Intinti Gruhalakshmi December 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో లాస్యని ఫ్రిడ్జ్ తాళాలు అడుగుతుంది అంకిత. ఎందుకు అని లాస్య అడిగితే అడగడానికి నువ్వు ఎవరు అంటుంది అంకిత. ఇన్నాళ్ళ వరకు నేను ఎవరో తెలియదా ఇప్పుడు నేను పరిచయం చేసుకోవాలా? అయితే విను ఈ ఇల్లు నాది నేను ఈ ఇంటి యజమానురాలిని అంటూ అహంకారంగా మాట్లాడుతుంది. ఇంట్లో ఏం జరిగినా నా పర్మిషన్ కావాలి అంటుంది లాస్య.
లాస్య తో గొడవ పెట్టుకున్న అంకిత..
అంకితని గొడవ పెట్టుకోవద్దు అంటాడు పరంధామయ్య. తనని నా మీదకి రెచ్చగొట్టి ఇప్పుడు ఏమి తెలియనట్టు నాటకం ఆడుతున్నారా అంటుంది లాస్య. నాటకం ఆడవలసిన అవసరం ఆయనకి లేదు,ఆయన కడుపు మంటతో బాధపడుతున్నారు ముందు ఫ్రిజ్ తాళాలు ఇవ్వు అంటుంది అంకిత. నచ్చినట్లు వాళ్ళు తింటూ పోతే ఇంటి బడ్జెట్ మీద ఎవరికి కంట్రోల్ ఉంటుంది. ఇన్ని రోజులు మీకు అలవాటు లేనట్టుంది అందుకే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇకపై అలవాటు చేసుకోండి అంటుంది.
తాతయ్య పేషెంట్ అది నీకు అర్థమవుతుందా అంటుంది దివ్య. నాకు మావయ్య మీద అంత కన్సర్న్ లేదనుకున్నారా ఆయనకి అవసరమైతే నాతో మాట్లాడతారు అంటుంది లాస్య. ఆయన కోసం డజను అరటి పళ్ళు తెప్పించి ఉంచాను అంటుంది లాస్య. ఆయన షుగర్ పేషెంట్ అనేసి అరటి పళ్ళు తినకూడదు అయినా ఆయనకి అరటి పళ్ళు ఇష్టం ఉండదు అంటుంది అంకిత. ఆరోగ్యం బాగోలేనప్పుడు కడుపు నింపుకోవాలి గాని ఇస్టా,ఇష్టాలతో పనేం ఉంది అంటుంది.
శృతిని అవమానించిన లాస్య..
అయినా ఒక్క పాల ప్యాకెట్ కోసం ఎందుకు అంత గొడవ ఉంటుంది అంకిత. నేను కూడా అదే అంటున్నాను ఒక్క పాలు ప్యాకెట్ కోసం ఎందుకు అంత గొడవ, ఇది నా ఇల్లు నాకు నచ్చినట్లుగా జరగాలి అంటుంది లాస్య. మాట్లాడితే నా ఇల్లు నా ఇల్లు అంటున్నావేంటి ఇదేమి నువ్వు కష్టపడి సంపాదించింది కాదు మోసంతో సంపాదించింది అంటుంది శృతి. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఊరుకోను అంటుంది లాస్య. ఒక్కసారి కాదు వందసార్లు అంటాను అంటుంది శృతి.
నన్ను వేలు పెట్టి చూపించే ముందు నీ గురించి ఒకసారి ఆలోచించుకో, ఏం కి గాలం వేసి ఈ ఇంటికి కోడలువి అయ్యావు. ఎవరు లేని అనాధ వి నువ్వు, నువ్వు కూడా నన్ను అనేదానివి అయ్యావా అంటుంది లాస్య. అనాదని నేను కాదు నువ్వు, వీళ్ళందరూ నా వాళ్లు, మా అందరి మధ్య చిచ్చుపెట్టి ఈ ఇంటిని ముక్కలు చేయాలనుకుంటున్నావ్ అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది శృతి. మరోవైపు పూజ చేసుకుంటున్న తులసి చేతిలోంచి హారతి పళ్లెం జారిపోతుంది.
శృతి కోసం కంగారు పడుతున్న కుటుంబ సభ్యులు..
