Intinti Gruhalakshmi April 7 Today Episode : ఈరోజు ఎపిసోడ్ లో డ్రెస్సింగ్ రూమ్ వైపు దివ్యని రమ్మని తను ముందుగానే ఆ రూమ్ లోకి వెళ్ళిపోతాడు విక్రమ్. డ్రెస్ ట్రైల్స్ కోసం అన్నట్లుగా దివ్య కూడా అదే రూమ్ లోకి వెళ్దాం అనుకుంటుంది కానీ తులసి ఈ చీర చాలా బాగుంది ఒకసారి చూడు అని ఆమెని లాక్కుపోతుంది. ఈ లోపు అదే ట్రైలర్ రూమ్ లోకి వేరే అమ్మాయి డ్రెస్ ట్రైల్ కి వస్తుంది.

 

దివ్యముందు నవ్వుల పాలైన విక్రమ్..

 

ఇదంతా పైనుంచి చూస్తున్న దివ్య పాపం విక్రమ్ ఇరుక్కుపోతాడు అనుకుంటూ టెన్షన్ పడుతుంది. దివ్య ఫేస్ చూస్తే ఆమెని హగ్ చేసుకోలేను అనుకొని రూమ్ లో లైట్ ఆఫ్ చేసేస్తాడు విక్రమ్. లోనికి వచ్చింది దివ్య అనుకొని ఆమెని హగ్ చేసుకుంటాడు. ఆ అమ్మాయి అబ్జెక్షన్ చెప్పకుండా ఇప్పటికి నా అదృష్టం పండింది అంటుంది. మాటలు తేడాగా ఉండటంతో లైట్ వేసి చూస్తాడు విక్రమ్.

 

ఆమె దివ్య కాదని తెలుసుకొని షాక్ అవుతాడు. ఆమె నుంచి విడిపించుకోవడానికి నానా తంటాలు పడతాడు. ఇదంతా చూస్తున్న దివ్య పగలబడి నవ్వుతుంది. ఏమైంది అని తులసి అంటే ఏం లేదు అంటూ మాట దాటేస్తుంది దివ్య. సరే అన్ని అకేషన్ కి రెండేసి చొప్పున తీసి పెట్టెను నీకు ఏది నచ్చితే అది ఫైనల్ చేద్దాం అంటూ ఆ సెక్షన్ కి తీసుకెళ్తుంది తులసి.

 

విక్రమ్ ప్రవర్తనకి షాకైన దివ్య ఫ్యామిలీ మెంబర్స్..

 

విక్రమ్ కి నచ్చిందే తులసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అది గమనించిన దివ్య ఫ్యామిలీ ఆమెకి తెలియకుండానే ఆమెని ఆట పట్టిస్తారు. ఈ డ్రెస్సు ట్రైల్ వేసుకుని వస్తాను అంటుంది దివ్య. అలాగే కంగారు ఏమీ లేదు నెమ్మదిగా వెళ్లి రా అంటుంది అనసూయ. ఆమె వెనకే విక్రమ్ కూడా అదే రూమ్ లోకి వెళ్తాడు. అది గమనించిన అనసూయ రండి మనం కూడా వెళ్దాము అంటుంది. బాగోదేమో అంటుంది తులసి.

 

వాళ్ళిద్దరూ కలిసి ఒక రూమ్ లోకి వెళ్ళటం బాగుందేంటి ఏమీ పరవాలేదు పదండి అంటూ తులసిని లాస్యని తీసుకువెళ్లి దివ్య వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది. మీ వాళ్ళకి తెలియకుండా ఇలా దొంగతనంగా కలిస్తే భలే మజాగా ఉంది కదూ అంటాడు విక్రమ్ నాకు చాలా టెన్షన్ గా ఉంది అంటుంది దివ్య. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బయటినుంచి నవ్వుకుంటూ ఉంటారు అనసూయ వాళ్ళు.

 

అడ్డంగా దొరికిపోయిన దివ్య, విక్రమ్..

 

దివ్యకి పిల్లి అంటే చాలా భయం ఇప్పుడు ఏం చేస్తానో చూడు అంటూ పిల్లిలాగా అరుస్తుంది అనసూయ. అది విన్న దివ్య కంగారుగా ఇక్కడ ఎక్కడో పిల్లి ఉంది వెళ్ళిపోదాం అంటుంది. పెళ్లికి భయపడటం ఏంటి అని విక్రమ్ అంటే అదంతా తెలియదు నాకు కంగారుగా ఉంది వెళ్ళిపోదాం అంటుంది దివ్య. సరే నాకు ఒక ముద్దు పెట్టు వెళ్ళిపోదాం అంటాడు విక్రమ్.

 

అంతలోనే అనసూయ మళ్లీ పిల్లిలా అరవడంతో కంగారుగా బయటికి వచ్చేసిన దివ్య తనని మాట పట్టించింది అనసూయ వాళ్లు అని తెలుసుకొని సిగ్గు పడిపోతుంది. దొంగ పిల్లి అంటూ మనవరాలి చెవి మెలేస్తుంది అనసూయ. మీరింక బయటికి రావచ్చు అంటూ విక్రమ్ ని పిలుస్తుంది అనసూయ. విక్రమ్ కూడా సిగ్గు పడిపోతూ బయటికి వస్తాడు.

