Intinti Gruhalakshmi April 8 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పదిమంది మధ్యలో తన మాట విన్నానని ఎర్రి గొర్రె ని అనుకుంటుంది కానీ తననే గొర్రెని చేసి పులిబోనులోకి రప్పిస్తున్నాను అంటుంది రాజ్యలక్ష్మి. నన్ను ఎలాగో ఇబ్బందులు పెడుతున్నారు కదా కనీసం దివ్య నైనా వదిలిపెట్టండి అంటుంది ప్రియ. అయితే నువ్వు నా కొడుక్కి విడాకులు ఇచ్చేయ్ నేను దివ్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటుంది రాజ్యలక్ష్మి.
దివ్యని ఆట పట్టిస్తున్న రాములమ్మ..
అప్పుడు నా జీవితం నాశనం అయిపోతుంది కదా అంటుంది ప్రియ. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు దివ్యకి పెళ్లికూతురులా ముస్తాబు చేస్తుంది రాములమ్మ. ఇప్పుడెందుకు పెళ్ళిలో ఎలాగూ చేస్తారు కదా అంటుంది దివ్య. అప్పుడు అందరూ మిమ్మల్ని చూస్తారు కానీ మిమ్మల్ని మీరు చూసుకునే అవకాశం ఉండదు ఈ ముస్తాబులో ఎంత అందంగా ఉన్నారు.
ఇప్పుడే గాని విక్రమ్ బాబు ఉంటేనా నన్ను మెడ పెట్టి బయటికి గెంటేసి లోపల గడియ పెట్టేసేవారు అంటూ ఏడిపిస్తుంది రాములమ్మ. ఇంతలో విక్రమ్ ఫోన్ చేస్తే కాసేపు మాట్లాడి ఇంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే బాగోదు అంటూ ఫోన్ పెట్టేస్తుంది దివ్య. ఫోన్లో మాట్లాడితే కట్ చేస్తుందా డైరెక్ట్ గా ఇంటికి వెళ్తే ఇంటిల్లిపాది మర్యాద చేసి మా ఇద్దరి మాట్లాడుకోమంటారు అనుకుంటాడు విక్రమ్.
లాస్యను చూస్తే భయం వేస్తుందంటున్న నందు..
మరోవైపు తులసి తన దగ్గరికి వచ్చిన నందుతో లాస్య లో ఏదో మార్పు వచ్చింది ఇంతకు ముందులాగా ఏడిపించటాలు, వెటకారంగా మాట్లాడటాలు ఇలాంటివి లేవు అంటుంది. కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది పాము బుస కొడితే పర్వాలేదు ఎందుకంటే అది దాని నైజం. కుదురుగా ఉన్న పాముని చూస్తేనే భయం ఎందుకంటే ఎప్పుడు బుస కొడుతుందో అని అంటాడు నందు.
నందు చేతిలో చీర చూసి మీ ఆవిడ కోసం తెచ్చారా అంటుంది తులసి. కాదు నీకోసమే తీసుకొచ్చాను అంటాడు నందు. ఎందుకు అంటుంది తులసి. తీసుకోవాలనిపించింది తీసుకున్నాను అంటాడు నందు. కట్టుకున్న భార్యకి తప్పితే వేరే వారికి చీరలు కొనివ్వడం మీకు అలవాటే కదా అంటుంది తులసి. కొన్ని తప్పులు మర్చిపోతేనే మంచిది అంటాడు నందు.
అర్ధరాత్రి గోడ దూకిన విక్రమ్..
నన్ను పెళ్లి చేసుకోవడం తప్పా లేకపోతే విడాకులు ఇవ్వడం తప్పనుకుంటున్నారా అంటూ నిలదీస్తుంది తులసి. మీరు గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు కాకుండా అందరి మధ్యలో ఇవ్వండి అప్పుడే మీకు మంచిది నాకు మంచిది అంటుంది తులసి. ఇకముందు అలాగే చేస్తాను అంటాడు నందు. తెలియకుండానే నాకు ఇష్టమైన కలర్ తెచ్చారు అంటుంది తులసి.
