Intinti Gruhalakshmi December 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తులసిని ఇంట్లోంచి వెళ్లిపోమంటుంది లాస్య. ఆవిడ వెళ్లరంటే వెళ్లరు ఇది నీ ఇష్టం కాదు అంటుంది శృతి. ఈ ఇంట్లో ఏం జరగాలన్నా నా ఇష్టమే తగ్గనంటే తగ్గను అంటుంది లాస్య. మొండికేయ్యొద్దు లాస్య, శృతి నా కోడలు వాళ్లకి ఏ ముచ్చట జరగాలన్నా నా చేతుల మీదుగానే జరగాలి అంటుంది తులసి.
తులసికి జరిగిన ఘోర అవమానం..
మాటలకి కోపంతో తులసి చేతిలోని పసుపు, కుంకుమ బ్యాగ్ కింద విసిరేస్తుంది లాస్య. నువ్వు మనిషివా పశువా పసుపు కుంకాలు బ్యాగ్ అలాగ విసిరేస్తున్నావు , అది ఎంత అశుభమో నీకు తెలుసా అంటుంది తులసి. నన్ను రెచ్చగొట్టింది నువ్వే అంటుంది లాస్య. ఆవిడ నాకోసం వచ్చింది అంటుంది శృతి. రమ్మండానికి నీకేం హక్కు ఉంది నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది లాస్య. అంతలోనే భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి శృతి నువ్వు గొడవ పడొద్దు ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దొరుకుతుంది.
నువ్వు సంతోషంగా ఉండు పసుపు కుంకాలు బ్యాగ్లోకి ఎత్తి తనతోనే తీసుకు వెళ్ళిపోతుంది తులసి. మరోవైపు తులసి గారు ఎక్కడికి వెళ్లిపోయి ఉంటారు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అనుకుంటాడు సామ్రాట్. అంతలోనే అక్కడికి వస్తుంది తులసి. దూరం నుంచి సామ్రాట్ ని చూసి కళ్ళు తుడుచుకుంటుంది తులసి. తులసిని చూసినా సామ్రాట్ ఏమైపోయారు అండి కలిసి ఆఫీస్ కి వెళ్దాం అన్నారు కదా కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అంటాడు సామ్రాట్.
తులసికి ధైర్యం చెబుతున్న సామ్రాట్..
పని ఉండి బయటికి వెళ్ళవలసి వచ్చింది మీరు వెళ్ళండి సర్ నేను ఒక గంటలో వస్తాను అంటూ ఇంట్లోకి వచ్చి ఏడుస్తుంది తులసి. ఆమె తనకి వచ్చిన సామ్రాట్ ఆమె ఏడవడం చూస్తాడు. తులసి కూడా సామ్రాట్ ని చూస్తుంది. నాకు తెలిసిన తులసి ఏడవదు కష్టాలు తట్టుకొని నిలబడుతుంది అంటాడు సామ్రాట్. దేవుడు పెట్టే కష్టాలని ఎదుర్కోగలుగుతున్నాను కానీ మనుషులు పెట్టే కష్టాలని భరించలేకపోతున్నాను, ఎందుకు తను నా మీద అంత పగ పట్టిందో అర్థం కావట్లేదు.
నా భర్తని తనకి వదిలిపెట్టాను నా ఇంటిని తన పేరున రాశాను. ఇష్టం లేకపోయినా నా పిల్లల్ని అత్తింటి వాళ్ళని ఆ ఇంట్లోనే ఉండనిచ్చాను. ఇంతకంటే ఏం ఇవ్వగలను, ఇవ్వటానికి నా ప్రాణం తప్ప ఇంకేం లేదు అంటుంది తులసి. ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అని ఏడుస్తుంది. అది పిరికి వాళ్ళు చేసే పని లోకాన్ని ఎదిరించి ధైర్యంగా బ్రతుకుతున్నారు అలాంటి మీ కళ్ళలో ఆ కన్నీళ్లు అసలు బాగోలేదు అంటాడు సామ్రాట్.
నేను ఓడిపోయాను అంటున్న తులసి..