కంగారు పడిపోయిన తులసి ఎప్పుడూ ఇలా జరగలేదు, ఏం చెప్పాలనుకుంటున్నావు తండ్రి మా వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చిందా అలాంటిది ఏదైనా ఉంటే నాకు ఇవ్వు నేను తట్టుకుంటాను కానీ వాళ్లకి ఎలాంటి కష్టం ఇవ్వద్దు అంటూ దండం పెట్టుకుంటుంది. మంచం మీద పడుకోబెట్టి శృతికి టెస్ట్ చేస్తుంది అంకిత. గొడవలు వద్దు అంటే విన్నారు కాదు ఇప్పుడు చూడండి అంటూ బాధపడతాడు పరంధామయ్య. ప్రేమ్ ఇంట్లో లేడు విషయం తెలిస్తే ఇంకెంత గొడవపెడతాడో అంటుంది అనసూయ.
అన్నయ్యకి చెప్దామా అంటే అంకిత టెస్ట్ చేస్తుంది కదా విషయం తెలిశాక చెబుదాంలే అంటుంది అనసూయ. మెలకువ వచ్చిన శృతి నాకు ఏం జరిగింది అంటుంది. లాభం లేదు శృతి నువ్వు కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలి అంటుంది అంకిత. ఆ మాటలకి అందరూ కంగారు పడిపోతారు. ఏమైందో చెప్పు అంకిత టెన్షన్ గా ఉంది అంటుంది శృతి చెప్పక తప్పదా అంటూ ఆమె చెవిలో ఏదో చెప్తుంది అంకిత. ఆ మాటలకి చాలా సంతోష పడిపోతుంది శృతి.
శుభవార్త చెప్పిన అంకిత..
ఏమైందో అని అందరూ కంగారు పడుతుంటే, కంగారు పడవలసిన పని లేదు శృతి తల్లి కాబోతుంది అంటుంది. ఆ మాటలకి అందరూ సంతోషిస్తారు. నువ్వు కొడుకుని కను తర్వాత నేను పెళ్లి చేసుకొని తీరికగా కూతుర్నికంటాను అంటూ వదినని ఆట పట్టిస్తుంది దివ్య. ఈ విషయం అర్జెంటుగా ప్రేమ్ కి చెప్పు అంటూ ఫోన్ ఇస్తుంది శృతి. ఫోన్ తీసుకున్న శృతి ముందు చెప్పవలసింది ప్రేమ్ కి కాదు తులసి ఆంటీకి ఆవిడే తన కొడుక్కి చెప్పుకుంటుంది అంటూ తులసికి ఫోన్ చేసి ఆ శుభవార్త ని చెప్తుంది. సంతోషంతో నిజమేనా అంటుంది తులసి.
నేనే కన్ఫర్మ్ చేశాను ఆంటీ అంటుంది అంకిత. ఈ విషయం ప్రేమ్కి తెలుసా అంటే లేదు మీరే చెప్పండి అంటుంది శృతి. హారతి పెళ్ళం చేజారి పోతే ఏదో చెడు జరుగుతుంది అనుకున్నాను కానీ శుభవార్త చెప్పావు తల్లి అంటే దేవుడికి దండం పెట్టుకుంటుంది తులసి. మరోవైపు సంతోషంతో అత్తింటికి వస్తుంది తులసి. గుమ్మంలోనే ఎవరైనా లాస్యకి కంగ్రాట్స్ చెప్తుంది తులసి. నాకెందుకు కంగ్రాట్స్ అంటూ షాక్ అవుతుంది లాస్య.
కన్ఫ్యూజన్ లో ఉన్న లాస్య..
నందు తాతయ్య అంటే నువ్వు నానమ్మ వే కదా అంటూ సంతోషంగా చెప్తుంది తులసి. తులసి ఏం మాట్లాడుతుందో లాస్యకి అర్థం కాదు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారా ఎవరు కనిపించడం లేదు ఏమి స్వీట్ సడానికి వెళ్ళారా అవసరం లేదు అవన్నీ నేను తీసుకుని వచ్చాను అంటుంది తులసి. ఎవరికి ఇవ్వటానికి అని లాస్య అడిగితే కడుపుతో ఉన్న వాళ్ళకి అంటుంది తులసి. ఈ ఇంట్లో ఎవరు కడుపుతో లేరు నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉన్నారు.
