Intinti Gruhalakshmi April 5 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నా మీద పగ తీర్చుకోండి దయచేసి దివ్యని వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ప్రియ. అది సరిపోదు తను ఈ ఇంటి కోడలు అవ్వాలి నీలాగే తను కూడా ఇలా కన్నీటితో ప్రాధేయపడాలి అప్పుడు తనని ఏం చేయాలో ఆలోచిస్తాను అంటూ పొగరుగా మాట్లాడుతుంది రాజ్యలక్ష్మి. మరోవైపు

పరంధామయ్యతో గేమ్ ఆడుతూ ఉంటుంది దివ్య.

 

తండ్రిని గెలిపించిన దివ్య..

 

రేపు నేను పెళ్లి అయిపోయి వెళ్ళిపోతే ఎవరితో ఆడుతావు తాతయ్య అని అడుగుతుంది. సంతోషం జీవితంలో ఎల్లకాలం ఉండదు. ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి లేనప్పుడు ఆ తీపి గుర్తులు తలుచుకోవాలి నేను కూడా అలాగే బ్రతికేస్తాను అంటాడు పరంధామయ్య. అంతలోనే వెడ్డింగ్ కార్డ్ సెలక్షన్ చేసి తీసుకువస్తారు నందు, తులసి.

 

ఒకటి నాకు నచ్చింది ఒకటి నాన్నకి నచ్చింది ఇందులో మీకు ఏది నచ్చితే అదే సెలెక్ట్ చేద్దాం అంటుంది తులసి. నందు తెచ్చింది సెలెక్ట్ చేస్తుంది దివ్య. దివ్య టేస్ట్ నాకు తెలియదు అన్నావు చూడు మా ఇద్దరి టేస్ట్ ఒకటే నేనే గెలిచాను అంటూ ఆనందంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు. తులసి దివ్యని ముద్దు పెట్టుకుంటుంది. నువ్వు తెచ్చిన కార్డు నచ్చలేదంది నీ కూతురు.

 

దివ్యని అర్థం చేసుకున్న తులసి..

 

అయినా ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నావు అని అడుగుతుంది అనసూయ. తనకి నేను తెచ్చిందే నచ్చింది కానీ వాళ్ళ నాన్న మొహంలో వెలుగులు చూడాలని ఆ కార్డు సెలెక్ట్ చేసింది అంటుంది తులసి. నా మనసుని అర్థం చేసుకున్నది మా అమ్మ ఒక్కతే అంటూ తల్లిని హత్తుకుంటుంది దివ్య. మరోవైపు దివ్య చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని వీడియోలో చూస్తూ ఉంటాడు.

 

అప్పుడే అక్కడికి వచ్చిన తులసిని కూడా కూర్చోమంటాడు. ఇద్దరూ పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటారు. దివ్యకి నా దగ్గర చేరిక ఎక్కువగా ఉండేది. మన ఇద్దరి మధ్య పెరిగిన దూరం వలన దివ్య తో కూడా దూరం పెరిగిపోయింది. నేను రియలైజేసరికి ఆ దూరం మరింత ఎక్కువైంది. నీకు నాకు మధ్యన మనస్పర్ధలు ఉండవచ్చేమో కానీ పిల్లలతో ఎప్పుడు దూరమవ్వాలని అనుకోలేదు.

 

బాగా ఎమోషనల్ అవుతున్న తండ్రి, కూతుర్లు..

 

ఇంత జరిగినా కూడా నా పిల్లలు నాతో ఉన్నారు అంటే అది నా గొప్పతనం కాదు కేవలం నీ దయ అంటూ చేతులు జోడిస్తాడు నందు. ఇదంతా వింటున్న దివ్య ఏడుస్తూ వచ్చి తండ్రిని హత్తుకుంటుంది. అమ్మని ఒంటరిదాన్ని చేసేసారు అనే బాధ తప్పితే మీరు ఎప్పుడూ నా హీరోనే ఇంకెప్పుడూ మిమ్మల్ని వదిలి ఉండను అంటుంది దివ్య. ఆడపిల్ల చూస్తుండగానే పెరిగి పెద్దది అయిపోతుంది.

 

అక్షరాభ్యాసం చేస్తే చదువులతో బిజీ, తరువాత ఉద్యోగంలో బిజీ తర్వాత పెళ్లి అయ్యి అత్తగారింటికి వెళ్ళాక సంసారంలో బిజీ అంటూ కన్నీరు పెట్టుకుంటాడు నందు. మీరు ఇంత ఎమోషనల్ అనుకోలేదు అంటూ దివ్య కూడా కన్నీరు పెట్టుకుంటుంది. వీళ్ళ ట్రాప్ లో పడకుండా దివ్యని ఎలాగ రక్షించడం అంటూ ఆలోచనలో పడిన ప్రియ విక్రమ్ తో జరిగిందంతా చెప్పడానికి డిసైడ్ అవుతుంది.