తులసి ఓడిపోవడం అంటే మీ ఫ్రెండ్ సామ్రాట్ ఓడిపోవడం మీకు ఇష్టమేనా అంటాడు సామ్రాట్. నేను ఓడిపోయాను సామ్రాట్ గారు. నా పిల్లల్ని కలుసుకోలేకపోయాను అంటే నేను ఓడిపోయినట్టే కడుపుతో ఉన్న కోడల్ని దగ్గరికి తీసుకోలేకపోయాను అంటే ఓడిపోయినట్టే అంటుంది తులసి. మీ కాళ్ళకి మీరే సంకెళ్లు వేసుకొని పరిగెట్టలేకపోతున్నారు అంటాడు సామ్రాట్. అవి నేను కావాలని వేసుకున్న సంకెళ్లు కాదు, నా బందాలు వేసిన సంకెళ్లు వాటికి నేను విలువ ఇవ్వాల్సిందే అంటుంది తులసి.
మీ పిల్లలు మిమ్మల్ని చూసుకొని గర్వపడాలనుకుంటున్నారా లేకపోతే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోమని పాఠం చెబుతున్నారా అంటాడు సామ్రాట్. మీ మాటకు విలువిచ్చి వాళ్ళు అక్కడ ఉంటున్నారు కానీ మిమ్మల్ని కాదని కాదు. అలాంటప్పుడు వాళ్ళ కష్టానికి నష్టానికి మీరే బాధ్యత తీసుకొని మీరే సమాధానం చెప్పాలి అంతేగాని పారిపోవడానికి వీల్లేదు అంటాడు సామ్రాట్. ఆ ఇంటిని దారికి తెచ్చుకోవడానికి నందగోపాల్ గారు కాస్త సమయం అడిగారు అంటుంది తులసి.
తులసిలో స్ఫూర్తిని నింపుతున్న సామ్రాట్..
ఎవరైనా ప్రాణం పోయేక కళ్ళు దానం చేస్తారు అంతేగాని ప్రాణం ఉండగా కాదు, మీరే సంతోషంగా లేనప్పుడు అతను సంతోషం గురించి, అతనికి ఇచ్చిన మాట గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచించవలసింది మిమ్మల్ని వదిలేసిన నందగోపాల గురించి కాదు మీరు కావాలనుకుంటున్న మీ కుటుంబ సభ్యుల గురించి పదండి వెళ్దాం అంటాడు సామ్రాట్. ఎక్కడికి అని తెలిసి అడిగితే మీ కోడలికి కంగ్రాట్స్ చెప్పడానికి అంటాడు సామ్రాట్. మీకు ఆత్మస్థైర్యం ఉంటేనే మీ వాళ్ళు ధైర్యంగా ఉంటారు.
పదండి నేను మీ పక్కనే ఉంటాను అంటూ ఆమెలో స్ఫూర్తిని నింపుతాడు సామ్రాట్. అదే సమయంలో నందు వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది. నేను బ్రతిమిలాడితేనే తను ఎక్కడికి వస్తుంది ఇష్టం లేకపోతే ఆ రోజే చెప్పవలసింది కదా మేము ఆ రోజే ఇంట్లో ఉండాలో లేదో డిసైడ్ అయ్యేవాళ్ళం కదా అంటుంది అనసూయ. తులసిని అవమానించడం అంటే మమ్మల్ని అవమానించడమేరా? ఇంత జరిగినా నోరెత్తవేమి,మాట్లాడవేమి, నువ్వు చేసింది తప్పు అని నీ పెళ్ళానికి చెప్పవే ఏందిరా అంటూ కొడుకుని నిలదీస్తుంది అనసూయ.
నాక్కూడా అవమానం జరిగిందంటున్న లాస్య..
మీ కొడుకు మాజీ భార్య కి జరిగిన అవమానం గురించి మాట్లాడుతున్నారు గాని ప్రస్తుతం ఉన్న నాకు జరిగిన అవమానం గురించి మాట్లాడరేం అత్తయ్య అంటుంది లాస్య. నీకేం మనం జరిగింది అంటాడు ప్రేమ్. ఈ ఇంటి మనిషి కడుపుతో ఉంటే ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ల ద్వారా తెలియటం నాకు ఎంత అవమానం దీని గురించి ఎవరిని నిలదీస్తారు అత్తయ్య అంటుంది లాస్య. తులసి సారితో ఇంటికొచ్చి చెప్పేదాకా నాకు తెలియదు ముందు వాళ్ళని నన్ను క్షమాపణ చెప్పమనండి అప్పుడు నేను తులసికి క్షమాపణ చెప్తాను అంటుంది లాస్య.
