Intinti Gruhalakshmi August 6 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నందు తులసి పాట పాడటంతో తనను పొగుడుతాడు. మీ గొంతు ప్రపంచానికి వినపడకుండా చాలా పెద్ద తప్పు చేసారు ఎంతో గొప్ప స్థాయికి మీరు ఈ నాలుగు గోడల మధ్య ఆగిపోయారు అని అంటారు.
దాంతో తులసి గతంలో నందు తనతో మాట్లాడిన మాటలను గుర్తుకు చేసుకుంటుంది. గుడిలో పాట పాడినందుకు మ్యూజిక్ డైరెక్టర్ తనకు సినిమాలో పాడే అవకాశం ఇస్తా అన్నారు అని వెంటనే నందు తులసి పై అరుస్తాడు. సంపదన నీకు సరిపోవటం లేదా అంటూ బాగా అవమానిస్తాడు. గతాన్ని గుర్తుకు చేసుకొని బాధపడుతుంది.
సీన్ కట్ చేస్తే..
పరంధామయ్య తన కోడలు నాలుగోడల మధ్య ఆగిపోవడానికి ఒక రకంగా మేము కూడా కారణమని అంటాడు. అనసూయ కూడా తను గతంలో తులసిపై ఈర్ష పడ్డ విషయాలను చెప్పుకుంటూ బాధపడుతుంది. తులసిని చాలా బాధపెట్టాను అని.. బంధిని చేశాను అని.. నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెబుతుంది. ఇప్పుడు నా కోడల్ని మంచిగా చూసుకుంటాను అని అంటుంది.
వెంటనే అంకిత గుర్తుంచుకోండి అని అంటుంది. ఆ తర్వాత అభి నానమ్మ చేసిన తప్పేమీ అంటూ.. నానమ్మ తన కొడుకు సుఖంగా ఉండాలి అని అలా చేసి ఉండొచ్చు అని అంటాడు. అంతేకాకుండా నానమ్మది పెద్ద మనసు కాబట్టి తప్పును ఒప్పుకుంది అని అంటాడు. తర్వాత సామ్రాట్ వల్ల బాబాయ్.. భార్య భర్తల మధ్య ఉండాల్సిన బాధ్యత గురించి చెప్పటంతో అప్పుడే లాస్య మధ్యలో కలగజేసుకొని మరి తులసి విషయంలో పాపం ఆమె భర్త ప్రాబ్లం ఏంటో మనకు తెలుస్తుంది అంటూ మాట్లాడుతుంది.
నీ భర్తను ఎందుకు వదిలేసాడని తులసిని నేరుగా అడిగిన సామ్రాట్ బాబాయ్..
వెంటనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ కూడా తులసిని నీ భర్త ఎందుకు వదిలేసాడు అని అడుగుతాడు. దాంతో తులసి బాధపడుతూ సామ్రాట్ కి చెప్పి మన కుటుంబ సభ్యులతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సామ్రాట్ కాస్త బాధపడినట్లు కనిపిస్తాడు. తులసి ఒంటరిగా కూర్చొని నా బతుకు నేను బతుకుతున్న కూడా ఆ దేవుడికి కూడా నాపై జాలి లేదు అని.. వద్దు వద్దు అనుకున్న మనిషితోనే ఏదో రకంగా ముడి పెడుతున్నాడని అనుకుంటుంది.
Intinti Gruhalakshmi August 6 Today Episode: లక్కీ పై కోపంతో రగిలిపోయిన నందు..
ఇక పరంధామయ్య నీ మెడలో మంగళసూత్రం ఒకసారి చూపించు అని.. అనటంతో వెంటనే చూపిస్తుంది. గతాన్ని వదులుకోకుండా మెడలో వేసుకొని తిరుగుతున్నావ్.. అని అంటాడు. అలా కాసేపు ఎమోషనల్ డైలాగ్స్ కొడతాడు. ఆ తర్వాత సామ్రాట్ జరిగిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ కోపంతో కనిపిస్తాడు. అప్పుడే లక్కీ ఆడుకుంటూ వచ్చి ఆ బొమ్మ సామ్రాట్ అంకుల్ ఇప్పించాడు అని ఆయన గ్రేట్.. మీరు జలసీగా ఫీల్ అవుతున్నారు కదా అనటంతో వెంటనే నందు ఆ బొమ్మను కిందకి కొట్టబోతాడు. ఇప్పుడే లాస్య వచ్చి అడ్డుకుంటుంది