. దివ్య ని ఎలాగైనా రక్షించాలి అనుకుంటూ పనిమనిషిని ఫోన్ అడుగుతుంది ప్రియ. పెద్దమ్మ గారికి తెలిసిందంటే ఊరుకోరు నేను ఇవ్వను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సంజయ్ రూమ్ లోకి వెళ్లిన ప్రియ కి అక్కడ మొబైల్ కనిపిస్తుంది. తను వచ్చేలోగా ఫోన్ చేద్దాం అనుకున్న ప్రియ కి కంగారులో ఫోన్ నెంబర్ గుర్తుకురాదు.
పోనీ నన్ను గుర్తు చేయమంటావా అంటూ అక్కడికి వచ్చేస్తుంది రాజ్యలక్ష్మి. నా హాస్పిటల్లో నేను ఇచ్చే జీతంతో బతికే నువ్వు నా ఇంట్లో పెత్తనం చేయాలనుకున్నావు. అందుకే సంజయ్ ని బుట్టలో వేసుకొని దివ్యని అడ్డం పెట్టుకొని నాటకం ఆడావు అంటుంది రాజ్యలక్ష్మి. ప్రమాణస్ఫూర్తిగా నేను అలా చేయలేదు సంజయ్ సర్ నా వెంట పడ్డారు తప్పు అన్నా వినిపించుకోలేదు అంటుంది ప్రియ.
దివ్య ప్రాణానికి ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్న రాజ్యలక్ష్మి..
మీకు ఏమైనా పగ ఉంటే నా మీద తీర్చుకోండి దివ్య జోలికి వెళ్లొద్దు అంటూ ప్రాధేయపడుతుంది ప్రియ. దెబ్బతిన్నది పరువు పోగొట్టుకున్నది నేను. నా దెబ్బ ఎలా ఉంటుందో అది కూడా తెలుసుకోవాలి అంటుంది రాజ్యలక్ష్మి. పొరపాటున కూడా ఈ ఇంట్లో మాటలు దివ్యకి చేరితే అది తన ప్రాణాలకే ముప్పు తెస్తుంది అంటూ ప్రియ జుట్టు పట్టుకొని తన దగ్గర ఉన్న మొబైల్ లాక్కుని వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి.
మరోవైపు పెళ్లి బడ్జెట్ వేసుకుంటున్న తులసి దగ్గరికి తీసుకువచ్చి నగలు పెడుతుంది అనసూయ. ఈ నగలు ఎందుకు తీసుకువచ్చారో నాకు తెలుసు ఇప్పుడు మీ ఇంటి కోడల్ని నేను కాదు అంటుంది తులసి. మేము కూడా బాధ్యతలు పంచుకుంటాము అంటుంది అనసూయ. మా కష్టాలు మమ్మల్ని పడనివ్వండి, పక్కన నిలబడి మంచి చెడు చెప్పండి చాలు అదే మాకు కొండంత అండ అంటుంది తులసి.
లాస్య కి థాంక్స్ చెప్పిన నందు..
అక్కడికి వచ్చిన నందు దివ్య పెళ్లి బాధ్యత నాది. నువ్వు చాలా చాలా చేశావు నువ్వు చేసిన దానికి తీర్చుకోలేను అంటాడు నందు. ఎవరెన్ని చెప్పినా దివ్య పెళ్లి బాధ్యత నాదే అంటుంది తులసి. నా కూతురి కోసం నేను ఖర్చు పెట్టడానికి ఉన్న ఆఖరి అవకాశము ఇది కనీసం ఈ ఒక్క తృప్తి అయినా నాకు మిగిలని అంటూ నగలని తల్లికి ఇచ్చేస్తాడు నందు.
అప్పుడే వచ్చిన లాస్య పెళ్లి చేయాలని చాలా ఆరాటపడుతున్నాడు ఈ అవకాశం ఇవ్వచ్చు కదా, ఇప్పటికే ఈ కుటుంబం కోసం చాలా చేశావు ఈ ఒక్క చిన్న అవకాశం నందు కి ఇవ్వు ఎందుకు బ్రతిమాలించుకుంటున్నావు అని తులసితో అంటుంది లాస్య. అందరి కోరిక అదే అయితే నాకేమీ అభ్యంతరం లేదు అంటుంది తులసి. నాకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ అంటూ లాస్యకి థాంక్స్ చెప్తాడు నందు.
Intinti Gruhalakshmi April 4 Today Episode దివ్యని కాపాడమంటూ విక్రమ్ ని రిక్వెస్ట్ చేస్తున్న ప్రియ..
మరోవైపు విపరీతంగా పని చేస్తున్న దివ్య దగ్గరికి వచ్చి కడుపులో ఇంటి వారసున్ని మోస్తున్నారు ఇంత పని చేయకండి నాకు ఇవ్వండి నేను చేస్తాను అంటుంది పనిమనిషి. రాజ్యలక్ష్మి నువ్వేమైనా దానికి తల్లిగా ఎందుకు దానికోసం అంత ఆరాట పడుతున్నావు అంటుంది రాజ్యలక్ష్మి. కడుపుతో ఉంది కదమ్మా అందుకే సాటి ఆడదానిగా బాధపడ్డాను అంతే, తప్పైపోయింది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పనిమనిషి.
నీ కష్టం కొద్దిరోజులే నీకు తోడుగా మరో కొత్త పనిమనిషి రాబోతుంది అంటూ దివ్య ఫోటో ప్రియ కి చూపిస్తుంది రాజ్యలక్ష్మి. మా వాడు పసుపు తాడు వేసిన వెంటనే నేను పలుపుతాడు వేసి దాని పొగరు దించుతాను అంటుంది రాజ్యలక్ష్మి. తరువాయి భాగంలో నీకు సహాయం చేసిన దివ్య జీవితం కష్టాల్లో కూలికి పోతుంటే ఎలా ఉంటుందో చూద్దువు గానివి అంటుంది రాజ్యలక్ష్మి. దివ్యని మీరే ఎలాగైనా రక్షించాలి అంటూ విక్రమ్ కి చెప్తుంది ప్రియ. ఒక్కసారిగా షాక్ అవుతాడు విక్రమ్.