లాస్య చెప్పిందాంట్లో అర్థం ఉంది కదా తన ప్లేస్ లో నేను ఉన్నా కూడా అలాగే ఆలోచిస్తాను అంటాడు నందు. తులసి అలా మాట్లాడుతున్నప్పుడు శృతి ఒక్క మాట కూడా అనలేదు, ఇలా అనుబంధంల పట్ల నిర్లక్ష్యం వహించిన కూడా బంధాలు పల్చబడిపోతాయి. ఎందుకో అందరూ కలిసి నన్ను శత్రువులగా చూస్తున్నారు శుభవార్త చెప్తే నేను సంతోషిస్తాను కానీ శృతికి ఏమి నష్టం చేయను కదా అంటుంది లాస్య. ఏమో చేసేదానివేమో ఎవరికి తెలుసు? నీకు భయపడే శృతి నీకు ఆ విషయం చెప్పలేదు ఏమో అంటాడు ప్రేమ్.
లాస్య వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను అంటున్న సామ్రాట్..
ఆలోచించేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు ప్రేమ్ అంటూ మందలిస్తాడు నందు. ఆ మాట ఆవిడకి చెప్పబడింది ఇంట్లో అందరూ సంతోషాలు పంచుకునే టైంలో గొడవలు పెట్టి ఇంట్లో అందరిమూడ్ స్పాయిల్ చేస్తుంది.తను చిన్న విషయాన్ని పెద్దది చేసి మీకు బూతద్దంలో చూపిస్తుంది దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటాడు ప్రేమ్. తప్పు చేసింది నేను కాదు ఆ తులసి అంటుంది లాస్య. అంతలోనే అక్కడికి సామ్రాట్, తులసి వస్తారు. వాళ్లని చూసిన కుటుంబ సభ్యులందరూ కామ్ అయిపోతారు.
చూసావా నందు తులసి ఒక్కతే వస్తే రానివ్వలేదని బాడీగార్డ్ ని వెంటేసుకొని వచ్చింది అంటే సామ్రాట్ ని చూసి చెప్తుంది. మీకు ఎన్ని సార్లు చెప్పాను మా ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, ఎందుకు మాట వినకుండా మీ గౌరవాన్ని తగ్గించుకుంటారు. దయచేసి వెళ్ళిపోండి, మీ వల్లే మా ఇంట్లో గొడవలు పెరుగుతున్నాయి అంటాడు నందు. ఇంట్లో గొడవలు వస్తుంది నావల్ల కాదు మీ ఆవిడ లాస్యవల్ల. ముందు తనని వెళ్ళిపోమను నేను కూడా వెళ్ళిపోతాను అంటాడు నందు.
సామ్రాట్ తో పాటు తులసిని కూడా బయటికి పొమ్మన్న నందు..
నా భార్య గురించి కామెంట్ చేసే హక్కు మీకు లేదు వెళ్ళు అంటాడు నందు. అయినా వెళ్ళరు నాకోసం నాకు తోడుగా వచ్చారు అంటుంది తులసి. జీవితాంతం తోడుగా ఉంటారా అంటుంది లాస్య. జీవితాంతం ఉంటారు మీకేంటి అభ్యంతరం ఉంటుంది తులసి. అలాంటివి ఏమైనా ఉంటే ఆఫీసులో చూసుకో అంటుంది లాస్య. నువ్వు ఇంట్లో గొడవలు పెట్టకు నీకు అంత అభ్యంతరం అయితే అతనితో పాటు నువ్వు కూడా వెళ్ళిపో అంటూ తులసి తో చెప్తాడు నందు.
Intinti Gruhalakshmi December 27 Today Episode:
నేను గొడవ పెట్టడానికి రాలేదు నా కోడల్ని గుండెలకు అతుక్కోవడానికి వచ్చాను మమ్మల్ని కాసేపు ఒంటరిగా వదిలేయండి అంటుంది తులసి. ఇప్పుడిప్పుడే మనుషులందరూ కుదిరి పడుతున్నారు నువ్వు వెలిగించిన దీపాన్ని నువ్వే అర్పేయ్యవద్దు అంటాడు నందు. తరువాయి భాగంలో తులసి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఆ విషయాన్ని దివ్య ద్వారా తెలుసుకున్న లాస్య నందుకు చెప్తుంది. ఆవేశంగా బయలుదేరుతారు నందు వాళ్లు. మరోవైపు పార్టీలో శృతి కాలుజారి పడిపోతుంది.