 

విక్రమ్ ని హద్దుల్లో ఉండమంటున్న తులసి..

 

లైఫ్ లో థ్రిల్ ఉండాలి కానీ ఇంతకుమించి ఉండకూడదు అంటారు పరంధామయ్య, నందు. మీరు ఇలా మాతో ఉండడం మాకు సంతోషమే కానీ మీ అమ్మగారికి తెలిస్తే బాగోదు పెళ్లయ్యే వరకు ఎవరి హద్దుల్లో వాళ్లు ఉండటమే మంచిది ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు అంటుంది తులసి. అలాంటిది ఏమీ లేదు మీరు ఏం చెప్పినా మా మంచి కోసం కదా అంటాడు విక్రమ్.

 

అయినా పెళ్లయ్యాక మా మనవరాలు మీ ఇంటికే కదా వచ్చేది అంటుంది అనసూయ. మా దివ్య కోసం మీరు సెలెక్ట్ చేసిన చీరలు చాలా బాగున్నాయి అంటుంది లాస్య. ఒక్కసారిగా షాక్ అవుతారు విక్రమ్ లాస్య. అన్ని మేము చూసాము అంటుంది అనసూయ. వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి సిగ్గు పడిపోతూ వెళ్ళిపోతాడు విక్రమ్. బిల్ పే చేస్తున్న నందుతో దివ్యని చూస్తే తృప్తిగా ఉంది.

 

తులసిని పద్ధతి మార్చుకోమంటున్న రాజ్యలక్ష్మి..

 

 

తనకి ఎలాంటి భర్త దొరుకుతాడో అని భయంగా ఉండేది విక్రమ్ ని చూస్తుంటే ఆ భయం పోయింది అత్తారింట్లో అది సంతోషంగా ఉంటుంది అని నమ్మకం కలిగింది అంటుంది తులసి. అదంతా వింటున్న లాస్య నీ నమ్మకం ఎన్నో రోజులు నిలబడదు అనుకుంటుది. మరోవైపు రాజ్యలక్ష్మి, తులసికి ఫోన్ చేసి ఒక్క విషయంలో మీ పద్ధతి బాగోలేదు వెంటనే మార్చుకోవాలి అంటుంది.

 

తప్పు నా వైపు ఉంటే దిద్దుకుంటాను క్షమాపణ కూడా చెప్తాను తప్పు నా వైపు లేకపోతే మాత్రం దేవుడు చెప్పిన వినను అంటుంది తులసి. అంతా ఇగో నా అంటుంది రాజ్యలక్ష్మి. అది ఈగో కాదు ఆత్మ అభిమానం అంటుంది తులసి. వియ్యంకులం అవుతున్నాము అయినా కూడా మీరు వదిన గారు అని కాకుండా పేరు పెట్టి పిలవటం ఏమీ బాగోలేదు అంటుంది రాజ్యలక్ష్మి. అలవాటు అవ్వాలి కదా టైం పడుతుంది అంటుంది తులసి.

 

కోడల్ని నెత్తిన పెట్టుకుంటానంటున్న రాజ్యలక్ష్మి..

 

 

దివ్య ఇకనుంచి నా కూతురుతో సమానం మీరు భుజాలు వస్తే నేను నెత్తిన పెట్టుకుంటాను అంటుంది రాజ్యలక్ష్మి. మీలాంటి మంచి అత్తగారి దొరకడం నా కూతురు అదృష్టం అంటుంది తులసి. దివ్యకి కూడా నాలాగే ముక్కుసూటితనం ఎక్కువ అని తులసి అంటే దివ్యలో నాకు నచ్చినది అదే గుణం అంటూ ఇంతకీ నేను పంపించిన బట్టలు నగలు నా కోడలికి నచ్చాయా అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. తనకి బాగా నచ్చాయి అంటుంది తులసి.

 

అయితే మా అభిరుచులు కలిసినట్టే అంటుంది రాజ్యలక్ష్మి. రేపు మా అల్లుడు గారికి నేను బట్టలు పంపిస్తాను మా అభిరుచులు కూడా కలవాలి కదా అంటుంది తులసి. వాడికి ప్రత్యేకించిఅభిరుచులు ఏమీ ఉండవు నాకు నచ్చితే వాడికి నచ్చినట్లే అంటూ ఫోన్ పెట్టేస్తుంది. రాజ్యలక్ష్మి. అతి త్వరలో దివ్య ఈ పులిబొనులోకి అడుగు పెట్టబోతోంది అని ప్రియ తో చెప్తుంది రాజ్యలక్ష్మి.

Intinti Gruhalakshmi April 7 Today Episode :నందు మాటలకి ఎమోషనల్ అయిన తులసి..

 

తరువాయి భాగంలో తులసి కోసం చీర తీసుకువస్తాడు నందు. కట్టుకున్న భార్యకి తప్ప పరాయి వాళ్లకి చీరకొనడం మీకు అలవాటే కదా అయినా మీకు తెలియకపోయినా నాకు నచ్చిన రంగే తెచ్చారు అంటుంది తులసి. తెలిసే తీసుకువచ్చాను అంటాడు నందు. ఎమోషనల్ అవుతుంది తులసి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 7, 2023 at 7:50 ఉద.