పాపం సారే పట్టుకుంటూ ఊపుకొని వచ్చేసావ్ అంటుంది లాస్య. పోనీలే నువ్వేమి బాధపడకు ఇంటికి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టటం నాకు ఇష్టం ఉండదు ఆ సారే ఏదో నాకే ఇవ్వు అడ్వాన్స్డ్గా ఇచ్చావు అనుకుంటాను అంటుంది లాస్య. అప్పుడే అక్కడికి వచ్చిన శృతి తో ఏంటి క్లాస్ ఇలా మాట్లాడుతుంది నువ్వు నెల తప్పని విషయం తనకి తెలియదా లేకపోతే తెలిసే నాటకం ఆడుతుందా అంటుంది తులసి. అప్పుడే విషయం అర్థం చేసుకున్న లాస్య, శృతికి కంగ్రాట్స్ చెప్తుంది.
లాస్యకి సారీ చెప్పిన తులసి..
ఇంట్లో వాళ్ళందరూ ఎదురుచూస్తున్న శుభవార్తని వినిపించావు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. సారీ ఈ శుభవార్త నీకు కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను అంటుంది తులసి. అందరికీ అన్ని తెలియాలని లేదు కదా అది చెప్పే వాళ్ళ ఇష్ట ఇష్టాలని బట్టి ఉంటుంది లాస్య. అయినా శుభవార్త ఎప్పుడు చెప్పిన శుభవార్తె, అంతా శుభమే జరగాలి అంటుంది లాస్య. ఆ మాటలకి సంతోషించిన తులసి పదండి పండగ చేసుకుందాం అంటుంది.
పండగ చేసుకోవాల్సింది ఈ ఇంట్లో నా ఇంట్లో, పండుగ చేయవలసింది ఇంటి కోడలు హోదాలో నేను అంతేగాని నువ్వు కాదు అంటుంది లాస్య. సంబంధం లేనిది తులసి ఆంటీ కి కాదు నీకు ఎందుకంటే నేను తులసి ఆంటీ కోడల్ని అంటుంది శృతి. తప్పు, నువ్వు నందగోపాల్ గారి కోడలివి నేను ఆయన భార్యని ఈ ఇంట్లో సర్వహక్కులు నావి అంటుంది లాస్య. ఇంకా చిన్న విషయానికి గొడవ ఎందుకు పండుగ నీ చేతితోనే చేయి అంటుంది తులసి.
తులసిని ఇంట్లోంచి బయటికి పొమ్మన్న లాస్య..
కుదరదు నాకు తులసి ఆంటీ చేతితోనే పండగ కావాలి అంటుంది శృతి. నీ మాట వినాలా తులసి మాట వినాలా అంటుంది లాస్య. శృతి మాటే మా అందరి మాట అంటుంది అంకిత. నిన్ను చూసేసరికి వీళ్ళందరికీ పూనకాలు వచ్చేస్తాయి ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను, మీక్కూడా అదే ఇష్టం అయితే వెంటనే వెళ్ళిపో అంటుంది లాస్య. మీరు రండి అంటుంది శృతి. నువ్వు అంతా రెచ్చిపోకు ఎందుకంటే కడుపుతో ఉన్నావు కదా నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాదే అంటుంది లాస్య.
Intinti Gruhalakshmi December 26 Today Episode:
నా మొదటి బిడ్డకి మొదటి ఆశీర్వాదం ఇవ్వాల్సింది తులసి ఆంటీ మధ్యలో అడ్డు పడొద్దు అంటుంది శృతి. పక్కకు తప్పుకోండి అంటుంది అంకిత. ఒక పావుగంట ఉండి వెళ్ళిపోతాను అంటుంది తులసి. నిన్ను ఫోన్డనిస్తే నా కోడలి వద్ద వదులుకున్నట్టే అంటుంది లాస్య.
తులసి ఆంటీ ఎక్కడికి వెళ్ళదు అని శృతి అంటే వెళ్లి తీరాల్సిందే అంటుంది లాస్య. తరువాయి భాగంలో తులసి చేతిలో ఒకసారి నీ నేలకేసి కొడుతుంది లాస్య. తన ఇంటికి వచ్చి బాధపడుతున్న తులసిని ధైర్యం చెప్పి ఓదారుస్తాడు సామ్రాట్. వాళ్లకి జరిగే కష్టానికి, నష్టానికి మీరే బాధ్యత తీసుకోవాలి అంటాడు సామ్రాట్.