 

దివ్యని ఆట పట్టిస్తున్న అనసూయ..

 

మరోవైపు హాస్పిటల్ ఎండి కోడలు అంటే దివ్య కూడా ఎండితోనే సమానం అంటాడు నందు. దివ్య మీద చాలా హోప్స్ పెట్టుకుంటున్నారు అనుకుంటుంది లాస్య. అలాంటిదేమీ లేదు నాన్న నాకు కన్నా సీనియర్ మా మరిది సంజయ్ ఉన్నారు ఆయనదే మేనేజ్మెంట్ అంటుంది దివ్య. లాస్యకి ఖరీదైన పట్టు చీర కొనాలి ఎందుకంటే తనే పెళ్లి పెద్ద అంటుంది అనసూయ.

 

నాదేముంది పెళ్లి బాధ్యత అంతా వాళ్ళ ఆయనదే సెలక్షన్ వరకే నా పని అంటూ ఆటపట్టిస్తుంది తులసి. అంతలోనే రాజ్యలక్ష్మి పంపించిన బట్టలు, నగలు తీసుకొని వస్తారు షాపు వాళ్లు. అవి ఏంటి అని అందరూ అడుగుతారు. మా అత్తగారు పంపించిన నగలు బట్టలు అని చెప్పింది దివ్య. మా అత్తగారు మా అత్తగారు అంటూ బాగా వెనకేసుకొస్తున్నావు.

 

పెళ్లి చేసుకోనంటూ షాకిచ్చిన దివ్య..

 

ఇన్నాళ్లు పెంచిన అమ్మని మర్చిపోయావు అంటూ ఆట పట్టిస్తుంది అనసూయ. ఆ మాటలకి ఉడుక్కున్న దివ్య నాకు ఈ పెళ్లి వద్దు ఇప్పుడే రాజ్యలక్ష్మి గారికి ఫోన్ చేసి చెప్తాను అంటూ ఫోన్ తీసుకుంటుంది. నిజంగానే దివ్య చెప్పేస్తుంది ఏమో అని కంగారు పడిన లాస్య తన సూట్ కేసు ఎక్కడ మిస్ అవుతుందో అనుకుంటూ ఆమె దగ్గర ఫోన్ లాక్కొని అలా చేస్తే రాజ్యలక్ష్మి గారు ఏమనుకుంటారు అంటూ కోప్పడుతుంది.

 

చూడండి ఆంటీ ఎలా ఏడిపిస్తున్నారో, మా అత్తగారు అన్నంత మాత్రాన తల్లిని, తండ్రిని మర్చిపోతానా ఇప్పటికే అమ్మని నాన్నని వదిలి వెళ్ళటానికి చాలా బాధగా అనిపిస్తుంది అయినా పదే పదే మళ్లీ అదే గుర్తు చేస్తున్నారు అంటూ బాధపడుతుంది దివ్య. నిన్ను ఉడికించడానికి అలా అన్నారు. నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతున్నావని నీ కన్నా ఎక్కువగా నానమ్మ బాధపడుతున్నారు కావాలంటే చూడు అంటుంది తులసి.

  Intinti Gruhalakshmi April 5 Today Episode రాజ్యలక్ష్మి ని చూసి ఈర్ష పడుతున్న తులసి..

 

అప్పటికే బాధపడుతున్న అనసూయ దగ్గరికి వెళ్లి ఆమెని హత్తుకుంటుంది దివ్య. నీకు తల్లి లాగా చూసుకునే అత్తగారు దొరికింది. రాజ్యలక్ష్మి గారు రోజు ఫోన్ చేసి తన కోడల్ని ఎలా చూసుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఆవిడ ప్రేమ చూస్తే తల్లిని నాకే ఈర్షగా ఉంది అంటుంది తులసి. ఇంటిల్లపాది

మోసపోతున్నారు పాపం అనుకుంటుంది లాస్య.ఒంటరిగా ఉన్న విక్రమ్ తో నిజం చెప్పేయాలి అనుకుంటుంది ప్రియ.

 

ఆ విషయాన్ని అప్పుడే వచ్చిన బసవయ్య గమనిస్తాడు. విక్రమ్ తో ఏదో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంది ఏం మాట్లాడుతుందో విందాం అనుకుంటాడు. తరువాయి భాగంలో బట్టలు సెలెక్ట్ చేస్తున్న నందుకి తులసికి ఇద్దరికీ ఒకే చీర నచ్చుతుంది. మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ షాప్ అతను మెచ్చుకుంటాడు. అది చూసి ఎమోషనల్ అవుతుంది దివ్య.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 5, 2023 at 8:08 ఉద.