తెలిసే తీసుకువచ్చాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు. మరోవైపు గోడదూకి దివ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఆమె రూమ్ లోకి వెళ్లి ఆమెని మెల్లగా పిలుస్తాడు విక్రమ్. నిద్రలో ఉన్న దివ్య వచ్చింది దొంగనుకొని గట్టిగా కేకలు వేస్తుంది. ఆ కేకలకి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. అప్పటికే విక్రమ్ సోఫా కింద దాక్కుంటాడు. అది గమనించిన దివ్య దొంగ అనుకోని అరిచేశాను.
విక్రమ్ ని ఇంట్లోంచి బయటికి పొమ్మన్న దివ్య..
ఇప్పుడు అందరి ముందు దొరికిపోతే పరువు పోతుంది ఎలాగైనా రక్షించాలి అనుకుంటుంది. నాకు పీడకల వచ్చినట్లుగా ఉంది దొంగ ఎవరు రాలేదు అంటుంది దివ్య. నీ పక్కన పడుకోనా నీకు ధైర్యంగా ఉంటుంది అంటుంది తులసి. వద్దు కావాలంటే మళ్ళీ పిలుస్తాను అంటూ అందరిని అక్కడి నుంచి బయటికి పంపించేస్తుంది. తర్వాత విక్రమ్ ని బయటికి రమ్మని వాళ్లు నిన్ను చూసి ఉంటే ఏమయ్యేది.
వెంటనే వచ్చిన దారిలో బయటికి వెళ్ళు ఇక్కడ ఉండడం మంచిది కాదు అంటుంది దివ్య. ఇంతలోనే ఏంటా హడావుడి అంటూ కుటుంబ సభ్యులు మొత్తం వచ్చేస్తారు. విక్రమ్ ని చూసి షాక్ అవుతారు. విక్రమ్ కూడా సిగ్గు పడిపోతూ చూడాలనిపించింది అందుకే వచ్చాను అంటాడు. నీ అవస్థ నాకు అర్థమైంది కానీ ఈ టైంలో మంచిది కాదు రేపు పొద్దున రా అంటూ బయటికి తీసుకెళ్ళిపోతాడు నందు.
Intinti Gruhalakshmi April 8 Today Episodeఅత్తగారి కాళ్లు పట్టుకున్న నందు..
ఇదేనా పిడకల అంటూ మనవరాల్ని ఏడిపిస్తుంది అనసూయ. మరోవైపు ఇంటికి పిల్లలు వస్తేనే కానీ పెళ్లికళ రాదు అంటుంది తులసి. మా కాలంలో వారం ముందు నుంచే హడావుడి ప్రారంభమైయ్యేది. వచ్చిన బంధువులు రావడం ఆలస్యం ఇంట్లో ఉన్న వాళ్ళం అందరినీ వెళ్లి వాళ్ళని ఆప్యాయంగా పలకరించే వాళ్ళం ఎంతైనా ఆ రోజులే వేరు, ఇప్పుడు కళ్ళు మూసి తెరిచేలోగా పెళ్లి అయిపోతుంది అంటుంది అనసూయ.
నా పెళ్లి కూడా అలాగే ప్లాన్ చేయొచ్చు కదా అంటుంది దివ్య. కొన్ని కొన్ని జ్ఞాపకాలు చెప్పుకొని మురిసిపోవాలి అంతేగాని ఆ రోజులు మళ్లీ తిరిగి రావు అంటాడు నందు. అంతలోనే ప్రేమ్ దంపతులు వస్తారు. అందరూ ఎదురెళ్లి వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తారు. నా మనవడు ఏడి అంటూ ప్రేమ్ కొడుకుని ఎత్తుకొని ముద్దు చేస్తుంది తులసి. అంతలోనే మాధవి వాళ్లు కూడా వస్తారు.
తరువాయి భాగంలో మీ అమ్మ వాళ్లు కనిపించడం లేదు అంటుంది మాధవి. ఏం మొహం పెట్టుకుని వస్తారు అల్లుడుతో సంబంధాలు తెగిపోయిన తర్వాత అంటుంది తులసి. ఆ మాటలు విన్న నందు అత్తగారింటికి వెళ్లి కూతురి పెళ్లి అవుతుంది అన్న సంతోషం తులసి మొహంలో లేదు దయచేసి మీరు రావాలి కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను అంటూ అత్తగారి కాళ్ళ మీద పడతాడు నందు.