Intinti Gruhalakshmi August 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నందు, సామ్రాట్ వంటలు చేయటానికి పోటీ పడతారు. నందుకు లాస్య హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది చూసి హనీ ఇదంతా చీటింగ్ అని అంకుల్ కి ఆంటీ హెల్ప్ చేస్తుందని అనటంతో వెంటనే లక్కీ తులసి ఆంటీ ఉంది కదా మీ డాడీ కి హెల్ప్ చేయమని అంటాడు. లక్కీ అన్న మాటలతో నందు బాగా కోపం అవుతాడు.
ఫైర్ అవుతున్న నందు..
తులసి వెళ్లి సామ్రాట్ దగ్గర వంట చేస్తుంది. ఆ తర్వాత వంటలు రెడీ అవ్వగా వీటిని తులసి, లాస్య టెస్ట్ చేసి రిజల్ట్ చెప్పమని అంటారు. దాంతో నందుకి లోలోపల బాగా కోపం వస్తుంది. తనకు వంట రాదని తెలిసిన కూడా లాస్య తనను అడ్డంగా బుక్ చేసింది అని ఫైర్ అవుతూ ఉంటాడు. తర్వాత ఆడవాళ్లు వంట చేయాలి దాని రుచి మగవాళ్ళు చూడాలి అని నందు అంటాడు.
దాంతో వెంటనే తులసి అలాంటప్పుడు ఆడవాళ్ళని ఎందుకు ఉద్యోగాలు చేయిస్తున్నారు అని అంటుంది. వెంటనే సామ్రాట్ కరెక్ట్ పాయింట్ అని అనడంతో
వెంటనే నందు మరికొన్ని మాటలతో కాస్త కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో అభి నాకు అక్కడ ఉండాలని లేదు అని వెళ్లాలని ఉంది అనటంతో దివ్య వెళ్లకు అని అంకుల్ ఫీల్ అవుతాడు అని అంటుంది.
వంటలో గెలిచిన సామ్రాట్..
ఇక నందు టాపిక్ ను మరింత పెద్దగా చేయడంతో వెంటనే తులసి అది ఆపే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత తులసి ఇంత జరిగాక ఆ రుచులు మేము చూసి చెప్పడం కాదు.. మా అత్తయ్య, మామయ్య చూసి చెబుతారని అనటంతో అందరూ ఓకే అంటారు. ఇక అనసూయ దంపతులు రుచి చూడగా సామ్రాట్ కు మార్కులు వేస్తారు.
మధ్యమధ్యలో సలహాలు ఇస్తున్న లక్కీ..
దాంతో హనీ మురిసిపోతుంది. ఆ తర్వాత నందు, లాస్య బయటకు రాగా నందు లాస్య పై బాగా కోపం అవుతాడు. ఆ తర్వాత లాస్య నందుకి నచ్చజెప్పి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత దివ్య, సామ్రాట్ చెస్ ఆడుతూ ఉంటారు. ఇక హనీ అందరూ దివ్య అక్క వైపు ఉన్నారు అని మా డాడీ కి ఎవరు సపోర్ట్ చేయడం లేదు అనటంతో వెంటనే లక్కీ తులసి ఆంటీ ఉంది కదా మీ డాడీ వైపు లాక్కో అని సలహా ఇస్తాడు.
Intinti Gruhalakshmi August 4 Today Episode: మళ్లీ నందుని బుక్ చేసిన లాస్య..
దాంతో నందు కి మరింత కోపం వస్తుంది. ఆ తర్వాత సామ్రాట్ గెలవడంతో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ చెస్ చాంపియన్ అని అంటాడు. ఇక సామ్రాట్ గురించి గొప్పగా చెబుతాడు. వెంటనే లాస్య ఓడించేవాడు లేక గెలిచాడు అని వెటకారం చేస్తుంది. దాంతో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఆ గెలిచే వ్యక్తి ఎవరు అని మళ్లీ నందు పేరు చెప్పి నందుని బుక్ చేస్తుంది. దాంతో తులసి వాళ్లంతా షాక్ అవుతారు. ఇక హనీ, లక్కీ వాళ్ళు ఊరుకోకుండా సామ్రాట్, నందులను పోటీకి సిద్ధం కావాలి అని అంటారు. ఇక ఇద్దరు హ్యాండ్ రైసింగ్ కి సిద్ధమవుతారు.